Thursday, September 16, 2021

AMMA KAAMAAKSHI UMAYE-07

7. మయే ************ అల్లరి పిల్లల బుగ్గ గిల్లియు తల్లి బుధ్ధులను నేర్పించదో పెనుభూతమైనను తన పిల్లలను మిగుల ప్రేమతో పెంచునమ్మా ఆయాసపడుచున నా ఆర్తనాదమును పెడచెవిని పెట్టకమ్మా ఆవగింజంతైనను జాలిలేదా నీకు కఠినశిల కరుగునమ్మా ఆనవాలే లేని అన్ని అపరాధములు విడిచిపెట్టక ఉండకమ్మా హెచ్చైన కరుణతో వచ్చి రక్షింపక రచ్చ చేయుట తగనిదమ్మా దయలేని దానివను పదిమంది వేసేటి నింద నీకేల నమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.అంబ కామాక్షి ఉమయే.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...