Tuesday, December 26, 2017

ANAMDA LAHARI-01

 ఉపోద్ఘాతము

 " యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా
  
  నమస్తస్థ్యై  నమస్తస్థ్యై నమస్తస్థ్యై నమో నమ:"

   సకలజీవుల శరీరముల రూపములలో కాని,చేతలలో కాని మనకు ఒక్కరీతి కనిపించరు.ఒక్కొక్క శక్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంచరించుకొనును.జలచరములు,భూ చరములు,ఖేచరములు,ఉభయచరములు వేని ప్రత్యేకతను కలిగియున్నవనుట నిర్వివాదాంశము.

  మనము చూస్తున్న,అనుభవిస్తున్న శక్తి సూక్ష్మము నుండి స్థూలముగాను,స్థూలము నుండి సూక్ష్మము గాను తన ఉనికిని ఏ మాత్రము కోల్పోకుండా సమయ-సందర్భానుసారముగా మారుతు సృష్టి-స్థితి-లయ కార్యములను నిర్వహించుచున్నదనుట నిర్వివాదాంశమే.

   ఏ విధముగా సూక్ష్మమైన మర్రివిత్తనము పెద్ద వృక్షముగా స్థూల పరిణామమును-పరిమాణమును పొందుతుందో అదేవిధముగా మనలోపల (నీవార శోక)చిఛక్తి అవసరమునుబట్టి శబ్దశక్తి,శ్రవణశక్తి,దృశ్యశక్తి,మేధాశక్తిమాదిరి పలువిధములుగా విభజింపబడి ప్రకటితమగుచున్నది.సూక్ష్మము స్థూలమైన తీరు మాత్రమేకాదు స్థూలము సూక్ష్మమైనను తన స్థూలత్వమును ఏ మాత్రము కోల్పోదు అనుటకు గురువు సహాయముతో పుస్తకమునందలి స్థూల విషయము సూక్ష్మముగా మారి విద్యర్థి మస్త్ష్కములోనికి ప్రవేశిస్తుంది.అయినను తన స్థూల స్వభావమును పదిలపరచుకుంటుంది.కనుక సూక్ష్మ-స్థూల శక్తులు రెండు అజరామరములే -ఆ చంద్ర తారార్కములే.

   "వ్యక్తం అంబామయం సర్వం
    అవ్యక్తం  పరమేశ్వరం." ను అనుసరించి శివశక్తులు బిందు వృత్తములుగా అలరారుతుంటాయి.

   శివశక్తుల చిద్విలాసముగా దక్షయజ్ఞము తరువాత లోకకళ్యాణార్థము హరి సుదర్శన చక్రముతో ఖండింపబడిన మాయాసతి శరీర భాగములు పడినచోట్ల "అష్టాదశ శక్తి పీఠములు"గా విరాజిల్లుచున్నవి.(వీటి సంఖ్య గురించి,వివరముల గురించి వివాదములు మనకొద్దు.)

  ఆదిపూజ్యుని తల్లి నా అశక్తతతను  గ్రహించి,తన అవ్యాజ కరుణతో నన్నొక పనుముట్టును చేసి,తాను  ఆధారమైన ఆ దారమై, " ఆనందలహరి" అమ్మ కథల అరవిందములను అల్లుచున్నది.అమ్మ నామస్మరణమనే ఝుంకారముచేయుచు,మధుర మధుర మాధవీదేవి కృపారసమను మధువును గ్రోలుటకు తరలి రండి-తరించండి.

   (నా అహంకారము వలన దొర్లిన లోపములను పెద్దమనసుతో సవరిస్తారని ఆశిస్తూ-మీ సోదరి..

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...