Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-08

 న రుద్రో రుద్రమర్చయేత్-03

********************
"జ్ఞానానందమయందేవం నిర్మల స్పటికాకృతం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే."
సకలవిద్యలకు మూలమైన గుర్రపుతలగలదేవునికి నమస్కరించుచున్నాను.
ఈ రోజు బిల్వార్చనము అశ్వ ప్రస్తావనము-ప్రాముఖ్యము తెలియచేయుచున్నది.
నమకములోని 3వ అనువాకమునందలి 17 వ యజస్సు మనకు అశ్వ శబ్ద ప్రాశస్త్యమును వివరిసున్నది.
"నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమోనమః""నమోనమః"
ఇది ఉభయతో నమస్కార యజస్సు.
ఈ మంత్రమునందు అశ్వ శబ్దము స్వామి బహుముఖ ప్రతిభను తెలియచేస్తున్నది.
1.అశ్వము-రూపముగా అన్వయించుకుంటే గుఱ్ఱము.
2.అశ్వపతి-గుఱ్ఱమునకు అధిపతి యైన శివునకు నమస్కారములు.
3..అశ్వస్తన-సంపదలందు ఆసక్తిలేని స్వభావము కలవారు.
తమ ఉదరపోషణ నిమిత్తము సైతము ధనమును దాచుకొనక పేదతనముతో నున్నవారు.ఐహికముగా.
అశాశ్వత సంపదలందు అనురక్తి లేక కరతల భిక్షను మాత్రమే ఆశించు యోగ బుద్ధి కలవారు.
యోగి రూపములో నున్న శివునకు నమస్కారములు.
3.అశ్వము-శ్వాసగా నున్న శివునకు నమస్కారములు.4.అ శ్వః రేపు లేని వానికి కాలాతీతునకు నమస్కారములు.
అశ్వపతిగా శివుడు.
1.నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః"
తాను కూర్చుండి మనలను కదిలించువానికి నమస్కారములు.
2.కదలుచున్న విషయవాసనలను నియంత్రించు అశ్వపతికి నమస్కారములు.
3.అశాశ్వతములను దూరముచేయు విచక్షణను అందించు అశ్వపతికి నమస్కారములు.
4.తాను స్థిరముగా నుండి శ్వాసలను చలింపచేయు శివునకు నమస్కారములు.
5.సంగీత పరముగా దైవత స్వరము "ద"
అశ్వపు గొంతుదారా నినదింపచేయుచున్న శివునకు నమస్కారములు.
6.చమకములోని 9 వ అనువాకము అశ్వమేథశ్చమే అంటు అశ్వ ప్రసక్తిని తెచ్చినది.సాధన గమనముచేత మేథస్సును వ్యాపింపచేయు శక్తిగా కీర్తించినది.
7. నమకము 4వ అనువాకములోని 11 వ యజస్సు క్షత్రభ్యః అంటు గుర్రపులను మచ్చిక చేసుకొనువానిగా ప్రస్తుతించినది.
స్వామి మనలను రక్షించుటకు హయగ్రీవుని వధించుటకు (ఐహికము) హయగ్రీవునిగా అవతరించెనని(ఆధ్యాత్మికము) దేవీ భాగవతము కీర్తించుచున్నది.
హయగ్రీవుడను దానవుడు మానవశరీరము అశ్వముఖముతో జన్మించెను.బ్రహ్మవరముగా తనవంటి రూపము గలవానిచేత తప్ప మరణములేని వరమును పొందెను.వరగర్వితుడై వేదములను సైతము తస్కరించి,హయగ్రీవతారమునకు కారకుడాయెను.ధర్మసంరక్షణమునకు పరమాత్మ పలురూపములుగా ప్రకటింపబడుతు పరిరక్షిస్తుంటాడు.వేదపరిరక్షణమునకై హయగ్రీవమూర్తిగా ఆవిర్భవించెను.వేదపరిరక్షణమును గావించెను.
స్వామిలీలలను వర్ణించలేని నా కలము భక్తుని కథ వైపు పరుగులు తీస్తున్నది.
మాణిక్యవాచగరు గా కీర్తింపబడు వధవురారు తిరువాచగమును రచించిన శివస్వరూపుడు.పాండ్య రాజైన వరగుణవర్మ మంత్రి.వైగై నదీతీరమున గల వధవూరులో జన్మించిరి.వీరి స్తుతులు "తిరుమియిదళ్" పురాణముగ ప్రసిద్ధి గాంచినది. వీరు శివసేవక సంకేతముగ తలచుట్టు ఒక చిన్న గుడ్డను కట్టుకొని యుండెడివారు.కర్తవ్య నిర్వహణలో కడు నేర్పరి.
ఒకసారు రాజుగారు మాణిక్యునకు ధనమునిచ్చి రాజ్యమునకు కావలిసిన అశ్వదళమును తెమ్మని ఆదేశించిరి
స్వామికార్యమునకు వెళ్ళుచుండగా " అశ్వేభ్యో -అశ్వపతిభ్యో" ఎదురైనాడు,ఇంకెక్కడి అశ్వములు? తిక్క కుదిరింది అన్నట్లు ఆ ధనముతో గుర్రములను కొనక,తిరుప్పెరుంతరైలో పెద్ద శివాలయము నిర్మింపచేసి,నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండెను.విషయము తెలిసిన రాజుకోపించి,గుర్రములను పంపించమని కబురుచేసెను.
భక్తుడు ఆ భారమును భగవంతునిమీద వేసి నిశ్చింతగా నుండెను.
చంద్రశేఖరుడు చమత్కారముగానక్కలను గుర్రములను చేసి,
అశ్వశాల పంపినాడు .చిన్న చిన్న చమత్కారాలు చిద్విలాస భాగములుగా ద్యోతకమవుతూ దోబూచులాడుతుంటాయి."ఓం నమః శివాయ".అక్కడ నిలువలేక అడవినక్కలు తమ నిజస్వరూపమును ధరించి అడవిలోని పారిపోయినవి..విషయమును గ్రహించిన రాజు మాణిక్య వాచగరును పంచాగ్నుల మధ్య బంధించమని శాసించెను
"నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః".
శరణు పొందిన సాత్వికుడైన భక్తుడు ముందు నడుస్తుంటే వానిని రక్షించుటకై స్వామి వాని వెనుక అందుకునేటందుకు పరుగులెత్తుచుంటాడట.అది తన సర్వ సైన్యములతో.ఎంతటి భాగ్యశాలియో కద ఆ మాణిక్యవాచగరు.
పంచాగ్నులకు పరమశివుని శిరోభూషణమైన గంగమ్మ తోడై పరమాద్భుతము చేసినది.
గంగాధరుని యాన గంగ ఉప్పొంగి మాణిక్య వాచగరు శివభక్తిని చిరస్మరణీయము చేసినది. రాజును సంస్కరించి ,సత్కృపను పొందునట్లు చేసినది. సదా శివుడు మాణిక్య వాచగరు సరసను కూర్చుండి భగవంతుని భక్తునికి గల సాన్నిహిత్యమును ఋజువు చేసినాడు. సమయమాసన్నమయినపుడు స శరీరముతో (అవశేషములను మిగల్చకుండ) శివము శివైక్యమైనది.సదాశివుడు మనలను సర్వదా రక్షించుగాక.
మరొక కథా కథనముతో రేపు బిల్వార్చనలో కలుసుకుందాము.
( ఏక బిల్వం శివార్పణం.)
ఉదాహరణ కావచ్చు
Lakshmi MV, Sreedhar Kota
1 కామెంట్
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...