Tuesday, December 26, 2017

ANANDA LAHARI-03

కామాక్షి కాంచికాపురి
  ***************************

  "పుష్పేషు జాజి పురుషేషు విష్ణు
   నారీషు రంభ  నగరేషు కంచి"  ఆర్యోక్తి.

  మాయాసతి వీపు భాగము పడిన ప్రదేశము కామాక్షి దేవిగా భక్తుల  కల్పతరువైనది.అయ్యవారు  ఏకామబరేశ్వరుడు.ఏకామ్రేశ్వరుడు అను కూడా పిలుస్తారు.అమ్మవారి సైకత లింగ పరమేశ్వరిని మామిడిచెట్టుక్రింద్ అ నిలిపి తపమాచరించి
పతిగా పొందినది.పంచభూతాత్మిక క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది కంచీపురము.

  "అయోధ్యా మధురా మాయా కాశి కాంచి అవంతికా" అను భారత దేశములోగల సప్త మోక్ష పురములలో ఒకటి.ఆద్వైత విద్యకు ఆధారస్థానము.పూర్వకాలములోని అలంకారికులు లాక్షణికులు తమ రచనలను ప్రమాణీకరణకు కంచికి పంపి వారి ఇంటిముఖము పట్టెడివారు కనుక కథ కంచికి మనము ఇంటికి అను నానుడి.ఎందరో కవులు చరిత్రకారులు విదేశీ యాత్రికులు(పాహియాను) కాంచీ వైభమును గురించి ప్రస్తావించిరి.
 " క" కారము సృష్టికి" మ" కారము పోషణకు ప్రతీకలుగా గుర్తిస్తారు.కామాక్షి విలాసము అను గ్రంధము ప్రకారము అమ్మ శక్తిని మన్మథుని యందు ఆవహింపచేస్తుందట.   ..ఇతిహాసకథల ప్రకారము అమ్మ భీకర రూపముతో రాత్రులందు నగరసంచారము చేయుచుండెడిదని,ప్రజలు భయభ్రాంతులయ్యేవారని ,ఆ సమయమున ఆదిశంకరాచార్యుల వారు గర్భగుడికి ఎదురుగా శ్రీచక్రమును ప్రతిష్ఠించారట.రాత్రులందు నగరసంచారమును ఆపివేయమని వేడుకున్నారట.అప్పటీనుండి అమ్మవారి ఉత్సవ సమయములలో ఆదిశంకరులవారి అనుమతితోనే ఊరేగింపు జరుగుతుందట.భక్త పరాధీనత అంటే ఇదేనేమో.
  మరొక ప్రచారములోనున్న ఆనందిలభట్టు కథ.వారు నిరంతరము అమ్మధ్యాన సమాధిలో రాకాశశిబింబమును దర్శించుచు తరియించేవారట.ఒక అమావాస్య రోజున ధ్యానభగ్నుడైన ఆనందిల భట్టు ఆదేశరాజుగారితో ఆనాడు పూర్ణిమ తిథి అని చెప్పినాడట.అమ్మ భక్తానుగ్రహమేమో తనచేతి కంకణమును నింగికి విసిరి ఆ తల్లి పసిడి కాంతులను పండించినడట.
    కామాక్షి అమ్మవారు శాంతి సౌభాగ్యములను ప్రసాదిస్తూ పద్మాసనములో ప్రకాశిస్తూ ఉంటుంది.పాశము అంకుశము చెరకువిల్లు పూలగుత్తులు ,పూలగుత్తులచేతి దగ్గర ప్రణవనాదముచేయుచున్న చిలుక గల కామాక్షీ మాత మనలను కరుణించును గాక.

    శ్రీ మాత్రే నమ: . 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...