Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-10


 నరుదో రుద్రమర్చయేత్-09

*************************
దేవరాజ సేవమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే.
ప్రియమిత్రులారా ఈ రోజు మనము క్షేత్రపాలక శబ్దముగురించి తెలుసుకుంటు బిల్వార్చనను చేసుకుందాము
నమకము
4వ అనువాకము 17వ మంత్రము
" నమశ్వభ్య శ్వ్పతిభ్యశ్చవో నమః"
కుక్కలరూపలోను,కుక్కలపాలకరూపములోను నున్న రుద్రులకు నమస్కారములు.
కుక్కలపాలకరూపములోనున్న కాలభైరవ క్షత్రపాలక స్వరూపమును తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
కుక్కలు భౌతికముగా విశ్వాసమునకు సంకేతములు.విశ్వాసమునకు సంకేతముగా సాహకుడు తన
నిజ తత్త్వమునందు ఏమరుపాటులేక యుండును.మోహమును దరిరానీయడు.అట్లు సంరక్షించువాడు కుక్కలనాయకుడు.
రుద్రుని దత్తాత్రేయరూపమును కూడా మనము భావించుకొనవచ్చును.నమస్కారములు.
పరమేశ్వరునిపరిపూర్ణ అవతారమే భైరవుడు.శునకము ఈయన వాహనము.అహంకారపూరితమై,అసత్యమాడినబ్రహ్మ ఐదవతలను శివుని భృకుటి నుండి సృష్టింపబడిన భైరవుడు తనగోటితో చిదిమి స్వామికార్యమును నెరవేర్చెను
పన్నెండు సంవత్సరములు తాను గిల్లిన బ్రహ్మకపాలమును భిక్షాపాత్రగా స్వీకరించి,పుణ్యనదులలో స్నానమాచరించి,పునీతుడైనాడు భైరవుడు.ఆనందమూర్తి ఆలయములో ఈశాన్యదిక్కున నుండి ఈశ్వరుని సేవిస్తుంటాడు.తనకర్తవ్య నిర్వహణకై అష్టభైరవ తత్త్వముతో క్షేత్ర పాలనను కొనసాగిస్తుంటాడు.అగ్నిగోళముల వంటి నేత్రములతో పాపములనుదగ్ధము చేస్తుంటాడు.గరళ కంఠముతో గళమున పాములతో చేతిలో త్రిశూలము,డమరు.కపాలముతో కాలభైరవుడు కాశీక్షేత్రమును,అక్కడికి వచ్చిన యాత్రికులను కాపాడుతుంటాడు.పాపాత్ములకు ప్రాణోత్క్రమణ సమయములో ఘోర రూపముతో సాక్షాత్కరిస్తు,వారి పాపములను భక్షిస్తుంటాడు.కనుక పాపభక్షకుడిగా ప్రసిద్ధిగాంచాడు.పాపులను సైతము పవిత్రులను చేయు పరమేశ్వర అంశ కాలభైరవుడు.
కాలభైరవస్వామికి వారణాసి-దంతేవాడ ,ఉజ్జయిని,,తేజ్పూర్,రామగిరి ఇంకా ఇంకా ఎన్నోచోట్ల కొండలలో ,జలపాతాలదగ్గర,గుహలలో,కొలువైనాడు.కొన్నిచోట్ల మూర్తి ఎదుగుతు ఉనికికి ఉత్తమనిదర్శనంగా ఉంటున్నదట.స్వామికి మద్యమును సమర్పించి, దానినితీర్థముగా భక్తులు సేవిస్తారట.ఇందుగలడందులేడనిసందేహములేల? మహిమలస్వామి మనలను కనిపెట్టుకునే ఉంటాడు కనికరము కలవాడు
.కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ
శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ
నమకములో క్షేత్రము-క్షేత్రపాలక ప్రసక్తి
**************************
2వ అనువాకము 7వ మంత్రము.
" నమో రుద్రాయా- ఆతతావినే క్షత్రాణాం పతయే నమః"
క్షేత్ర శబ్దము మూడువిధములుగా మనము అన్వయించుకుంటే
1. పంటపొలముగా భావిస్తే,
దానికి అనుగుణముగా
తిలాశ్చమే.మసురాశ్చమే-గోధుమాశ్చమే అంటు వాటిని ప్రసాదించమని చమకములో అర్థిస్తున్నారు.
2.శరీర పరముగా అన్వయించుకుంటే
చమకము 10 వ అనువాకము
గర్భాశ్చమే-వత్సాశ్చమే అంటు వివిధదశలలో క్షత్రములలో
జీవులను రక్షించమని ప్రార్థిస్తున్నది.
3.పుణ్యక్షేత్ర పరముగా అన్వయించుకుంతే స్వయముగా స్వామియే వివిధరూపములతో క్షేత్రపాలకత్వమును నిర్వహిస్తున్నాడు.శివోహం.
నమకము 11 వ అనువాకములోని 9 వ మంత్రము
" యే తీర్థాని ప్రచరంతి సృకావంతో నిషంగిణః"
అని ఈశ్వర రక్షకత్వమును మరింత తెలియచేస్తున్నది.
ఏ రుద్రులు హస్తములలో బాకులు,ఖడ్గములు ధరించి కాశీ ప్రయాగాది దివ్య క్షత్రములను పరిపాలిస్తున్నారో వారికి నమస్కారములు.
భక్తుడు కరువూరు క్షేత్ర పాలకునిగా శివభక్తులను రక్షించుట ఈశ్వరారాధనగా భావించి,తరించిన పుణ్యశీలి.ఘోరరూపి గా అఘోర రక్షణను గావించెడి వాడు. ప్రదేశమునందలి శివభక్తులకు ఎటువంటి ఆపదలు కలుగకుండ,శివార్చనలు జరుపువారికి హాని కలుగకుండ ఆయుధధారియై సంచరించుచు,సంరక్షించుచుండెడి వాడు.క్షేత్ర పాలకునిగా శివభక్తులను రక్షించుట ఈశ్వరారాధనగా భావించి,తరించిన పుణ్యశీలి.
చిదానందరూపా- ఎరిపాత నాయనారు
అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.నీవే తప్ప పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ అనగానే సర్వస్య శరణాగతికి వశుడై సిరికిం చెప్పకనే వచ్చినాడు గజప్రాణ రక్షణ ఉత్సాహముతో.ఇక్కడ అహంకారములేదు.అంతరించినది.కాని ఆఅదేజాతికిచెందిన ఏనుగు అహంకరించి శివభక్తులను అహంకారముతో ఘీంకరించి,శివ భక్తులను తుదముట్టించినది.బుద్ధిః కర్మానుసారిణి అని కద సూక్తి.
ఒక కరి రక్షింపబడినది.మరొకకరి శిక్షింపబడినది.ఇదియే పరమేశ్వర లీల.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు.ఎరిపాత నాయనారు.
వజ్రాయుధము వంటి దృఢమైన ఆయుధముచే తనను తాను రక్షించుకొనుచు,హాని కలిగించు ప్రాణులను చంపు రుద్రులకు నమస్కారములు.
శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తురాలిని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత
ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎనలేని కరుణతో రాజునుఎరిపాత నయనారును రక్షించిన సదాశివుడు మనందరిని రక్షించును గాక.
మరొక కథా కథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...