Wednesday, March 29, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SAPTASAPTIMAREECHIMAAN)-10

 ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥


  పూర్వభాగ పరిచయమును ముగించుకొని,ప్రస్తుత శ్లోకము నుండి మనము ఆ పరమాత్మ యొక్క నేకానేక గౌణ నామములద్వారా జగత్పాలనా విశషములను అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.

 ఆదిత్యుడు,సవితుడు,సూర్యుడు,ఖగుడు,పూషుడు,గభస్తిమానుడు,హిరణ్యసద్రుశుడు,భానుడు,సువర్ణరేతస్సుడు,దివాకరుడు అనే నామ ప్రాశస్త్యము వివరింపబడుతోంది.

 ఆదిత్య నమోనమః
  ...............
 దితి ఖండింపదగినది.విడదీయబడునది.దానికి విరుద్ధముగా అఖండముగా అవిభాజ్యముగా నున్నది అదితి.అదియే అఖండము.
 అదియే "ఆత్మజ్ఞానము-అసలు వీడనిది."స్థిరముగా మనలో నిలిచి మనలను ఉద్ధరించునది.దానిని అనుగ్రహించువాడే ఆదిత్యుడు.
 సవితః నమోనమః
 .............
 సువి ప్రాణ సవిత.ప్రసవము అని మనము ఉపయోగించు పదము సవితాశక్తియే.సృష్టి చేయుటకు,విస్తరించుటకు అనుకూలమైన సూర్యశక్తియే సవిత అని గౌణనామముగా ఉపయోగించబడుతున్నది.
 సూర్య
 ......
 సువతి రమయతి సూర్య అన్నది ఆర్యోక్తి.సుష్టు ఇరయతి సూర్యః.వాయు సంచారమునకు తగిన ఉష్ణమును అందించువాడు సూర్యుడు.
 సురసుర-చరచర తన కిరణములచే శక్తిని భూమిమీదకు ప్రసరించువాడు కనుకనే సౌరిగా సూర్యశక్తి కీర్తింపబడుతున్నది. 
 ఖగ
 ....
 ఖ అనగా ఆకాశము.గ అనగా గమనముచేయగల శక్తి.ఆకాశమునుండి తన శక్తిని భూమి మీదకు ప్రసరిస్తూ పాలించువాడు.
 ఖగ అను శబ్దము ధర్మాచరనమునకు సంకేతముగా పక్షి ఉదయముననే లచి తన రెక్క్లను/జ్ఞానమును విస్తరింపచేస్తూ
క్రమశిక్షనతో నుండు విధానము.
 పూషాన్
......
పుష్ణాతి ఇతి పూషా.ద్వాదశాదిత్యులలో మాఘమాసపాలకుడు.వర్షమూతో /వర్షజలముతో లొకములను పోషించువాడు.ఉత్తరాయనములో సౌద్రజలమును గ్రహించి,వానికి చంద్రుని ఔషధతత్త్వమును మేళవించి వర్షధారలుగా అనుగ్రహించువాడు.
 పోషకత్వమునకు సహాయపడు తన సక్తిని కిరనములద్వారా అందించువాడు.ధర్మమునే పూష అని కూడా పిలుస్తారు.
 గభస్తిమాన్
 ..........
 గో /వాక్కు శబ్దమునుండియే గభస్తి శబ్దమును అన్వయించుకుంటే జ్ఞానప్రదాత.
 గో-జ్ఞేయ వర్గః-తెలియవలసిన విషయములను/లక్ష్మీతత్త్వమును తెలియచేయు సంకేతము.అగ్నిసోమాత్మకమైన వేడి-కాంతికి సంకేతము.
 భ నగా ప్రకాశము.తన గమనము/కిరణముల గమనముద్వారా ప్రకాశమును కలిగించు పరాశక్తి.కిరణములను గభస్తులు అని అంటారు.
 ఆయననె సువర్ణ రేఖలు గలవాడు.సుపర్ణ రేఖలు కలవాడు.
 సు-అనగా శుభములను కలిగించు అనుష్ఠానము-అభ్యాసము కలవాడు.
 భానుడు
......
 తీక్షణమైన కిరణములు కలవాడు భానుడు.
 హిరణ్య రేత నమోనమః
........................
 రేతస్సు అనగా బీజము/మూలకారణము.
సూర్యుని రేతస్సు హిరణ్యము.అనగా హితమును-రమణీయతను కలిగించునది.సర్వ రమణీయమైన/రమించగలిగిన హితములకు మూలకారణము సూర్యుని బీజప్రాయశక్తియే.
 దివాకర నమో నమః
 ****************
 దివ్ అను శబ్దమునకు వెలుగును కలిగించువాడు.అనగా చీకట్లను తరిమివేయగల శక్తిగలవాడు.
 ఆకరము అనగా నిలయమైనవాడు/నిధియైనవాడు.
 వెలుగు అను పదమును మనము భౌగోళికముగా అన్వయించుకుంటే తన కిరణములచే పగలు-రాత్రిని ఏర్పరచువాడు,సూక్ష్మముగా పరిశీలిస్తే అజ్ఞానమనే చీకట్లను పారద్రోలుటకు జ్ఞానమనే చైతన్యమును అనుగ్రహించువాడు.
 తం సూర్యం ప్రణమామ్యహం.


Thursday, March 23, 2023

ANIRVACHANEEYAM ADITYAHRDAYAM(PRAJA-PRANA)-10

 పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥


 పితరో నమః
 ***********
 పరమేశ్వరుని ఇంద్రియములే/శక్తులే దేవతలు అని పెద్దలు చెబుతారు.ప్రస్తుత శ్లోకము గనములకు సంకేతమైన బహువచనమును అన్వయించుచున్నది.

  పితృగణమును-వసుగణమును,సాధ్యగణమును,అశ్వినీదేవతలను ఇద్దరిని,మరుత్ గణములను,మనుగణములను,వాయుగణములను,వహ్నిగణములను,ఋతుగణములను,ప్రభాకిరణములను ప్రస్తావించుచున్నది.

 రుద్రములో చెప్పినట్లు"పత్తీనాం పతయే" మార్గములను ఏర్పరచి నడిపించుపరమాత్మ కిరణ సమూహములే బహు రూపములతో,తత్త్వములతో సమీకరింపబడుతూ సహాయపడుచున్నవి.

 పితరో నమః
 *********
 " మాతాచ-పితాచ పితరో" ఆర్యోక్తి.తల్లి-తండ్రులే పితరులు.
 జీవునికి జన్మజన్మలయందు ఉపాధికి తగిన అనుగుణమైన ఆహారమును అందించు వ్యవస్థయే పితృదేవతా వ్యవస్థ.
పితృయానమునకు సహాయపడు కిరణ సమూహములు.
 సనాతన ధర్మముననుసరించి ఉపాధిని వీడిన జీవుడు వసు రూపమును,రుద్ర రూపమును,ఆదిత్యరూపమును క్రమముననుసరించి పొందుతాడని దానికి అనుగుణమైన కర్మలను ఆచరించవలసిన బాధ్యత వారసులదని నమ్ముతుంది.ఒక విధముగా జీవుల వివిధ ఉపాధులను స్పందింపచేయు శక్తియే పితరో శక్తి.
 

 వసవః నమః
 *********
 వసు అనగా సంపదగా అన్వయించుకుంటే,సంపదలను/భూగర్భ సంపదలను అందించుటకు సహాయపడు సూర్యచైతన్యమే వసువులు/కిరణములు.ఒక విధముగా ఇవి ప్రకృతి తత్త్వమునకు ప్రతీకలు.
 ఐతిహాసిక ప్రకారము 
 అనిలః,అనలః,ఆపః,ధర్మః,ధ్రువః,ప్రత్యుషః,ప్రభాసః అను నామములను,వాయుతత్త్వముగాను,అగ్నితత్త్వముగాను,జలతత్త్వముగాను,ధర్మ సమ్రక్షణముగాను భావిస్తారు.ఏ కిరణముల ప్రసారము వలన భూగర్భ సంపదలైన చమురులు.లోహములు,ఇంధనములు,జలములు,ఖనిజములు మొదలగు వాని ఉత్పత్తికి సహకరిస్తాయో అవే వైజ్ఞానిక పరముగా వసుకిరణములు.
 పునర్వసు నక్షత్రమునకు అధికారిణిగా అదితీదేవిని భావిస్తారు.
 సాధ్యః నమః
 **************
 'సాధనాత్ ప్రాప్యము సాధ్యం"
  సాధనకు అనుకూలతను-సాధ్యమునకు అనుగ్రహమును కలిగించి సూర్యశక్తి విభాగమే సాధ్యకిరణములు.
 ఐతిహాస ప్రకారముగా బ్రహ్మ ముఖమునుండి ప్రేకటింపబడిన దేవతాశక్తులైన వీరిని
 మను-ప్రాణద-జయ-నయ-ప్రభు-విదు-వీర్యవాన్ గా కీర్తిస్తారు.
 అశ్వినౌ(బహువచనము-02) నమః
 *********************
 ఐతిహాసిక ప్రకారముగా సూర్యభగవానుడు సంజ్ఞాదేవి కుమారులుగా అశ్వనీదేవతలను ,వైద్యులుగాను భావిస్తారు.
 నాసక్యుడు-దస్రుడు వీరి నామధేయములుగా చెబుతారు.విస్తృత వ్యాపకత్వ చిహ్నముగా అశ్వ అశు వ్యాప్తో అన్న దానిని సమర్థిస్తూ గౌణనామముగా వీరిని అశ్వనీదేవతలుగా సంభావిస్తారు.వీరు ఇద్దరు.ఒకరు రోగనిర్ధారనను-రోగనిర్మూలనమును కలుగచేస్తారు.


 మరొతో నమః
 ***********
 "కుపితేన అనేన  మృయతే లోకః ఇతి మరుతః"
 ఎవరికి కోపం వస్తే లోకములు నాశనము అవుతాయో ఆ సూర్యశక్తులే మరుత్తులు.ఒక విధముగా వాతావరణములో విపరీత పరిణామములను కలిగించుటకు సహకరించు చలిగాలులు,వడగాలులు,తుఫానులను కలిగించు గాలులు అని కూడా అంటారు.
 తనకు మరణము లేకుండా ఇతరులకు మరణమును కలిగించు సూర్యశక్తులు మరుత్తులు.
  
 ఐతిహాస కథనము ప్రకారము దితిదేవి బలపరాక్రమ సుతునికై (దేవతలకు సాటియైన వానికొరకై) పయోవతమును ప్రారంభించి నియమపాలనచేయసాగినది.
 విషయమును గ్రహించిన ఇంద్రుడు దితి వద్దకు రాగానే సత్యవచనయై తన వ్రతమును గురించు ఇంద్రునికి చెప్పింది.దానికి సమాధానముగా ఇంద్రుడు అక్కడే ఉండి ఆమెకు(పిన్నికి) సపరిచర్యలు చేసేందుకు అనుమతిని పొంది అవకాశము కోసము ఎదురుచూస్తున్నాడు.కాల నిర్ణయం అతిక్రమించలేనిది అన్నట్లుగా ఆమె వ్రత నియమమునకు విరుద్ధముగా కురులు విరబోసుకొని గడపపై తలను వాల్చి సమకాని వేళ నిదురించినది.అంతే ఇంద్రుడు తన వజ్రాయుధముచే ఆ గర్భస్థ పిండమును ఏడు ముక్కలుగా ఖండించినాడు.మారుతః అన్న శబ్దము ఛేదించవద్దు అని వినబడుతున్నప్పటికిని మరింత కసితో ఒక్కొక్క భాగమును ఏడు భాగములుగా ముక్కలు చేసెనని,
 అందుకనే మరుత్తులు ఏడుగురు అని,వారికి గల అనుచరులు కలుపుకుంటే 49 అని భావిస్తారు.
 వారి నామములను వ్యవహః,అనువాహ,పరివాహ,ఆవాహ,వహ,వివహ మొదలగునవి అని కూడా గౌణములుగా చెబుతారు.
  కాని ప్రకృతి సమతౌల్యములో వీరి ప్రాధాన్యత ఎంతో ఉంది.
 నమో మనుః
 **********

  మనుః ఇతిసర్వజ్ఞ ఆదిరాజస్యనాన్యతః అస్త్మంతః-ఏ పని ఎప్పుడు చేయవలెనో తెలిసినవాడు మనువు.మను శబ్దము నుండి మానవ శబ్దము-జాతి విస్తరించాయని చెబుతారు.
 మనువు పరిపాలనా కాలమును తెలియచేయునది మన్వంతరము.
 పురాణములకు ఉండవలిసిన లక్షణములైన సర్గ-ఉపసర్గలతో పాటుగా మన్వంతరము ప్రధానమైనది.మనము ప్రస్తావించుచున్న ఆదిత్యహృదయములో సైతము సూర్య భగవానుని శక్తులు/కిరణములు కొన్ని మనువులుగా పూజింపబడుచున్నవి.

 విష్ణుసహస్రనామము సైతము భగవంతుని శక్తిని
 "విశ్వకర్మా మనుః త్వష్టా" అంటూ ప్రస్తుతించినది.
  కాలనిర్యనమునకొస్తే,
 నాలుగు యుగముల కలయిక మహాయుగము.71 యొక్క మహాయుగముల కాలపరిమితి మన్వంతరము.అనగా అంతకాలము మనువు యొక్క పరిపాలన కొనసాగుతుంది.
 ప్రళయానంతరము తిరిగి మరొక మనువు మానవ పరిపాలనాబాధ్యతలను స్వీకరిస్తాడు.ఆ సమయములో సప్తఋషులు,దేవతలు,పరమాత్మ ,ఇంద్రుడు వేరువేరు నామములతో పిలువబడుతూ జగన్నిర్మాణమునకు స్థితికి సహాయపడుతుంటారు.
  సనాతన సంప్రదాయ ప్రకారముగా పదునాలుగుమందిని ముఖ్య మనువులుగా పేర్కొంటారు.వారే
1.స్వాయంభువ మనువు
2.స్వారోచిషమనువు
3.ఉత్తమ మనువు
4.తామస మనువు
5.రైవత మనువు
6.చాక్షుస మనువు
7.వైవస్వత మనువు
8.సూర్య సావర్ణిక మనువు
9.దక్ష సావర్ణిక మనువు
10.బ్రహ్మ సావర్ణిక మనువు
11.ధర్మ సావర్ణిక మనువు
12.రుద్ర సావర్ణిక మనువు
13.దేవ సావర్ణిక మనువు
14.ఇంద్ర సావర్ణిక మనువు
 మనమిప్పుడు ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరములో 28 వ మహాయుగములో ఉన్నాము.


ప్రజాప్రాణః నమః
*****************
 సకలజీవులలో ప్రాణస్వరూపముగా నున్న సూర్యతేజస్సునకు ప్రణామములు.
 వాయుః-వహ్ని నమః
 *******************
 సర్వచైతన్యము కుండలినీ సక్తిగా అగ్నితత్త్వమై వాయుతత్త్వమును తనతో కలుపుకొని ఊర్థ్వ పయనమును సాగించు చైతన్యశక్తికి నమస్కారములు.

 ఋతుకర్త నమః
*************
 రెండుమాసముల కాలమును ఋతువు అని అంటారు.ఒక సంవత్సర కాలములో ఆరు ఋతువులు ఉంటాయి.ఆరు ఋతువులు అనేక వైవిధ్యముతో ఒకదానికి ఒకటి సహాయపడుతుంటాయి.ఋతము అనగా వేదము/సత్యము.కాదనలేనిది.దానిని గ్రహింపచేయు జ్ఞానమే ఋతువు.ఋతువులను నిర్ధారించు నిర్వహించు ప్రజ్ఞాన చైతన్య సూర్యశక్తియే ఋతుకర్త.
 వసంతము గ్రీష్మమునకు అనుకూలవాతావరణమును ఏర్పరచి,జరుగుతుంది.అదే విధముగా గ్రీష్మము వర్షమునకు అనుకూల వాతావరణమును,నైసర్గిక వసతులను కలిగించి మరలుతుంది.వర్షము శరత్తునకు,శరత్తు హేమంతమునకు,హేమంతము శిశిరమునకు మార్గదర్శకములుగా మాఎఉటకు సూర్య శక్తి తన కిరనములను చంద్రునిద్వారా భూమిమీదకు ప్రసరింపచేస్తూ పరిపాలిస్తుంటాడు.


 ప్రభాకరః నమోస్తుతే
 ****************
 ప్రకృష్టమైన భాసత్వము కలవాడు ప్రభాకరుడు.వెలుగునే/కిరనములనే కరములుగా కలవాడు.వెలుగును కలిగించేవాడు.

 తం సూర్యం ప్రణమామ్యహం


Wednesday, March 15, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VIVIDHA KARTA ESHA)-09


ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః 

  ప్రతి స్తోత్రము పూర్వము-పరము అను రెండు కొసలను కలుపుటకు సంగతి అను నడుమనున్న విషయములను ప్రస్తావించును.అదేవిధముగా ఆదిత్యహృదయ స్తొత్రము ఉపెద్ఘ్హ్తమను పూర్వభాగమును పఠించు అవశ్యకతను పూర్వభాగములో తెలియచేసినది.తరువాత సంగతిగా స్వామి యొక్క కిరనవ్యాపకత్వమును-లోక పాలకత్వమును తెలియచేయుచున్నాది.
  ప్రస్తుత శ్లోకము గౌణ నామములైన బ్రహ్మ-విష్ణు-శివ-స్కంద-ప్రజాపతి-మహేంద్ర-ధనద-కాల-యమ-సోమ అను నామ విశేషముల ద్వారా స్వామి మనలను ఏ విధముగా అనుగ్రహిస్తున్నాడో మరింత స్పష్టము చేస్తున్నది.
 ఏష-బ్రహ్మ-నీవే బ్రహ్మ రూపములో దాగిన అంతర్యామివి.  

 బృహత్వాత్-బ్రహ్ణత్వాత్-ఇతి బ్రహ్మ
 ------------------------
 అన్నింటికన్నా ఏది ఉత్కృష్టమో అది బ్రహ్మము.అదియే బృహతత్త్వము.అన్నింటియందు ఏది వ్యాపించి యున్నదో అంతర్యామిగా అదియే బ్రహ్మణత్వము.బ్రహ్మణత్వము ను ప్రకటించువాడే బ్రహ్మ.సర్వజీవులయందలి ఆత్మస్వరూపమే బ్రహ్మము.స్థావర-జంగమ స్వరూపముగా భాసించుచున్నది బ్రహ్మము.తాను కదలకుండా యుండి అన్నింటిని కదిలించు శక్తియే బ్రహ్మ.
   

 ఏష విష్ణుశ్చ
 --------------
 పురాణకథనము ప్రకారము ఉపేంద్రునిగా కీర్తింపబడు వామనుడు అదితిపుత్రుడు.సూర్యుడు సైతము అదితిపుత్రుడు.
 స్వభావ ప్రకారముగా వ్యాపకత్వ లక్షణము గలవారు ఇద్దరు.
 దేవనములు అనగా కిరణములు.నాడులన్నింటి యందు ప్రవహించు ప్రాణశక్తియే విష్ణువు/విష్ణువుగా సంకీర్తించబడుతున్న సూర్యుడు.
 అస్తమానే స్వయం విష్ణుః అన్నది ఆర్యోక్తి.
 ఒక విధముగా జలతత్త్వమును అందించు వానిగా కీర్తించబడుతున్నాడు సూర్యుడు విష్ణు శబ్దముచే.
 ఏష శివశ్చ
-----------
 శివనామధారిగా వృషభవాహనునిగా ప్రస్తుతింపబడుచున్న రూపములో దాగిన పరమాత్మ ప్రకాశమే సూర్యుడు.
 ప్రకాశకత్వముతో నిండి వర్షించే స్వభావము కలిగినవి/కిరణములు కలిగినవి /వృషభమును అధిష్ఠించిన సూర్యునికి నమస్కారములు.
 ప్రాతఃకాలే స్వయం బ్రహ్మ-మధ్యాహ్నేషు మహేశ్వరః-సాయం సంధ్యా స్వయం విష్ణుః అన్న వాక్యము ప్రకారము సృష్టికి కావలిసిన అగ్నిని-జలమును పరమాత్మ యైన సూర్యశక్తి బ్రహ్మ-విష్ణు-శివ అను గౌణ నామములద్వారా అందించుచున్నది.
ఏష స్కందః
 ----------
 "శోషయతి శత్రుః స్కందః"
 శత్రువులను నశింపచేయువాడు స్కందుడు.అనారోగ్యమును-మానసిక రుగ్మతలను కలుగచేయువానిని తన తేజోకిరణములచే నిర్మూలనము చేయగల శక్తికలవాడు సూర్యభగవానుడు.
  "సంసార దుఃఖం స్కందం కరోతి"
  సంసారమనే జన్మదుఃఖం-జాయాత్ దుఃఖం-సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత-జాగ్రతః-భజగోవిందం
 అట్టి సంసార దుఃఖమును నాశనము చేయువాడు ఆదిత్యుడు.

   సర్వాని ఇంద్రియాని స్కందయతి
 ఇంద్రియములను సమన్వయపరచి పుష్టినిచ్చువాడు స్కందుడు.

 


 ఏష ప్రజాపతిః 
 ************
  పురాణకథనము ప్రకారము కశ్యప ప్రజాపతి కుమారునిగా సూర్యభగవానుడు ఆరాధింపబడుతున్నాడు.
 ప్రజ అనగా సంతానము.సంతానమును పాలించెడివాడు అనగా కావ;ఇసిన ఆహారమును-ఔషధములను,చైతన్యమును,వివేకమును తన కిరనములద్వారా అనుగ్రహించువాడు.
 దీనినే "ఇనాలోక సంయోగము" అని కూడా చెబుతారు.
 ప్ర కృష్ట జనయతి ప్రజా అని ఆర్యోక్తి.ఇది
 ఎందరో పరిపాలకులకు సమిష్టిగా వాదపడు "జాత్యైక వచనము."
 మరీచి-కర్దమ-పులస్త్య-దక్ష-అంగీరస-అత్రి మొదలగు పాలనాకర్తల సామూహికనామమె "ప్రజాపతి."
 సృష్టి విస్తరణమునకు అనుకూల కిరణములను విస్తరింపచేయువాడు "ప్రజాపతి".

 ఏష మహేంద్రః
 ************
 "ఇతం రాతి మహేశ్వరః"/ఇందం రాతి మహేశ్వరః" 

  ఇతి పరమైశ్వర్యః"
 ఇంద అను పదము గొప్ప ఐవర్య సంకేతము.పర్జన్యములద్వారా/మర్ఘముల ద్వారా వర్షముననుగ్రహించి సకల ఐశ్వ్ర్యములను ప్రసాదించువాడు.శత్రువులను నాశనము చేయువాడు మహేంద్ర నామముతో నున్న సూర్యుడు.
 ఆరోగ్యం భాస్కరాదిత్యేత్-అనారోగ్య కారకములగు క్రిములను తన వేడిమిచే సంహరింపచేయువాడు సూర్య భగవానుడు.

 ఏవ ధనదః
 ************
  సూర్య భగవానుదే ప్రాకృతిక సంపదలను భూమికి తగిన ఉష్ణోగ్రత గల కిరణ ప్రసరణముచే గనులను-పంటపొలములను-నదీజలములను-ఉద్యానవనములను తుష్టి-పుష్టి నొసగునట్లు చేయును.
 ఇది నైసర్గిక ధనము.
 మన శరీరములోని నాడీ వ్యవస్థను పుష్టికరము చేయుటకు సూర్యభగవానుడు కావలిసిన పోషకములను తన చైతన్యము ద్వారా కలుగచేస్తున్నాడు.
 శాస్త్ర విజ్ఞానమును ఖగోళ శాస్త్రమును సూర్యుడు తాను స్థిరముగా నుండి తన చుట్టు తిరుగుచున్న భూగోళము గమనింపచేస్తూ ధనమును అనుగ్రహిస్తాడు.


 ఏష కాలః
 ********
 కలయతీతి కాలః అన్నది ఆర్యోక్తి.కదులుతుండేది కాలము.దాని గమనమును నియంత్రించుట మానవులకు అసాధ్యము.
 కాలమును మనము మానసికముగా-యాంత్రికముగా విభజించుకుంటే 
 యాంత్రికాల గమనము తిధి-వార-నక్షత్ర-యోగ-కరనములను అనుసరించి సాగుతుంటుంది.
 అదే కాల ప్రభావము మానవులు సంతోషముతో నున్నవేళ త్వరగా కదిలినట్లు-విచారముగా నున్న వేళ మెల్లగ కదులుతున్నట్లు భావింపచేస్తుంది.
 జీవులు తాము చేసుకున్న పాప-పుణ్యముల ననుసరించి కాల చక్ర భ్రమణములో దానిచే పట్టుకొనబడి-కొంతదూరము సాగి,విడిచివేయబడుతుంది.  

 ఏష యమః
 ******
 ధనం చైతన్యం సర్వానుగ్రహాయ -సర్వస్య అంతర్యామి దదాతి-స్థాపయతి-ధనదః. 
 జనన-మరణములను నిర్ణయించేవాడు యముడు.చిత్రముగా లెక్కలు వ్రాసి వానిని గుప్తముగా ఉంచి సమయమాసన్న మైనపుడు తన విధిని నిర్వర్తించు సూర్యుడే యముడు.

 "అంతరో యమయతి-లోపలినుండి సర్వులను నియమించువాడు.

 ఏష సోమః
 ******* 
స ఉమ సోమ.అమృతకిరణములను వెదజల్లు సూర్యుడు సోముడు.విరోధభావనమును విడిచివేయుటయే అమృతత్త్వ పానము.సమభావనమును కలుగచేయువాడు సూర్యుడు.

 మ-ప్రభ అన్న అర్థములో అన్వయించుకుంటే తన కిరణములద్వారా చంద్రుని వెన్నెల కిరణములను తయారుచేయు పరమాత్మ సోముడు.శక్తిని కలిగిన వాడు.

 ఏష అపాంపతిః
 *********
 భౌగోళిక పరముగా భావిస్తే తన కిరనముల ద్వారా పర్జన్యములను కలిగించి వర్షపాతము ద్వారా తగిన జలవనరులను కలిగించువాడు.
 ఇదే విషయమునుద్వాదశాదిత్య ప్రస్తావనలో ఒక్కొక్క నెల ఒక్కొక్క అప్రసను తోడ్కొని భానుడు తన గమనమును చేస్తాడని చెప్పబడింది.
 కాని మనసుకు కావలిసిన సత్వగుణమును సమృద్ధిగా చేయువాడు సూర్య భగవానుడు.
 ఇదే విషయమును లక్ష్మీదేవి పరముగా "ఆర్ద్రాం-జ్వలంతీం" అని అగ్ని-సోమాత్మకతను ప్రస్తావిస్తుంది శ్రీసూక్తము.






Wednesday, March 8, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ESHALOKAAN PAATI)07

 సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।

ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥


 ప్రస్తుత శ్లోకములో" ఏష" అను శబ్దము స్వామియొక్క అంతర్యామి తత్త్వమును వివరించుచున్నది.
  మరియును స్వామి యొక్క లోకపాలకత్వమును ప్రతిబింబించుచున్నది.
 సర్వ-అన్ని-సమస్త-
 దేవగణాన్-దేవతా సమూహములలో
 ఆత్మన్-అంతర్యామిగా నుండి వారిచే ప్రకటింపబడుతున్నది
 దేవ-అసుర-గణాన్
  సత్వ-రజో-తమోగుణములుగా ప్రకటింపబడుతున్న వానిలోదాగినది
 ఏష-నీవే-ఏకైక ఛిత్శక్తివి.అనుపమానమైనది.
 శ్రీ లలితారహస్య సహస్రనామములో చెప్పబడినట్లు
 'సమానాధిక వర్జితా" 
 హే పరమాద్భుత శక్తి!
 నీతో సమానమైనది కాని-అధికమైనది కాని లేదు.
 ఆ శక్తియే ఆదిత్యహృదయ స్తోత్రములో ఏష శబ్దముగా సంబోధింపబడి-సంభావింపబడుచున్నది.
 ఏష దేవ
 ఏష సర్వదేవ
 ఏష సర్వదేవాత్మక
 ఏష-దేవాసుర గణ-గుణ
 ఏష-తేజః
 ఏష-తేజస్వి
 ఏష-రశ్మి
 ఏష ఏస్మిభావన
 ఏష-గ-గమనము
 ఏష-భ-ప్రకాశము
 ఏష-గభస్తిభిః-గమనముతో ప్రకాశమును కలిగించువాడవు.
 చీకట్లను తొలగించువాడవు.
  ఏష-లోకాన్ పాతి-నీవు లోకములను పరిపాలించువాడవు.
   సూర్యనారాయణ-నీవు నీ యొక్క అంతర్యామి స్వభావముతో సర్వులను అనుగ్రహించుచున్నావు.
 దేవాసుర-సత్వరజోతమోగుణములను ప్రకోపింపచేయుచున్నావు.
 నీవు అనేక కిరణములుగా నీ అనుగ్రహమును విస్తరింపచేసి సృష్టి-స్థితి కార్యములను నిర్వహించుచున్నావు.
 రేయింబవళ్ళను కలిగించుచున్నావు.

   నీ కిరణములను ప్రసరించునపుడు భూమిమీద నున్న సకల చరాచరములకు తగినంత మాత్రమే స్వీకరించు శక్తిని కలిగించుచున్నావు.


 పూవునకు వికసమునకు కావలిసినంత-అగ్నికి దహనమొనరించగలిగినంత-చెట్టునకు ఆహారమును సమకూర్చుకొనగలిగినంత,దేహికి తగిన ఉష్ణోగ్రతను 
స్వీకరించగలిగినంత అనుగ్రహిస్తున్నావు.
  భూగోళ-ఖగోళములను సమన్వయ పరుస్తున్నావు నీ కిరణములనే కరములతో,

గమనములకు అనువుగా ప్రభావితముచేస్తూ-నమస్కారములు.
 తం సూర్యం ప్రణమావ్యహం.

Tuesday, March 7, 2023

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(BHASKRAM-BHUVANESVARAM)-07


 రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ ।

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥


 ఆదిత్యహృదయ ఉపోద్ఘాత-ఫలశృతి   అనంతరము అగస్త్యుడు ప్రస్తుత శ్లోకములో స్వామి యొక్క అతిశయ గుణవిశేషములను  మనకు అనుగ్రహించుచున్నాడు.
 ఇదే విషయమును విశ్వామిత్రుడు,
"కౌసల్యా-సుప్రజా రామా-పూరాసంధ్యా ప్రవర్తితే
 ఉత్తిష్ట నరశార్దూల-కర్తవ్యం-దైవమాహ్నికం"
 అని తెలియచేసాడు.
 స్వామి యొక్క ఉదయము సముద్యంతం గా ప్రస్తుతింపబడుతున్నది.
 స్వామి" సమ్యక్-ఉద్యంతి" సమస్త లోకములను-చరాచరములను జాగృతము చేయుచున్నాడు.నిద్రావస్థ నుండి చేతనావస్థకు తరలించుచున్నాడు.అంటే స్వల్పకాలిక లయమును ముగించుకొని
 అనుష్ఠానమును ప్రారంభించవలసిన  సమయమాసన్నమైనదన్నమాట.
  సూర్య భగవానుడు భువనములకు సంపదలను-ఈశ్వరత్వమును ప్రసాదించువాడు.కనుక భువనేశ్వరుడు.భువనములను పరిపాలించువాడు.
 ఇక్కడ మనము స్వామి అనుగ్రహమును-మనము చేయవలసిన అనుష్ఠానము ఒకచర్యకు గల రెండు పార్శ్వములను తెలియచేస్తున్నారు.
 స్వామి రశ్మిమంతుడు.అనగా తన కిరణ ములతో సకలచరాచరములను జాగృతము చేయుశక్తి కలవాడు.

 సకలదేవతా చైతన్య సంకేతములే రశ్ములు.
 పంచేంద్రియ జ్ఞానమును జాగృతము చేసే శక్తులు రశ్ములు.
 పంచేంద్రియ జ్ఞానము ద్వారా పరమాత్మ ఉనికిని తెలుసుకునేలా చేసేవి చైతన్య ప్రతిరూపములైన రశ్ములు.
 అన్నమయ్య చెప్పినట్లు ఆ పరబ్రహ్మమునకు చరాచరములను చైతన్యము చేయుటలో తారతమ్యత లేదు.కనుకనే అడవిలో నైన-కడలిలోనైనా,ఏనుగుపైన అయినా-శునకము పైన అయిన తన కిరణములను విస్తరింపచేసి రాజునిద్రనుండి-బంటును నిద్రనుండి జాగృతపరుస్తాయి.
 జాగృతమైన దేవతలు-అసురులచే నమస్కరింపబడువాడు ఆదిత్యుడు.మనము రావణాసుడు ఆత్మలింగమును వినాయకునికి ఇచ్చి అర్ఘ్యసమర్పణమునకు తరలుట తెలిసినదే.
 అంతే కాదు సూర్యరథ గమనముతో పాటుగా యక్షులు,మునులు,అప్సరసలు,యాతుధాన్యులు,గంధర్వులు కదులుచుండుట మనము చూస్తూనే ఉన్నాము..జగములకు కావలిసిన నైసర్గిక వనరులను అందించు పరమార్థమే ఇది.
 వారు "న మమ"  మేముకాదు స్వామి ప్రపంచమునకు ఆధారభూతులము,మాలోదాగిన నీ నిత్యనూతన చైతన్యమే అని గుర్తించుటయే నమస్కృతం అన్న పదము యొక్క భావము.
 దానికి కారణము స్వామి వివస్వంతుడు.
 విశేషాన వసుమాన్-వేశేషముగా తన బంగరు కిరణములతో వేడిని-వెలుగును విస్తరింపచేసి భువనములకు పోషకత్వమును కూర్చువాడు.ఆ విస్తరనకు కారణము స్వామి భాస్కరత్వము.అంటే భాసించు కరములు కలవాడు.ఒక విధముగా చెప్పలంటే స్థితికర్త యైన మహావిష్ణువునకు-భాస్కరునకు భేదములేదు.
 విస్తరింపచేయుచున్న బంగరు కిరణములతో  ఉదయిస్తూ సకలజీవులచే త్రిగుణములకలవారిచే,త్రిగుణాతీతులచే సైతము నమస్కరింపబడుచున్న ఆదిత్యుడు మనలను అనుగ్రహించుగాక.
 తం సూర్యం ప్రణమామ్యహం.

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(SARVAMAANGALYAM)-06

 సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ ।

చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥

  ప్రస్తుత శ్లోకములో ప్రవృత్తి-నివృత్తి అను రండుచిషయములు చెప్పబడినవి.అంటే కొన్ని సుగుణములను అనుగ్రహిస్తాడు-మరి కొన్నింటిని తొలగిస్తాడు ఆదియ్త్య రూపములో స్తుతింపబడుచున్న పరమాత్మ.
 పాపము అనగా బుద్ధిని -విచక్షణను విస్మరించి ఇంద్రియలోలులమై ప్రవర్తించిన తీరుకు కలిగే ఫలితము.అవి మానసికము కావచ్చును-కాయకము కావచ్చును.వాటిని నాశనము చేసేది/పూర్తిగా తొలగించేది
ప్రణాసనం-పరిపూర్ణముగా నిర్మూలించునది స్వామి స్తుతి.
 అంతే కాదు చింత-ఆలోచనము-విచారము అను రెండు అర్థములలో చింత అను పదమును అన్వయించుకుంటే
" యద్భావం తద్భవతి" అన్నట్లుగా
 మన ఆలోచనాప్రవృత్తులను అనుసరించి వాటి ఫలితములు అనుసరిస్తాయి.
 కనుకనే ధూర్జటి మహాకవి,
 చింతాకంతయు చింత చేయరు కదా శ్రీకాళహస్తీశ్వరా అని స్వామి నిన్ను స్మరించరు మోహభ్రాంతితో అన్నాడు.
 అదియే కనుక
 సత్ చింతయ న శోక అని అన్వయించుకుంటే 
 సత్తు-చిత్తు యైన పరమాత్మను స్మరించిన-తత్త్వమును ఆలోచించినను శోకముండదు కదా అని కూడ భావింపవచ్చును.

 ప్రస్తుత శ్లోకము స్వామి యొక్క "మిత్ర" గౌణనామమునకు అద్దముపడుతున్నది.
 శ్రీలలితా రహస్య సహస్ర నామముల భాష్యములో చెప్పబడినట్లు అమ్మవారు మిత్రరూపిణి.ఆదిత్యుడు మిత్రరూపుడు.అనగా మైత్రు-కరుణ-ముదిత-ఉపేక్ష అను నాలుగు వాసనలను కలిగినవాడు.అందించువాడు.అవే,
1.నీ-నా అను భేదభావము లేనిది మైత్రి.త్రిగుణములచే ప్రభావితము కాని తురీయ స్థితి.
 2.దుఃఖపీడితుల పట్ల కలుగు కరుణకు ఆధారము మైత్రి.
 3.వారి దుఃఖములను తొలగించుటకు అవసరమైన పుణ్యపురుష సాంగత్యమును లభింపచేయునది ముదిత.
 4.మానవసహజముగా అరిషడ్వర్గములను అధీనములో నుంచుకోలేని జీవులు అసహాయులై పాపములు చేసినప్పటికిని ఆపేక్షతో వారిని మన్నించుటయే ఉపేక్ష.క్షమాగుణమే ఆ సూర్యభగవానునిది.
  స్వభావమును సరిచేసుకొనుటకు సహనముతో సదవకాశములను  -వాసనాచతుష్టయము ను శ్రీరాముడు రావణునికి అందిస్తున్నడు.కనుక "మిత్ర శబ్దము సూర్య పరముగాను-"శ్రీరాముని పరముగాను అన్వయించుకోవచ్చును. 


   

 మూడు విశేషపదములు స్వామి అనుగ్రహమునకు అద్దముపడుతున్నాయి.
 అవి
1.సర్వమంగలము
2.ఉత్తమము
3.ఆయుర్వర్ధనము.
 ఉత్తమ స్వభావము కలవాడు ఆదిత్యుడు.తల్లిగా భావింపబడు భూమండలమునకు-తండ్రిగా ఆరాధింపబడు ఆకాశమునకు తన కిరణములద్వారా వంతెనవేస్తూ,మధ్యలో పంచభూతములను విస్తరింపచేస్తూ,స్వలాభమును కోరుకోకుండా సర్వలాభమును అందించు స్వభావము కలవాడు పరమాత్మ.
 స్వామి నామములన్నియు గౌణ నామములే.గుణములకు సంకేతములే.

  అమంగళము ప్రతిహతమగుగాక అన్న మంగళాశాసనమును మనము వింటూనే ఉంటాము.
  పూర్తిగా నిరోధింపబడుట.
 మంగళములకు కలుగు అడ్దంకులే అమంగలములు.అవి సర్వజనులను బాధించునపుడు సర్వులకు అమంగళమే కదా .అది నివారింపబడినపుడు సర్వమంగలము.దానిని కలిగించు సూర్యుడు సర్వ మంగళుడు.
 ప్రకృతిని సమపాళ్ళలో సమన్వయపరచి సంపన్నముచేయుట చే వచ్చు మాంగళములను అందించువాడు.
 ఇదే విషయమును మనము పరమేశుడు హాలహల భక్షణమును చేసిన సందర్భములో,
 మింగమనె సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమినదో అన్నారు పోతన మహాకవి.
  స్వామి ఉత్తమస్వభావి.మంగళప్రదుడు.వాటిని పొందుటకు సర్వచరాచరములకు కావలిసినది పెంపొందించబడిన ఆయుర్దాయము.
 అదే ఆయుర్వర్ధనం అన్న మహా విశేషము.
 సకల చరాచరములకు "ఆరోగ్యం భాస్కరాదిత్యేత్" అన్నట్లుగా
 జలచరములకు-భూచరములకు-ఖేచేరములకు తగిన ఆహారమును-ఔష్ధులను-ఆరోగ్యమును అనుగ్రహించువాడు.
 ఇక్కడ ఔషధము అన్న పదమును ఒకసారి గ్రాసమునందించు సమసిపోవు వానిగా కూడా వరి,చెరకు (పంతలు) గా కూడా భావిస్తారు పెద్దలు.
 అనుగ్రహదాత-అనుగ్రహ గ్రహీతలకు శుభములు కలుగుగాక.
   తం సూర్యం ప్రణమామ్యహం.

Monday, March 6, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AKSHAYAM PARAM SIVAM)-05

 ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ ।

జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥


 ప్రస్తుత శ్లోకము సర్వాంతర్యామిని సంకేతిస్తూ,అఖిలమునకు మూలమైన ఆదిత్యహృదయ స్తొత్రమును నిత్యము జపించిన కలుగు ఫలప్రాప్తిని వివరించుచున్నది.
 జయము-శివము-నిత్యము అను మూడు విశేషములు ప్రస్తావించబడినవి.పదములలో దాగిన నిగూఢార్థములను గ్రహించే ప్రయత్నము చేద్దాము.
 1.ఆదిత్య అను శబ్దమునకు అనేకానేక సమన్వయములు చెప్పబడినవి.
 ప్రణవముగా ఆదిత్యశబ్దము కీర్తించబడుతున్నది.
 ప్రకాశముగాను స్పష్టమగుచున్నది.
 కాలగమనమునకు సంకేతముగాను నిర్ధారింపబడుచున్నది.
 కిరనముల ద్వారా ప్రత్యక్ష వ్యాపకత్వముతో పరిపాలించుచున్న పరమాత్మ అనుట నిజమే.
 
 హృదయము అనగా మూలము.అనంతవిశ్వరచనకు ఏది మూలమో,అనంతవిశ్వభ్రమణమునకు ఏది కారనమో,అనంత పోషకత్వమునకు ఏది ప్రధానమో,అనంత వికాసమునకు ఏది ఆధారమో అదే ఆదిత్యహృదయము.
 సాహిత్య పరముగను-సాంకేతిక సమన్వయమునకు అనుసంధానము చేయుచున్న అద్భుత చేతనాశక్తియే ఆదిత్యహృదయము.

 జపము అను పదము  అట్టి మహత్తర చైతన్యశక్తిని నామము-స్మరనము-సమయము-సమర్పణము-విశ్వాసము అను నమః చేయుచున్నది నేను అనిపిలువబడు ఉపాధికాదు-దానిలో దాగిన నీ చైతన్యమే అని గుర్తించి-గౌరవించు స్వభావము.
  నిత్యము-నిత్యము అనే పదము పరమాత్మ యొక్క శాశ్వతత్త్వమునకు-జీవుని జపమునకు-సాధనకు-దాని వలన లభించే సత్ఫలితములకు అన్వయించి తెలియచేయటమైనది.
 సాధకుని పరముగా
 జపేత్-నిత్యం
 ఫలితముల ప్రకారముగా
 పుణ్యము-నిత్యం
 జయం-నిత్యం
 శివం-నిత్యం
 పరం-నిత్యం
 అక్షయం-నిత్యం
 మనము పైన చెప్పబడిన నిత్యమును సమయమునకు అన్వయించుకుంటే 
 అది ఒక్కరికి-ఒక్కసారి అని కాదు అని స్పషటము చేస్తూ
 సర్వ శత్రు-వినాశనం అని అవి లభించటానికి అవసరమైన మలినములను సైతము తొలగిస్తుందట.లోపల దాగిన శత్రువులను-ఉపాధులతో ప్రకటనమగు శత్రువులను తొలగించి,అనుగ్రహమును పొందుటకు అవకాశమును కలిగిస్తుంది.
 ప్రస్తుత శ్లోకము స్తోత్ర వైశిష్త్యమును
 అక్షయ్యం అను పదముతో అనిర్వచనీయము చేస్తున్నది.
 1.ధర్మరాజుకు అనుగ్రహింపబడినది అక్షయపాత్ర.వాచ్యార్థమును గమనిస్తే రాగి పాత్ర.కాని పరిశీలిస్తే భూమండలము.సూర్య భగవానుడు భూమండలము అనే పాత్రలో తన కిఋఅణముల ద్వారా ఋతువులను మార్చుతూ,అనేకానేక ఆహారములను,ఔషధములను,అధ్యయమును అందిస్తున్నాడు.పాత్రతను అనుగ్రహిస్తున్నాడు ఉపాధులకు జీవించుటకు.
 2.అక్షయము అనగా ఆకాసము-అనంతము.తాను దానిని తన శక్తిని కిరణములుగా ప్రసరిస్తూ పాలించుటకు కేంద్రము చేసుకొనినది.
 3.అక్షయము అనగా క్షయము కానిది.నిరంతర నిధి నిక్షేపములను అనుగ్రహించునది.
  పరము అయిన శివము-అనగా చెదిరిపోని మానసిక స్థితిని నిత్యము కలిగించునదిగా అగస్త్యునిద్వారా అనుగ్రహించబడినది,
 తం సూర్యం ప్రణమామ్యహం.


 

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(GUHYAM-SANATANAM)-04

 రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥


 ప్రస్తుత శ్లోకము ఒక విధముగా ఫలసృతి అని భావిస్తారు.
 ఇందులో గుహ్యం-సనాతనం అని శ్లోకము ద్వారా స్తోత్ర వశేషము చెప్పబడినది.
 మననాత్ త్రాయతే మంత్రం-వేదవాక్యము.
 అగస్త్యుడు రామునకు అదిత్యహృదయ మంత్రమును ఉపదేశించాడు అనుట మంత్ర మర్యాదను పాటించమనుకోవచ్చును.
 ఆది-అంతములేని నిత్యనూతన తత్త్వమే సనాతనము.
 ఆదిత్యహృదయ స్తొత్ర పఠన ఫలితము కేవలము శ్రీరామ చంద్రునికి మాత్రమే కాదు సర్వులకు-సర్వకాల సర్వావస్థలయందును సంస్కరించునది అని చెప్పకనే చెప్పబడినది.
 అంతే కాదు ఒక్క శత్రువును సంహరించునది మాత్రమే కాదు
 సర్వన్-అరీన్-సర్వశత్రువులను అనగా 
 కామ-క్రోథ-లోభ-మోహ-మద-మాత్సర్యములను అంతరంగశత్రువులను-బాహ్య శత్రువులను హరించివేస్తుంది.
  అంతే కాకుండ
 వత్స-అను వాత్సల్య పూరక సంబోధనము జరిగినది.
 వత్స అను సబ్దమునకు గోమాత యొక్క లేగ.గోవు తాను సాకాహారి.అయినప్పటికిని తన నుండి జన్మించిన బిడ్దను ఆవరించి యున్న నిషిద్ధమును ప్రేమతో శుభ్రం చేస్తుంది.దానికి స బాహ్య-అభ్యంతర శుచిని ప్రసాదిస్తుంది.
 శ్రీరాఘవం-ఆజానుబాహుం అన్నది మనము వింటూనే ఉంటాము.
 రామ-రామ మహాబాహో అన్న విశేషము కూడా వినిపిస్తుంది.
 మహా అవధులు లేని భుజపరాక్రమము కల శ్రీరామ
 నీవు రణ్ అమున చింతాక్రాంతుడవై ఉండుట తగదు.
 జగన్మాత యైన సీతను అయోధ్యకు తీసుకుని వెళ్ళవలసిన సమయమాసన్నమైనది.
 రామ-ఓ భగవానుడా!
 రామ-దుష్టశిక్షన-శిష్ట రక్షణ వ్రతముగా గల అవతారమా
 శ్ర్ణు-వినుము.
 నేను ఉపదేశించుచున్న స్తోత్రమును విని-పఠించుము.
  ఇది మానవధర్మాచరణము.ఆచరించి-అనుగ్రహపాత్రుడవు కమ్ము అంటూ రాముని కార్యోన్ముఖునిగా ఉత్తేజపరచిన శ్లోకమిది.
 తం సూర్యం ప్రణమామ్యహం.

Sunday, March 5, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AGASTYOE BHAGAVAAN RISHI)-03


 



 కొండను నియంత్రించినవాడు అగస్త్యుడు.అగము/నగము అంటే కొండ.కొండను ఎత్తుగా పెరగవద్దని నియంత్రించిన మహా తపోశక్తి సంపన్నుడు.ఇది వాచ్యార్థము.

 అగము అను శబ్దమునకు ఇంద్రియము అనునది మరొక భావము.అవి కొండల్లా ఎదిగి మనస్సును  ఆవరించి కదలనీయవు.ఒక్క కొండను దాటుటయే ఎంతకష్టమో.అటువంటిది ఆరు ఇంద్రియములు ఆరు కొండలుగా మనసును చుట్టుముట్టి,పొరపాటున కదిలి వెళ్ళిపోదామనుకుంటే కదలక వాటి మధ్యలో నున్న లోయలలో పడవేస్తుంటాయి.

 రావణాసురునిది అదే దయనీయమైన స్థితి.కామము అనే ఇంద్రియము కొండలా ఎదిగి కదలక నిలిచి సీతమ్మను అపహరించునట్లు చేసినది.ఎక్కడ  తప్పించుకుంటాడో అని క్రోధము వానిచే సీతమ్మను నిర్బంధింపచేసి తనను వివాహమాడమనుట, అను రెండు విషయములతో కామము-క్రోధము రెండువైపులా పెద్ద కొండల్లా  కమ్ముకున్నాయి.వెనువెంటనే తనకే దక్కాలన్న మోహము,ఆమె రామధర్మపత్ని అన్న మాత్సర్యము మరింత పెద్దకొండలై రావణుని బంధించాయి.ఎటు కదలలేడు.కదిలినా ఉండేది లోయలోనే తప్ప వాటిని దాటలేడు.వానిని ఆ కొండలనుండి బయటకు తెప్పించగలవాడు,వాని అవస్థను తప్పించగలవాడును అగస్త్యుడనే పాత్రధారుడే సుమా.అంతేకాదు.


 రఘువంశ కులదైవము సూర్యభగవానుడు.

 రాఘవునకు ఉపదేశము చేయబడినది ఆదిత్యహృదయము.

 శ్రీ రామునకు ఉపదేశించినది సూర్యతనయుడు అగస్త్యమహాముని.

  .అంతకు మించిన సన్నివేశమేముంటుంది.

 సూర్య భగవానునికి-ఊర్వశికి భావనలో జనించి,కుండలో పెరిగి ప్రకటితమైన మహాముని అగస్త్యుడు/కుంభముని.

   రాజగురువు వశిష్టుడుకదా ఆయన బదులు అగస్త్యుడు యుద్ధభూమిలో శ్రీరామునకు గుహ్యముగా ఆదుత్యహృదయము ఉపదేశించుట అన్న సందేహము కలుగవచ్చును.

 వశిస్టుడు -అగస్త్యుడును ఒకే కుండలో ఊర్వశీ పుత్రులుగా పెరిగి మైత్రావరుణులుగా ప్రకటింపబడినారు.కనుక వరుస ప్రకారము గురుతుల్యులే.

 ఆ విశిష్టమైన యుద్ధమును దర్శించుటకు దేవతలతో పాటుగా అగస్త్య్డుడును వచ్చినాడట.చింతాక్రాంతుడిగా నున శ్రీరామునికి గుహ్యమైన/సనాతనమైన ఆదిత్యహృదయ స్తోత్రమును ఉపదేశించి యథాగతం/తిరిగి స్వస్థలమునకు వెళ్ళి సూర్యునితో పాటుగా యుద్ధకార్యోన్ముఖుడైన రాముని యుద్ధమును చూచుటకు సన్నద్ధుడైనాడట.

  రావణుడు వరప్రభావముచే శత్రాస్త్రములచే మరణముపొందనివాడు.రాముడు ధర్మయుద్ధమును మాత్రమే ఆచరించువాడు.అలిసిన రావణునితో యుద్ధముచేయుటకు మనసొప్పక ఇంటికి పంపించివేసిన ధర్మశాలి.


కథనం ప్రకారములో లంకలో సీత భగవంతుని ఆశ్రయించి యుద్ధరహితస్థలికి చీకటితో నిండిన లంకను వీడి చేరాలనుకుంటున్నది.రావణుడు ఉపాధిసక్తిని చైతన్యశక్తిగా భావించక పోరాడి ధర్మమును జయించాలనుకుంటున్నాడు.అదియును మూర్తీభవించిన ధర్మముతో.

 రామచంద్రమూర్తి రావణుని బ్రహ్మాస్త్రముతో తుదముట్తించడు.ఎందుకంటే దాని ప్రభావము అమాయక జీవులకు సైతము ఆవరించివేస్తుంది.దివ్యాస్త్రములను ప్రయోగించడు.ఎందుకంటే మానవధర్మమును సమస్తలోకాలకు చాటిచెప్పలనుకున్నాడు.

 రావణుని శాపవిముక్తుని చేయవలసిన బాధ్యత నిర్వర్తించాలంటే ధర్మయుద్ధము చేయవలసినదే.దానికి రావణుడు సహకరించవలసినదే.

కనుక రాముడు సమరే చింతయాస్థితుడుగా ఉన్నాడు.

రావణుడు సైతము నిస్సహాయుదై యున్నవేళ సారథి రథమార్గమును మరల్చి,సేదతీరే అవకాశము ఇచ్చాడు.తెలివి వచ్చిన తరువాత రావణునకు అది అవమానముగా అనిపించినది.కనక తతో యుద్ధములో విపరీతముగా అలిసిపోయానని-పరిశ్రాంతం,చింతయాస్థితిలో నున్నాడు.

 ఇట్తి ధర్మ సంకతమును తొలగించగల వాడు సాక్షాత్తు సూర్య పుత్రుడైన అగస్త్యుడు మాత్రమే.రామునిది సూర్యవంశము.చేయవలసిన కర్తవ్యము సూర్యోపదేశము.

 అంతే కాకుండా విజ్ఞుల కథనము ప్రకారము కోసలదేశ పాదాతి దళమునకు సంరక్షకుడిగా అగస్త్యుడు,నౌకాదళమునకు గుహుడు,ఆకాశ దలమునకు జటాయువు నియమింపబడ్డారని చెబుతారు.అదే కనుక నిజమయితే అది రాజ్య రక్షాధర్మము.

 అగ్రతో దృష్ట్వా అనునది మరొక విశేషము.

 అగ్రతో సమీపములో చూసి అని ఒక భావన.

 సాహిత్య పరముగా అన్వయించుకుంటే,

"నానృషి కురుతే కావ్యం"

 మూర్తీభవించిన జ్ఞానము ఋషి.అందులోను తన జ్ఞానమును సరజన శ్రేయస్సుకై అందించువాడు.కనుకనే అగస్త్యుడు సమస్తలోకములకు సమ్మంగళాశాసనముగా ఆదిత్య హృదయస్తోత్రమును అందించెను.

 తం సూర్యం ప్రణమామ్యహం  

 



 


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(UPAGAMYAA AGASTYO)-02

 దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।

ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః 


 ప్రస్తుత శ్లోకములో రెండు పాత్రలు ప్రవేశింపబడినవి.అవి,
1.అగస్త్య మహాముని
2.దేవతలు.
 ఇంకొక విశేషము మొదటి శ్లోకములో యుద్ధమునకు సిద్ధముగా సమీపించిన రావణుని ప్రత్యర్థి రామచంద్ర ప్రభువుగాను పేర్కొనబడినది.
 రాముడు భగవానుడు.
 రామునికి ఉపాగమ్యా-సమీపమునకు వచ్చినవాడు ఋషి అగస్త్యమహాముని.
 ఇంకొక విచిత్రము ఈ యుద్ధమును వీక్షింపచేయుటకు అగస్త్యుడు దేవతలందరిని తనతో కలుపుకొని/కూడి వచ్చెను.
 అగస్త్య-గమ్య అగస్త్యుడు వచ్చెను.
 అగస్త్య సమాగమ్యా-అగస్త్యుడు-దేవతలతో కలిసి వచ్చెను.
  వచ్చిన అగస్త్యుడు
 రామం ఉపాగమ్యా-రాముని దగ్గరకు సమీపించెను.
  అంటే రామునికి అగస్త్యమహాముని ఆదిత్యహృదయమును ఉపదేశించునపుడు మిగిలినవారు వినలేదా/యుద్ధము జరుగలేదా అను అనుమానములు కలుగ వచ్చును.
 అది సామాన్యమైన రామ-రావణ యుద్ధము కాదు.అంతా నిమేషము-రహస్యము-రమణీయము.
 అంతే కాదు అభ్యాగతో అన్న పదం ప్రయోగించబడినది.అంటే వారు అనుకోకుండా,తిథి-వార-నక్షత్రములను గమనించకుండా వచ్చే అతిథులు కారు.ఎప్పుడెప్పుడు వారు రావణ శమ్హారమును ప్రత్యక్షముగా వీక్షించి,శ్రీరామచంద్రునకు జయజయధ్వానములతో,పుష్పవర్షమును కురిపించవలెనన్న కాంక్షతో నున్నవారు.
 అంతే కాదు.అగస్త్యమహాముని ఆదిత్యమంత్రమును ఉపదేశించి వెడలిపోయినాడు.చివరి వరకు అక్కడలేదు.
 అసలు రామచంద్ర ప్రభవు యుద్ధముచేయువేళ కులగురువైన వశ్ష్టుడు రాకుండా అగస్త్యుడు రావటం,,మంత్రోపదేశము చేసి మరలిపోవటం ఎమిటి?
 అసలెవరీ అగస్త్యుడు.అన్న విషయమును తరువాతి సంచికలో తెలుసుకుందాము.
  తం సూర్యం ప్రణమామ్యహం.

ANIRVACHANEEYAM- ADITYAHRDAYAMU(TATOE YUDDHAM)-01

 తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥


  ప్రస్తుత శ్లోకములో మహర్షి అనుగ్రహించిన పదములు,
 
 తత్-ఆ
 యుద్ధము,సమరము,చింత-అగ్ర-దృష్టి,రావణ-స్థితం-సముపస్థితం.పరిశ్రాంతం మొదలగునవి.
 రావణ-అను ఒక్క నామము మాత్రమే చెప్పబడినది.
 సమరము-యుద్ధము-పరిశ్రాంతము-దృష్ట్వా-(చూచెను)స్థితం-సముపస్థితం 
 అను క్రియా పదములు(పనుల) గురించి చెప్పబడెను.
 అగ్రతో-పైకి,పరి-మిక్కిలి,విశేషములను చెప్పబడినవి.
 రావణం చ-అనగా రావణునితో కూడి యున్నది ఆ యుద్ధరంగము అని,చ అను భూతకాలమును అన్వయించుకుంటే ఈ యుద్ధము ఎప్పుడో జరిగినది అని రెండు విధములుగా భావించవచ్చును.కాని రావణునికి ఎవరికి మధ్యన ఈ యుద్ధము జరిగినదో ప్రత్యేకించి చెప్పలేదు.
 సమరే చింతయాస్థితం-అన్నారు మహర్షి.
 యుద్ధమును గ్య్రించిన ఆలోచనలతో నున్నారట.
అంటే ఇరుపక్షములవారా లేక కేవలము రావణుడు మాత్రమేనా అన్న సంసయము కలుగవచ్చును అజ్ఞానమునకు.
 రావణ ప్రసక్తి వచ్చినది కనుక లంకలో యుద్ధము జరిగినదనుకొనుటలో తప్పులేదు.
 కాని నిలకడలేని ఆలోచనలు స్థిరముగా నున్నవట.ఇది ఒక విరుద్ధ విషములను తెలియచేయుటకు/ఒక ప్రత్యేక మానసిక స్థితిని చెప్పుచున్నదే సమరము అనే పదము.మానసిక సంఘరషణలో నిలకడలేని ఆలోచనలు స్థిరముగా ఉండెననుటచే ఆ యుద్ధము ప్రత్యేకమేమో.
 1. ఆ యుద్ధము సామాన్యమైనది కాదు.కనుకనే రామ-రావణ యుద్ధమనలేదు మహర్షి.

  యోధులున్నప్పటికిని యుద్ధములను ప్రోత్సహించనిది అయోధ్య రాజ్యము.అటువంటి అయోధ్యాపతిని సమరమునకు సన్నద్ధముచేసినది తత్ యుద్ధము.
2.  సీతాపహరణ యుద్ధమనలేదు.ఉత్తర-దక్షిణ రాజ్యముల మధ్య యుద్ధమనలేదు.
3. లంకా యుద్ధమనలేదు.రామునకు కావలిసినది లంక కాదు.ధర్మ స్వరూపమైన తన ధర్మపత్ని.

4..ఆజానుబాహుడు-మహాబాహుడైన శ్రీరాముడు యుద్ధము చేయుటకు మనస్కరించని స్థితిని ప్రకటింపచేసిన యుద్ధము.
 యుద్ధనీతి ప్రకారము అలసిన నిస్సహాయుడైన రావణుని విశ్రాంతి తీసుకుని,తిరిగి సన్నద్ధుదై రణభూమికి రమ్మని పంపించివేసినది పూర్వ సందర్భము.ఒక వేళ రావణుడు మనసు మార్చుకొని తిరిగి యుద్ధమునకు రాకున్నచే,శరణాగతుడైనుచో,తన వరము ప్రకారము నరునిగా తన చేతిలో అంతమొంది జయునిగా వైకుంఠమును చేర్చవలసిన బాధ్యత భగవంతునిది గా తనది కదా.దానికి ఆలస్యమయితే?
 5.  మీరు నవ్వుకోవచ్చును.సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి ఈ విషయము తెలియదా అని ,కాని స్వామి మానవధర్మములను తాను ఆచరించి,మనలను ఆచరింపచేయుటకు కదా ఈ యుద్ధము.
 కనుక రామ-రావణ యుద్ధమనలేదేమో.
6. రావణుడు ఎప్పుడెప్పుడు  తన స్వామి ద్వారసేవకునిగా తనను కరుణిస్తాడని తరుణమునకై  తహతహలాడుచున్న యుద్ధం.తన జయుని అనుగ్రహించాలని స్వామి తహతహలాడుచున్న యుద్ధము.
7.శాపవిమోచనమునకు జగన్మాత సాక్షాత్తుగా సహకరించిన యుద్ధము.
 క్షాత్రము-క్షమాగుణము కలగలిసినది ఆ యుద్ధభూమి.
8..ఇదమిత్తమని,ఇదే నిమిత్తమని కాని సకలలోక క్షేమమునకై 

 పరిత్రాణాయ సాధూనాం-వినాశాయచ దుకృతాం

 ధర్మ సంస్థాపనకై జరుగుచున్న యుద్ధభూమి అది.
9.మానవ హృదయమే తమోభావములనే నీటితో నిండిన లంక.వాటిలోని అరిషడ్వర్గములే తనను ఎవరు జయించలేమని చేయుచున్న పెద్ద రవము.కనుకనే రావణుడు ఆకాశమార్గమున మాయ యుద్ధముచేయుచుందగా రాముడు తలపైకెత్తి పైకెత్తి చూచుటను "అగ్రతోదృష్ట్వా" అని అనుకొని ఆనందపాడారు.సముపస్థితం-దగ్గరగా వచ్చి ఉన్నది.ఏమిటి?
.సంస్కరించవలసినఉపాధి.పదితలలతోప్రత్యర్థినిపరిమార్చుటకు ప్రయత్నిస్తున్నది.పరమాత్ముని కరుణా వీక్షణమే

ఆ అగ్రతోదృష్ట్వా అని ఆరాధించేవారు ఉన్నారు.
 తద్భావం తద్భవతి-
 తం సూర్యం ప్రణవామ్యహం.

Saturday, March 4, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-INTRO

 


       ఆదిత్యహృదయము 

       *************

 "ఏకం సత్ విప్రా బహుధా వదాతి"


   వాల్మీకి విరచితమైన "శ్రీమద్రామాయణము" లోని యుద్ధకాండమునందు "ఆదిత్యహృదయస్తోత్రము"  అగస్త్యమహాముని చే అనుగ్రహింపబడినదని ఆర్యోక్తి.

 కథాకథన ప్రకారముగా,

 దక్షప్రజాపతి కుమార్తె అదితి.కశ్యప ప్రజాపతి ధర్మపత్ని.వీవివి సంకేత నామములు.వానినే గౌణ/గుణమును తెలియచేయు నామములని చెబుతారు.అదితి అనగా అఖండము.కష్య అనగా ప్రకాడము.అకహండ ప్రకాశమే వారి దాంపత్యము.

  మాతృస్వరూపిణి అయిన అదితీదేవి ధర్మసంరక్షణమునకై "అదిత్యోపాసనమును" ఉపాయముగా భావించి,తన భర్త అనుమతిని స్వీకరించి,పరమాత్మను ప్రార్థించుటకు పూనుకొనెను.

  పరమాత్మ(సూర్యభగవానుడు) తల్లికి ప్రత్యకముగా కనబడి,సుష్మ్న అనే కిరణము ద్వారా ఆమె గర్భవాసము చేసే వరమును ప్రసాదించెను.

 తరువాత జరిగిన కథను మనము ముందు సంచికలలో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.


   అదితి అనగా అఖండముగా మనము భావించుకుంటే అఖండమునకు లభించిన అనుగ్రహమే "ఆదిత్య హృదయము".

 పరంజ్యోతిని అదితిగా భావించుకుంటే పరమాత్మ ప్రకాశమే ఆదిత్య హృదయము.

 కిరతి-వ్యాపకము-కిరణము.వ్యాపకత్వమే హృదయమైతే దానిని వ్యాపింపచేసేది అదితి.అంటే వ్యాపకశక్తి-వ్యాపకత్వమే ఆదిత్యహృదయము.

  విత్-తెలుపునది వేదముగా భావిస్తే,వాటిని 

 త్రయీ వేద్యము గా భావిస్తే మూడువేదములుగా,

 మూలశక్తి-ఋఇగ్వేదముగా

 చైతన్యశక్తి-యజుర్వేదముగా

 వ్యాపకశక్తి-సామవేదముగా అన్వయించుకుంటే

 వేద సారమే ఆదిత్యహృదయము.

  నాదమయముగా నమ్మితే,గాయత్రీమంత్ర రహస్యమే ఆదిత్యహృదయము.

 "నేలనీరు నింగిచేరు ఆ సూర్యుని సాక్షిగా

  నింగినీరు నేల జారు ఆ వర్షము సాక్షిగా"

 అన్న వాక్యములను గ్రహిస్తే

 అగ్ని-సోమాత్మక తత్తము ఆదిత్యహృదయము.

  మన ప్రయత్నముగా ప్రతి శ్లోకమును అర్థమును గమనించి-గ్రహించుటకు స్వామి కరుణను అర్థిస్తూ

ముందుకు సాగుదాము.

 తం సూర్యం ప్రణమామ్యహం.



Friday, March 3, 2023

SIVATANDAVA STOTRAMU(ANUGRAHAMU)-15

 పూజావసానసమయే దశవక్త్రగీతం యః

శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15.


 ప్రస్తుత శ్లోకము కథాపరముగా అన్వయించుకుంటే పూజను ముగించే సమయమున,సాయం సంధ్యా సమయమున చదివినటయితే అశ్వములు-ఏనుగులు-రథములు లభించుటయే కాక అవి మరలిపోక స్థిరముగా ఉంటాయని చెప్పబడినది.పది నాలుకలు కల రావణుడు దీనిని పఠించినట్లు-పరమేశ్వరునిచే అనుగ్రహింపబడిన కథనము కలదు.ఒక విధముగా ఇది సంప్రదాయ మంగళాశాసనము.సంపదలను అనుగ్రహించేవాడు శంకరుడు.అనగా సంకరుడు అను నామము-శిరముపై జటలు-గంగ-చంద్రవంకను ధరించి,మెడలో పాములను హారములుగా ధరించి,డమరు నాదమును మ్రోగించుచు ,అమ్మ పార్వతీదేవిని కూడి తాండవమాడు స్వామిని స్మరించుకుంటే అసమాన సంపదలను పొందుతారని ఆర్యోక్తి.

 కాని కొంచము నిశితముగా పరిశీలితే ఎన్నో విశిష్ట పదముల వివరణను గ్రహించగలిగితే మనము తప్పక మన మనసును పరమేశ్వరార్పనము చేయకుండా ఉందలేము.


  స్వామి తాందవమును వర్ణించిన సాధకుడు ఆ పవిత్ర తాండవము తనలో కూడా నిరంతరము జరుగుచున్నదని,ఆ నర్తనమును గమనించుకొనుటయే లక్ష్మీ సుముఖత్వముగా గ్రహించగలగాలి.

 తన స్వస్వరూపమును అర్థముచేసుకొనుటయే పూజ.పూజానంతరము పఠించుట అని చెప్పబడినది.

 తన నిజస్థితిని గ్రహింపచేయునదియే "దశవక్త్ర గీతం."

 పదినాలుకలు పలికిన పదితలల వాని విరచితమైన స్తోత్రమిది అంటుంది కథనము.

 పది ఇంద్రియములు(ఐదు జ్ఞానేంద్రియములను-ఐదు కర్మేంద్రియములను చైతన్యవంతము చేయునది శివతాందవము అంటుంది విచక్షణ.

  పంచభూతములను-పంచ తన్మాత్రలను సమస్థితిలో నుంచునదే శివతాండవము అంటుంది ప్రకృతి.

 పంచకృత్యములను-వాటి సమన్వయమును తెలియచేయునది స్వామి తాందవము అంటుంది సనాతనము.

 దశదిశలను సమన్వయ పరచుట అంటుంది మరొక వాదము.

 ఏది ఏమైన ఎవరు ఏ విధముగా అన్వయించుకొనిన మనలోని వివేకమును జాగృతపరచునది తాండవ స్తోత్రము.

 కనుకనే నీవు కనుక దానిని గమనించి గౌరవిస్తే నీ తమోభావము తొలగి నీ మనసనే గుఱ్ఱము నిన్ను అనుసరిస్తు,రథమనే నీ ఉపాధిని ఉన్నతముగా మలచి,నిన్ను ఉధ్ధరిస్తుంది.

  ఏక బిల్వం శివార్పణం.




Thursday, March 2, 2023

SIVATANDAVASTOTRAMU(VISUDDHIM ETI SAMTATAM)-14

 ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం

పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||


 క్రిందటి శ్లోకములో సాధకుడు తాను పొందవలసిన సమాధిస్థితిని తెలియచేస్తూ,కనుబొమలమధ్యలో తన ఏకాగ్రతను నిలిపి ఆ పరమాద్భుతమును దర్శితూ,ధ్యానిస్తూ ,
స్తవములలోఎల్లా అత్యుత్తమమన శివతాండవస్తొత్రమును 
1.పఠన్-స్మరన్-బ్రువన్
 చదివినను-స్మరించినను-జపించినను
 ఇదమ్హి నిత్య ఏవ ముక్తం

 శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది. 
2.అంతే కాదు న అన్యధాగతి-అంతకంతే తక్కువ స్థితికి తీసుకుని వెళ్లదు.అంటే అదే స్థితిలోనే సాధకుని చిత్తమును నిలుపుతుంది.
3.అట్టి స్థితికి అనుకూలమగు
 నరో విశుద్ధ ఏతి సంతతం
 ఇక్కడ నరులకు అను శబ్దము ప్రయోగించబడినది.
ఆకారములు వికారములకు ప్రేరకములు.నరులకు చూపు ఆకారములపై నున్నంతకాలము వికారములు వారిని వేధించక మానవు.
 ఆకారములో దాగి చైతన్యవంతము చేస్తున్న అసలును గ్రహించిన వేళ ఆకారములేదు-అది కల్పించు వికారములుండవు.

 అప్పుడు ఆ హృదయకుహరములో సుభక్తి ప్రవేశించి ఆ పరమాత్మను గురువుగా తనను అనుగ్రహించమని వేడుకోగలుగతుంది.జీవాత్మను శిష్యునిగా స్వీకరించి పరమాత్మ గురువై అంధకారమును తొలగించుతకు నామ సమరనము-పఠనము-జపము అను అనువగు మార్గములను చూపిస్తూ దేహి యొక్క దేహభ్రాంతిని విడిచి శంకరుని సుచింతనను పొందగలుగుతారు.
 ఏక బిల్వం శివార్పణం. 

Wednesday, March 1, 2023

SIVATANDAVA STOTRAMU(SIVETI MAMTRAMUCHCHAREN KADA-WHEN)-13


 కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్

విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||


  క్రిందటి శ్లోకములో సాధకునకు కావలిసిన మనోస్థితిని సమస్థితిగా వివరిస్తూ,అట్తి స్థితిని పొందుటకు బాహ్యవస్తువులలోని వైవిధ్యమును గమనిస్తూ ద్వంద్వములో దాగియున్న మూలమును గ్రహింకలిగే సంస్కారమును పొందాలి అని చెప్పబడినది.

   ప్రస్తుత శ్లోకములో ఆసనమును గురించి ఎటువంటి ప్రదేశము అనువైనది నాలుగు విధములుగా ఐదవది ఫలితముగా చెప్పబడినది.అవియే 1.వసనము 2.స్మరనము 3.లగ్నము 4.వందనము 5.సుఖము                         
 1.వసనము.
   *******
 బాహ్యమునకు 
 నిలింపనిర్ఝరీ ప్రవాహ తటమున కల కుటీరము అనువైనదట.భ్రూమధ్యక్షే త్రమైన కాశీక్షే త్రమున ప్రవహించుచున్న గంగానదీ తీరమున నున్న పవిత్ర ఆశ్రమములో అధిష్ఠించి ఉపాసనను ప్రారంభించవేల్ననెను.
  మనసులో కదిలే ఆలోచనలన్నీ నిలింపనిర్ఝరీ తరంగములు కావలెని.వాటి తీరమున నున్న హృదయ కుహరము కుటీరముగా కావించుకొనవలెను.
   అగస్త్య మహాముని కాశీక్షత్ర గంగాతీరమున నున్న బిల్వనమున ఆసనమునేర్పచుకొని పరమేశ్వర ధయానము చేసెననునది ఇతిహాసికము.
2.స్మరణము
  ********
 స్మరనము నందు ఉపభాగములుగా ముద్ర-వహనము అనగా కొన్నింటిని విడిచి-కొన్నింటిని స్వీకరించాలి.
 స్వీకరించవలసినది నమస్కార ముద్ర.
 వహనము/విడువ వలసినవి దుర్మతి-చెడు ఆలోచనలు
 మనసునుండి చెడు ఆలోచనలను త్యజించి,అంజలి ముద్రను స్వీకరించవలెను.
3.లగ్నము
  ******
  చిత్తము ఈశ్వరాయత్తము కావలెను.అనగా అనగా ఏకాగ్రతను బిందుస్థానమునకు చేర్చుకొనవలెను.అదియే సాధకుని జ్ఞాననేత్రముగా అద్భుతములను దర్శింపచేయును.
 4.వందనము
   ********
 నమస్కారము.అనగా న మ నేను అనుకునేది నేనుకాదు.నాలోనున్న నీవు అని తెలిసికొనుటయే వందనము.సస్వరూపమును అనగా తన ఉపాధిలో నున్న చైతన్యమును గుర్తించి-గౌరవించుట ప్రారంభమయితే
 అహం నేను సదా ఎల్లవేళల
 సుఖావస్థలోనే ఉండెదను గాక అన్న ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నాడు సాధకుడు.
 ఏక బిల్వం శివార్పణం 

   

SIVATANDAVA STOTRAMU( KADA SADASIVAM BHAJE--ELIGIBILITY TO WORSHIP)-1212

 దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-

-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||




  మొదటి శ్లోకములో జటాజూటమునుండి జారిన నిలింప-దేవతలయొక్క-నిర్ఝరీ-జల ప్రవాహము శివతాండవ వేదికను పునీతము చేసినది.ప్రస్తుత శ్లోకములో సాధకుని హృదయపీఠిక స్వామి తాండవమునకు ఏ విధముగా సిద్ధము చేసుకొనవలెనో తెలియచేయబడుతున్నది.
 ఇంతవరకు చెప్పబడిన శ్లోకములలో సర్పములు ఒకసారి ఆభరణముగాను-మరొకసారి ఆయుధముగాను-ఇంకొకసారి అగ్నిని ప్రజ్వలించేసిన జ్వాల గాను స్వామి తాండవములో భావింపచేసినది.
 అదే విధముగా స్వామి కంఠము సైతము ఒకసారి అమావాస్య కటికచీకటిగాను మరొకసారి చంద్రోదయమునకు వికసించుచున్న కలువకాంతిగాను ప్రస్తావింపబడినది.
  గజము ఒక సారి గర్వచిహ్నముగాను మరొకసారి ఉత్తరీయముగాను భావింపబడినది.
  చంద్రవంక ఒకసారి స్వామి జటలో ఆభరణముగాను మరొకసారి చకోరమునకు వెన్నెలనందించు అమృతమూర్తిగాను వర్ణింపబడినది.
 అమ్మవారు సరేసరి .అగ్నిసోమాత్మక సంకేతముగాను,అర్థనారీశ్వర పరమార్థముగాను,మరొకసారి జగన్మాతగా స్థితికార్యమును నిర్వహించుటకు సూర్యచంద్రులను తన వక్షోజములుగా పత్రమై స్వామిచే మకరికాపత్ర రచనకు ఆలంబనమైనది.
  ఒకే వస్తువు పలువిధముగా ప్రకటనమగుట దాగిన అర్థమేది?
 పాములు పాకుట-గంగ జారుట,స్వామి ఆడుట,దమరు మోగుట,అగ్ని ఒదిగి ఒదిగి జలము సామీప్యములో నుండుట,నిష్కళంకుడు కళాధరుని అలంకరించుకొనుట.
 అన్నింటిలో దాగి అన్నింటిని చైతన్యవంతము చేసిన తాందవము తన మెడనున్న పాములచే తీవ్ర ఉఛ్చ్వాసములతో విషమును గ్రక్కించుట,ఆ విషమును అగ్నిని మరింత ప్రజ్వలింపచేయుట సామాన్య మేధ గుర్తించరానిది.
  దానిని గుర్తించే అర్హతను పొందాలంటే ఉపాధి ఒకటిగానే ఉన్న ప్రజలు-ప్రభువు అన్న భేదమును దూరము చేయాలి.
 రాయి-రత్నము అన్న తారతమ్యమును తరిమివేయకలగాలి.
 అమృతము-విషము అన్న విరుద్ధభావనను విడిచివేయగలగాలి.
 సౌకర్యము-అసౌకర్యము అంటూ రెండు అవస్థలను అతిక్రమించగలిగియుండాలి.

 అన్నింటిని మించి మితృ-శతృ భావాతీతులుగా ఉండ్ అగలగాలి.
 అటువంటి స్థితిని పొంది నేను పరమాత్మను నిష్కళంక మదిలో ఎప్పుడు నిలుపుకొందునో కదా అని సాధకుడు తన ఆకాంక్షను ప్రస్తుత శ్లోకములో నివేదించుచున్నాడు.
 ఏక బిల్వం శివార్పణం 


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...