SIVA SANKALPAMU-100

ఓం నమః శివాయ-100 ******************* నీ సుతుడగు గణపయ్య అడ్డంకులు తొక్కాడు నీవాహనమగు బసవయ్య పుష్టిని అందించాడు నీకంఠాభరణము పొత్తముగా మారింది నీ సగభాగపు గౌరమ్మ ఘంటము తానయింది నీ సిగపూవగు గంగమ్మ గలగలా సాగింది నీపరివారపు స్వచ్చంద సహకారములేగ నీవే స్పురింపచేసిన నిందాస్తుతుల హేల వికల్పములు పారద్రోలు శివ సంకల్పపు లీల నా దిక్కైన శంకరుడు నాలోనే ఉన్నాడని లెక్కలేని నా తిక్కను మక్కువతో నీకు ఇచ్చి నీకు అక్కరే లేనివైన ఈ చక్కెర పలుకులను నేనెక్కడ వ్రాసానురా?నా దిక్కైన శంకరా! మహేశ పాప వినాశ నా హృదయవాస ఈశా ఎంత భాగ్యమందినానో ఏలినావయా భక్తి ఏదో పూజఏదో తెలియనైతిని గుట్టు పట్టులేక నిన్ను తిట్టిపోస్తిని మంత్రయుక్త పూజలేవి తెలియనైతిని కుతంత్రముతో కూడి నిన్ను వెక్కిరిస్తిని నిజము ఏదో నింద ఏదో తెలియనైతిని బొమ్మ వెనుక బొరుసు నేను చూడనైతిని చీకటేదో వెలుతురేదో తెలియనైతిని ఏకమే అనేకమని నేనెరుగనైతిని క్షమయు నీవైనవేళ నేను క్షేమమైతిని రక్ష-రక్ష నామమే నా లక్ష్యమైనది.దేవా-మహేశా ఏక బిల్వం శివార్ప

Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI