Monday, September 14, 2020

SIVA SANKALPAMU-105

శివ సంకల్పము-105 ************************ నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం నీకేమి తెలియదంది నా అహంకారం నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా. ఆరూఢ భక్తిగుణ కుంచిత భావచాప యుక్తైః శ్శివస్మరణ బాణ గణైరమోఘైః నిర్జిత్య కిల్బిష రిపుం విజయీ సుధీంద్రః సానంద మావహతిసుస్థిర రాజ్యలక్ష్మీ. శివమే జగము-జగమే శివము శివోహం శివోహం. శివా! నీ అనుగ్రహ వృష్టిలో మునిగి పునీతుడనైన నేనేకాదు,మరెందరో బుధ్ధిమంతులు ధనుర్విద్యా సంపన్నతతో ధన్యులగుచున్నారు.వారి హృదయమనే ధనుస్సుకు నిష్కళంక భక్తి అనే నారి బంధించబడినది.నెరజాణలైన శివ నామములు అనే బాణములు అమ్ములపొదిని అలంకరించుచున్నవి.వారి ధన్యత నేమనగలను? అర్జునుని తో పాటు సమానముగా అందించిన నీ ధనుర్విద్యా చాతుర్యముతో వారు పాపములనే శత్రువులపై శివనామ బాణములను సునాయాసముగా సంధించుచు,భక్తి రాజ్యమునేలుచున్నారు భవబంధ విముక్తులై.స్వామి నీ కడగంటి చూపు చాలదా నన్ను కడతేర్చగ. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...