Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-03

 న రుద్రో రుద్రమేచయేత్-18

********************
" ఎప్పొళుదుం ఎనై ఎదిర్వే కాక్క
అదియేన్ వశనం అశైమళనేరం
కడుగవే వందు కనకవేల్ కాక్క
వరుం వగల్ తన్నిల్ వజ్రవేల్ కాక్క
అరై ఇరుళ్ తన్నిల్ అనయవేల్ కాక్క.
సర్వకాల సర్వావస్థలయందును సర్వమును ఆ వేలాయుధుడు రక్షించును గాక.
కందషష్టికవచం.
ప్రియ మిత్రులారా ఈ రోజు బిల్వార్చనలో మనము "ప్రణవ" శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.సాక్షాత్తుగా తన తండ్రికి ప్రనవమును ఉపదేశించిన స్వామినాథన్ లీలా విశేషములను తెలుసుకుందాము.
నమకములో చెప్పినట్లు,
విచిత్రము ఈ క్రింది మంత్రములు శివునకు-శివపుత్రునకు చక్కగా అమరుచున్నవి వారి అభేదమును మరింత ప్రస్పుటము చేస్తూ.
5.వ అనువాకము-6వ మంత్రము
"నమో గిరిశాయచ-శిపివిష్టాయచ"
కొండలయందును-వాక్కుల నందును నున్న రుద్రునకు నమస్కారములు.
6. వ అనువాకము 2&3 మంత్రములు.
" నమః పూర్జాయచ-అపరయాయచ"
" నమో మధ్యమాయచ"
పూర్వమునము-మధ్యలోను-అపరము నందు నున్న రుద్రా నమస్కారములు.
6. అనువాకము-12 వ మంత్రము.
" నమః శూరాయచ-అవబందతేచ"
అవబందతేచ-శత్రువులను పదగొట్తువాడు అదియును తన శర్యముచే.
6. అనువాకము-15 వ మంత్రము
" నమ శ్రుతాయచ-శ్రుతసేనాయచ"
అద్భుత మంత్రము.
వేదస్వరూపము తానైన వాడు.వేదస్వరూపమునకు ప్రతీకలుగా నిలిచిన,తీర్థములు-క్షత్రములు-ఆయుధములు,పురానములు-అస్త్ర-శస్త్రములు-మహత్మ్యములు సేనగా కలవాడు.
7. వ అనువాకము-
" నమః స్వ ఆయుధాయచ"
మంగళకరమైన వేలాయుధమును/శూలమును ఆయుధముగా కల రుద్రునకు
మంగళకరమైన త్రిశూలము ఆయుధముగా కల రుద్రునకు నమస్కారములు.
చమకములోని 3. వ అనువాకములో
" యంతాచమే-ధర్తాచమే"
ధర్మమును పరిరక్షించు నియంతను/తండ్రిని?గురువును ప్రసాదించమని అర్థిస్తున్నది.
" పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం." ఓం నమః శివాయ.
అకరా-ఉకార-మకార సంగమము " ఓంకారము." ఓంకారమును సూక్ష్మ ప్రణవముగను,పంచాక్షరిని స్థూల ప్రణవముగను దైవజ్ఞులు భావిస్తారు.ప్రణవము స్వయంప్రకాశకము నిత్యము నిరంజనము.
" ఓంకార బిందు సంయుక్తం నిత్యంధ్యాయంతి యోగినాం
కామదం మోక్షదం వందేం ఓంకారాయ నమోనమః."
ఇప్పుడు మనము సూటిగా ప్రణవ శబ్దము ఎందువలన
శివుడు మరచిపోవలసి వచ్చినది,దానిని మురుగన్ ఏ విధముగా తిరిగి జ్ఞప్తికి తీసుకుని వచ్చినట్లు లీలను సృష్టించి మనలను అనుగ్రహించాడో గుర్తుచేసుకుందాము.
పూర్వము భృగు మహర్షి ,తాను చేయబోవు తపమునకు ఎవరైన భంగమును కలిగించిన వారు ప్రణవమును మరచిపోవునట్లు బ్రహ్మచే వరమును పొంది ,తపమును తీవ్రముగా చేయ ప్రారంభించాడట.దాని ఫలితముగా ముని శిరమునుండి మంటలు పైకెగిసి సకలలోకములను భయభ్రాంతులను చేసినవి.శరణువేడిన సర్వజగములను సంరక్షించుటకై శివుడు భృగు మహాముని శిరమున తన చేతినుంచి మంటలను ఆర్పివేసెను.
వరమును గౌరవిస్తూ, తత్ఫలితముగా ప్రణవమును మరచిపోయెను.
విశ్వేశ్వరుడు మరచిన విశ్వమంతయు మరచినట్లే కదా.ధర్మమునకు గ్లానిగా నున్నందున మురుగన్,మన కుమారస్వామికి,బ్రహ్మ అజ్ఞానముగా ఇచ్చిన వరము అసహనమును కలిగిచుచున్నది.అదే సమయమున బ్రహ్మ తాను సృష్టికర్తనను అహంభావముతో అటువైపుగా వెళుతూ కుమారుని చూసి కనీసము మర్యాదకైనను పలుకరించలేదట.గమనించిన స్కందుడు వినయముగా బ్రహ్మదరికి వచ్చి నమస్కరించి,ప్రణవము యొక్క అర్థమును వివరించమనెను.సమాధానము తెలియని బ్రహ్మను చూసి,అజ్ఞానము మరింత అజ్ఞానమును సృష్టించరాదని బ్రహ్మను నిర్బంధించెను.సృష్టికార్యము ఆగిపోయినది.అది ధర్మ విరుద్ధము కనుక సకలదేవతలు బ్రహ్మను కుమారుని బారి నుండి విడిపించవలసినదిగా ప్రార్థించిరి.
జరిగిన విషయమును గమనించి,శంకరుడు బ్రహ్మను ప్రశ్నించి రాదని బంధించితివి కదా.అసలు నీకు ప్రణవము అంటే ఏమిటో తెలుసునా అని గుహుని ప్రశ్నించెనట.
స్వామికి కావలిసినది కూడా అదేకదా.అందులకు తన తండ్రితో తనను గురువుగా అంగీకరిస్తే చెవిలో ప్రణవమును ఉపదేశిస్తానని,దానిని తరువాత బ్రహ్మకు ఉపదేశించిన తరువాత,బ్రహ్మ సృష్టిని కొనసాగింపవచ్చని,తండ్రికి చెవిలో ఉపదేశించెనట.
ఓం నమః శివాయ.
క్షేత్ర విషయమునకు వస్తే కుమారుని ఆరుపడైవీడు లలో 4వది స్వామిమలై.వీడు అంటే తమిళములో ఇల్లు.పడై వీడు-యుద్ధసేన నిలిచిన శిబిరము.ఆరు పదై వీడు,ఆరు శిబిరములలో 4వది.కుంభకోణమునకు దగ్గరలో నున్నది.నక్కీరునిచే తిరుమురుగాత్రపడై గా ప్రస్తుతింపబడినది.గురుమలై/గురుగిరి అని కూడా పిలుస్తారు.స్వామి తన వేలాయుధముతో నేత్ర తీర్థమును సృష్టించాడని నమ్ముతారు.అహంకారమును/అజ్ఞానమును తొలగించునది తీర్థ సంకేతము.అందముగా బాలునిగా కనిపించు స్వామిని ముద్దుగా మురుగన్ అని తమిళములో పిలుస్తారు.. నెమలి వాహనమునకు బదులు ఏనుగు వాహనముపై దర్శనమిచ్చుట ఇక్కడి ప్రత్యేకత..
బ్రహ్మ అజ్ఞానముతో పాటు బ్రహ్మాండ అజ్ఞానమును హరించి రక్షించుచున్న స్వామినాథుడు మనలనందరిని రక్షించుగాక.
మరొక కథాకథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
ఫోటో వివరణ అందుబాటులో లేదు.
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...