నరుద్రో
రుద్రమర్చయేత్-06
***************
మనము ఈ రోజు బిల్వార్చనను స్వామిని అన్నస్వరూపునిగా భావిస్తు చేసుకుందాము.
భక్త పరాధీనతతో బడలిపోయి ఉన్నావని
నక్తపు నియమాలతో నకనకలాడుతున్నావని
భక్ష్యభోజ్య చోహ్యములు,లక్షణమగు లేహ్యములు
చవులూరు చెరకు రసము,ఆహా అను అతిరసములు
నారికేళ జలాలు,నానా తినుబండారాలు
మధురస మామిడిపళ్ళూ,మంచి నేరేడు పళ్ళు
చక్కెరకేళి పళ్ళు,చక్కనైన ద్రాక్షపళ్ళు
ఆరు రుచుల ఆథరువులు ఆత్మీయ సమర్పణలు
పోషణలేక నీవు సోషతో సొక్కిపోతావని
మక్కువతో తినిపించగ గ్రక్కున నేను వస్తే
విషము రుచి నీకంత విపరీతముగా నచ్చిందా
ఒక్కటైన ముట్టవేర ఓ తిక్క శంకరా.
ఎంతటి అమాయకత్వము.అజ్ఞానము.మనకోసము స్వామిమధుర పదార్థములను అందించి,మన క్షమము కోసము తాను విషమును స్వీకరించాడట.
పుణ్యోగంధం పృధివ్యాంచ-ఆర్యోక్తి.
భూమి మనకు ఆహారప్రదానము కనుక చెప్పబడినదేమో
నమక ప్రసక్తికి వస్తే ఆహారము గురించి,స్థితికారకత్వమును కీర్తిస్తూ,
6వ అనువాకములోని 7వ యజస్సు
" నమః ఉర్వర్యాయచ ఖిల్యాయచ" అని
సస్యభరితమైన భూమిగాను,సస్యమును నూర్చు వానిగాను రుద్రుని కీర్తించినది.
దైవశక్తి-మానవశక్తి సమన్వయమే సంపూర్ణస్థితికారకత్వమేమో.
9 వ అనువాకములోని 10 వ మంత్రము
" నమో లోప్యాయచ-ఉలప్యాయచ" అంటూ
తృణములలో ప్రకాశించుచున్న రుద్రుని కీర్తించినది.
10 వ1 అనువాకము " అంధసస్పతే-అంటూ
భక్తుల అన్నములను పాలించువాడా అని ప్రస్తుతించినది.
11 వ అనువాకములోని 8వ మంత్రము
" ఐలబృథాయ" అని అన్నమును-బలమును ఇచ్చువానిగా కీర్తించినది.
చమకము సహితము ఆహారమును అర్థించువానిగా స్తుతించినది.
వాజశ్చమే-అన్నమును ప్రసాదించమన్నది.
అంతేకాకుండా
ప్రసవశ్చమే-ప్రసుతిశ్చమే అంటు,లభించుట మాత్రమే కాక,పచనము చేసుకునే శక్తిని అర్థించినది.
స్వామిని రైతుగా భావిస్తూ,
చమకము 3 వ అనువాకము,సీరంచమే అని నాగలిని,దున్నుటకు ఎద్దులను అర్థిస్తున్నది.
4వ అనువాకము వచ్చిన పంటను సూచిస్తూ,
తిలశ్చమే-ముద్గాశ్చమే-ఖల్వాశ్చమే-గోధూమాశ్చమే
అంటు,నువ్వులు,పెసలు,శనగలు,గోధుమలు మొదలగు పప్పు దినుసుల ప్రసక్తితో ప్రస్తుతించినది.
పెద్దలు వీటికి ఆధ్యాత్మికముగా సమన్వయపరిచారు.వారికి నా నమోవాకములు.
భగవంతుని అన్నప్రదాతగా భావించి అన్నాభిషేకముతో అన్నమునకు-అన్నమును సృష్టించినవానికి అభేదముగా సేవించు సంప్రదాయము ఇప్పటికిని మనము ప్రత్యక్షముగా చూస్తూనే ఉన్నాము.
తమిళములో ఆకలి అను భావమును "పసి" అను శబ్దముద్వారా తెలియచేస్తారు.
ఐప్పసి అనగా ఆకలిని తొలగించునది.స్వామికి కృతజ్ఞావిష్కారముగా ఐప్పసి మాసములో వండిన అన్నముతో స్వామి రూపమును అలంకరిమ్క్హి,అభిషేకించి,ఆరాధించు సంప్రదాయము
బృహదీశ్వరాలయములోను,తిరువారూరు,నాగపట్టణములలో నేతికిని కలదు.మరికొందరు మరికొన్ని వంటకములతో మూర్తిని అలంకరించి,ఆరాధించి,దానిని లక్ష్యముతో స్వీకరించే సంప్రదాయము కలదు.
దానికి కారణము లేకపోలేదు.స్వామి పంచభూతాత్మకుడు.అన్నము పంచభూత సమిష్టి సహకార ప్రసాదము.విలువను విశ్వసిస్తూ వినయముతో సేవించుకొను సంప్రదాయమే మహాభిషేకము/అన్నాభిషేకము.
భగవంతుడు అన్నమునొసగిన విధమును-భక్తుని అన్నభక్తి గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
కావేరీ నదీతీరమున నున్న గణమంగళ పట్టణమున పరమశివభక్తులైన నాయనారుదంపతులుండెడివారు.ప్రతిరోజు పరమశ్రేష్ఠమైన కేసరి బియ్యముతో వండిన అన్నమును,ఆకు కూరలను,మామిడి ఒరుగులను అత్యంత భక్తిశ్రద్ధలతో చేసి,స్వామికి ఆరగింపును చేసెడివారు.
వారి భక్తికి పరీక్షపెట్టాలనుకున్నాడు పశుపతి.సంపదలను మెల్లగా హరించివేయసాగాడు.రోజు పొలములో కోతకోసి,వచ్చిన ధనముతో శివారాధనమును చేసెడివాళ్ళు.తాము మాత్రము సర్దుకుని దొరికితే ఆకుకూర,అదియును లేకపోతే జలముతో కడుపునింపుకునేవారు కాని స్వామి నివేదనకు ఏ మాత్రము లోపమును కలిగించలేదు.
" పుటము వేస్తేనే కదా పసిడికి మెరుపు
పరీక్షిస్తేనే కదా భక్తునికి గెలుపు"
మరింత భక్తుని పరీక్షించదలచి స్వామి,ఒకరోజు వారు నైవేద్యమును తీసుకుని వస్తుండగా,దానిని నేలపాలు చేసెను.జరిగిన అపరాధమును జీర్ణించుకోలేని నాయనారు కత్తితో తన పీకను కోసుకుని ఆత్మార్పణమును చేయబోయెను.
విచిత్రము నేలలో నుండి స్వామిచేయి పైకి వచ్చి ఆరగింపును ఆనందముతో స్వీకరించినది.ఆ నాయనారు దంపతులను అనుగ్రహించినది.
అదే కరుణను స్వామి మనందరిపై వర్షించును గాక.
రేపు మరొక కథా కథనముతో బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment