Posts

Showing posts from April, 2018

SAUNDARYA LAHARI-FALASRUTI

Image
 సౌందర్య లహరి-ఫలశృతి-108  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  చెల్లియో-చెల్లకో-తెలిసియో-తె లియకో, దొర్లిన  అక్షర లోపములను-పద, పాదలోపములను  అమ్మవని నీతో నేనాడిన బొమ్మలాటలను  భావ లోపములను,  లెక్కలేని అపరాథములను  కమ్మనైన కరుణతో, క్షమియించవమ్మా  కమ్మనైన ఫలములతో, కటాక్షించవమ్మా  నీవున్నావని అన్నా-లేవన్నా,నిన్ను గుర్తించలేకున్నా  ఆర్ద్రత నిండిన మనసుతో" అమ్మా" అని పిలువగనే  అర్హత ఉన్నను-లేకున్నను-అసలేమి కాము అనక,  చిన్న పిల్లలమనుకొని నీ ఒడిలో కూర్చోనీయమ్మా  సకలలోకరక్షిణి-శరణము నీవేనమ్మా,మా  మానస విహారి-మహా సౌందర్య లహరి.  ప్రియ మిత్రులారా!   శ్రీమాత ఆశీర్వచనములతో-శ్రీమాతాస్వరూపులైన  మీ అందరి ఆదరణతో-ఆలంబనతో ఈ రోజు 108 వ భాగమైన  స్తోత్రఫలశృతిని మీముందు  ఉంచగలుగుతున్నాను.అ తల్లి సంకల్పిత జ్ఞానయజ్ఞములోని విశేషములన్నియు తల్లి పలికించినవే.దొర్లిన దోషములకు నా అజ్ఞానము-అహంకారము కారణములు.క్షంతవ్యురాలను.పరమేశ్వరి ప్...

SAUNDARYALAHARI-CHINTAMANI GRUHAMU

Image
 సౌందర్య లహరి-చింతామణిగృహము  ****************************   పరమపావనమైన  నీపాదరజకణము   పతితపాలకమైన  పరమాత్మ స్వరూపము   ఏకాంత-శృంగార-జ్ఞాన-ముక్తి మంటపములు   సహస్ర మండపముల  సూర్య-చంద్ర ప్రక్కశితము   శక్తితత్త్వములు అమరినవి పది సోపానములుగా   శివతత్త్వము  మారినది శుభాకార మంచముగా   సకలలోక సౌభాగ్య  సంకల్పితము అపురూపము   కుడి-ఎడమగా విడివడినది  ప్రూషికా రూపము   సంతత  చిత్ప్రకాశక చింతామణి గృహములో   అమ్మ  ఒడిలో  నేను  ఆసీనురాలినైన  వేళ   జన్మధన్యమైన నన్ను  వెడలిపొమ్మనకమ్మా,   అందరికి అమ్మవైన  అద్భుత సౌందర్య లహరి.  మణిద్వీపమునకు బ్రహ్మరంధ్రము వంటి చింతామణి గృహములో తల్లిచిత్ప్రకాశముతో దర్శనభాగ్యమును ప్రసాదిస్తుంటుంది.చింతతో ప్రమేయము లేకుండగానే చింతితార్థ ప్రదాయిని చెంతనేఉండి రక్షిస్తుంటుంది.అందుకేనేమో తల్లిని "సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా" సన్నుతిస్తారు.సహస్రాక్షి-సహస్రపాత్ సహస్ర స్తంభ నిర్మితమైన చతుర్విధఫలపురు...

SAUNDARYA LAHARI-NAVARATNA PRAAKAARAMU

 సౌందర్య లహరి-నవరత్న ప్రాకారము ********************************  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  పంచభూత స్వామినుల ప్రకాశోపేతము-పవిత్రము  పగడముల ప్రదేశము-ప్రపంచ సంపన్నము  తూరుపు-పడమర-ఉత్తరము-దక్షిణము  ఊర్థ్వ-అథో ఆమ్నాయ దేవీసుసంపన్నము  అనంత తేజోమయ శుభలక్షణ శ్రీమంతము  అమృత రస ఆత్మానుభవ ఆనంద రామము  శ్రీమాత మంత్రములకు శ్రీకర నిలయములైన  నవరత్న ప్రాకారము నన్ను దీవించుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి. "పంచమీ-పంభూతేశి" తల్లిని సేవించునవి పంచభూతములు.అవి నీరు-నిప్పు-నింగి-నేల-గాలి.అవి తల్లి కనుసన్నలలో పంచభూతములను గమనించుచు,వాటి గమనమును నిర్దేశించుతు,ఋతువులననుసరించి,ప్రపంచ సౌభాగ్యమునకు సమతౌల్యతతో-సంస్కారముతో ఉండునట్లు చేయుశక్తులు పంచభూతస్వామినులు..అలాకాకుంటే ప్రళయమే కదా.    శ్రీమాత పూజా విధానములో సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహ విధానములలో,బిందురూప పూజ. (సృష్టి) స్థితిపూజలో అర్చించిన దేవతలు కాకుండా మిగిలిన దేవతలను (మంత్ర...

SAUNDARYA LAHARI-MARAKATAMAnI PRAAKAARAMU

   సౌందర్య లహరి-మరకతమణి ప్రాకారము **********************************    పరమపావనమైన నీ పాదరజకణము    పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము    సకలము మరకత మణిమయము- సాక్షాతు స్వర్గము    ముక్కోటి దేవతా విలసిత షట్కోణ భవనము     ఊర్థ్వ త్రికోణ బిందువులో బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు     అథోకోణ బిందువులలో వారు శక్తుల గూడిన వారు     వేద అక్షమాలా సమేత మేథా దక్షిణామూర్తి     ఈశాన్య కోణములో  తేజ రత్నగర్భ గణపతి     సకలదేవతలకు  సన్నిహితము  సకలమైన     మరకత మణి ప్రాకారము తారకమగుచున్న వేళ     నీ మ్రోలనే   నున్న నా కేలు విడనాడకమ్మా,నా     మానస విహారి! ఓ సౌందర్య లహరి.  మాహేశ్వరి మనోసంకల్ప నిర్మిత మరకతమణి ప్రాకారము మహిమాద్భుతము.ఇందులో రెండు త్రికోణములు గలభవనము కలదు.పైవైపున నున్న త్రికోణ బిందువులలో త్రిమూర్తులు తేజరిల్లుచుంటారు.క్రిందివైపునకున్న త్రికోణ బిందువులలో వారు శక్తులతో ఉంటారు.గణపతి-కుబేరుడు-దక్షిణామూర్తి ఇంకా ఎందరెందరో దేవతలు అ...

SAUNDARYA LAHARI-MARAKATA

 సౌందర్య లహరి-మరకత మణి ప్రాకారము    పరమపావనమైన నీ పాదరజకణము    పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము     వృక్షో రక్షితము-సకలము మరకత మణిమయము     ముక్కోటి దేవతా విలసిత షట్కోణ భవనము     ఊర్థ్వ త్రికోణ బిందువులో బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు     అథోకోణ బిందువులలో వారు శక్తిసమేతులు     గౌరి-వేద అక్షమాలా సమేత మేథా దక్షిణామూర్తి     ఈశాన్య కోణములో  తేజ రత్నగర్భ గణపతి     కోటి ప్రకృతుల సౌందర్యాల కూటమియైన.     మరకత మణి ప్రాకారము సంసార తారకమగుచున్న వేళ     నీ మ్రోలనే   నున్న నా కేలు విడనాడకమ్మా,నా     మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUNDARYA LAHARI-106

Image
 సౌందర్య లహరి-ముత్యాల ప్రాకారము  పరమ పావనమైన నీపాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  ధవళముక్తామయము-దశయోజన  విస్తీర్ణము  ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలప్రదము  అష్టమూర్తి రజైయాత్రీ లోకయాత్రావిధానము  అష్టదళ పద్మాకార  అతిసుందర భవనము  అనంగమదన-గగనరేఖ-భువనపాలాది  అష్టమంత్రిణీసేవిత జ్ఞానశక్తిమయము  సర్వజీవ-సర్వవేళ సమాచార సంరక్షణ కేంద్రమైన  ముత్యాల ప్రాకారములో సత్యము అవగతమగుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.   నిత్యకళ్యాణి మనోసంకల్పిత ముత్యాల ప్రాకారము స్వచ్చతకు-సత్యమునకు ప్రతీక అయిన తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుండి.అచ్చటి ఎనిమిది రేకులు పద్మము అనంగ మదనాది ఎనిమిది శక్తులుగ ,వారు అందించు సర్వజీవుల- సర్వకాల-సర్వావస్థల సమాచారములను కాంతులను వ్యాపింప చేస్తు ,సత్కృపకు  పాత్రులను చేస్తుంటుంది.అంతేకాదు అమ్మవారి కంఠములో అలంకరించబడిన  అటు-ఇటు కదులుచున్న   అందమైన ముత్యాలతో అల్లబడిన రత్నాల హారము అందముగా కన...

SAUNDARYA-INDRANEELAMANI PRAAKAARAMU

  సౌందర్య లహరి-ఇంద్రనీలమణి ప్రాకారము  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మస్వరూపము  బ్రాహ్మి-కౌమారి-చాముండ-వైష్ణవి-వారాహాది అష్ట  మాతృకా శక్తుల వైఢూర్య నిలయములను దాటుకొని  ఇంద్రనీలమణిమయ పదహారు దళములున్న  పదియోజనముల విస్తీర్ణమున్న  పద్మాకార భవనము  కాళి-కరాళీ-ఉష-దుర్గ-సరస్వతి-లక్ష్మి ఇత్యాది  పదహారు శక్త్ల పరివేష్ఠిత  ప్రాకారములో  శింజానమణి మంజీర మండితశ్రీ  పదాంబుజను  దయాసంద్రముగా  ధ్యానములో దర్శించుచున్న వేళ  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.  అష్టమాతృకాశక్తుల వైఢూర్య నిలయములను  దాటిన తరువాత,పదహారు ఇంద్రనీలమణి రేకులున్న పద్మాకార భవనము ప్రజ్ఞావైభవమై ప్రకాశిస్తోంది.పద్మము జ్ఞానమునకు సంకేతము.పద్మము సూర్యుని ఉషోదయ కిరణాలతో వికసిస్తుంది.బురదలో పుట్టి,బురదలోనే ఉంటున్నప్పటికిని దానిచే ఏ మాత్రము ప్రభావితము కాకుండా ప్రకాశతత్త్వముతో పరిమళిస్తుంటుంది.పద్మాకారా భవనములోని పదహారు రేకులు అమ్మచే సంకల్పమాత్ర సంభవములైన జ్ఞాన సంకేతములు.పద్మాస...

SAUNDARYA LAHARI-106

 సౌందర్య లహరి-ఇంద్రనీలమణి ప్రాకారము  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మస్వరూపము  బ్రాహ్మి-కౌమారి-చాముండ-వైష్ణవి-వారాహాది అష్ట  మాతృకా శక్తుల వైఢూర్య నిలయములను దాటుకొని  ఇంద్రనీలమణిమయ పదహారు దళములున్న  పదియోజనముల విస్తీర్ణమున్న  పద్మాకార భవనము  కాళి-కరాళీ-ఉష-దుర్గ-సరస్వతి-లక్ష్మి ఇత్యాది  పదహారు శక్త్ల పరివేష్ఠిత  ప్రాకారములో  శింజానమణి మంజీర మండితశ్రీ  పదాంబుజను  దయాసంద్రముగా  ధ్యానములో దర్శించుచున్న వేళ  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

SAUNDARYA LAHARI-105

 సౌందర్య లహరి-వజ్ర ప్రాకారము  పరమ పావనమైన నీ పాదరజ కణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  లేశపు మాత్రపు కరుణ విశేష అనుగ్రహముగాగ  అమ్మను సేవించుచున్న  అదృష్టశాలులెందరో  వికచాంబోరుహ నయనములకు కాటుకనందించుచున్నారు  ప్రస్తుతులతో తల్లికిసుగంధ కస్తురినలదుచున్నారు  దీవెనల బలముతో వీవనలు  వీచుచున్నారు  పెద్ద సౌభాగ్యమంటు అద్దమునుచూపుచున్నారు  పాద సంవాహనముతో పావనమగుచున్న,ఆ అద్భుత  వజ్ర ప్రాకారములో మహారాజ్ఞిని కొలుచుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.  అత్యంతవైభవోపేతమైన మణిభవనములు,వాని ముందు ఎన్నో కోట్ల మైళ్ళ దూరమువరకు గల అసంఖ్యాక అశ్వములు-గజములు-రథములు-వాహనములు కొలువుతీరిన అమ్మవారి సైరంధ్రీ జనము (అమ్మను అలంకరించు చెలికత్తెలు-పరిచారికలు అనలేము)వారి పూర్వ జన్మపుణ్యఫలముగా అపూర్వ సేవాసౌభాగ్యమును పొందియున్నారు.కొందరు సత్వ-రజో-తమోరూపముకన్ను అని చర్చించుకొనుచు చల్లనికాటుకను తయారుచేసి,అమ్మవారికి అందించుచున్నారు.సాక్షాత్తుచంద్రుని కన్నుయందు నిలుపుకొనిన తల్...

SAUNDARYA LAHARI-105

Image
 సౌందర్య లహరి-గోమేథికప్రాకారము  పరమ పావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  త్రిభువనేశ్వరి సంకల్పిత జపాకుసుమ సన్నిభము  దశయోజన ఔన్నత్యము-దండనా సన్నద్ధము  ఇంద్రాణి-రుద్రాణి-నారయణాది ముప్పది రెండు శక్తులు  ఒక్కొక్క మహాశక్తికి పది అక్షౌహిణీ సైన్యములు  (అక్షౌహిణీ-21,870 రథములు,21,870 ఏనుగులు,65,610 అశ్వములు,1,09,360 కాలిబంట్లు.)  విద్య-పుష్టి-సినీవాలి-ప్రభ-నందాది సకలసద్గుణములు  మెప్పు కలిగియున్నవి ముప్పదిరెండు లోకములు  అందరు అసమాన పరాక్రమ సంపన్నులు-అజేయులు  గోమేథిక ప్రాకారములో నా మేథోమథనమగుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానసవిహారి ! ఓ  సౌందర్య లహరి. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా సంకల్పిత గోమేథిక ప్రాకారము మందారకుసుమ ఎర్రని రంగుతో తాపస మందారి కరుణ ప్రకాశిస్తుంటుంది.ఈ ప్రాకారములో తరువులు.ఆకులు,పండ్లు,భూమి.దేవతశక్తుల ఆభరణములు అన్ని గోమేథిక మణిమయమే.ఎర్రని వీరతిలకమా అన్నట్లు శక్తులు-వీరులు తేజోవంతులై ఉంటారు.ఇక్కడ బుద్ధి,జ్ఞానము,పుష్టి,విద్య సర్వజీవులను ఆదరి...

SAUNDARYA LAHARI-104

 సౌందర్య లహరి-పద్మరాగమణిప్రాకారము  పరమ పావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  దశయోజన విస్తీర్ణపు ధర్మ సంస్థాపనము  ఆయుధముల రణసామాగ్రుల  భాండాగారము  పింగళాక్షి-విశాలాక్షి-వాగీశీ-బహురూపాది  కయ్యానికి కాలుదువ్వు  అరువది నాలుగు శక్తులు  అసంఖ్యాకములు అచట రథాశ్వ గజములు  అసమాన పరాక్రమ వీరులు-అరివీర భయంకరులు  యోగి హృత్ పద్మనివాసిత  సంకల్పిత  తేజో  పద్మ మణి ప్రాకారమున నేను పరిణితి పొందుచున్నవేళ  నీ  మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  "అరుణాం కరుణాంతరంగతాక్షి" సంకల్పిత పద్మరాగ మణి ప్రాకారము రక్షక స్థానము.చతుషష్టి కళలనెడు అరవై నాలుగు శక్తిస్వరూపములు-అరివీర భయంకరులైన వీరులు ధనుర్బాణ ధరులై,ధర్మపాలన చేస్తుంటారు.అసంఖ్యాక రథములు-గజములు-అశ్వములు-యుద్ధభూమి పయనమునకు సిద్ధముగా ఉంటాయి.ఆదిశక్తి అరివీరభయంకర సంకేతముగా,కుంకుమ సమ అరుణకాంతి భూభాగములో మండపములు-పక్షులు-వృక్షములు-ద్వారములు-సరోవరములలో పద్మరాగమణుల కాంతులు ప్రకాశించుచున్నవి.అమ్మదయతో నాల...

SAUNDARYALAHARI-103

  సౌందర్య లహరి-పుష్యరాగ ప్రాకారము  పరమపావనమైన  నీపాదరజకణము  పతితపాలకమైన  పరమాత్మ స్వరూపము  సమిష్టి దిక్పాలకా పాలితము-సాక్షాత్తుస్వర్గము  సమస్తము మణిమయము-సర్వాంగ సుందరము  చతుషష్టి శక్తుల సంరక్షణ నిలయము  తల్లినిసేవించు చతుర దాస-దాసీజనము  ఇంద్రాణి-మహేంద్ర విరాజిత అమరావతి పట్టణమున్న  పుష్పరాగ ప్రాకారములో ఆనందభాష్పములతో నున్న వేళ  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి. " కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితా" సంకల్ప నిర్మితమైన పుష్యరాగ ప్రాకారమునకు సమిష్టి దిక్పాలకులు నాయకులు.ఇక్కడ తరువులు-పత్రములు-ఫలములు-పక్షులు-సరోవరములు అన్ని ఎర్రని కాంతితో ఉంటాయి.ఉత్తరమున కుబేరుడు-పశ్చిమమున వరుణుడు-వాయవ్యమున వాయుదేవుడు-ఆగ్నేయమున అగ్నిదేవుడు ఈశాన్యమున రుద్రుడు మహాతేజోవంతులై వారివారి శక్తులను,ఆయుధములను ధరించి అమితోత్సాహముతో నున్నారు.ప్రమథగణ సంసేవితుడైన పరమేశుడు అష్టమూర్తియై,ఇష్టకామ్యములను తీర్చుచున్నాడు.అతి సుందర అమరావతి పట్టణమున అలౌకిక ఆనందముతో నున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మ...

SAUNDARYALAHARI-PASIDI PRAAKAARAMU-102

  సౌందర్య లహరి-పసిడి ప్రాకారము  పరమ పావనమైన  నీ పాదరజకణము  పరమపావనమైన  పరమాత్మ స్వరూపము ధాతువులు-ఋతువులకిది చివరి ప్రాకారము మథురస ఫలములతోనున్నదిచట కదంబవనము తపశ్రీ-తపస్యశ్రీలతో  శిశిర ఋతువు నాయకుడు కదంబ మద్యమును త్రాగి ఆత్మానందమొందువాడు ఆరాధ్యులు  ఎందరో దేవీ వ్రత సన్నద్ధులు దానమాచరించగ సిద్ధముగా నున్న సిద్ధులు అమ్మ తత్త్వ అధ్యయనమను ఆధ్యాత్మికతతో నిండిన పసిడివనములో  అమ్మకృప గుసగుసలాడుచున్న వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ! ఓ సౌందర్య లహరి. "కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా" సంకల్పిత స్వర్ణప్రాకారములోని వారి భక్తి సాధనకు ఇది తొలిమెట్టు.ఈ ప్రాకారమునకు నాయకుడు శిశిర ఋతువు.అతడు తన భార్యలైన తపశ్రీ-తపస్య శ్రీలతో ఇచటి కదంబ వన ఫలముల మద్యమును సేవిస్తూ,ఆత్మానందమును పొందుతుంటాడు.ఇది బాహ్యార్థము.పవిత్ర ప్రాకారములో మద్యపానమా? అని అనిపించినప్పటికిని,కొంచము నిశితముగా పరిశీలిస్తే.....కదంబ వనఫలములు అనగా అమ్మ కరుణతో అందించిన అనుగ్రహ ఫలితములు.వాని నుండి స్రవించు మద్యము అమ్మ కరుణాకటాక్షమను అమృతము.దానిని దర...

SAUNDARYA LAHARI-RAJATA PRAAKAARAMU

 పరమపావనమైన నీపాద రజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  ఆహ్లాదకరము అత్యంత  సుమనోహరము  ఆరోగ్యప్రదానము మణిద్వీప ఆరవ ప్రాకారము  ఆశ్వయుజ -కార్తిక మాసములు ,సహశ్రీ-సహస్యశ్రీ  అందమైన నాయికలు,శరదృతువు  నాయకుడు  పరిమళసంభరిత ప్రకాశములు పారిజాత వాటికలు  రససిద్ధిలో తేలియాడుచున్నారు ఎందరో సిద్ధులు  పండువెన్నెలగా తల్లి కరుణ పిండారబోసిన  వెండి ప్రాకారములో నేను వెండి-వెండి మురియు వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.  " శాంకరి-శ్రీకరి-సాధ్వి-శరత్ చంద్ర నిభాననా" అని శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రము కీర్తించుచున్నది.తల్లి ఆదేశానుసారముగా సహశ్రీ-సహస్యశ్రీ సమేత శరదృతునాయకుడు చల్లనైన-తెల్లనైన వెన్నెలలతో మనకు ఆహ్లాదమునందిస్తున్నాడు.పారిజాత వాటిక పరిమళ భరితమై తల్లి మహాత్మ్యమును చెప్పకనే చెప్పుచున్నది.  శరన్నవరాత్రులలో తల్లికి జరుపు పూజలు అసురసంహారము చేసి నెలకొలిపిన ప్రశాంతతయే సత్వగుణ ప్రకాశితమైన తెల్లనైన చల్లదనము.ఆ వెన్నెలలో అమృత స్నానము చేస్తూ ఎందరో...

SAUNDARYA LAHARI-100

 సౌందర్య-పంచలోహ ప్రాకారము  పరమ పావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  ఇనుము-కంచు-రాగి-సీస-ఇత్తడి ప్రాకారములను దాటి  వసంత-గ్రీష్మ-వర్ష ఋతువుల సగభాగమును దాటి  ఇషలక్ష్మి-ఊర్జ లక్ష్మి శక్తులు గల శరత్తుతో  సృష్టి-స్థిలి-లయ-తిరోధాన-అను గ్రహాదులతో  భక్త మందార మనోసంకల్పిత మందారవాటికల  పంచలోహ ప్రాకారమున  నేను సంచరించుచున్న వేళ  నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.  " పంచమీ -పంచ భూతేశి,పంచ సంఖ్యోపచారిణి" సంకల్ప నిర్మిత,పంచమ-పంచలోహ ప్రాకారము,ఇషలక్ష్మీ-ఊర్జలక్ష్మీ సమేత శరదృతు నాయక చంద్రికాపాలితమై ,ప్రకాశిస్తూ ఉంటుంది.    నీ పాదకమల సేవయు    నీ పాదార్చకులతోడి నెయ్యమును,నితాం    తాపార భూత దయయును    తాపస మందార నాకు దయసేయగదే. (సహజకవి బమ్మెర పోతన)     తాపస మందార-సేవక మందార-భక్త మందార అను పదములను మనము తరచుగ వింటూనే ఉంటాము.మందార  శబ్దము పుష్పజాతినే కాక,కొండజాతి,జలజాతి,వనజాతులను త...

SAUNDARYA LAHARI-99

  సౌందర్య లహరి-ఇత్తడి ప్రాకారము  పరమపావనమైన  నీపాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  అతిమనోహరము ఐదవ హారకూట ప్రాకారము  అగుపించును హరిచందన వాటికల హర్షాతిరేకము  మేఘదంతి- మదవిహ్వల-వాయుధారాది ద్వాదశ శక్తులకు  నభశ్రీ-నభస్యశ్రీ ల నాయకుడు మేఘవాహనుడు  పింగళ నయనములతో, వజ్ర సదృశ గర్జనలతో  కుండపోత వర్షములను మెండుగ కురిపిస్తున్నాడు  సిద్ధులు తమ సతులతో హర్షముతో నున్నారు  ఇత్తడి ప్రాకారములో నేను  చిత్తడి అగుగుచున్న  వేళ  నీమ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా  మానసవిహారి! ఓ సౌందర్య లహరి.  దయార్ద్ర-నిష్కళంక- నిర్విరామ అమృతాధారా ప్రవాహ మయము, ఏడు యోజనముల విస్తీర్ణముగల ఇత్తడి ప్రాకారము.స్థలము-సమయము-సందర్భములను గమనిస్తూ,మేఘవాహనుడు (శ్రావణ-భాద్రపదములైన) నభశ్రీ-నభస్య శ్రీ అను తన రాణులతో పాటు ,సర్వస్య-రస్య మాలిని-నితంతి-భ్రమయంతి-వర్షయంతి-వారిధార-మేఘయంతిక -వారిధార-చిపుణిక-మదవిహ్వల అను శక్తులను కూడి,తల్లి సంకేతానుసారముగా( నిమిత్తమాత్రుడై) వర్షిస్తూ.బాధాతప్త హృదయాలకు చలివేంద్రమై వర్షిస్తుంట...

SAUNDARYALAHARI-98

 సౌందర్య లహరి-సీస ప్రాకారము  పరమపావనమైనది  నీపాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  ఊహాతీత విభవమైనది సీసప్రాకారము  అతిమనోహము మనసుకు ఆహ్లాదకరము  సౌరభ సంభరిత  సంతాన వృక్ష వాటికలు  సిద్ధులు-యోగులు అచట సంతత తపోధనులు  జ్యేష్ఠ-ఆషాఢముల నాయకుడు  గ్రీష్ముడు  శుక్రశ్రీ-శుచిశ్రీలతో కొలువుతీరి ఉన్నాడు  శ్రీమాత  సంకల్పిత  శ్రీకర దర్శనములతో  సీసప్రాకారపు ప్రవేశము అమ్మ ఆశీస్సులైనవేళ  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.  సీస ప్రాకారము సప్తయోజన విస్తీర్ణముతో,మథుర రస ఫలములు గల సంతానవాటికతో శోభిల్లుతుంటుంది.గ్రీష్మ నాయకుని భార్యలైన (జ్యేష్ఠ-ఆషాఢ మాసములు) శుక్రశ్రీ-శుచిశ్రీలు సంసార తాప ఉపశమనమునకై  సంసారవాటిక తరుమూలములలో సేదతీరుతుంటారు.అచ్చటి ప్రాణులు చల్లని నీరు త్రాగుతుంటారు.లెక్కించలేనంతగా నున్న అమరులు-సిద్ధులు-యోగినీ యోగులు తల్లిని సేవిస్తుంటారు.గ్రీష్మ తాపమును తగ్గించుకొనుటకై నవ విలాసినులు శరీరమునకు  సుగంధమును పూసుకొని,పరిమళ పుష్పమాలలను అలంక...

SAUNDARYALAHARI-97

 సౌందర్య లహరి-రాగి ప్రాకారము  పరమపావనమైన  నీపాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము   ఏడు యోజనముల చతురస్ర ప్రాకారములతో   పది యోజనముల పరిమళ కల్పక వనములతో   బంగారు ఆకులతో-రత్నాల ఫలములతో   వజ్రాల విత్తులతో  రమణీయ ప్రకృతితో   మథుర మథువు సేవిస్తూ మదనమోహముతో   గంధర్వుల తమకపు  గాఢాలింగనలతో   మందస్మిత వదనలు మథుశ్రీ-మాధవశ్రీ ల గూడి   చైత్ర-వైశాఖముల వసంతుడు చెలువముతో నుండగా   సారసదళనేత్రి సంకల్పిత సరసరస మనోజ్ఞమైన   రాగిప్రాకారములోనికి నే సాగిపోవుచున్న వేళ  నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి  చదరపు ఆకారములో సప్తయోజన విస్తీర్ణ గోడలతో రాగి ప్రాకారము ప్రకాశిస్తుంటుంది.కల్పక వృక్ష వాటికలు బంగారు ఆకులతో,రతనాల పండ్లతో,వజ్రాల గింజలతో అమృత మధువును స్రవిస్తూ,పది యోజనములకు వరకు పరిమళములను వ్యాపింప చేస్తుంటాయి.గాన ప్రియులైన గంధర్వ యువతీ-యువకులు మధువును సేవిస్తూ,మదన పరవశులై ఉంటారు.అందులో పుష్ప బాణుడు పువ్వుల గొడుగు క్రింద,పువ్వుల సింహాసనముపై ,పువ్వుల...

SAUMDARYA LAHARI-96

   సౌందర్య లహరి-కంచు ప్రాకారము  పరమపావనమైన నీపాదరజ కణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  ఇనుప ప్రాకారమును ఇనుమడించు కాంతితో  సుగంధ పుష్ప తావులు-సుమధుర ఫల తరువులు  వృక్షములకు జలమునీయ అసంఖ్యాక కూపములు  పక్షుల కూజిత రవములు ఎన్నో శుభలక్షణములు  హంసలు-నెమళ్ళు,సీతాకోక చిలుకలు  ప్రశాంత వాతావరణపు సొగసు పులకరింతలు   హరిణీ సమూహముల బిత్తరిగంతులతో,హరిణేక్షణ  కంచు ప్రాకారము అచ్చెరువులో ముంచెత్తుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.          అతి ఎత్తైన కంచులోహ ప్రాకారములు అమ్మ అపారకృపావీక్షణమునకు నిలువెత్తు నిదర్శనములు.పనస-శింశుప-దేవదారు- లవంగ-పాటల-దాడిమి-చందన మొదలైన అచ్చమైన పచ్చదనపు వృక్షాల( అసలు ఎండుటాకు కానరాదు) హరిత ప్రకాశము జగన్మాత స్థితికారకత్వము ,వాటి సుమనోహర పరిమళము వ్యాపించిన ఆశ్రిత వాత్సల్యమేమో .పరాత్పరికి ప్రణామములు చేస్తున్నవా అన్నట్లు చిలుకల-గోరువంకల మైత్రి,పావురముల ప్రశాంతత-రాజ హంసల రమణీయత పరుగుతీస్తున్న కాలమును సూచిస్తూ పరుగులు తీస...

SAUNDARYALAHARI-95

Image
సౌందర్య లహరి-ఇనుప ప్రాకారము    పరమ పావనమైన  నీ  పాదరజకణము    పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము    ఏడు యోజనముల  విస్తీర్ణము నానా శస్త్ర రక్షకులతో    చెవులుచిల్లులు పడేటంత గుఱ్ఱపు సకిలింతలతో    సుధాసాగర మధ్యమున  నవనవోన్మేషముగా    సర్వేశ్వరి  సంకల్పిత సర్వలోక ద్వారములలో    లెక్కించలేనంతగ క్రిక్కిరిసిన భక్తులను    అడ్డగించుచున్న ద్వారపాలకులను దాటుతు    ఏ నోము ఫలితమో ఇది ఏపూర్వ పుణ్యమో    అయోమయ ప్రాకారములోనికి అడుగులు తడబడుచున్న వేళ   నీ మ్రోలనే నున్న  నాకేలు విడనాడకమ్మా,నా   నా మానస విహరి ఓ సౌందర్య లహరి.  మణిద్వీపమునకు నాలుగు వైపుల అమృత సాగరముంటుంది.సాగరతీరములో దక్షిణావర్త శంఖములు-రతనాల ఇసుక ప్రదేశములు-రత్మ వృక్ష వాటికలతో,అమ్మ సందర్శనమునకై చిన్న పడవలతో వచ్చుచున్న భక్తులతో కళకళలాడుతుంటుంది.అంతేకాదు మొదటి ప్రాకారమైన ఇనుప ప్రాకారము నాలుగు ద్వారములలో కిక్కిరిసిన దేవ,యక్ష,కిన్నెర,కింపురుషాదులతో,నిలిపిన వారి ఆయుధ...

SAUNDARYA LAHARI-94

 సౌందర్య లహరి-మణిద్వీప   ఉపోద్ఘాతము   పరమపావనమైన  నీ పాదరజకణము   పతిత పాలకమైనపరమాత్మ స్వరూపము   మథుకైటభ విధ్వంసములకు భయపడినవాడు    తామరతూడు క్రిందకు జారి దాగినాడు (బ్రహ్మ)   అది తామరసదళనేత్రుని నాభియని గ్రహియించె   నానా సంశయములను తల్లి తొలగించ దలచె   దివ్య విమానమును పంపి త్రిమూర్తులను దీవించె   సప్త  అథోలోకములను-సప్త ఊర్థ్వ లోకములను దాటి   సాక్షాత్ సర్వేశ్వరి దయతో సాగుచున్న వారికి   సందర్శనమైనది సర్వలోకము అన్న సత్యము తెలిసిన వేళ   నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి ! సౌందర్య లహరి.    బ్రహ్మాండములకు గొడుగైన మణిద్వీపమునకు వందనం    మణిద్వీప వాసిని మూల ప్రకృతికి వందనం."     జగన్మాత నీ లీలలను తెలిసికొనలేని మాయామోహితులైనారు త్రిమూర్తులు.ఇక మేమెంత? తల్లి నిర్హేతుక కృపాకటాక్షమునకు నిజ నిదర్శనము సంకల్పమాత్ర సర్వలోకము మన.మనో-వాక్కాయ-నమస్సులను స్వీకరించి,అనుగ్రహ ఆవిష్కారమే మణిద్వీప సందర్శనము.  ...

SAUNDARYA LAHARI-93

 సౌందర్య లహరి-సరస్వతీదేవి  పరమపాబనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  అమృత- ఆకర్షిణి-ఇంద్రాణి-ఈశాని-ఉషకేశాది  పదహారు  అక్షరములు విశుద్ధ పద్మ రేకులు  తక్కిన అక్షరములు వివిధ చక్రములలో రేకులు  హ్రస్వ-దీర్ఘ-ప్లుతములు,ఉదాత్త-అనుదాత్త స్వరములు  నాసిక-నిరనునాసిక విధానముతో పద్దెనిమిది భాగములు  సంగీత  స్వర ప్రస్థానములు,సారస్వత రూపములు  మాయాసతి కుడిచేయి మారినది  శైవీముఖముగా  సర్వజ్ఞ పీఠ సరస్వతి సాహిత్యరూపమైన  వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.   " జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ     మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ"    " కశ్మీరేతు సరస్వతి". క శబ్దము శిరస్సును సూచిస్తుంది.కశ్మీరము జ్ఞానప్రధాన కేంద్రము.ఇక్కడిది సర్వజ్ఞపీఠము. ఏ ప్రదేశమునుండి పండితులు ఇక్కడకు వచ్చి విజయము సాధిస్తారో ఆ వైపు ద్వారము తెరువబడేదట. ఆదిశంకరులు తమ ప్రతిభచే అప్పటివరకు తెరువని దక్షిణ ద్వారమును తెరిచారట.కశ్మీరమును శైవీ ...

SAUNDARYA LAHARI-92

 సౌందర్య లహరి-వైష్ణోదేవి  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  మహాశక్తి వెలిసినది ఊర్థ్వభాగపు శిలగా  ముగురమ్మలు నెలకొనిరి అథోభాగ శిలగా  ఏనుగు దంతాకారము  లక్ష్మీ సంకేతము  త్రిజగములబ్రోచుతల్లి  త్రికూటాచలము  హంసవిల్లి-బాణగంగ-పాదుకాతీర్థములు-  ఆదికుమారి-కోల్ కండోలి మా-సేవా పరమార్థములు  మాయాసతి శిరోభాగము మహిమాన్విత జ్వలనముగా  వైష్ణవీదేవి  కరుణ మనలను పిలుచుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.  " అధాత: సంప్రవక్ష్యామి కుమారీ కవచం శుభం     త్రైలోక్య మంగళం నామ మహాపాతక నాశనం."     శ్రీధరుని కరుణించిన కౌమారిదేవి అతనికి దర్శనమిచ్చి,అన్న సంతర్పణమును చేయమని కోరినది.పేదరికముతో స్నేహముచేయు అతడు అమ్మ మాటలకు విస్తుపోయి,తల్లి ఆనను శిరసావహించి,అన్న సంతర్పణకు ఊరిజనమునందరిని ఆహ్వానించి,ధ్యానమగ్నుడాయెను.అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లేకదా.భావనా మాత్రముచేతనే బహుపదార్థములు ప్రత్యక్షమాయెను.పంక్తి భోజనమును కౌమారి మాతృ...

SAUNDARYA-VISAALAAKSHI

 సౌందర్య లహరి-విశాలాక్షి  పరమపావనమైన నీపాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  ఆదిదంపతుల నివాసము ఆనంద కాననము  సర్వ క్షేత్ర సమగ్రము- సాక్షాత్ మోక్ష ప్రదము  వారణ-అసి నదుల సంగమ అవిముక్త క్షేత్రము  అహంకారి వ్యాసునికి అందించినది  బహిష్కరణము  అర్థనారీశ్వర  ప్రకాశముతో  ఆధ్యాత్మిక మైనది కాశి  "అహం కాశి గమిష్యామి" అనగానే నిలువెత్తు పుణ్యరాశి   మాయాసతి మణికర్ణిక పడినచోటు  మహామోక్షపురములో   సదా షోడశి విశాలాక్షి  నన్ను సంస్కరించుచున్న వేళ   నీమ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి.  " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం    విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా    సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం    వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ    అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః    త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."    గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్...

SAUNDARYA LAHARI-90

 సౌందర్య లహరి-మాంగల్య గౌరి   పరమ పావనమైన నీ పాదరజకణము   పతిత  పాలకమైన   పరమాత్మ స్వరూపము   ఆకలి-దప్పిక  తీర్చును  అమ్మవారి  గోపురములు   పురాణ ప్రవచిత  అమృత శిలా రూపములు   సుదర్శన చక్ర పునీతములు- గయుని  అవయములు   యాగ వాటికలు తారుమారైనవి అవి గయా వాటికలు   శ్రాద్ధ కర్మలకు ప్రసిద్ధము ఇచట సంతృప్తులు పెద్దలు   స్థితికార్య నిర్వాహకురాలికి పూజలు వైభవోపేతములు   మాయా సతి స్తనములు పడిన  పాలనా పీఠములో   దయయే ధర్మమైనగౌరి  తనకరమందించుచుండగా   నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి.  " గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే    పితౄణాంచ సకర్తౄణాం దేవి సద్గుణదాయిని    త్రిశక్తిరూపిణీ మాతా సచ్చిదానందరూపిణి    మహ్యం భవతు సుప్రీతా  గయా  మాంగళ్య గౌరికా"       " గయ" అను శబ్దమునకు అనేక మూలములు కలది అను అర్థము కలదు.విష్ణువుచే ఖండించబడిన గయుని శరీరపు ముక్కలు అనేకములు ఈ పవిత్ర క్షేత...

SAUNDARYALAHARI-89

 సౌందర్య లహరి-విరజాదేవి  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  రంబుడు-కరంబుడు కశ్యప-దనదేవి కుమారులు  కఠిన తపము చేసిరి శివుని, కోరి సంతానము అతిబలులు  పంచాగ్నుల మధ్యమున -జలదిగ్బంధనమున వారి తపము  మహేంద్రుని చేతిలో  కరంబుని కథ సమాప్తము  అగ్నివరము పొందినాడు అచంచల తపమున రంబుడు  హద్దుమీరి అమ్మ చేత  అంతమొందినాడు వాని సుతుడు  మాయా సతి నాభిభాగము పడినది జాజ్ పురములోన  గిరిజాసతి  చల్లదనము  నన్ను  చూచుచున్న  వేళ  నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి !  ఓ సౌందర్య లహరి.  " ఓఢ్యాణే గిరిజాదేవి పితృర్చన ఫలప్రదా    బిరజ పరా పర్యాయస్థిత వైతరిణితటే   త్రిశక్తీనాం స్వరూపాచ లోకత్రాణ పరాయణా    నిత్యం భవతు సాదేవి వరదా కులవర్ధని."  .విరజ అనగా శుభ్రపరచు అను అర్థమును అన్వయించుకుంటే మన పాపములను శుభ్రపరచుచు మనలను పునీతులను చేయు తల్లికనుక విరజాదేవి అని పూజిస్తారు.ఆర్యా స్తోత్ర ప్రకారము ఉత్కళరాజ్యస్థులు...

SAUNDARYA LAHARI-88

  సౌందర్య లహరి-మాధవేశ్వరి  పరమ పావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  గంగ-యమున-సరస్వతి  త్రివేణి సంగమము  ఇడ-పింగళ-సుషుమ్న ల నాడీ సంకేతము  అమృతబిందువులు పడిన అమృత తీర్థరాజము  అలోపిగ-అరూపిగ అమ్మ ఇచట ఆరాధ్యము  మాయాసతి చేతివేళ్ళు పడిన చివరి ప్రదేశము  కొయ్య స్తంభమున తల్లి కొలిచిన కొంగు బంగారము  ప్రకృష్ట యాగ వాటికయైన పవిత్ర ప్రయాగలో  మాణిక్యేశ్వరుని దేవి మాధవేశ్వరి బ్రోచుచున్నవేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానసవిహారి ! ఓ సౌందర్య లహరి .    " త్రివేణి సంగమోద్భూత త్రిశక్తీనాం  సమాహృతి     ప్రజాపతి కృతాశేష యుగమారాభివందితా     బృహస్పతి కరాంతస్థ పీయూష పరిసేవితా     ప్రయాగే  మాధవీదేవి సదాపాయాత్ శుభాకృతీ"   అమ్మతత్త్వము సాకారము-నిరాకారము,సద్గుణము-నిర్గుణము.నిరంజనము-నిత్యము.తన లీలా విశేషముగా అమ్మ సాక్షాత్కరించి వెంటనే అంతర్ధానమయినదట.ఒక కొయ్య  స్థంభములో మాత తన శక్తిని నిక్షిప్తపరచినదని భావిస్తారు.కొందరు విశాలమైన ...

SAUNDARYA-LAHARI-87

 సౌందర్య లహరి-కామాఖ్యాదేవి  పరమపావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  బ్రహ్మపుత్ర నది ఒడ్డున బ్రహ్మాడనాయకి  భూగర్భ జలములోని సహజ నీటిబుగ్గ రూపు  దశమహా విద్యలు-మహా భైరవశక్తులు కొలుచుచుండు  కొలిచిన దేవతలకు వరముగ ఖేచరత్వమిచ్చుచుండు  దక్షిణ-వామాచారములతో పూజించు గారోలు  రజస్వల అగు తల్లికి అంబువాషి ఉత్సవాలు  మాయాసతి యోని పడిన నారాయణ నీలాచలమున   కామాఖ్యా దేవి మన కామితార్థములిచ్చుచున్నవేళ  నీ మ్రోలనే నున్న నా  కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.     " కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని     కామస్య సర్వదే మాత మాతృసప్తక సేవితే     జామదగ్నస్య రామస్య మాతృహత్యా విమోచని     పంచ శంకర సంస్థాన భక్తపాలన తత్పరా     కళ్యాణదాయిని మాతా విప్రదర్శన నర్తనా     హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా  భవసర్వదా."    యోని అను పదమునకు కారణము అని అర్థము.తరువాతి కాలములో జననాంగముగా ప్రచారములో...

SAUNDARYA LAHARI=86

Image
  సౌందర్య లహరి-భ్రమరాంబ  పరమ పావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  సుఖ బీజము శ కారము-అగ్ని బీజము ర కారము  ఛిఛ్ఛక్తి స్వరూపమే  చిదానంద శ్రీకారము  పాల ధార-పంచ ధార స్వామి లీలా విశేషములు  చల్లనైన  సాంబయ్యది  తెల్ల మద్ది వృక్షరూపము  అరుణాసుర  సంహారమునకు సరియైన తరుణమని  బ్రహ్మ వరము గౌరవించి షట్పదమైనది తల్లి  మాయా సతి మెడ భాగము మహిమాన్విత మూర్తిగా,  శ్రీ శైల శిఖరం దృష్ట్వా  పునర్జన్మ న లభ్యతే" అను వేళ  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.   " శివ పార్శ్వావస్థిత మాతే శ్రీశైలే శుభపీఠికే   భ్రమరాంబిక మహాదేవి కరుణారస వీక్షణ"   శ్రీశైలమునకు సిరిగిరి,శ్రీగిరి,శ్రీ పర్వతము మొదలైన నామాంతరములున్నవి.శ్రీ అనగా సంపద. శైలము అనగా పర్వతము."శ్రీశైలము" అనగా సంపద్వంతమైన పర్వతము.దీనికి శ్రీ కైలాసము అనుపేరు కూడా వ్యవహారములో కలదు.మహేశ్వరులు శ్రీ కైలాసమునందున్నారని 13 వ శతాబ్దపు శాసనము తెలియచేయుచున్నది ...

SAUNDARYALAHARI-85

సౌందర్య లహరి-మణిక్యాంబ-81 పరమపావనమైన నీపాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము తుండి-నాట్య గణపతులు ఉండగ ద్వారములముందు యోగినిగా అమ్మవారు-భోగముతో శంకరులు దక్షుని నిరీశ్వర యాగమును కటాక్షమున సంస్కరించి పంచభూత సమతౌల్యమైన పంచారామము చేసిరి భీమేశ్వరునికి నిత్య సూర్యకిరణాభిషేకములు చల్లబరచగ సాగును గోదావరి ఏడుపాయలుగ మాయాసతి ఎడమబుగ్గ మహిమాన్విత దక్ష వాటికగా మాణిక్యాంబ మాతృత్వముతో మనలను బ్రోచువేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి. " ద్రక్షావతి స్థితశక్తి విఖ్యాత మాణిక్యాంబికా వరదా శుభదా దేవి భక్త మోక్ష ప్రదాయిని." పంచభూతములు సమతౌల్యమును పాటించు పవిత్ర ప్రదేశము " ఆరామము." అమరా రామము,ఖీరా రామము,సోమారామము,భీమారామము,దక్షారామము పంచారామములు..ఆరామము అనగా అతిమనోహరము అను అర్థము కూడాకలదు పార్వతీ పరమేశ్వరులు కైలాసము నుండి,కాశికి ,కాశి నుండి దక్షారామమునకు విచ్చేశారని స్థలపురాణము చెప్పుచున్నది.దక్షుడు నిరీశ్వర యాగము చేసిన ప్రదేశము తిరిగి భీమేశ్వరునిచే సంస్కరించబడినది కనుక దక్షారామము అని పేరు వచ్చినదని చెబుతారు.దక్షప్రజాపతి పుత్రిక దాక్షాయణ...

SAUNDARYA LAHARI-84

 సౌందర్య లహరి-పురుహూతికాదేవి  పరమ పావనమైన నీపాద రజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  వృతాసురుని వధించిన పాతక పరిహారమునకు  పురుహూతుడు చేసెను కఠినమైన తపస్సు  ప్రసన్నమైనది తల్లి-పురుహూతికగ మారినది  పవిత్రుడైనాడు గయుడు విష్ణువర ప్రభావమున  హవిస్సులను ఆపినాడు-విచక్షణను వీడినాడు  గయుని యజ్ఞవేదికగా కోరిరి శివకేశవులు  మాయాసతి పీఠము మహిమాన్వితమైనది పిఠాపురము  పాదగయలో నా పాదము పావనమగుచున్నవేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.     "పురుహూత సతి మాత పీఠికాపురు సంస్థిత      పుత్రవాత్సల్యతా దేవి భక్తానుగ్రకారిణి"     రాక్షసరాజైన గయుడు విష్ణుభక్తుడు.ఘోరతపముచేసి విష్ణువుని ప్రసన్నముచేసుకొనెను.తన శరీరము ఆపాదమస్తకము సకల తీర్థక్షేత్రములకన్న అతి పవిత్రము కావించమని వరమును ప్రసాదించమని కోరి,అతి పవిత్రుడయ్యెను.ఆ వర ప్రభావముచే పంచమహా పాతకములు గయుని శరీరస్పర్శచే పటాపంచలయేవి.సకలచరాచరములు గయశరీర స్పర్శచే ముక్తిని పొందెడివి.పుణ్యఫల...

SAUNDARYA LAHARI-KALI-83

Image
  సౌందర్య లహరి-మహాకాళి   పరమ పావనమైన  నీ పాదరజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   క్షిప్ర నదీతీరమున నెలకొనె- క్షిప్ర దయా స్వభావము   కాలాతీతురాలు  కాళి- ప్రళయ రౌద్ర స్వరూపము   సాందీపని-విక్రముడు-కాళిదాసాదు లను బ్రోచిన   సకల విద్యాప్రదానము హరసిద్ధిమాతా క్షేత్రము   మన తమస్సు తాకెనమ్మ తల్లికి నల్లని రూపిక   క్రిందకు సాగిన నాలుక తల్లి నిత్యత్వపు ప్రతీక   మాయాసతి పైపలువరుస  మహాకాల మూర్తిగా   తేజోమయమై నా కుజదోషమును తొలగించు వేళ   నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి  ! ఓ సౌందర్య లహరి.   "ఉజ్జయిన్యాం  మహాకాళి మహా కాళేశ్వరేశ్వరి    క్షిప్రతిరస్థిత మాతా వాంచితార్థ ప్రదాయిని"   కాలము అనగా తరిగిపోవునది.మింగివేయునది."కలయతీతి కాళి" కాలములోనున్న అఖండశక్తియే కాళిక.కలయతి నియతి కాళి అని కూడా అంటారు.కాలగతిని నడిపించునది.అయ్యవారు మహాకాళుడు.అమ్మవారు మహా కాళీ.లింగభేదమును పరిగణనలోనికి తీసుకోకుంటే కాలము/సమయమే కాళి.వస్తువుల ప...