Thursday, June 29, 2017

సౌందర్య లహరి-03


    సౌందర్య లహరి-03

   పరమ పావనమైన  నీ పాదరజకణము
   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

   మంచిపనులు  చేయుచున్న ఇంద్రియములు ఐదు
   దానికి  సంకేతములు ఇచ్చు ఇంద్రియములు ఐదు

   సప్త ధాతువులు-మనసు కలిసి ఎనిమిది
   అష్టాదశ పీఠముల నా హృదయ మందిరము

   నిశ్చలభక్తితో నిన్ను కొలువ నిష్ఠను చేరినదమ్మా
   మనో వాక్కాయ కర్మలను ముగ్గురు  మిత్రులతో

   ఏమని వర్ణించను? ఏమి నోము ఫలమో ఇది
   నా శరీరము పావన శక్తిపీఠమగుచున్న వేళ

   నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
   మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...