Tuesday, December 26, 2017

ANANDA LAHARI-09

  "ఉజ్జయిన్యాం  మహాకాళి మహా కాళేశ్వరేశ్వరి
   క్షిప్రతిరస్థిత మాతా వాంచితార్థ ప్రదాయిని"

 మధ్యప్రదేశములోని  మాల్వా పీఠభూమి యందు,క్షిప్రనదీ తీరములోని మాల్వ పీఠభూమి యందు,పదహారు జనపదములలె ఒకటైన అవంతీ రాజ్యమునందు పడిన మాయాసతి పై పెదవి/పలువరస ఉజ్జ్వల మహా కాళిగా/మహా కాలునిగా ఆవిర్భవించెను.దీనిని "మహా శ్మశానము" అని కూడా అంటారు

  చంద్రసేనుడను భక్తుని రక్షించుటకు శివుడు ఇక్కడ వెలిశాడని అంటూంటారు.విక్రమాదిత్యుడు,సాందీపని,మహాకవి కాళిదాసు తరించిన ప్రదేశము కనుక ,సాధనతో ఎందరో మహానుభావులు సిద్ధిపొందిన క్షేత్రము కనుకను,సిద్ధమాతా క్షేత్రమని కూడా వ్యవహరిస్తారు.

  మంగళనాథుని కోవెల కుజునిచే నిర్మింపబడినదని ఇక్కద మంగళగ్రహ దివ్యశక్తి కలదని,దర్శించిన ప్రజలు కుజదోషము నుండి విముక్తులగుదురని భక్తుల విశ్వాసము..

   అబంతీ పట్టణము కాలక్రమమున ఉజ్జయినిగా మారినది.దాని యందు మహాకాలుడుగా  అయ్యవారు,మహాకాళి గా అమ్మవారు ఆరాద్గింపబడుదురు.ఈ క్షేత్రమును మహా శ్మశానవాటిక అనికూడా అంటారు.అమ్మవారు రౌద్రరూపిగా పుర్రెలను మొలకు వస్త్రములుగా ధరిస్తుంది.కాలము ప్రళయస్వరూపము.నాలుక బయటపెట్టి కాళికాదేవిని ఉపాసనాబలముగలవారు బహుతక్కువ.యుద్ధభూమిలో పడియున భర్త పరమశివుని తన తాండవసమయములో కాలితో తొక్కినది.

        ఉజ్జయిని విద్యాక్షేత్రము.సిద్ధక్షేత్రము.హరసిద్ధి అమ్మవారుకనుక ఇది సిద్ధ క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది.గడ్ కాళి మాత అనికూడా అంటారు.కాళిదాసుని అనుగ్రహించినతల్లి.సాందీపని నివసించిన సాహీతీక్షేత్రము.
   కాలము అనగా తరిగిపోవునది.మింగివేయునది."కలయతీతి కాళి" కాలములోనున్న అఖండశక్తియే కాళిక.కలయతి నియతి కాళి అని కూడా అంటారు.కాలగతిని నడిపించునది.అయ్యవారు మహాకాళుడు.అమ్మవారు మహా కాళీ.లింగభేదమును పరిగణనలోనికి తీసుకోకుంటే కాలము/సమయమే కాళి.వస్తువుల పరిణామమును తెలియచేయునది కాలము కనుక "కాలో జగద్రక్షక"  అని అంటారు."కాల కాష్టేన రూపేణా' అనికూడా కాలికాదేవిని కొలుస్తారు.కాలాతీతురాలైన తల్లికి కాల నిర్దేశములేదు కనుక నాలుకను తెరచి దర్శనమిస్తుంది,అమ్మ నిత్యత్వమునకు ప్రతీకగా నాలుకను కిందకు సాచిఉంటుంది.అమ్మలీలను అర్థముచేసికొనుట దుర్లభము.అంతులేని అమ్మమహిమలను తెలుసుకోలేనితనము అమ్మ శరీరమును నల్లతనముగా (తమస్సుగా)  అల్లుకున్నదేమో.."కళా కాష్టాది రూపేన పరిణామప్రదాయిని" కాళీ. 

  సూర్యోదయ చంద్రోదయములకు అంతు  తెలియని కాలమే మహాకాలం.కాలోపాసనతో కాలాతీత స్థితిని చేరుకోగలము.కాలబద్ధులు జీవులు.కాలాతీతుడు దైవము.బ్రహ్మము మొదలుకొని గడ్డిపోచవరకు  కాలబద్ధులే.కాలము ఎవరి అధీనములో ఉందో ఆమెయే కాళి.కాల నిర్దేశములను భావించు సూర్యచంద్రులను అమ్మ తాటంకములుగా ధరించుట వలన విషమును మ్రింగినను పరమేశ్వరుడు కాలాతీత మహాకాళుడు.రామక్రిష్ణ పరమహంస కాళికాదేవిని తల్లిగా భావించి  ధన్యుడయ్యెను..
   తల ఆలోచనలకు,చేతులు ఆచరణలకు సంకేతములు. అమ్మ తలలను చేతితో పట్టుకుని నడుముకు ధరించుట సత్భాషణ-సత్కార్యా విష్కరణకు సూచనగదా.  అమ్మ ధరించు కొలికిపూస లేని పుర్రెలదండ అసంపూర్ణ పుర్రెల మాలలకు సంకేతము.కాలతత్త్వ ఉపాసనయే కాళికోపాసన.మహేశ్వర మహాకల్ప మహా ప్రళయ   సాక్షి యైన తల్లి మనకు మంగళమొనరించుగాక.

   శ్రీ మాత్రే నమః


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...