AMMA KAAMAAKSHI UMAYE-04

బూలోక పిళ్లయాయ్ 4.బూమియిల్ పిళ్ళయాయ్ పిరందు వలరుందునాన్ పేరాన స్థలము అరియేన్ పెరియార్గళ్ దరిశనం అరునాళం కందునాన్ పోట్రి కందాడి అరియేన్ వామి ఎండ్రున్నయై శివగామి ఎండ్రెసొల్లి వాయినార్ పాడి అరియేన్ మాతాపితా వినదు పాదత్తె నానుమె వనంగి ఒరునాళ్ అరియేన్ స్వామిఎండ్రె సొల్లి సద్రుదన్ కైకాపి చరణంగళ్ సైదు అరియేన్ సద్గురువు పాదారవిందంగళై కందు సాష్టాంగ దందనిత్తరియేన్ ఆమింద బూమియిల్ ఆడియైపోల్ మూడన్ ఆత్నికందందుందో అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. ****************** భూలోకమున నేను పుట్టిపెరిగినగాని ఏ క్షెత్రములు చూడలేదు సత్పురుషులను దర్శించి భక్తితో వారిని ప్రస్తుతించినదియు లేదు వామి నీవని శివగామి నీవని తల్లి నిన్ను నోరార కీర్తించలేదు మాతా పిత యనుచు పాదములు తాకి నే వందనము చేయలేదు జ్ఞానులను గుర్తించి జాగరూకతతోడ సవినయ కైమోడ్పులీయలేదు సద్గురువు పాదాలపై వాలి సాష్టాంగములు చేయలేదు పరికించి చూచినను నా వంటి మూఢుడు నీకెందు కానరాడు అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.