Monday, September 14, 2020

SIVA SANKALPAMU-95

ఓం నమః శివాయ-95 *************** రూపివా/అరూపివా/అపురూపివా? శివా నీవు కన్నతండ్రిని చూడ నే కాశిపోవ కానరాడు దేవతల మోహమడచ మొదలు-చివర కానరాడు చిదంబరము పోయిచూడ చిన్నగను కానరాడు అటుచూడని-ఇటుచూడని ఆటలెన్నో ఆడతాడు నింగిలోకి సాగుతాడు-నేలలో దాగుతాడు అగ్గినంటి ఉంటాడు-గాలినేనే అంటాడు జ్యోతిని నేనంటాడు-ప్రీతిని నీకంటాడు ఈ వలసలు ఎందుకంటే చిద్విలాసమంటాడు దాగుడుమూతలు ఆడుతు పట్టుకోమంటాడు సుందరేశ్వరడునంటాడు ముందున్నానంటాడు ఒక్కరూపునుండవేమిరా ఓ తిక్కశంకరా. శివుడు తనమాటలతో మనలను తికమకపెట్టటానికి చూస్తుంటాడు.అరుణాచలములోని అగ్గి,కంచిలోని మట్టి,చిదంబరములోని గగనం,జంబుకేశ్వరములోని నీరు,శ్రీకాళహస్తిలోని గాలి నేనే నంటుంటే,మిగత ప్రదేశాలలో వేరే రూపాలలో శివుడులేడా అనే సందేహము మనకు రాదా? అసలే మనము చాలా తెలివైనవారముకదా.శివుని తెలివితక్కువ మాటలను నమ్మలేము కదా.అందుకని అదే విషయమును అడిగితే మాటమారుస్తూ మీరు కాశికి వచ్చి చూడండి.అక్కడి వెలుగు అంతా నేనే అంటూ ప్రగల్భాలు పలుకుతాడు.చాల్లే నీ బడాయి మాటలు అని అనుకునే లోపలే ఇదిగో మీకు నాపేరు చెబుతున్నాను అంటు మథురలో నున్న సుందరేశుని పేరును మహగొప్పగా చెబుతాడు.చాల్లే సంబడం అంటే ఏమాత్రము వినకుందా అన్ని జ్యోతిర్లింగాలలో నున్నది తానేనని ,మనతో సరదాగా ఆగుడుమూతలాట ఆడుతున్నానంటూ మాటలతో మరింత గారడి చేస్తూ,మనలను బురిడీ కొట్టిస్తాడు.అమ్మో ఎంత జాణతనము కాకపోతే తన చేతకాని తనాన్ని మన చేవలేని తనముగా చూపాలనుకుంటాడు.-నింద. కాలడి నమః శివాయ-గారడి నమః శివాయ బడాయి నమః శివాయ-బురిడీ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః సద్దుమణిగిన సత్వగుణము నిద్దురలేచిందేమో అన్నట్లుగా నా మనసులోని రజోతమోభావములు చేసేదిలేక దూరముగా జరుగుతు నక్కినక్కి చూస్తున్నాయి.నీ సంగతి తెలిసినదిలే .నేను నీతత్త్వము కొంచం కొంచం అర్థమవుతోంది.కాసేపు ఇద్దర్ము ఆడుకుందాము నా మాటలను అవునన్నా-కాదన్నా అది నాకు శిరోధార్యమే శివా. శ్రీ తనికెళ్ళ భరణి గారికి నమస్కారములతో, ఎంత మోసగాడివయ్యా శివా-నువ్వెంత వేషగాడివయ్యా శివా పైన మూడు నామాలంటా శివా నీకు లోన వేయి నామాలంటా శివా బయటకేమో తోలుబట్టలంటా శివా నీకు లోపల పీతాంబరాలంటా శివా బయటకేమో లింగరూపమంటా శివా నీకు లోపల శ్రీరంగమంటా శివా కడతీర్చేవాదవీవె శివా మమ్ము కాపాడేవాడవు నీవే శివా ఎంత పిచ్చివాదవయ్యా శివా ఎంత పిచ్చి వాడివయ్యా శివా నీవెంతా మంచివాడవయ్యా శివా నీవెంత మంచివాడివయ్యా శివా ఎంతెంత ఎంతెంత మంచివాడివయ్యా శివా-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...