Thursday, September 16, 2021

AMMA KAAMAAKSHI UMAYE-8

8.మున్నయోర్ 8.మున్నయోర్ జన్మదిరం ఎన్నెన్నో పావంగళ్ ఇమ్మూడన్ సెయిందనమ్మా మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్తట్తి మోసంగళ్ పన్నినేనో ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్ అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే.- ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను నా కలత తీరదమ్మా అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. ***************** శ్రీ మాత్రే నమః **************** .మున్నయోర్ జన్మదిరం ఎన్నెన్నో పావంగళ్ ఇమ్మూడన్ సెయిందనమ్మా మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్తట్తి మోసంగళ్ పన్నినేనో ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్ అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే. ****************** ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను నా కలత తీరదమ్మా అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే- అమ్మ కామాక్షి ఉమయే. ****** " హంస వాహ సమాయుక్తా విద్యాదాన కరీ మమ" అని సరస్వతీ స్తోత్రము . సత్యముకానిదానిని సత్యమనుకొనుట-సత్యమైన దానిని అసత్యమనుకొనుటయే అవిద్య.అన్నింటిలో దాగిన ఏకత్వమును గ్రహించలేకుండట.జ్ఞానమును పట్తుకొనుటకు దారులు వెతుకుట-పరుగులు తీయుట.ఫలితమును కనకుండుట. మనలో ఉన్నదానిని చూడలేక ,మరుగున ఉన్నదనుకొనుట మాయ. జగద్గురువులు 'సౌందర్యలహరి"లో అమ్మా నీవు అవిద్యానం అంతర్ తిమిర మిహిర లహరివని తల్లీ నీ చైతన్యమనే మాలో నున్న వెలుగు మా మనసులో నిండితున్న చీకట్లను పారద్రోలే ప్రకాశమమ్మా అని తల్లిని ప్రస్తుతించారు. ఈ భాగములో సాధకుని అంతరంగ చీకటి అమ్మదయతో కొంచము కొంచము తొలగుచు,తన తప్పిదములను ఒక్కొక్కటిని గురుతు చేస్తూ,పశ్చాత్తపముతో పరివర్తనము చెంది అమ్మ దయకై ప్రాధేయ పడునట్లు చేస్తున్నది. ముడుచుకు పోయిన జ్ఞానము మూఢత్వమై ఇక్కట్టుగా/ఇబ్బందిగా తరుముచు వచ్చుచున్నది. నేను పూర్వజన్మలలో ఏ ఏ పాపములను తెలిస్యు వినోదమునకై చేసినానో/విలాసమునకై చేసినానో/విర్రవీగుతూ చేసినానో తెలియదు. ఒకటేమిటి? లెక్కలేనన్ని.చెప్పలేనన్ని. పొంచి ఉంచి నిన్ను తుంచివేయు పూర్వపాప కర్మ-పేర్మి తోడ. నటరాజ పత్తు లో సాధకుడును ఇదే విధముగా, " వళికండు ఉన్నడే తుదియాద పోదిలం" అమ్మా/అయ్యా నాకు దారి కనిపించుటలేదు.కనిపిస్తుందని అనిపించుటలేదు. మోసమే చెయ్యనుం-దేశమే కవరినుం" మోసముతో దేశాన్ని గెలవాలనుకున్నానేమో,

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...