Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-11

 న రుద్రో రుద్రమర్చయేత్-07

************************
"శ్రీకంఠాది సమస్త రుద్ర నమితో వామార్థ జాని శివః
ప్రాలేయాచ హారహరీకుముద క్షీరాబ్ధిః తుల్యప్రభో
విష్వక్సేన విఘాతమస్తమకుటీ రత్నప్రభా భాస్వరః
శ్రీమత్ మల్లికార్జున మహాదేవ శివోమేగతిః"
మిత్రులారా ఈ రోజు మనము వృక్ష పదమును తెలుసుకునే ప్రయత్నముగా బిల్వార్చనను జరుపుకుందాము.
" నమో వన్యాయచ-కక్ష్యాయచ"
6వ అనువాకము 9వ మంత్రము సాక్షాత్తు శ్రీశైల మల్లికార్జున సాక్షాత్కారమే అనుటకు ఏ మాత్రము సందేహము లేదు.
అడవిలో వృక్షాది రూపము కాదా నల్లమల అడవులను తాను మెచ్చి విచ్చ్చేసిన పరమేశ్వరుడు.
కక్ష్యాయచ-ఆ బోదెను అల్లుకుని ఆశీర్వదిస్తున్న మల్లెతీగ కాదా మన అమ్మవారు.
అడవిలోని అర్జునవృక్షము దానిని అల్లుకుని ఉన్న అపర్ణ సాక్షాత్కారమే కదా ఆదిదంపతుల ఆశీర్వచనము.
రూపయవ్వన సంపన్నమైన వనదేవతామూర్తియైనవాడును,అశోక పున్నాగ పుష్పముల గుచ్చములవలె నున్నవాడును,కదంబ పూదండలను అలంకరించుకునవాడును అగు సదాశివునికి నమస్కరించుచున్నాను.
నమో వృక్షభ్యో-హరికేశేభ్యః పశూనాం పతయే నమః"
" వృశ్చంతే ఇతి వృక్షాః"
***********
ఛేదింపబడునవి వృక్షములుఛేదింపబడునవి పాపములు.అజ్ఞానము-అహంభావము.
ఇంద్రియ ప్రవృత్తులను మనము పశువులుగా కనుక అన్వయిస్తే వాటిని నియంత్రించే శక్తి పశుపతి.
ఆ పశుపతి సస్పింజర వర్ణముతో ఎరుపుతోకూడిన పసుపు రంగు మిశ్రమముతో
త్విషీమతే-ప్రకాశించుచున్నాడు.
2 వ అనువాకము 9వ యజుస్సు
" నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః"
ఇంద్రియములను పశువులను నియంత్రించుటయే కాక,వృక్షాణాం పతిగా రుద్రుడు ప్రకాశించుచున్నాడు.స్తపతి-స్థాపించువాడిగా,
సూర్యుని రూపముగా వృక్షములను పెంపొందించుచు,చంద్రుని రూపముగా వానిలో ఔషధములను నిక్షిప్తపరచుచు,మేఘ రూపముగా వాటికి నీరు పెట్టుతూ వాచ్యార్థము.
సదాశివుడు సకలచరాచరములను సంస్కారపరుస్తున్నాడు కనుకనే
8వ అనువాకములో 7వ యజుస్సు మళ్లీ ప్రస్తావించినది.
9వ అనువాకము 9వ యజుస్సు
" నమః శుష్కాయచ-హరిత్యాయచ"
పచ్చిగడ్ది-ఎండినగడ్డి రూపముగా నున్న రుద్రునకు నమస్కారములు.
10 వ అనువాకము 10 వ యజుస్సు
" పరమే వృక్ష ఆయుధం" నిధాయ
శివా మాయందు దయయుంచి నీ ఆయుధములను
నిధాయ-దాచివేయుము.నీ ఆయుధములను మాపై ప్రయోగించక వృక్షమునందు దాచివేయుము అను అభ్యర్థన మంగళానుగ్రహమును కోరుతున్నది
.
చమకములో సైతము యజ్ఞకార్యము నిర్వహించుటకు వివిధవృక్షముల ప్రసక్తి వచ్చినది.
నింగి-నేలలను అనుసంధించే పరమేశ్వరుని అద్భుత ఆవిష్కరణలు వృక్షములు.చేతనాచేతనత్వములను భగవత్ప్రసాదములుగా కలిగినవి.కాండం అచలముగా-పై భాభాగములు చలిస్తూ చల్లని ప్రాణవాయువును అందించుచు పరమేశ్వర ప్రతి రూపములు.
సింధునాగరికతయు వృక్షపూజను నిర్వహించినదని,నాటి నుండి వృక్షములలో ఆధ్యాత్మికత ప్రాధాన్యత పరిశోధకులు కాదనలేని ప్రాధాన్యతను సంతరించుకున్నది.
జమ్మిచెట్టు,మారేడు చెట్టు,తెల్ల మద్దిచెట్టు,నేరేడు చెట్టు,ప్రత్యేకముగా ఉసిరి చెట్టు దైవస్వరూపములుగా ఆరాధనలనందుకుంటున్నాయి.
వృక్షో రక్షిత రక్షితః.
.ఆకుపచ్చని కొమ్మలు-రెమ్మలు.పువ్వులు-పండ్లు.ఆచ్చాదనయే పరమాత్మ తత్త్వము.విజ్ఞానమనెడి వృక్షము రుద్రుడైనప్పుడు వేదములు-వేదాంగములు హరికేశములు.దానిఆకులు-కొమ్మలు.శ్రీశైల పర్వత ప్రాంతములో వృక్షములు జరుగుట ఎందరో మహానుభావులు దర్శించినారట
.శ్రీశైలములో తెల్లమద్దివృక్షము శివస్వరూపమని నమ్ముతారు.మరియు త్రిగుణాతీత వృక్షముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడి,త్రైలోక్యపూజ్యమైనది.జంబు వృక్షముసైతము జలలింగేశ్వరుని ప్రతిరూపమే కదా.
స్వయముగా ప్రీతితో మద్దివృక్షముగా భక్తుని అనుగ్రహించిన శివుడు,మల్లికా లతయై స్వామిని అల్లుకున్న అమ్మవారి సాక్షిగా వృక్షములు సర్వశుభలక్షణములకు నిదర్శనములు.
స్వామి వృక్ష స్వరూపమును వేనోళ్ల కీర్తించలేని నా అసహాయత భక్తుని కథ వైపునకు పరుగులు తీస్తున్నది.
అవి పరమతసహనములేని జైనుల పాలనలో నున్న శివభక్తులు ప్రార్థించుచున్న పరిస్థితులవి.
కోవూరు బ్రహ్మయ్య భక్తితో బసవని కొలుచుచుండెను." నమః శంభవాయచ -మయస్కరాయచ" ఇహపర సుఖములనందించు ఈశ్వరా! నమస్కారములు.అని స్తుతించుచున్న సమయమున పరమత ద్వేషముతో బ్రహ్మయ్యను దుర్భాషలాడుటయే కాక ఆరాధ్యదైవమును అవహేళన చేయసాగిరి.అందులకు నొచ్చుకున్న బ్రహ్మయ్య స్వామి అందరిపై 'మీడుష్టమ
శివతమ శివోనస్సుమనా భవంతు" అని ప్రార్థిస్తూ, స్వామిని వారి అజ్ఞానమును క్షమించి,అనుగ్రహించమని ప్రార్థిస్తూ
అ గ్రామమును వదిలి పొరుగూరికి వెళ్ళిపోవుటకు నిశ్చయించి అడుగువేయసాగాడు. అంగరక్షకుడై అనుసరిస్తున్నాడు ఆ మార్గములకు అధిపతి.
అక్కడనున్న మరికొందరు బాటసారులతో పాటుగా కొంచముసేపు విశ్రాంతి తీసుకొనుటకు ఒక మర్రిచెట్టుకింద కూర్చున్నాడు శివనామమును జపిస్తూ.
జైనుల లోని ఘోర రూపమునకు శైవుల లోని అఘోర స్వరూపమునకు సర్వవేళలా తానైన ఘోరాఘోర స్వరూపమునకు త్రికరణశుధ్ధితో నమస్కారములు.
శివద్వేషి వేషముతో సమీపించాడా మర్రిచెట్టును తన భక్తునికి పరీక్షపెడుతు.
బ్రహ్మయ్యను సమీపించి మీరునమ్మిన రుద్రుడు పక్షులతో నిండిన పచ్చని మర్రిచెట్టును బూడిదచేస్తే,తిరిగి దానిని జీవింపచేయగలడా? దానిపై నున్న పక్షుల సంగతి ఏమిటి? పశుపతి అని పూజించే మీ దేవుని మహిమలు చూపించగలరా? అంటూ వారిని రెచ్చగొట్టాడు
,బ్రహ్మయ్య ఎంతో వినయముతో /విశ్వాసముతో పరమేశ్వరుడు పచ్చదనమును అందించే ప్రఖ్యాత శిల్పి.తనశిల్పకళా చాతుర్యముతో పదునాలుగుభువనములనుసృష్టించిపరిపాలించుచున్నాడు.పరమకరుణాంతరంగుడు అని సమాధానమునిచ్చెను.
. అదివిని క్రోధముతో అంతగొప్పవాడా మీ
దేవుడు అంటూ ఆ జైనుడు తాను మర్రిచెట్టును బూడిదచేసి తిరిగి పచ్చనిచెట్టుగా మార్చమని బ్రహ్మయ్యను రెచ్చగొట్టెను.
ఓం నమః శివాయ
అచంచలవిశ్వాసముతో బ్రహ్మయ్య ఆ విభూతిని స్పర్శించి " ఓం నమో భవాయచ-రుద్రాయచ" ఓ రుద్రా రోదనమునకు కారణము నీవే.దానిని పోగొట్టువాడవు నీవే.ఈ దురాగతమును క్షమించి,అభము-శుభము తెలియని ఆవృక్షమును రక్షించి,అహముతో కనులు మూసుకొని పోయిన వీరిని కరుణించుము అంటూ చేతిలోని విభూతితో కాలిపోయిన వృక్షమును స్పృశించెను..'
జైనుని పశ్చాత్తాపమునకు గురిచేస్తూ,కాలిపోయిన బూడిచకుప్ప పచ్చని వృక్షముగా ప్రాణముపోసుకొని, పక్షులతో నిండి పరమేశ్వర తత్త్వమునకు ప్రతీకగ నిలిచినది.మన మోడుబారిన మనసులను సైతము స్వామి తన కరుణామృతధారలతో చిగురింపచేయునుగాక
.
మరొక కథాకథనముతో
స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.
( ఏక బిల్వం శివార్పణం)
ఇంటి వెలుపలి, వచనం చిత్రం కావచ్చు
2 షేర్‌లు
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...