Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-04

 న రుద్రో రుద్రమర్చయేత్-17

*********************
"తిరుమురుక్కరు పాలై" మధుర తమిళ కవి నక్కీరర్
నమ్మినసత్యమునకు నిలిచి,పరమేశ్వరునే చర్చకు రప్పించెను
" తిరువిలైయడల్" దేవుని-జీవుని ఆటలుతెలియగ లేనివి
ఆటకు నాందియైనది అమ్మ ఘనపూంగదై పరిమళము
బహుమానము ప్రకటనమైనది ఆటకు ఆశచూపుతు
ప్రవేశించినది పద్యము ధీటుగ ధారుమి చదువగ
సరికాదన్నది సభాస్థలి దేనికి స్వాగతంబదో
వాదనమో శివనినాదమో ప్రమోదమో అవ్యక్తము
మాటకు మాట అంటు ముమ్మాటికి సరికాదనుచున్న
అతి మూర్ఖత్వమె ఆదిదేవుని అనుగ్రహమునకు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
రెండుపదములు మనకి కొంచము కొత్తగా అనిపించవచ్చును.అవి,
1.తిరు మురక్కరు పాలై - అనగా పరమ మూర్ఖుని పరిపాలించినవాడు/పరమేశ్వరుడు అది వాని ఆట.దానినే తిరువిలైయాడల్ అంటారు ద్రవిడభాషయైన తమిళమిలో.
ప్రియమిత్రులారా ఈ రోజు బిల్వార్చనను మనము కేశములు శబ్దమును గురించి తెలుసుకుంటు చేద్దాము. తమిళము నా మాతృభాష కానందున చింతిస్తు,లోపములను మన్నించమని అభ్యర్థిస్తున్నాను.
"కొంగు థెర్ వాజ్హ్కై అంజిరై థుంబి
కామం సెప్పాథు కందథు మొళిమొ
పయిలియాథు కెళియ నత్పిన్ మయిల్ ఇయల్
సెరి ఇయర్రు అరివై కూంథలిన్
నరియవుం ఉలవొ, నీ అరియుం పూవె"
ఓ తుమ్మెదా! నీవు మకరందమును గ్రోలుటకు పలురకములపూలపై వ్రాలి వాటి సువాసనను ఆఘ్రాణిస్తావుకదా.నెమలివంటి నా చెలికేశములనుండి వ్యాపించు పరిమళము వంటి అసమాన సౌగంధము నీకు ఎక్కడైన లభించినదా అన్నది ధారుమి సభలో చదివిన పద్యము.
అసలాపద్యము ఆవిర్భవించుటకు కారణము ఆదిదంపతుల అవ్యాజానురాగము.
పాండ్యరాజ పట్టమహిషికి వచ్చిన సందేహము నాందియైనది.కథను ముందుకు నడిపించుటకు ధారుమి పేదరికము చేరువైనది .దానికి తోడు సందేహము తీర్చిన వారికి లభింపనున్న భారీ పారితోషికము భాగస్వామ్యము తీసుకున్నది.
రసవత్తరమైన ఆ నాటకమునకు ధారుమి శివాలయమున స్వామిని వేడుకున్నాడు పేదతనమును పారద్రోలమని.కరుణాంతరంగముతో కదిలినాడు పరమశివుడు విప్రునిగా.పద్యమును వ్రాసి ధారుమి చేతికిచ్చి,రేపు రాజసభలో చదివి జరుగు చమత్కారమును చూదమన్నాడు.
ధారుమి ఆనందానికి అవధులు లేవు.తెల్లవారగనే రాజాస్థానమునకు వెళ్ళి తనదగ్గర నున్న పద్యమును రాగయుక్తముగా చదివి,రాజు మెప్పును పొందాడు.బహుమానమును స్వీకరించుటయే తరువాయి.
కథను మరింత రసవత్తరము చేయుటకా అన్నట్లు నత్కీరుడు సభాప్రవేశము చేశాడు.ధారుమి చదివిన పద్యమునకు నిరూపణమును కోరాడు.లోకరీతిగా పుష్పములవలన కేశములు సుగంధభరితములగునని,ధారుమి దానికి విరుద్ధమైన విధముగా భావించెను కనుక నిరూపించమని అడిగాడు.అసలే బేలతనం.దానికి పద్యమా తాను వ్రాసినది కాదు.ఏమని చెప్పగలడు? ఏ విధముగా నిరూపించుకొనగలడు.
లలితా సహస్ర నామ స్తోత్రములో సైతము,
" చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా" అని ఉన్నదికదా. తన చేతనున్న పద్యము వేరొక విధముగా నున్నది.తనకిచ్చి తనను అవమాన పరిచేటందుకే ఆ వ్యక్తి నిన్న వచ్చినట్లున్నాడు.
తలచుకున్నాడో లేదో మళ్ళీ ఎదురయి బహుమానము దొరికిందా అంటూ మాటకలిపాడు.
నమకములో సైతము
నమో కపర్దినేచ-వ్యుప్తకేశాయచ అన్న కేశ ప్రసక్తి వచ్చినది.హరికేశాయోపవీతనే అన్నప్పుడు స్వామి నిత్య యవ్వనమును ప్రస్తావించారు.ఆదిశంకరులు సైతము వ్యోకేశా/వ్యోమశిఖి అని ప్రస్తుతించారు.
కథను ముందుకు నడిపించాలనుకుంటుమ్న్నాడు కాముని కాల్చినవాడు.
మరునాడు పద్యమును తీసుకుని సభకు వెళ్ళమన్నాడు ధారుమిని.
శంకరులు వ్రాసి ఇచ్చిన పద్యములో
మయిల్ - నెమలి ప్రస్తావన కనిపిస్తున్నది.
శివానందలహరి 54 వ శ్లోకములో-సంధ్యాఘర్మ..
తాండవహేలను తిలకించుచున్న భక్తుల హర్ష వర్షమునుగని,మయూరి/శివా ఆర్యామహాదేవియే ఆడునెమలిగా మారి,నీలకంఠుడను నెమలితో కలిసి ఆనందతాండవమును చేయు దృశ్యము నా మహద్భాయము అన్నారు. నమో నమః.
కేశములు పూవుల సుగంధములవలన పరిమళమును సంతరించుకుంటాయి కాని సహజముగా సుగంధభరితములు కావు అన్నది నక్కీరుని అభ్యంతరము.
నక్కీరుని నాసిక ఇంద్రియము.పద్యములోని నాసిక పరమార్థము.
భక్తితో గమనిస్తే తల్లి నా పంచేంద్రియములు ఇంద్రియములై నా నిజతత్త్వమును గుర్తించలేకపోతున్నవి.మంత్రపూరితములైన నీ కేశములు మా క్లేశములను తొలగించగలిగినవి.అందుకే ఎందరో పరమయోగులు తుమ్మెదలవలె ప్రణవమను ఝంకారమును చేయుచు నీ కేశములందు పుష్పములవలె తరియించనీ అని వేడుకుంటారట.
పుష్పము ఐదు ఇంద్రియ మాత్రలను కలిగి ఉంటుందని కనుకనే దాని రూపము ఆకర్షణీయముగా,స్పర్శ మృదువుగా,వాసన వ్యాపకత్వముగా,జ్ఞానము సంకేతముగా,శబ్దము తుమ్మెదలను ఆకర్షించు శక్తిగా ఉంటుందని పెద్దలు చెబుతారు.
సభ ప్రారంభము అయినది.నక్కీరుని మనసు మురిసిపోతున్నది తర్కములో జయించినందుకు.కాని దానిని తాత్కాలికమే చేస్తూ , చమత్కారమును స్వాగతిస్తూ.
" మండలాంతరగతం హిరణ్మయం -భ్రాజమాన వపుషం శుచిస్థితం
చందదీధితం అఖండితద్యుతిం ఇచింతయేన్ముని సహస్రసేవితం"
అంటూ మునిపుంగవుల స్తుతులు నినదించు శుభసమయమున ,ధార్మితో పాటుగా సభాప్రవేశము చేసినాడు సుందరేశుడు.
" తిరుమురుక్కరుపాలై" పెద్ద మూర్ఖుని అనుగ్రహించుటకు వచ్చిన స్వామితో,నక్కీరరు తాను తర్కమీమాంసలను తెలిసినవాడనని,ఎంతటి గొప్పవారు రచించినదైనప్పటికిని పద్దియము అవాస్తికమని,లోపభూయిష్ఠమని వాదించసాగెను.
నక్కీరుని అదృష్టమును ఏమని వర్ణించగలను? ఆనిర్హతేభ్యునితో సర్వపాపములను నాశనముచేయువానితో) వాదన చేయగల వరప్రదానుడు.అక్కడ జరుగుచున్నది వాదప్రతివాదములు కావు. నక్కీరుని ప్రతి పదము పవిత్రబిల్వపత్రమై పరమేశుని పాదార్చనచేయుచున్నది,పరమేశుని ప్రతిపదము ఆశీర్వచనమై నక్కీరునికి పరమావధిని చూపించుచున్నదా అన్నట్లున్నది.ఎందుకంటే వాది-ప్రతివాది పరమేశ్వర స్వరూపాలే కదా.
" సభాభ్యో-సభాపతిభ్యశ్చవో నమః"
కనులముందున్న స్వామిని కనుగొనలేని మూర్ఖత్వము పదమునకు పదమును ,వాదనకు-ప్రతివాదనను ఇస్తూ సమవుజ్జిగా సాగిపోతున్నది.
సూచనలిస్తున్నాడు సదాశివుడు.సూక్ష్మమును
కనుగొనలేకపోతున్నాడు నక్కీరుడు.
మనసిజుడైనాడు నక్కీరుడు.మట్టుపెట్టేశాడు మనోహరుడు.ఎగిరి దూరముగా నున్న,హిరణ్య పద్మ కొలనులోనికి తోసివేయపడ్డాడు.పద్మము జ్ఞానమునకు ప్రతీక.హిరణ్యము కారుణ్యమునకు ప్రతీక.
పరిణామముల ఫలితములు భక్తికి పరిణితిని అందించినది.పరమార్థమును ప్రసాదించినది.ధన్యతనొందినారు ధారుమి,నక్కీరుడు,సభాసదులు,సర్వులు..
వారిని కరుణించిన విశ్వేశ్వరుడు మనలనందరిని రక్షించు గాక.
మరొక కథా కథనముతో
స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.
( ఏక బిల్వం శివార్పణం)
2 మంది వ్యక్తులు, వ్యక్తులు నిలబడి ఉన్నారు చిత్రం కావచ్చు
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...