Monday, September 14, 2020

SIVA SANKALPAMU-104

ఓం నమః శివాయ-103 ******************** చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో "త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా. " ఏషత్యేషజనిం మనోన్య కఠినం తస్మిన్నటానీతిమ ద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః నోచేదివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః స్సత్సు శిలా తలేషు నటనం శంభో కిమర్థం తవః." ఓ తండ్రీ! నేను దుర్భాషలాడతానని నీకు ముందే తెలుసుకదా.అయినా నీ పితృవాత్సల్యము నన్ని విడిచిపెట్టలేదుకదా.అందుకే అవును అందుకే వీడు పుడతాడు.వీడి మనసు కఠినమైనది అయినప్పటికి నేను అక్కడ సంచరించాలని నా మీది ప్రేమతో ఎన్నో దివ్య భవనము (మెత్తని తివాచీలు కప్పినవి),పూలపానుపులు (సుతిమెత్తనివి) యజ్ఞవాటికలు (అతి పవిత్రమైనవి) ఉన్నప్పటికిని శిలాతలములపై నాట్యము చేసి,నా కొరకు పురాభ్యాసితుడవైనావు.నీ పాదములెంత కందిపోయినవో కదా.వాటిపై భక్తి అను లేపమును అద్దుతు నన్ను సేవించుకొనీయి శివా. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...