Monday, September 14, 2020

SIVA SANKALPAMU-91

ఓం నమః శివాయ-91 ********************* పాట పాడుచు నిన్ను చేర పాటుపడుతు ఒక భక్తుడు నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒకభక్తుడు నాట్యమాడుచు నిన్నుచేర ఆరాటపదే ఒక భక్తుడు కవితవ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు తపమాచరించి నిన్నుచేర తపియించుచు ఒక భక్తుడు ప్రవచనముల నిన్నుచేర పరగుతీయు ఒక భక్తుడు చిత్రలేఖనములతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒకభక్తుడు అర్చనలతో నిన్నుచేర ముచ్చటనుచు ఒకభక్తుడు ఏదారిలో నిన్నుచేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు నువ్వు నక్కతోక తొక్కావురా ఓ తిక్కశంకరా. శివుడు అనిశ్చిత మనస్కుడు.ఒక క్రమపధ్ధతిని తన విషయములోను అనుసరించలేడు.అంతే కాదు భక్తులను తాను త్వరగా అనుగ్రహించుటకు ఒకేఒక చక్కని మార్గమును చెప్పలేడు.చేసేదిలేక పాపము వారు పాటో,ఆటో,కవితో,నాటకమో,ప్రవచనమో,చిత్రలేఖనమో తమకు తోచినది ఏఓ ఒక మార్గమును ఎంచుకొని,ప్రయత్నిస్తూ,ఫలితమునకు ఎదురుచూస్తుంటారు.కాని విచిత్రమేమంటే నక్క తోకను తొక్కిన ప్రదేశమును శాంతికై తవ్విస్తుంటే లంకెబిందెలు దొరికినట్లు అయోమయము దేవునకు అనేకానేక భక్తులు-నింద. ఏకము నమః శివాయ-అనేకము నమః శివాయ గమనము నమః శివాయ-గమ్యము నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. సకలదేవతా శివస్తుతి **************** 1. దేవదేవ త్రినేత్రాయ అందుకో వందనములు జటామకుట కపర్ది అందుకో వందనములు. 2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు రక్త పింగళ నేత్రాయ అందుకో వందనములు. 3.భైరవ ఊర్థ్వకేశాయ అందుకో వందనములు అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో వందనములు. 4.బ్రహ్మ కపాల మాలాయ అందుకో వందనములు బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు. 5.కరిగర్భ నివాసాయ అందుకో వందనములు కరి మస్తక పూజ్యాయ అందుకో వందనములు. 6.ప్రచండదందహస్తాయ అందుకో వందనములు ప్రపంచ పూర్ణ వ్యాప్తాయ అందుకో వందనములు. 7.నీలకంఠ త్రిసూలాయ అందుకో వందనములు లీలా మానుష దేహాయ అందుకో వందనములు 8.అష్టమూర్తి యజ్ఞమూర్తి అందుకో వందనములు దక్షయజ్ఞ వినాశాయ అందుకో వందనములు. 9.వేద వేదాంగ వక్త్రాయ అందుకో వందనములు వేద వేదాంత వేద్యాయ అందుకో వందనములు 10.సకలసన్మంగళ విగ్రహాయ అందుకో వందనములు సకల దేవతాస్తుతాయ అందుకో వందనములు. ఇది మహా పురాణాంతర్గత సకల దేవతా స్తుతి సకలాభీష్ట ప్రదం. సర్వమంగళ కరం. సదా శివ కృపాకటాక్ష కరం. ( ఏక బిల్వం శివార్పణం.) ఓం తత్ సత్.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...