SIVA SANKALPAMU-102

ఓం నమః శివాయ-102 ********************* తామరలున్న కొలనులో తిరుగాడు కప్పను నేననుకో తామసమడచి ఆ కప్పను తుమ్మెదగా మార్చరాదో మధురసమున్న పాత్రలో తిరుగాడు తెడ్డుననుకో మేధను అనుగ్రహించి తెడ్డును జిహ్వగ మార్చరాదో కొమ్మకు చుట్టుకుని తిరిగాడు గాలిపటము నేననుకో ఇమ్ముగ జాలిచూపి దానిని చుక్కల పక్కకు చేర్చరాదో వాన నీరు వృధాచేయు సంద్రమునునేననుకో పన్నీరై క్షుథతీర్చు పంటబీడు చేయరాదో శివుడెంత అని అన్న గర్వపు గంగను నేననుకో శివపాదమే తనకు సర్వమన్న గంగగా చేయరాదో ఇన్ని మార్పు చేర్పులకు కూర్పువైన నిన్ను ఎన్న తరము కదురా నా కన్నతండ్రి శంకరా. " రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో భీతః స్వస్థగృహం గృహస్థమతిధిః దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతః సర్వ భయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం శివానందలహరి. ఓ మనసా! ఏ విధముగా నీటిలో కొట్టుకొనిపోవువాడు ఒడ్డును,అలిసిన బాటసారి చెట్టు నీడను,వర్షభయము కలవాడు ధృఢమైన ఇంటిని,అతిథి గృహస్థుని,దీనుడు ధార్మికుడైన ప్రభువును,చీకటిలో భయపడువాడు దీపమును,చలిలో వణుకువాడు మంటనుచేరునట్లుగా,సమస్త భయములను పోగొట్టి సుఖమునిచ్చు శివుని పాద పద్మములను ఆశ్రయింపుము. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI