Thursday, September 16, 2021
AMMA KAAMAAKSHI UMAYE-02
పత్తువిరల్ మోదిరం ఎత్తనై ప్రకాశమదు పాదకం దండగొలుసు
పచ్చ వైఢూర్యముం ఇచ్చయై ఇళదిట్ట పాద శిలంబొళియుం
ముత్తు మూకుత్తియం రత్తన పతకముం మోహన మాలై అళగుం
ముళుదు వైఢూర్యముం పుష్పరాగత్తినిల్ ముడితిట్ట తాళి అళగుం
చుత్తమై ఇరుకిండ్ర కాదనిల్ కమ్మలుం శెన్ కయ్యల్ పొన్ కంకణం
జగమెల్లాం విళై పెద్ద ముఖమెల్లాం ఒళువిద చిరుకాతు కొప్పిన్ అళగుం
అత్తివరదన్ తంగై శక్తిశివరూపత్తె అదయనాళ్ సొల్ల తిరమా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్విడుం అమ్మ కామాక్షి ఉమయే.
********
ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు
చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును
ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం
మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము
శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు
ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు
చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును
ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం
మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము
శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు
ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు
చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును
ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం
మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము
శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు
జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర.
అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మా, నా మొర ఆలకించి,నన్ను కరుణించదలిచావా,ఒక్కసారి నీ పాద నమస్కార సౌభాగ్యమును ప్రసాదించు అని, భావనలో తల్లి పాదములను పట్టు కొనిన నా నుదుటిని, అమ్మ పదివేళ్లకు ధరించిన మెట్టెలు గట్టిగా వత్తుకుని,అమ్మ కరుణ నన్ను హత్తుకునేలా చేస్తున్నవేమో.లత్తుక అలదిన పాదములను పట్టుకొను ప్రయత్నములో అమ్మ పాదమంజీరములు నన్ను తడిమి అభయమునిస్తున్నవా అన్నట్లు సవ్వడులు చేస్తున్నాయి."కుపుత్రా సంజాతే-కుమాతా నభవతి".కరుణాంతరంగ, వాలిన నా శిరమును లేవనెత్తుటకు కొంచము వంగి,తన తామరతూడులవంటి కరములతో నన్ను లేవనెత్తువేళ అమ్మ కంకణ ధ్వనులు తామును అనుగ్రహము ప్రసాదగుణ ధ్వనులను చేయుచున్నామనుచున్నవేమో,బాహ్యమును మరచిన నేను అమ్మ కంఠహారములలో నవరత్న వజ్రవైఢూర్యముల నవనవోన్మేషకాంతులు నాలోని అజ్ఞానపు చీకట్లను తొలగించుటకు /తరిమివేయుటకు ఉద్యుక్తులై ఉజ్జ్వల ప్రకాశమాన భరితములైనవి.ఆహా ఏమి నా సౌభాగ్యము.అమ్మ ముత్యపు ముక్కుపుడక నన్ను సత్వగుణ సంశోభితుని చేయదలచినట్లున్నది.పుష్యరాగ
కాంతులతో సర్వమంగళ గళ విరాజమానమైన తాళి నన్ను మంగళానుగ్రహపాత్రుని చేస్తున్నది.
ఆళ్వారులచే "అత్తివరదన్" గా /వటపత్రసాయిగా కీర్తింపబడే వరదరాజస్వామి సోదరి సంసారప్రళయజలధి నుండి నన్ను రక్షించమని నీ దివ్య చరణములే
శరణమని నమ్మినానమ్మా.
మనది ప్రాకృత శరీరము.తల్లిది అప్రాకృత శరీరము.దానికి అమరిన/అలంకరింప బడిన ఆభరణములు కేవలము అలంకారములు కాదు ఆశీర్వాదములు అని అవగతమగుచున్నవేళ ఈ దీనుని ఉధ్ధరించుము తల్లీ.
కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం
.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment