Tuesday, December 26, 2017

ANANDA LAHARI-06

ఆలంపురే జోగులాంబ

 "లంబస్తనీ వికృతాక్షి ఘోరరూపాం మహా బలాం
  ప్రేతాసన  సమారూఢాం  జోగులాంబాం  నమామ్యహం"

  మాయాసతి పైపలువరస పడి జోగులాంబగా కర్నూలుకు సమీపములోనున్న ఆలంపుర క్షేత్రమునందు భక్తులను అనుగ్రహించుచున్నది.ఉష్నస్వభావముతో నున్న తల్లిని చల్లబరచుటకు అలయము చుట్టు తటాకములు ప్రసాంతముగా ప్రవహించుచుండును.స్వభావములోనేకాదు స్వరూపములో కూడ అమ్మ ఉగ్రముగా ఉండి తలపై తేలు,బల్లి,గుడ్లగూబ,  శవము మొదలగు వాని   ఆభరణములుగా అలంకరించుకొనును.

       అలంపురము పూర్వము హలపురము హలంపురంగా వ్యవహరింపబడినది. చాలుక్యరాజైన రెండవ పులకేశి ఆలయ పునర్నిర్మాణము గావించెనని శాసనములు తెలియచేయుచున్నవి.

  పూర్వము ఋషిశాపము వలన తన బ్రహ్మత్వమును కోల్పోయిన బ్రహ్మ ఈ పుణ్యస్థలమున శివుని గురించి ఘోరతపము చేసెనట.పరమేశుడు సంతుష్టుడై బాల బ్రహ్మ,తారక బ్రహ్మ,పద్మ బ్రహ్మ,కుమార బ్రహ్మ,ఆత్మ బ్రహ్మ,వీర బ్రహ్మ,విశ్వ బ్రహ్మ,గరుడ బ్రహ్మ,శబ్ద బ్రహ్మ అను నవ బ్రహ్మ రూపములలో సాక్షాత్కరించి అనుగ్రహించెనట.శివ బ్రహ్మమే జగమంతా అని భావించిన రస సిద్ధుడు నవబ్రహ్మ మందిరములను నిర్మించెనట.అరుదైన   విశేషముగా నవ బ్రహ్మ మందిరములు పూజలనందుకొనుచున్నవి.

       మరొక ప్రత్యేకత బ్రహ్మాణి,ఇంద్రాణి,మాహేశ్వరి,కౌమారి,చాముండి,వారాహి,వైష్ణవి అను సప్తమాత్రికలతో సంతసములనందించుతల్లి యోగినీ మాత  యైన జోగులాంబ.యోగిని అను పద వికృతి పదమే జోగిని.

     ఇక్కడ అయ్యవారు బాలబ్రహ్మేశ్వర స్వామి లింగరూపములో గాకుండా గోపాద రూపములో స్వయంభూగా వెలసి అనవరతము జలధారను ప్రవహింపచేస్తూ భక్తులకు తీర్థముగా అందిస్తుంటారట.దీనినే   ముజ్జగములను చల్లగా పాలించే మూలదాంపత్యము అంటారేమో.

    ప్రతి ఉదయమునను నవావరణ హారతినిచ్చు సంప్రదాయము కల ఆలయములలో ఇదిఒకటి.దేవాలయప్రాంగణములోగల రేణుకాదేవి మందిరమునందు ప్రతి మంగళవారము,శనివారము స్త్రీలకు మాత్రమే ప్రవేశము కలదు.సంతానవరప్రదాయి అమ్మ అని కొలుస్తారు.సంవత్సరమునకు ఒకసారి మాత్రమే వసంత పంచమి రోజున అభిషేకానంతరము అమ్మ నిజరూపదర్శన భాగ్యము కలుగుతుంది.శివ కేశవ (బ్రహ్మ) ఏకత్వమును సూచించు ప్రతిసంవత్సరము ధనుర్మాస వ్రతము చేయబడును.జోగులాంబను అర్చిస్తే కుండలినీ శక్తి జాగృతమైమనము మోక్షమునకు దగ్గర కాగలము.
  
       శ్మశానవాసిగానున్న శివుని, తల్లి ఆరాధిస్తుంది.వికృతములన తేలు,బల్లి,కపాలము,గుడ్లగూబ ధరించుటలో గల పరమార్థము బల్లిని శకునములకు,తేలును దానధర్మములకు,కపాలమును తాంత్రిక విద్యలకు,గుడ్లగూబను ఐశ్వర్యమునకు (లక్ష్మీదేవి వాహనము) సంకేతములు భావించి వానికి శాశ్వతత్వమును ప్రసాదించుటయే.అమ్మ వికృతములను తాను ఆభరణములుగా ధరించి నరఘోషకు ఆధిపత్యమును వహించుచున్నది.( తాను తీసివేయుచున్నది)

  శ్రీశైలమునకు పశ్చిమద్వారముగా అలంపురము అలరారుతోంది.ఈ పవిత్ర క్షేత్రములో తుంగ-భద్ర అను రెండు నదులు ఏకమై తుంగభద్రగా ఉత్తరవాహినియై ప్రవహిస్తుంటుంది.గంగ కాశిలో ఉత్తరవాహినిగా ఉంటుంది కనుక అలంపురమును దక్షిణకాశి అని భావిస్తారు.

  చండి-ముండి ద్వారపాలకులుగా అండాండ-బ్రహ్మాండములను పాలించు జోగులాంబమాత మనలను  కాపాడును గాక.

   శ్రీ మాత్రే నమ: 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...