Monday, September 14, 2020

SIVA SAMKALPAMU-90

ఓం నమః శివాయ-90 ***************** అసత్యమాడు బ్రహ్మపుర్రె అంతగా నచ్చిందా ఆభరనముగా చేసి అలంకరించుకున్నావు హింసకు గురిచూసే బోయకన్ను నచ్చిందా రక్తాశ్రువులను కార్చ అనురక్తిని చూపావు అమ్మ దగ్గర ఉండనన్న అర్భకుని వాక్కు నచ్చిందా అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు పృష్టభాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు పెంపును అందించుతావో పంపు అని చంపుతావో పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా. ఓకే గూటి పక్షులు ఒద్దికగా ఉంతాయన్న సామెతను పెద్దలు చెప్పారు కద!ఒకే స్వభావము కలవారు ఒకరినొకరు విడువలేనంత సఖ్యముగా ఉండుతలో వింత ఏమీలేదు కదా. శివుడా అవలక్షణ సంపన్నుడు.మరి శివుడు ఇష్టపడే వస్తువులు-మనుషులు అవలక్షణాలతో ఉండకపోతే ఎలా?శివుడు లోపభూయిష్ఠములను పాపరహితములుగా మారుస్తున్నానన్న భ్రమలో మునిగి,అబధ్ధాల బ్రహ్మపుర్రెను దండగుచ్చుకొని అలంకరించుకుంటాడు.అబధ్ధము చెప్పిన తన తోకను అటు-ఇటు తిప్పిందని (దురదవేసి విసురుకున్నదేమో)సత్యము పలికిందన్న "గొప్పసాక్షి" అను బిరుదును దానికిచ్చి,పధ్ధతిగా రావణునితో లంకకు పోకుండా,దానిచెవి వంటి ఆకారముగల ప్రదేశములో(గోకర్ణము) తాను నిలిచి పోయాడు.అబధ్ధాలు ఇషమైనవి.సరే.దానికి మించిన స్వార్థము కలవారికి కూడ పరమార్థము తెలుసంటు పోయి వారి ఉదరనివాసము చేయుటయే కాక,చర్మమును కూడా తాను వస్త్రముగా ధరించే స్థితికి వచ్చాడు.అయ్యో-అయ్యయ్యో.మాతృదేవోభవ అని కృతజ్ఞతగా తల్లిని దగ్గరుండి చూసుకోవలసిన ఒక్కడే అయిన కొడుకు,టక్కరితనముతో తన కాలిని మొసలి పట్టుకున్నదని,అది విడువాలంటే తల్లి సన్యాసమును స్వీకరించుటకు అనుమతించాలని మాయమాటలతో పారిపోయిన వాడికి ధారణశక్తినొసగి దయచూపించాడు.అన్నిటికన్నా విడ్డూరము.రాయి కంటె కఠినమైన మనస్సుతో,కౄరత్వము కన్నునిండా నింపుకుని హింసకు గురిచూసే తిన్నని కన్ను నచ్చిందంటు అమాయకముగా తన కన్ను నుండి రక్తమును కార్చుకున్నాడు.ఎంతన్న లయకారుడిని అంటూ అందరిని అంతమొందించే అవలక్షణమున్నవాడుకదా.తప్పులుచేసే వాటికి మెప్పులు అందిస్తూ,తాను గొప్పవాడిననే భ్రమలో ఉంటాడు శివుడు. సులక్షణము నమః శివాయ-అవలక్షణము నమః శివాయ తప్పులు నమః శివాయ-తత్త్వము నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ వన్నే యేనుఁగుతోలు దుప్పటము బువ్వా కాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే ల్నిన్నీలాగున నుంటయున్ దెలిసియు న్నీపాదపద్మంబు చే ర్చె నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా! ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీవు కట్టునది ఏనుగుచర్మము, ఆహారమా కాలకూటవిషము, చేతిలో బ్రహ్మదేవుని కపాలము, మెడలో భీకరమైన సర్పము. ఇంత ఉగ్రమైన ఆకారము కలిగిన నిన్ను చూసి కూడా ఆ శ్రీమన్నారాయణుడు సదా తన మనస్సును నీ ధ్యానమందు ఏ విధముగా నిలిపినాడో కదా ప్రభో? అటువంటి నిష్కళంక మనసును అనుగ్రహించి,నన్ను ఉధ్ధరింపుము శివా.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...