Thursday, June 29, 2017

tallee bailellinaadiroe

బోనాలు శుభాకాంక్షలు
..................
తల్లీ..బైలెల్లినాదరో
సల్లంగ..సూసి నాదరో
.................
జాతరల మోతలతో
అసాడం..ఐతారం
పిల్లగాళ్ళు..పైలమంటూ
తల్లీ..బైలెల్లినాదిరో
సల్లంగ..సూసినాదిరో
..............
ఏ..పొద్దూ..కాపాడు
మా..పెద్దతల్లి
ముద్దైన..రూపాలు..ఇంగో..ఓ
సద్దడి..చేస్తున్నయి
తల్లీ..బైలెల్లినాదిరో
సల్లంగ..సూసినాదిరో
...........
పోచమ్మ,మైసమ్మ
ఎల్లమ్మ,రేణుకమ్మ
కొండలమ్మ,గాజులమ్మ
అంకాలమ్మ,పోలేరమ్మ
ముత్యాలమ్మ,సత్యాలమ్మ
ఎన్నెన్ని.రూపాలతో
తల్లీ..బైలెల్లినాదిరో
సల్లంగ..సూసినాదిరో
..........
పచ్చంగ..ఉండాలని
పచ్చి కుండలను తెచ్చి
అచ్చంగ..అమ్మరూపు
ముచ్చటగ..దిద్ది
ఘటనలను..తప్పింపగ
ఘటములతో..మెప్పింపగ
పచ్చన్నముతో..నీ..కాడికి
వచ్చింది..పోచమ్మా
......
*ఊరడి* అందుకుని
ఆరడులు..తోలేయి 11తల్లీ11
.........
దూకుడులను..తప్పించగ
మూకుడులు..తెచ్చి
ఆ..నాకము..దింపగ
పానకము..పోసి
బాగుకోరు..తల్లికి
*సాకు* వార..బోయగ
సాగింది..మైసమ్మ
.....
*సాకు* నందుకుని
మమ్ము సాకు తల్లీ 11తల్లీ11
.........
బండరాయి..మనసులను
బండారుతో..మారిసి
కొండేక్కని..దీపాలతో
ఎండీ..కడియాలు..మోగ
పాపాలను..తొలగించ
ఏపాకులను..బట్టి
శివశక్తి..రూపాలై
చిందేసే..పోలేరమ్మ
.....
మా..ముందుండి..ఏలుమమ్మా11తల్లీ11
........
ఎన్నెలంటి...మా..తల్లికి..ఎన్నెన్నో..పూఒజలు
నాలుగు..దిక్కుల..మాతల్లికి..నానాఇద..పూఒజలు
.....
తొట్టెలతో..ఎల్లమ్మ
పట్టీలతో..అంకాలమ్మ
పసుపు..కుంకాలతో
పసిడి.రేణుకమ్మ
గవ్వలతో..గాజులమ్మ
దండలతో..కొండలమ్మ
.......
మనసులు..నీముందుంచి
మా..మనిసివి..నీవంటుంటే
.......
రంగం..ఈరంగాలు
మేకపోతు..విందులు
పోతురాజు..చిందులు
బోనాల..పూజలలో
బోలెడు..రివాజులు
......
పంచబూతముల..సాచ్చి
పంచామ్ముతముల..సాచ్చి
పంచుతము...మంచిని
నీ..పంచన..లాలించు11తల్లీ11

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...