Thursday, September 16, 2021

amma kaamaakshi umayae-01

1. సుందరి సౌందరి నిరందరి దురంధరి జ్యోతియాయ్ నిండ్ర ఉమయే శుక్రవారత్తినిల్ కండ దరిశిత్తు వగళ్ తుంబత్తె నీకిడిడువాయ్ చింతనిల్ ఉన్ పాదం తన్నయే తులుపవర్కళ్తుయిరత్తె మాత..... జగమెల్లాం ఉన్ మాయ పుగళ ఎన్నాలామొశిరియనాళ్ ముడిదిడిత్తూ సొంద ఉన్ మైందనాం ఎందనై రక్షిక్క సిరియ కాదన్నదమ్మా శివశివ మహేశ్వరి పరమ మణి ఈశ్వరి శిరోన్మణి మనోన్మణియు నీయే అంతరి దురంధరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీయే అళగానకాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. ************ సుందరి సౌందరి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా నీ పాద చింతనమే భవతాపహరణము భావనామాత్ర సంతుష్టవు జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే అంతరి దురంతరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. జ్యోతియాయ్ నిండ్ర ఉమయే ********************** జగత్కళ్యాణమునకై ఆదిపరాశక్తి,తనను తాను శివ-శక్తి అను రెండు రూపములుగా ప్రకటించుకొని,శివ రూపమునకు స్థిరత్వమును-శక్తి రూపమునకు విస్తరణను నిర్దేశించుకొని,సూత్రధారుడైన స్వామి సంకల్పముతో తాను ఎన్నెన్నో నామరూపగుణ వైభములతో క్షేత్రములుగా భాసిల్లుతు,పరమేశుని క్షేత్రజ్ఞిగా ప్రకటింప చేయుచున్నది. ప్రళయ జిత్/జయించినక్షేత్రముగా,సప్త మోక్ష పురములలో ఒకటిగా,ధర్మమునకు రెండు కళ్ళైన కాశి-కాంచి క్షేత్రముగా అలరారుచున్న కాంచిక్షేత్రముగా- కామాక్షి తాయిగా, తన చల్లని చూపుతో కాపాడుతున్నది. లోకములకు వెలుగును ప్రసాదించుటకు వారు చీకటిని నాంది చేసుకొని లీలను ప్రారంభించారు.అమ్మ అయ్యవారి కనులు మూయుట,తత్ఫలితముగా ప్రళయావిర్భావము-పునః సృష్టిలోని చీకటిని తరిమివేసే వెలుగును ప్రసరింప చేయుటకు,సకల చరాచరజీవరాశులను ఉధ్ధరించుటకు,తల్లి తనను తాను ఒక ఉదాహరనగా నిరూపించుటకు,ధర్మ-అర్థ-కామ-మోక్ష సాధనామార్గమునకు తార్కాణమైన తపోకామాక్షిగా కాంచి నగరములో కొలువైన కామదాయిని చరణములను శరణు వేడుదాము. కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...