SIVA SANKALPAMU-101
ఓం నమః శివాయ-101
********************
కాసు లేనివాడవని కానిమాటలన్నాను
బేసి కన్నులను చూసి రోసిపోయి ఉన్నాను
దోసములే నీ పనులని ఈసడించుకున్నాను
వేసమేమిటో అంటుఈసడించుకున్నాను
నీ కొండను ఎత్తినాడు నీ విల్లు ఎత్తలేదు కద
సహకారమునుఈయనిది అతని అహంకారమేగ
దిక్కు నీవు అనగానే పక్కనేఉంటావు
అహంకారమును వదిలేస్తే అధీనుడివి అవుతావు
స్వల్పకాలిక లయముతో శక్తినీస్తావు
దీర్ఘకాలిక లయముతో ముక్తిని ఇస్తావు
నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి
మొక్కనీయరా భక్తితో ముక్కంటి శంకరా!
మూగమనసులు చిత్రములోని గౌరమా నీ మొగుడెవరమ్మా అను జానపద గీతిక జ్ఞానదీపికగా ప్రకాశిస్తోమి పరమేశ్వరా నీ తత్త్వమును అర్థమును చేసికొని తరించుటకు.
పురుషపాత్రధారి వ్యంగంగా రూపమును మాత్రమే ఇల్లు-వాకిలి లేనివాడు,బిచ్చమెత్తుకుని తిరిగేవాడు,ఎగుడు-దిగుడు కన్నులవాడు,జంగమదేవర నీ వాడా? అంటు పరిహాసముచేస్తే,శక్తిస్వరూపమైన స్త్రీ పాత్రధారి శివుని రూపము వెనుక దాగిన తత్త్వమును ,ఆకాశమే ఇల్లు,భూమియే వాకిలి అంటు పంచభూత తత్త్వమును పరిచయము చేయుటయే కాక,బిచ్చమడిగేది భక్తి-బదులు ఇచ్చేది ముక్తి,అని ఆదిదేవుని అవ్యాజ కరుణను అనుభవించమంటున్నది.ఎగుడుదిగుడు కన్నుల లక్ష్యమును కూడ బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు అంటు అగ్గికన్ను అంతరార్థమును అర్థమయ్యేలా చెబుతుంది.పాటతో పరమార్థమును చాటిన పండితునికి శతకోటి నమస్కారములు.
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment