Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMAECHATAET-01

 న రుద్రో రుద్రమర్చయేత్-19

********************
'"థకథక థకయన ఆడవా
శివశక్తి ఎత్తి ఎత్తి ఓడు ఆడవా"
అని శివ తాండవమును వీక్షిస్తూ అనుగుణముగా తాను ఆలపించగలగటము అపూర్వము కాక మరేమిటి?
పుణ్యవతి చరితమును ధన్యమైనది "తిరువలాంగాడు-ఊర్థ్వతాండవమూర్తి వట అరణ్యేశ్వరన్ "రత్నసభ"
శివనే పోట్రి.
ప్రియ మిత్రులారా! ఈ రోజు బిల్వార్చనను మనము " సభ" అను పదమును తెలుసుకునే ప్రయత్నముతో చేద్దాము.
శైవాగములలో ఐదు సభలు ప్రస్తావించబడినవి.అవి,
1.రత్నసభ-తిరువలాంగాడు
2.కనకసభ-చిదంబరము
3.మధురై-రజతసభ
4.తిరుకుట్రాలం-చిత్రసభ
5.తిరునేల్వల్లి-తామరై సభ
నమకములో సైతము సభ పదము ప్రస్తావించబడినది.
3వ అనువాకము
" సభాభ్యో-సభాపతిభ్యశ్చవో నమః"
భాషాపరముగా సభ అను పదమును అన్వయించుకుంటే సమూహపు కలయిక.అదియే సమూహ అభిప్రాయములను పంచుకుంటే సదస్సు.ప్రస్తుతము కూడా సభ పదము రాజకీయ పరముగా లోక సభ-రాజ్యసభ అని వ్యవహారములో ఉన్నది.మహాభారములో సభా పర్వమే రచింపబడినది.మయసభ కూడా కలదు.విద్వత్సభ-పండితసభ,గానసభ-నాట్య సభ అంటు ఎన్నో కళల సమాహారములు మనము వింటూనే ఉంటాము.
పూర్వము సభ అను పదమును వ్యసనపరులున్న ప్రదేశముగా సభాస్థలి అని జూదరులు అన్న వారిని సభికులు అని పిలిచేవారని భాషాశాస్త్రకారులు చెబుతారు.మూర్ఖనాయనారు అందుకుఏమీ తీసిపోడు కదా.అంబే శివం.
పరమాత్మ చైతన్యమును స్థూలముగా వీక్షిస్తుంటే మనకు ,చిదంబర క్షేత్రము,మధురై క్షేత్రము ,తిరుకుట్రాలం క్షత్రము ,తిరునాల్వల్లి క్షత్రము,తిరువలాంగడు క్షత్రము సమాహారము శివతాండవ సభ స్థలములు.పురాణకథనము ప్రకారము తాండవ దర్శన భాగ్యవంతులు వేరువేరుగా ఉండవచ్చును.తాండవ ఉద్దేశ్యములు వేరుకావచ్చును.ఆనందతాండ వమొకచోట,పోటిగా తాండ వమొకచోట,,అనుగ్రహ తాండవమొకచోట అన్నీ అద్భుతములే.ఆరాధ్యనీయములే.
సూక్ష్మము లోనికి వెళితే ప్రతి ఉపాధి హృదయము ఒక సభయే.దాని మానసిక-బాహ్య అవస్థలను పట్టి దానికి ఎన్నో పేర్లు.ఉదాహరణమునకు
పరిశుద్ధ హృదయముకల దేహము కనక సభ. అందులో జ్ఞానము ప్రవేశించి,ఇంద్రియ ప్రవృత్తులను నియంత్రించగలిగినప్పుడు తామరై సభ/జ్ఞాన సభ.
మన ప్రతి ఇంద్రియ చైతన్యమును ఒక్కొక్క దేవతా సంకేతముగా భావించినపుడు దేవసభ.
కాదు కాదు మనము తెలుసుకొనుచున్న క్షేత్రములన్నింటిని కలిపి చూసుకుంటే క్షేత్రసభ.క్షేత్రము అనగా శరీరము అను అర్థమును కూడా పెద్దలు చెబుతారు..
ఇంద్రియప్రవృత్తులు శాంతమూర్తులైన వేళ రజతసభ.
" సభ ఏదియైనప్పటికిని అందులోని విరాజమాన చైతన్యమును గుర్తించగలినప్పుడు అది రాజసభ/ కాదు కాదు రత్నసభ."
ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయమును పరిశీలించాలి.చైతన్య స్వరూపములుగా మనము భావిస్తున్న సభలనన్నింటిని జాగృతపరచుచున్న సభాపతి మాత్రము స్థాణువే.అంటే
నిశ్చలత్వము-సభాపతి
చలనము-సభలు.
చలనమునందించు నిశ్చల చిత్శక్తి కి/రుద్రునకు నమస్కారములు.
.
మనము మాట్లాడుకొనుచున్న సభలు విభిన్నములు కావచ్చును కాని వాటిని నిర్వహించుచున్న సభాపతి మాత్రము ఒక్కడే.
మనలను కరుణించుచున్న స్వామి వదారణేశ్వరన్ అమ్మ వందారుళై-ఇక్కడి తీర్థము ముక్తి తీర్థం.స్వామి భద్రకాళితో కలిసి చేసే పోటీగా తాండవము ఇక్కడి ప్రత్యేకత.స్వామి తాండవ సమయములో ఒక భంగిమగా తన ఎడమకాలిని,చేతిని పైకెత్తి చేసేనట. ఊర్థ్వ తాండవ అనుగ్రహమును ప్రదర్శించుట అభ్యంతరకరముగా నున్నదనిఉమ స్వామిని గెలిపించినదచట..
అంతేకాదు మనకు అట్టి అపురూప దర్శన భాగ్యమును అందించిన "కరైక్కాల్ అమ్మను" అనుగ్రహించినది అమ్మ కారుణ్యము.
పుదుచ్చేరి సమీపములోని కరైక్కాల్ ప్రాంతములో పుణ్యవతి అను పరమసాధ్వీమణి శివభక్తురాలు.పరమదత్తుడను వ్యాపారి ధర్మపత్ని.ఒకరోజు భర్త రెండు మామిడి పండ్లను తన సేవకునితో ఇంటికి పంపించెను,భోజన సమయములో తినాలన్న భావనతో.అదే అదనని భిక్షువుగ ప్రత్యక్షమైనాడు శివుడు.పరమభక్తితో ఒక పండును సమర్పించింది.భర్త భోజన సమయములో మామిడి పండును భుజించి,మరొకదానిని కూడా అడిగాడు.మహాపతివ్రత లోనికి వెళ్ళి శివప్రసాదముగా మరొకదానిని వడ్డించింది.సమయమాసన్నమైనది సాధ్వికి తన గృహస్థ ధర్మును వదిలివేయటానికి,మహిమను గమనించిన భర్త ఆమెను వదిలి పొరుగుదేశమునకుపోయి,మరొక వివాహము చేసుకున్నాడు.తన యవ్వనము,అందమును హరించివేయమని పుణ్యవతి తాను శివ సంకీర్తనముతో ఊపిరిగా తీసుకుంటూ,తన ఉపాధిని శివనివాసమైన కైలాసమునకు చేర్చదలచెను.కాని స్వామి సర్వాంతర్యామికదా.తన పాదము తగలరాదనుకుని ,తలకిందులుగా నడచి చేరినది.దీక్షకు సంతసించిన స్వామి ఆమెకు ముక్తి దేహమునొసగెను.అంతేకాక అమ్మగా భావించి,ప్రతిరోజు తనదగ్గరనే ఉండి తాను కాళితో చేయు ఆనందతాండవమునకు అనుగుణముగా ఆలపించుచు,ఆనందించు వరమును ప్రసాదించెను.
ఆనందలోలుని అనుగ్రహము అందరిపై వర్షించునుగాక.
మరొక కథా-కథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం
ఇంటి వెలుపలి, వచనం చిత్రం కావచ్చు
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...