Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-14

 న రుద్రో రుద్రమర్చయేత్-04

********************
" బాలేందు మకుటం దేవం తరుణాదిత్య విగ్రహం
ధ్యాయేత్ నందీశ్వరాకారం గణేశ్వర సమావృతం"
ఈ రోజు బిల్వార్చనలో మనము "జలతత్త్వమును" గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఓం నమః శివాయ
న రుద్రో రుద్రమర్చయేత్-04
********************
" బాలేందు మకుటం దేవం తరుణాదిత్య విగ్రహం
ధ్యాయేత్ నందీశ్వరాకారం గణేశ్వర సమావృతం"
ఈ రోజు బిల్వార్చనలో మనము "జలతత్త్వమును" గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
చమకము 2వ అనువాకములో అమశ్చమ-అంబశ్చమే అని నీటి ప్రస్తావన "అంబశ్చమే" అను పదముద్వారా చెప్పబడినది.
'అమయతి అంబః" గ్రహించేశక్తిని నీరు,జలము అని పెద్దలు సంకేతిస్తారు.దానిని నిర్ధారిస్తు అమశ్చమే-విచక్షణ ప్రసాదించమని,సత్యాసత్యములను గ్రహించే శక్తిని అంబశ్చమే అంటు ప్రస్తావించారు.
నమకములో సైతము జలము ద్రవరూపముగా,మంచురూపముగా,మేఘములో దాగియున్నదానిగా,బురదరూపముగా,గాలితో కలిసి వచ్చుదానిగా,శబ్దముచేయుచు కదులు తరంగములుగా,మౌనముగా ప్రవహించి కొలనులా,సరస్సులా,బావిలో దాగిన నీటిలా,సహజ జలముగా,వర్షపు జలముగా,అనేకానేక రూపములుగా కీర్తించబడినది.
పెద్దలు ఆ జలతత్త్వమును సూక్ష్మముగా దాగిన మన శరీరవ్యవస్థతో పోల్చి స్వామి తత్త్వమును-అనుగ్రహమును మరింత స్పష్టముగా దర్శింపచేశారు.
ఓం నమః శివాయ
నమకము 5వ అనువాకము -13 వ యజస్సు
నమః శీఘ్రియాయచ శీభ్యాయచ".
శీభము అనగా జలప్రవాహము.జలప్రవాహమునందున్న వానికి నమస్కారములు.
5వ అనువాకము 14వ యజస్సు
నమ ఊర్మాయచ-తరంగములు తరంగములుగా ప్రకటింపబడుచున్న రుద్రునకు నమస్కారములు.
నమ అవస్వన్యాయచ-ధ్వనిలేని జలములో నున్నవానికి నమస్కారములు
5వ అనువాకము 15వ యజస్సు
నమః.స్రోతస్యాయచ-ప్రవాహమునందున్న వానికి నమస్కారములు
ద్వీప్యాయచ-ద్వీపము చుట్తు నున్న జలరూపునికి నమస్కారములు.
7వ అనువాకము 5వ యజస్సు
" నమ కాట్యాయచ-నీప్యాయచ"
కాట్యము-కాలువ
కాలువలయందు జలరూపముగా నున్న వానికి నమస్కారములు
నీప్యము-పెద్ద పెద్ద కాలువలుగా నున్న స్వామికి నమస్కారములు.
7వ అనువాకము 9వ యజస్సు
" నమః సూద్యాయచ-సరస్యాయచ"
సూదము-బురద-బురదరూపముగా నున్న వానికి నమస్కారములు
సరస్యాయచ-సరస్సులయందున్న వానికి నమస్కారములు.
7వ అనువాకము-
" నమో నాద్యాయచ-వైశంతాయచ"
నదీజలములుగా ప్రకాశించువానికి నమస్కారములు.
వేశంతము అనగా చిన్న కొలను-చిన్నికొలనులుగా చెలువొందువానికి నమస్కారములు.
7వ అనువాకము 11 యజస్సు
" నమః కూప్యాయచ-అవట్యాయచ" రేష్మియాయచ
కూపము అనగా బావి.బావి యందు జలముగా నున్న వానికి నమస్కారములు.
అవటమనగా-పల్లపు ప్రదేశము.
పల్లపు ప్రదేశములందు ప్రవహించుచున్న జలస్వరూపునకు నమస్కారములు.
7వ అనువాకము-12 వ యజస్సు
" నమః వర్షాయచ-అవర్షాయచ"
వర్షపుజలముగా-భూజలముగా నున్న రుద్రునకు నమస్కారములు.
7వ అనువాకము 13 యజస్సు మొదటి భాగము
నమో మేధ్యాయచ
మేఘములో దాగిన జలరూపముగా నున్న రుద్రునకు నమస్కారములు.
7 వ అనువాకము 15 వ యజస్సు
నమ@ వాత్యాయచ -రేష్మియాయచ"
వాత్యము-గాలితో కూడినది.గాలుతో కూడిన వానయందున్న జలరూపమునకు నమస్కారములు.
రేష్మి-ప్రళయకాల జలదిగ్బంధమున నున్న స్వామికి నమస్కారములు.
9వ అనువాకము-7వ యజస్సు
" నమః హ్రదయ్యాయచ-నివేష్యాయచ"
హ్రదము అనగా లోతైన మడుగు నందున్న రుద్రునకు నమస్కారములు.
నివేష్యము అనగా మంచు.ఘనీభవించిన జలరూపముగా నున్ననున్న రుద్రునకు నమస్కారములు
జలరూప లింగా-జంబుకేశా నమో నమః.
తెల్ల నేరేడు వృక్షములు ఎక్కువగా గల ప్రదేశము జంబుకేశ్వరము." తిరువనై కానల్" గా ప్రసిద్ధిచెందినది.స్వామి ఈ క్షేత్రమున విశేష పూజలను ఏనుగులచే అందుకుంటాడట.భక్తులు అమ్మవారైన అఖిలాండేశ్వరి దేవిని-స్వామిని గురుశిష్యులుగా భావించుటచే ఇక్కడ స్వామి వారి కళ్యాణము నిషేధము.
స్వామి వారి పాన వట్టము నుండి నిరంతరము జలము ఊరుతుంది కనుక స్వామిని " నీర్ తిరళ్ నాథర్" అని ప్రేమతో పిలుస్తారట." ఓం" నమో నీప్యాయచ"-కొండపై జారు నీటియందుండు స్వామి కోటి కోటి దండాలు.
జలస్వరూపుడైన జలధారిని స్పర్శించి సంస్కరింపబడిన వారి సచ్చరితములు కార్తిక-మాఘ పురాణములందు కోకొల్లలు.మృకండ మహాముని-మనస్విని దంపతుల మాఘస్నాన ఫలితమే మార్కేండేయునికి కలిగిన ఈశ్వరానుగ్రహముగా భావిస్తారు
ఇంకొక విశేషమేమిటంటే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరంలో స్వామి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే జలమునుండి బయటకు వచ్చి దర్శనమిస్తాడట.స్వామి జలతత్త్వమును చెప్పుటకు వేయితలల ఆదిశేషునకైన సాధ్యముకాదు.అతి సామాన్యురాలను నేనెంత?
భగీరథుని అనుగ్రహించిన
ఆ పరమేశ్వరుని జలతత్త్వములో నిక్షిప్త సంకేతములగురించి స్వామి ఆయారూపములో భక్తుని అనుగ్రహించిన వైనమును గురించి,రేపటి బిల్వార్చనలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
ఏక బిల్వం శివార్పణం.
ఇంటి వెలుపలి చిత్రం కావచ్చు
Arundhathi Komanduri
1 కామెంట్
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చArundhathi Komanduri

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...