Tuesday, November 30, 2021
TIRUNALAI POVAR NAYANAR
" నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!"
తిరునాలైపోవార్ నాయనారు
**********************
తిరునాలై -మరుసటిరోజు
పోవర్-శివదర్శనమునకు పోవుచున్నాను అని భావించెడివాడు.
తనకు చిదంబర నటరాజ దర్శనమునకు తనకున్న ఆర్థిక పరిస్థితి,అసమాన కుల స్థితి అవరోధనమును కలిగించునని తెలిసి నప్పటికి,సదాశివునికరుణపైగల నమ్మకము నందనారును మరుసటిరోజు తాను శివదర్శనమును చేయగలనన్న నమకముగా మారినది.
నంది తలను పక్కకు జరిపించిన మహనీయుడు కనుక నందనారుగా ప్రసిధ్ధిని పొందెను.
ఆదనూరు మురికివాదలో చెప్పులుకుట్టే వంసమునందు జన్మించిన నాయనారు తనకు జన్మతః లభించిన కళతోచెప్పులను మాత్రమే కాక డమరు-మద్దెల మొదలగు చర్మవాతిద్యములను అయంతభక్తితో తాయారుచేసి స్వామిసేవకు సమ్ర్పిమచేవాడు.
****
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
తిరునాలై పోవార్ నాయనారు తిరిపమెత్తువాని భక్తుడు
"గీతం సమర్పయామి" అంటు సంగీత సామాగ్రినిచ్చెడివాడు
తిరువంకూరల్ శివదర్శనమునకు అడ్డమైనది నందివాహనము
శిరముని వంచి ఆదర్శమైనది విడ్డూరముగ నందనారుకు
తిరునాలైపోవార్ అనగా రేపువెళ్ళువాడు అని అర్థము
శివయానై వెళ్ళెను చిదంబరమునకు కనకమహాసభ దర్శనార్థము
చిన్నకులమువాడన్న వాదును చెరిపెను,శివ కులములోనికి చేర్చెను
అగ్నినేత్రుని జ్యోతిగ కొలువగ అగ్నిస్నానమె కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
**********
కులము వ్యాకులమునకు కారనమగుట శోచనీయము.
కులము అనే పదమునకు నాలుగుగా పనిని బట్టి విభజించిన విభాగము గాను,సమూహముగాను మనము అన్వయించుకుంటే మహాశివుడు అన్ని విభాగములలోను,అన్ని విభాగ సమూహములలోను స్థూల-సూక్ష్మ రూపములలో నిండియున్నాడనుటకు నిదర్శనమే కదా
పరమ భక్తాగ్రేసర నందనారు పుణ్య చరితము.విచక్షణ మరచిన పెద్దలు అంటరానితనమను ముద్రను తగిలించినను, తగవులాడక, అనేక శివ క్షేత్రములను తన్మయత్వముతో దర్శించుచు,"శిశుర్వేత్తి-పశుర్వేత్తి-వేత్తి గానరసం ఫణిః" అను శ్రుతిని అనుసరించి,తన స్వామిని ఆరాధిస్తున్న నాగులకువానిని ఆదరిస్తున్న స్వామికి సంగీతము ఎంతోఇష్టమైనది కావున దేవళములలో భేరి-మృదంగము-వీణ తీగెలు మొదలగు సంగీతోపకరణములను సమర్పించి పులకించిపోయే వాడు.
చిక్కబడ్డ భక్తి చక్కదనమును తెలియచేయాలనుకున్నాడు ముక్కంటి.
తిరువంకూరులోని స్వామి దర్శనాభిలాషను కలిగించాడు నాయనారుకు."విఘ్నేశ్వరును పెళ్ళికి అన్నీ విఘ్నాలే" అన్నట్లు స్వామిని చూడాలంటే నంది అడ్డముగా నిలిచినది. పరితప్తుడైన తన భక్తుని ధ్యానమునకు మెచ్చి,క్షిప్త ప్రసాదుడైన (త్వరగా అనుగ్రహించేవాడు) స్వామి పరీక్ష చాలనుకొని,నందిని కొంత పక్కకు తొలగమన్నాడు.తన సర్వస్యమైన స్వామి ఆనను,అనుగ్రహముగా భావించి,కొంచము పక్కకు వంగినది నంది వాహనము. నంది వంగుటకు కారణమైన తిరునాలై నందనారుగా ప్రసిద్ధికెక్కాడు
.ఓం నమః శివాయ.
కాలాతీతుడైన శివుడు కాల చక్రమునుతో తోడుగా కోరికలను చట్రములను బిగించి తిప్పుతుంటాడు.అదే జరిగింది మన నందనారు విషయములో." సంఙా రంభ విజృంభితుడు " ఆ సదా శివుడు.కనకమహా సభలో నాట్యమును చూడాలనే కోరిక బలీయము కాసాగింది నాయనారుకు.కులవ్యవస్థ అంతరార్థమును తెలియని అపార్థము పడగ విప్పింది .నందనారు అడుగులను కదలనీయలేదు.తిల్లై బ్రాహ్మణ వర్గముగా మారి వీల్లేదంది.ఘటనాఘటన సమర్థుడు అగ్ని నేత్రుడు నందనారును అగ్ని పునీతునిగా అనుగ్రహించ దలిచాడు.
అగ్ని ప్రవేశమును చేసిన నందనారుని విభూతి రేఖలతో,యజ్ఞోపవీతముతో,జుట్టు ముడితో ,వినూత్న తేజవంతుని గా ఆశీర్వదించిన ఆ సుందరేశ్వరుడు మనలనందరిని పునీతులుగా చేయుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)
Monday, November 29, 2021
PUGAL CHOLA NAYANAR
పుగల్ చోళ నాయనార్
********************
కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరిమూటకట్టుకుని బోవంజాలిరే భూమిపై
పేరైనం గలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశః కాములై
ఈరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా
పోతనామాత్యుడు
పుగల్ -ప్రభువు/పెంపొందించు స్వభావము కలవాడు.
చోలన్-చోలరాజ్యమ్ను పెంపొందించి/పాలించు స్వభావము కలవాడు.
సమర్థవంత రాజ్యపాలన వృత్తి.
సదాశివార్చన ప్రవృత్తి.
ఎరిపత్త నాయనారు అభిరామి ఆండారును పై దూకి,నెట్టి,కిందపడవేసినందుకు వచ్చి,క్షమాపణలను చెప్పిన రాజుగా భావిస్తారు.
ఉరైయూరును రాజధానిగా చేసుకుని,ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ,పశుపతీశ్వరుని సేవిస్తూ
పరమానందముగా కాలమును గడుపుచున్నవేళ,
తలపున యైనను శివభక్తులకు చెడును తలపెట్టని నాయనారుకు విషమ పరీక్షను పెట్టదలచాడు.
" పరమం పవిత్రం సాంబం విభూతిం
పరమ విచిత్రం లీలా విభూతిం
పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం
సాంబం విభూతిం ఇదమాశ్రయామి.
విభూతి అనగా ఐశ్వర్యము/మహిమ/కరుణ అను అర్థమును కనుక మనము భావించుకుంటే,"
వి-విశేషమైన-భూతి/బూది-అనుగ్రహమును ఉపకరనముగా మలచుకున్నాడు.
రుద్రాక్షమాలను జతచేసాడు.
నాయనారులోని రాజ్య విస్తరణ కాంక్షకు మరింత పెంచాడు రాజధర్మము అనుసరణీయము అంటూ.
ఒకరాజుకు కప్పము మీది ఆసక్తి/మరొక రాజుకు కప్పమును కట్టలేని స్థితి.
మెప్పుకోలుగా కప్పము అపరాధమును తప్పించుకోనీయకుండా చేసినది.
సామంతుడైన వాసల్ పై తన సేనను కట్టుదిట్టముగా ముట్టడించమని ఉత్తరువులు జారీచేయించింది.
ఏ మాత్రము అందులోని పరమార్థమును గ్రహించలేని మనసు,
చేతులారంగ శివపూజ చేయడేని
మోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యము లోనుగా తలపడేని,
అనుకుంటూ,పరమేశ్వరార్చనతో పరవశించి పోతున్నాడు.
అదే సమయమని భావించినట్లున్నాడు ఆదిదేవుడు,
జయము జయము మహారాజా,దిగ్విజయము అంటూ లోని ప్రవేశించాడు.
శత్రుశేషము లేకుండా చేసామన్నాడు.
అంతటితో సంభాషణము ఆగితే కథ మరొకలా ఉండేది.
జరుగవలసిన సన్నివేశమునకై జంగమదేవర సన్నధ్ధపడుతున్నాడు,వచ్చినవానిని పెడుతున్నాడు.
మహారాజా! మీకు మేమొక కానుకను సమర్పించదలచాము అంటూ,
ఒక విశాలమైన పళ్ళెములో శత్రుశిరమునుంచి తీసుకుని వచ్చాడు.
పరమ తేజోమయమై నుదుటను విబూది పుండ్రములతో,మెడలో రుద్రాక్ష మాలలతో అతి ప్రశాంతతను దశదిశలా వ్యాప్తిచేస్తున్నది.
శివునకు-శివభక్తునకు భేదము లేదను భావించు మహారాజు మతిపోయినది.
ఏమిటి ఈ విషమ పరీక్ష?
శివపదారాధనము ఒకవైపు
శివ శిరోఖండనము మరొకవైపు
నన్ను చూడు అంటే,నన్ను చూడమని ఒకటే పోరు పెడుతున్నవి.
ఒక వైపు అర్చన/మరొక వైపు దండన
పాపము-పుణ్యము పరిహసించసాగాయి పుగల్చోళను.
ప్రాయశ్చిత్తము కనుమరుగైనది స్వామి ఆనగా.
నిర్ఘాంతపోయాడు.
చేకొనుమాశిరము
నా పాపమును బాపగ గైకొనుమా శిరము
ముల్లును ముల్లుతో తీయునట్లు
శీరమునకు శిరమును అర్పించుటయే
తన పాపమునకు నిష్కృతి అనుకునేలా చేసాదు నాయనారును నీలకంఠుడు.
జాతవేదుని జాణతనము పళ్లెముగా మారినది.
వైశ్వానరుని పరీక్షగా అగ్నికుండము సిధ్ధమైనది సహకరిస్తూ
ఖండించిన శిరమును శిరోధార్యముగా భావిస్తూ,అగ్నికి ఆ శిరముతో జతగా తనశిరమును సమర్పించుటకు సిధ్ధమయి అగ్నికుండమునకు ప్రదక్షిణమును ప్రారంభించాదు.
దాక్షిణ్యపూరితుడు భక్త రక్షణాతత్పరుడు ప్రత్యక్షమయ్యాడు.కైవల్యమును ఇద్దరికి ప్రసాదించాడు.
పుగల్ చోలను కటాక్షించిన సదాశివుడు మనలనందరిని అనిశమురక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
KOTPULI NAYANARU
కోట్పులి నాయనారు
*********************
దృశ్యాదృశ్య విభూతి వాహనకరీబ్రహ్మాండ భాండోదరి
లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
తిరునాత్తియన్నగుడి లో వ్యవసాయ కుటుంబము నందు నాయనారు జన్మించెను.
చోలరాజునకు సైన్యాధ్యక్షత వృత్తి.
ధాన్యరాశులను దేవాలయములోని నైవేద్యమునకు,అన్న సంతర్పణములను అర్పించుట ప్రవృత్తి.
అన్నింటిని సరిగా సాగనీయడు కదా అన్నపూర్ణేశ్వరుడు.
భక్తి చేయు గమ్మత్తులను బాహ్యప్రపంచమునకు తెలియచేయాలనే సంకల్పముతో ఎన్నో చిత్ర-విచిత్రములను చేస్తుంటాడు.
భక్తినే ఆయుధముగా మలచి భక్తుని అరిషడ్వర్గములతో ఆడుకోమంటాడు.తాను వేడుక చూస్తుంటాడు.
ఇక్కడ అదే జరిగింది.వ్ర్త్తి-ప్రవృత్తిని రెండు పాచికలుగా మలచుకున్నాడు మహేశుడు.
కర్తవ్యపాలనము అంటూ నాయనారుకు ధాన్యము దేవాలయములలోని పంచే అవకాశమును తుంచివేశాడు.
రాజాజ్ఞగా ఊరువిడిచి పొరుగు దేశమునకు సైన్యముతో వెళ్ళవలసిన సందర్భమును సృష్టించాడు నాయనారును పరీక్షించుటకై వాని ఇష్టదైవమైన శివుడు.
ఒక పక్క కర్తవ్యము.మరొక పక్క కైంకర్యము.
రెండును తాను త్రికరముల సాక్షిగా పాటించవలసినవే.దేనికదే సాటి.కాదనలేని పోటి.
కావలిసిన కార్యమునకై ఏదో ఒక చిన్న పరిష్కారమును భక్తుని మదిలో కదిలింప చేస్తాడు కాలకంఠుడు.
కర్తవ్యమును తాను స్వీకరించి-కైనకర్య బాధ్యతను తన బంధువులకు అప్పచెప్పి కదిలాడు నాయనారు.
కోట్-పులి.
రౌద్రముగా/పరుషముగా నున్న పులి.వీరత్వ నిదర్శనము.
శత్రువులు తోకముడుచుకొని పారిపోయారు.
అక్కడ కథను సుఖాంతముగా నడిపిస్తున్న శివుడు,ఇక్కడ మాత్రము కలిని విజృంభింపచేశాడు.కరువు కాటకములు తమదైన బలముతో సర్వజనులను బలహీనము చేస్తున్నాయి.
కోట్పలి బంధువులకు సైతము ఏమీ మినహాయింపులేదు.
పాపము ఏమిచేయగలరు.
రుద్ర చమకములో చెప్పినట్లు వాజశ్చమే-
నాకు ఆహారము కావాలి,ఆహారముతో పాటుగా నీరు కూడా కావాలి కనుక,
అంబశ్చమే,అంటూ అన్నపాదాదులు రెండూ తానైన శివుడు,
అణువు-అణువు తానై-అడుగు-అడుగు తానై వాటిని అందనీయకుండా ,పొందికగా ప్రణాళికను నడిపిస్తున్నాడు.
అన్నోదక ప్రాణాలేమొ,
ఒక పక్క క్షామము-మరొక పక్క ధాన్యము రెండు,
ధర్మా-ధర్మ రూపములుగా గిరగిరా తిరుగుతూ వారిని అధర్మమైనా సరే,అన్న ప్రసాద వితరనకు వెళ్ళ వలసిన ధాన్యమును,తమ ఆహారముగా అనుకూలముగా మార్చుకొనేటట్లు చేసినది.నటరాజునకు కావలిసినది కూడా అదేకద.
పరమసంతోషముతో తిరిగివచ్చాడు కోట్పులి.దుర్భిక్షము తాను లక్షణముగా ఇక్కడే ఉన్నానని హెచ్చరిస్తూ,వెక్కిరించింది.
దేవాలయములలో అన్నసంతర్పణములు ఆగిపోయినవి.దేహాలయములు నిత్య నైవేద్యములు లేక నకనకలాడుతూ సాగలేకున్నవి.
కదిలాడు నాయనారు క్షామము గురించి తెలుసుకోవాలని,
కాదు కాదు కదిలించాడు నాయనారుని కాముని కాల్చినవాడు క్రోధపూరితునిగా మార్చ్తకు.
ఆట కదరా శివా-ఆటకదా కేశవా.
శివుని ఆనపై కిమ్మనకుండా ఉన్నాడు స్థితికర్త.
పరిస్థితిని మరింత దయనీయముగా కదిలిస్తూ,కరుణను వదిలేస్తూ,
అన్ని విషయములు అవగతమవసాగాయి కోట్పులికి.అదే అదనుగా పదునైన కోపము తన వంతుగా పరుగులు తీస్తూ వచ్చిచేరింది నాయనారు.
లయము చేయు వాని కరుణ మాయాజాలమై మానవతను సైతము మరుగున పడేటట్లు చేసింది.
తన బంధువులనందరిని సాకుతో తన దగ్గరకు రప్పించుకున్నాడు
కఠినత్వమునకు పరాకాష్ఠ యా యన్నట్లు ఆ అధర్మ ఆహారమును భుజించి,తమ పిల్లలకు చనుబాల నిచ్చిన బాలెంతలను సైతము జాలిలేక మట్టుపెట్టాలనుకున్నాడు.
వీతరాగుని చేతలను ప్రశ్నించేవారెవరు?
ఒకవేళ ప్రశ్నించినా వాటికి సమాధానమినిచ్చే సాహసము చేయగలవారెవరు?
కనీసము పరిహాసమునకైనను,
కడతేర్చేసాడు కనిపించినవారినందరిని క్షణములో.
నమో అఘోరేభ్యో-ఘోరాఘోర తరేభ్యః.
కన్నతల్లి మనసు కరుగకుండా ఉంటుందా.కదిలి వచ్చేసింది.
ధూర్జటి మహాకవి చెప్పినట్లు అగ్ని-మంచు అగు
అందరిని సజీవులని చేసింది.
అమ్మ తలుచుకుంటే కరువు కాలుముడుచుకోక తప్పుతుందా.
అంతే.ఎక్కడ చూసిన ధాన్యపురాశులు-అన్నమై -సుసంపన్నమై శోభిల్ల సాగినది.
నాయనారు భక్తిని నలుదిక్కులా వ్యాపింపచేసింది.నందివాహనుని కరుణను పదిమందికి తెలిసేలా చేసింది.
చనిపోయిన వారందరిని పునర్జీఉతులను చేసిన పరమేశుడు ,కోట్పులికి కైవల్యమును ప్రసాదించాడు.
కోట్పులిని అనుగ్రహించిన ఆది దంపతులు మనలనందరిని అనిసము రక్షించెదరు గాక.
ఏక బిల్వం శివార్పణం.
Friday, November 26, 2021
cheramaan naayanaar
చేరమాన్ నాయనార్
***************
" ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు"
ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన
మనసులో సంతసము కనుల జారు విధాన
కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ
ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ
ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.)
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు.
పెరుముక్కో అడయార్ నాయనార్ కేరల రాష్ట్రములోని చేర రాజ్య వంశములో జన్మించినప్పటికిని రాజ్యమును తృణప్రాయముగా నంచి,శివభక్తిని పెంపొందించుటకు తన జీవితమును అర్పింపదలచినాదు.
కాని శివుడు తన భక్తునకు ఎవ్వరి మనసులోని భావములను కాని,ఏ స్థలము-వస్తువు మొదలగు వాని స్వరూప-స్వభావములౌ చిటికెలో గ్రహించగల వరమును ప్రసాదించి,రాజ్యాభిషిక్తుని చేసెను.
ఎవరి మనౌలోని భావములనైన గ్రహించగల శక్తిమంతుడు కనుక పెరుముక్కూ అడయర్ గా ప్రైధ్ధిని పొందెను.
రాజ్యము వీర భోజ్యము అన్నది ఆర్యోక్తి.బలపరాక్రమములు-కళరిర్-దయాదాక్షిణ్యములు కల నాయనారును,
కళరిర్-అరివర్ గా కీర్తింపబడుచున్నాడు.
చేరరాజ్య ప్రభువు కనుక చేరమాన్ నాయనారుగాను ఖ్యాతికెక్కినాడు.
సగౌరవ సూచకముగా చేరమాన్ నాయనార్ గజారోహుడై నగరవెధులలో,ఇరుపక్కల శాంతిహిహ్నములుగా సత్వగుణ శోభితుని తెల్లనివింజామరలు వీచుచుచుండగా,
రాజు వెడలె రవితేజములలరగ
అన్నట్లున్న సమయమున తెల్లనివిభూతిరేఖలను ధరించిన ఫాలభాగముతో,మెడలో అలంకరించుకొనిన రుద్రాక్ష మాలలతో,అనవరతము అజపా మంత్రమువలె ఆగక జరుగుచున్న/జరుపుచున్న శివనామ స్మరణముతో ఒక రజకుడు/చాకలివాడు రాజునకు గుడ్దలమూటనెత్తుకుని ఎదురుపడెను.
నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు
నీలోన గలశివుడు
నాలోన గల శివుడు
నిండార రక్షించగలడు అన్న
కీర్తిని నిజము చేస్తూ,
త్వమేవాహం-నీవే నేను-నేనే నీవు,
అన్న సత్యమును నిరూపిస్తూ రూప-ప్రతిరూపములు-బింబ-ప్రతిబింబములు పరమ శివుని లీలగా కాదు కాదు అవలీలగా పరస్పరము నమస్కార-ప్రతినంస్కారములను చేసుకొనినవి.
ఏనుగు అంబారీనిదిగి నాయనారు ఎదురుపడిన రజకునికి నమస్కరించుచున్నాడు.
ఏకాదశ రుద్రమును కూడి నందనారు రాజునకు నమస్కరించుచున్నాడు.
ఎంతటి మనోహర దృశ్యమది.ఎంతటి మమకార చిత్రమది.ఆడువాడు-ఆడించేవానిని-ఆడించేవాడు ఆడువానిని గుర్తించి,గౌరవించుకునే అద్భుత సన్నివేశము.
అంతటితో అయిపోలేదు అద్భుత లీల.అమృత వర్షిణియై దశదిసలను ధన్యతనొందునట్లు చేసినది.
రజకుడు రాజుతో అయ్యా! మీరు చేరదేశ ప్రభువులు.నేను పాలితుడను కనుక ధర్మశాస్త్రముల ప్రకారము పాలితులు ప్రభువులకు నంస్కరించవలెను.ఇది మీకు తెలియని కాదు.కనక నాకు మీరు నమస్కరించకూడదు అంటూ వినయముగా మందలించాడు.
రాజు రజకునితో సమాధానముగా అయ్యా మీరు చెప్పినది సత్యమే కాదనను.నేను చేర దేశమునకు బానిసను.మీరు ఒక భాగము.కనుక నేను మీకు నమస్కరించుట సమంజసమే అని విధేయునిగా సమాధానమినిచ్చెను.
తనతో పాటుగా రాజసభకు తీసుకుని వెళ్లి సేవించుకొనెను.సంతుష్టుడైన రక్జకుని రూపములో నున్న శివుడు చిందంబరములోని కనక సభలో తాను తాండవించువేళ ,తన మువ్వల సవ్వడి చేరమానుకు వినపడునట్లు వరమిచ్చెను.
ఎంతటి భాగ్యమును చేసుకున్నవో మన నాయనారు శ్రవణేంద్రియములు.ప్రతి ప్రదోష సమయముననటరాజు నర్తనమును పలుకరించుచు,పరవశించుచున్నవి.
ఉన్న నిండుతనముకన్నా లేని వెలితి బాగా అర్థమవుతుందంటారు పెద్దలు.
సాయం సమయమైనది.చెవులు చేటలంతవుతున్నయి మువ్వల సవ్వడికై.
ఆటలేదు-పాట లేదు.నాయనారు మనసు మనసులో లేదు
స్వామి మంజీరనాదము వినని చెవులు,
ఏ నీ గుణములు కర్ణేంద్రియముల సోక దేహతాపంబులు తీరిపోవు,
అన్నట్లుగా ,స్వామి మువ్వలసవ్వడి వినిపించని కారణము ు స్వామిపట్ల తాను చేసిన అపచారమని దుఃఖించసాగెను.
దయాంతరంగుడైన పరమేశ్వరుడు స్వామికి అపచారము జరిగినదేమో అని చింతించుచున్న నాయనారుతో స్వామి,తాను తన మిత్రుడు బత్తిరణార్ సంకీర్తనములో మైమరచి మువ్వలసవ్వడిచేయుటలో ఆలస్యము జరిగినదని చెప్పగానే కుదుటపడ్డాడు.
పరమదయాళుడైన పరమేశుడు నాయనారును అనుగ్రహించినట్లు మనలనందరిని అనిశము రక్షించును గాక .
ఏక బిల్వం శివార్పణం
Thursday, November 25, 2021
VIRAALMINdA NAAYANAARU
విరాల్మిండ నాయనార్
********************
"ధావతే సత్వానాం పతయే నమః"
భక్తులను రక్షించుటకు భక్తుల వెనుక ,భక్తులతో పాటుగా,భక్తులచే తరుమబడుతూ లీలలను ప్రదర్శించు శివునకు నమస్కారములు.
విరాల్ మిండ విశ్వమంతా పరమాత్మయే అను భావమును నమ్మువాడు.భగవంతునికి మిత్రుడు అన్న అర్థమును కూడా చెప్పుకుంటారు.
విరాల్మిండా నాయనారు చేర రాజ్యములోని,చెంగన్నూరులో వ్యవసాయ భూస్వాముల కుటుంబము నందు జన్మించెను.
విరాల్ మిండ అనగా సకలజీవులు సర్వేశ్వరుడే అను నమ్మువాడు.భగవంతుని సేవించాలంటే,దర్శించాలన్నా,భక్తుని అంతే భక్తిప్రపత్తులతో సేవించాలన్న నియమము కలవాడు.
శివార్చన ఎంతటి మహాభాగ్యమో శివభక్తార్చనయు అంతే అని నమ్మువాడు.
విరాల్మిండ యొక్క భక్తితత్పరతలను విశ్వవిఖ్యాతము చేయదలిచాడు విశ్వేశ్వరుడు.శివపుణ్యక్షేత్ర సందర్శనమనే మిషను కల్పించి నాయనారును ఉన్నచోటునుండి కదిలించాడు.
ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చదలచిన ఉమాధవుని కరుణ ఊహాతీతము కదా.
హర హర మహాదేవ శంభో శంకర
మహద్భాగ్యమునందించుటకు తిరువారూరు లోని త్యాగరాజ కోవెలను రంగస్థములనుగా సిధ్ధపరిచాడు ముందుముందు త్యాగరాజుగా నాయనారుచే తరుమబడాలన్న ముచ్చపడ్డ ముక్కంటి.
సుందరారుకు అందమైన బాధ్యతను అప్పగించాడు చేయవలసినపనికి ప్రేరణముగా.
సమయము వేచిచూస్తున్నది శివుని మాయను చూడటానికి వేయి కళ్ళతో.
సందర్భము తొందరపడుతోంది ముందుముందుకు జరుగుతూ.
అతియారు/శివభక్తి తత్పరులు తహతహలాడుతున్నారు తపఃఫలముగా ధన్యతను పొందాలని దేవాశ్రయ మండపములో తమదైన రీతిలో.
ప్రవేశించాడు విరాల్మిండ వినయముతో.పరవశించాడు అతియారులను చూసి నిశ్చలమతితో.
సభక్తిపూర్వక నమస్కారములను చేశాడు.తనివితీరా దర్శిస్తూ తత్త్వమును సంభాషించాడు.సంతుష్టాన్రంగుడవుతున్న సమయములో రానే వచ్చాడు సుందరారు హడావిడిగా.
భక్తి ఒక్కొక్కసారి చక్కని రూపుని దిద్దుకుంటూ,భక్తునిలోని పంతమును అమాంతము పెంచుట తనవంతు అనుకుంటుంది.
నిప్పుకన్ను వాని ఆనను తప్పదు కదా.
నాయనారు మనసులోనికి ప్రవేశించి,తన పనిని తాను చేసుకుపోతున్నది శివమాయ.
సుందరారు హడావిడి తప్ప అన్యమును ఆలోచించనీయ కుండా చేస్తున్నది.
త్యాగరాజ మండపము లోని అతియారులను సుందరారు దర్శించలేదు.పూజించను లేదు.అసలు పట్టించుకోనేలేదు.
స్వామి దర్శనమునకై సరాసరి పరుగులు తీస్తున్నాడు.
ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు బేసి నవ్వులవాడు.గుస గుసలు మొదలైనవి విరాల్మిండ మనసులో.
పసలేని భక్తుడు సుందరారు అంటూ,కసి కసిగా క్రోధము ముందుకు వచ్చింది నాయనారు మనసులో నుంచి మాటలుగా.
అది సుందరారు నియమపాలన ధిక్కారమో లేక,
విరాల్మిండకు జరుగబోవు సత్కారమో,
అదియును కాక ఆదిదేవుని చమత్కారమో
ఏమనగలవారము ఏలినవాడి కరుణను
శివోహం-శివోహం.
సుందరారును-సుందరారు తప్పిదమును క్షమించిన సుందరారును తాను మాత్రము క్షమించలేనని,ఆ స్థలమును-స్వామిని తిరిగి దర్శించనని పంతముతో,వందైపలై లో శివభక్తునిగా,సకల ఉపచారములను చేస్తూ ,సమారాధనలను చేస్తూ ,స్వగతములో మాత్రము తన పంతమునకు సాయముచేస్తూ ఉన్నాడు నాయనారు.
సుందరారు తేవారములను సుమధురములుగా మనకు అందించాలనుకొన్నాడు ఆ సుందరేశ్వరుడు.నేరుగా అడిగేకన్నా,నేర్పుగా అందించాలని పరీక్షగా, ఒకనాడు అన్న సంతర్పణకు తిరువారూరు నిండి త్యాగరాజుగా విరాల్మిండ ఆతిథ్యమునకు వచ్చాడు భక్తుని విడిచి ఉండలేని తండ్రి.
విరాల్మిండ తిరువారూరు నుండి వచ్చిన వారికి ఆథిధ్యమును తిరక్స్రించుటయే కాక కష్టపెట్టి కసితీర్చుకునే వాడు పరమసాధ్వీమణి అయిన నాయనారు ధర్మపత్ని పతిని ఎదిరించలేక వచ్చిన వారికి హితము చెప్పి వెనుకకు పంపించేది.
ఆ తల్లి త్యాగరాజును కూడా వివరములడిఘి విషయమును వివరించి,వెనుదిరిగి పొమ్మని వేడుకుంటున్నది.
విననే విన్నాడు విరాల్మిండ.పంచేండ్రియములు ఎంతటి పుణ్యమును చేసుకున్నావో మించిన కరుణ వాటిని ముంచెత్తుతోంది.
కన్ను తన వంతుగా వచ్చిన త్యాగరాజుని చూపిస్తోంది.వాక్కు తన వంతుగా పరుషములను పలికిస్తోంది.స్పర్శ వానిని పట్టుకొమ్మని ఉసిగొల్పుతోంది.
భస్మాసురుని బారిన పడిన వాని వలె భవుడు దవుడు తీస్తున్నాడు.భక్తుడు వానిని పట్టుకుని మట్టుపెట్టుటకు వెంబడిస్తున్నాడు.
చుట్టుకున్న మాయ గట్తుదాటి పోతున్నది.
నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు
లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు."
చిదానందరూపా- విరాల్మిండ నాయనారు
ఎంతసేపు పరుగులుతీశారో-ఎంతమందిని అనుగ్రహించారో,ఎవరికి తెలుసు.
పొలిమేరదాటాడు విరాల్మిండ త్యాగరాజును వెంబడిస్తూ.
అద్భుతము.మహాద్భుతము.పరమాద్భుతము.
పారిపోతున్న త్యాగరాజు పరమేశ్వరునిగా ప్రత్యక్షమయ్యడు.
పాహి-పాహి అని సన్నుతిస్తూ,సందరారు తో కలిసి అంత్యము వరకు అర్చిస్తూ,ధన్యుడైనాడు విరాల్మిండ నాయనారు
.
నాయనారును అనుగ్రహించిన నటరాజు మనలనందరిని తప్పక అనిశము కాపాడును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Tuesday, November 23, 2021
KALIKAMBA NAAYANAAR
కలికాంబ నాయనారు
***************
" నీ పాదకమలసేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును
నితాంతాపార భూత దయయును
తాపస మందార నాకు దయసేయకదె"
సహజకవి బమ్మెర పోతన.
ఆదిశంకరులు అమ్మ వారి పాదరేణువు మహాత్మ్యమును సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తావిస్తూ,ప్రశంసించిరి.
అన్నమాచార్చార్యులు సైతము,
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మమురా నీ పాదము అని
సర్వాంతర్యామి పాదపద్మములను సన్నుతించిరి.
నవవిధ భక్తులలో నాల్గవదైన పాదశేవనము భక్తుని నిరహంకార నిశ్చల మనోసేవలకు ప్రతీకగా అనుకోవచ్చును.
సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనసు చపలత్వముతో అటు-ఇటు జరుగవచ్చును /అహంకారమునకు దాసోహమవ వచ్చును కాని,నిండైన విస్తరి నెమ్మదిగానే ఉంటుంది అన్నట్లుగా నిరంతరము శరీరమును మోస్తున్నప్పటికిని,నడుస్తున్నప్పటికిని,పరుగులు తీస్తున్నప్పటికిని లేదా స్థిరముగా నున్నప్పటికిని అన్ని అవస్థలను సమానముగానే స్వీకరిస్తూ,సహనముతో ఉండేవి పాదములు.
స్వామి అంఘ్రియుగళ సేవనము సూచిస్తూ శ్రీదేవులపల్లి వారు సైతము,
శివపాదము మీద నీ శిరమునుంచరాదా అని ,
అహంకార-మమకార పోరాటములలో అహంకారము తొలగాలంటే అది మమకారమును ఆశ్రయించవలసినదే.దానిచే ఆశీర్వదించబడ వలసినదే.
పాదసేవనమును ప్రముఖ సేవగా స్వీకరించిన వారిలో,పెన్నుగదము లోని కలికాంబ నాయనారు దంపతులు స్వామి కరుణను లోకవిదితము చేసిన వారు.
కలిక్కాంబ/కలికంబర్/కలికంబనార్/కలియాంబ/ అను వివిధ నామములతో పిలువబడు
పరమశివభక్తుడు.న-కలి-లేనిది.కలి-ఉన్నది.
వైశ్యజాతిలో పుట్టినప్పటికిని ఉన్నదానితో సంతృప్తిని చెంది,శివభక్తులను సాక్షాత్తు శివ స్వరూపముగా భావిస్తూ,వారిఉపాధిని ఎంచక ,పాదసేవనమును పరమ భక్తితో చేసేడివాడు.
పరమ సాధ్వి అయిన నాయనారు ధర్మపత్ని పాదసేవనమునందు పతిని అనుసరిస్తూ,పాత్రలోని జలమును అతిథిని సాక్షాత్తు పరమేశునిగా భావిస్తూ,పరమ వినయముతో,
" పాదయోః పాద్యం సమర్పయామి" అన్న పవిత్ర భావనముతో పూజించేది.
మన నాయనారుకు పరమేశునిపై గల ంపరమభక్తియే బలము శివుని లీలకు అది బలహీనముగాను మారుతుంది.కాదనగలవారెవరు కాముని ఆనను.
క్రమక్రమముగా కలికంబర్ మనసులో తానే కాక తన కుటుంబము సైతము నిశ్చలభక్తితో పరమేశుని పాదశేనములో పాల్గొనాలనె ప్రగాఢ వాంఛ ప్రబలినది.
" అజాయమానా-బహుధా విజాయతే"
నిరాకారుడు భక్తులను పరీక్షించుటకై తనకు నచ్చిన నామరూపములను ధరిస్తాడు.తనంతట తానే దగ్గరగా వస్తాడు.భ్రమలను కల్పిస్తాడు.ఉన్నది లేదనిపిస్తాడు.లేనిది అవుననిపిస్తాడు.
అదేజరిగింది నాయనారు ఇంటిలో.మధ్యాహ్న వేల అయింది.అతిథి-అభ్యాగతులను అర్చించే సమయమాసన్నమయినది.
రానే వచ్చాడు రాగ-ద్వేషములను కలిగించుటకు ,యోగమును నిరూపించుటకు నిటలాక్షుడు.
సాదర్ముగా ఎదురేగాడు నాయనారు స్వాగతించుతకు అతిథిని.సాలోచనగా ఆగిపోయింది అతనిని చూసిన గుర్తులను పలక్స్రిస్తూ నాయనారు భార్య.
ఒకరిని ఇహము-మరొకరిని పరము ప్రభువు ఆనగా పలకరిస్తున్నది.పలకరిస్తూనే ప్రభావితము చేస్తున్నది.
అతిథిని కూర్చుండ్
అబెట్టినారు ఆసనము మీద.పాదములను కింద పీట మీద నిలిపారు.
నాయనారు కన్నులకు దేవుడు కనిపిస్తున్నాడు సదాశివునిగా.
నాయనారు భార్య కన్నులకు జీవుడు ఉపాధితో సహా కనిపిస్తున్నాడు తన దగ్గర పనిచేసిన సేవకునిగా.
మధురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా అంటూ సేవకు ఉపక్రమిస్తున్నాడు కలికంబరు.
అథమం శివ వేషం అర్హతలేదులే ఓ మనసా అంటూ నిరాకరణను నిర్ణయించింది నాయనారు భార్య.
పరస్పర విరుధ్ధ భావనలు పాదసేవనమునకు ఆయత్తమగుచున్న వేళ అది.
పుణ్యము/పాపము చెరో వైపుకు జరుగుతున్న జాము అది.
జంగమదేవర జటాధారియై జరుగవలసిన దానిని జరుపుతున్నాడు.
" మహాదేవ జగన్నాథ భక్తానాం అభయప్రద
పాద్యము గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్దయ
గంగాధరాయ నమః
పాదయో పాద్యం సమర్పయామి"
ప్రసన్న మనస్కుడై పాదప్రక్షాలనమునకై సిధ్ధమయ్యాడు నాయనారు.
దాసుని కాళ్లుకడుగుటయా? దానికి ధర్మపత్నిగా నేను జలధారనందించుటయా? ధర్మ సంకటము స్వామి మర్మమును తోసివేసి,కరములను శుభకరములు కానీయటము లేదు.
వేచి చూస్తున్నాడు అతిథి.జలధారకై వేచిచూస్తున్నాడు తన పతి.తోచుకోనీయటములేదు పరిస్థితి.
అంతే.అహము ఆమెను దాసోహము చేసుకున్నది.పాదపూజలేల యని వాదమును చేసింది.
నీలకంఠుని పూజను నిరాకరింప చేసినది.
ఇంద్రియములను మందము చేసినది.అదే అనందమనిపించేటట్లు ఆడిస్తోంది.
ఆగ్రహము కట్టలు తెంచుకుని వస్తోంది నాయనారుకు భార్య వింతప్రవర్తనను చూసి.
అతిథినిసత్కరించమని అనునయిస్తున్నాడు.వాడు మన సేవకుడు.నేను యజమానురాలిని.సేవలను స్వీకరించే అర్హత వాడికి లేదు అన్నది .
అంతే.కట్తలు తెంచిన క్రోధము ఆమె కరములను తుంపించేసింది.
చేతులారంగ శివుని పూజింపడేని
కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనముగా నేలకొరిగినది నాయనారు భార్య.
వెనుక ముందు ఆలోచించక తానే జలమును పోసి,తానే పాదప్రక్షాలమును గావించి,అర్చించాడు.
అర్థనారీశ్వరునికి అర్థాంగి సహిత పూజలను సమర్పించలేకపోయితినన్న దిగులుతోనున్న నాయనారును
అనుగ్రహించదలచిన ఆదిదంపతులు ప్రత్యక్షమయి ఆశీర్వదించారు.
నాయనారు పాదసేవనాతత్పరతను లోక విదితము చేసిన ఆదిదంపతుల అనుగ్రహము మనలను సదా రక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
cheraman nayanar
ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు"
ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన
మనసులో సంతసము కనుల జారు విధాన
కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ
ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ
ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.)
చిదానందరూపా-చేరమాన్ నాయనారు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను వీతరాగుడు
తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు
పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె
పశుపక్ష్యాదులు సైతము ప్రశాంతముగ పరవశించె
రతిపతిని కాల్చినవానిని రాజు రజకునిలోన గాంచె
విశ్వేశ్వరుడీతడేనని వినయ నమస్కారమును గావించె
తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ
తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్తుడు కానందున వయసురాగానే సన్యసించి తిరువంజక్కళములో శివపూజాదులతో నిశ్చింతగా నుండెను.శివుని ఆదేశమైనదేమో ఆ దేశపు రాజైన సెన్ గోల్ పోరయాను తపోదీక్షను కోరి రాజ్యమును విడిచివేసెను.వారసులు లేనందునప్రజలు మన నాయనారును రాజ్య పాలన చేయమని వేడుకొనగా శివాజ్ఞగాభావించి, స్వీకరించి సుభిక్షముగా నుండునట్లు పరిపాలించుచుండెను.
చేరమాను శ్రద్ధాభక్తులకు మెచ్చి, సుందరేశుడు తనశిష్యుడు బాణాపతిరారు ద్వారా ఆశీస్సులను పంపాడు.మనో వాక్కాయ కర్మలను నటరాజార్పణము చేసిన నాయనారును కనకసభనుండి తన మువ్వల సవ్వడితో ఆశీర్వదించెడివాడు.ఒకరోజు మువ్వల సవ్వడి వినిపించలేదు.స్వామికి అపచారము జరిగినదేమో అని చింతించుచున్న నాయనారుతో స్వామి,తాను తన మిత్రుడు నంబి అరూరారు సంకీర్తనములో మైమరచి మువ్వలసవ్వడిచేయుటలో ఆలస్యము జరిగినదని చెప్పగానే కుదుటపడ్డాడు.
తనలో లీనముచేసుకోవాలనుకొన్నాడు.దానికి లీలగా సుందరారుని పిలిచి,చేరమాను సుందరారును అనుసరించునట్లు చేసి కైలాసమునకు రప్పించాడు కాని దేవుడు వరమిచ్చినా పూజారి కూడా ఇవ్వాలి అన్నట్లు ద్వార పాలకులు నాయనారును అడ్డుకున్నాడు.వడ్డించేవాడు మనవాడైతే విస్తరి ఎక్కడ వుంటేనేమి అన్నట్లు పరమేశ్వరుడు తన వాహనమైన కరుణా వీక్షణముతో తనదగ్గరకు పిలిపించుకొని లాలించినట్లు మనలందరిని లాలించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.) తక్కువ చూపు
SOMASIRA MAARAN NAYANAR
సోమశిర నాయనారు
*******
" రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం
జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం."
శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది.
" యజ్" అను ధాతువుకు ఆరాధనచేయువాడు/అర్పణమును చేయువాడు అను అర్థమును కనుక గమనిస్తే యజ్ అను కర్త చేయు కార్యమును యజ్ఞముగాపరిగణింపవచ్చును.అగ్నిసాక్షిగా,అగ్ని సహాయమును కోరుతూ,యాగాగ్నిని ఉద్దీపింపచేసి అర్చించే వైదిక కార్యక్రమము.
ఇందులో అగ్నిహోత్రుడు మనము అర్పించిన పదార్థములను దైవసమర్పణ
మునకు అనుకూలమగు హవిస్సుగా మార్చి వారికి అందచేస్తాడు.వారు హవిస్సును స్వీకరించి ఆశీస్సులతో సుభిక్షమును కలుగచేస్తారు.
ఇక్కడ మహేశ్వరత్వమే మహేంద్రత్వము.అది పరిపూర్ణమైనది విరాత్పురుషుని అవయవములే దేవతలుగా మనచే పిలువబడు శక్తులు.మహేశ్వరుడు కరుణాంతరంగుడై కర్తవ్యపాలనకై కొన్ని శక్తులను తననుండి ఆవిర్భవింపచేసి,వాటికి చేయవలసిన పనులను-విధానమును ఆదేశించి,వాటిచే అమలు చేయిస్తున్నాడు.సాధకుల ప్రయత్నములను (యజ్ఞములను) సమర్థవంతము చేస్తున్నాడు .ఈ విషయమును గ్రహించిన జిజ్ఞాసువులు తమ యజ్ఞ హవిస్సులను,తమ మనస్సులను,తమ సాధనలను బీజమైన వానికి-ఫలప్రదము చేయువారికి సగము సగము సవినయముగా సమర్పించుచున్నారు.
యజ్ఞప్రక్రియలు బహువిధములు గా భాసిల్లుతూ బహుళార్థ ప్రయోజనములనందించుచున్నవి.అట్టివానిలో ఒకటి సోమరసమును హవిస్సుగా అర్పిస్తూ,వేదమంత్రములతో అగ్నిసాక్షిగా చేయు వైదిక ప్రక్రియ.సోమలతలు ముంజవత పర్వతములో ఆవిర్భవించినవని ఒక దివ్య పక్షి ద్వారా సోమలతలు స్వర్గమునుంది భూ
మికి తేబడినవని ఋగ్వేదములో చెప్పబడినది.వీటి ఆకులను అరచేతిలో పెట్టుకుని
రసమును తీసి దేవతలకు హవిస్సుగా అర్పించే విధానమును సోమసి అని అంటారు.
స-ఉమ-సోమ ఆరాధనా అగ్నికార్యము ,
" పూర్ణంచమే-పూర్ణతరంచమే
అక్షితిశ్చమే-అన్నంచమే" అని చమకము యజ్ఞము యొక్క ప్రశస్తిని వివరిస్తున్నది.
అంతే కాకుండా,
" శక్వరీరంగుళయో దిశశ్చమే" అంటూ విరాత్పురుచుని వేల్లుగా గా దిక్కులు-విదిక్కులు తమ కార్యములను శక్తితో నిర్వర్తించును అన్న నమ్మకముతో సోమసి యజ్ఞమును నిష్కళంక మనముతో నియమానుసారముగా నిర్వర్తించు,
సోమశిర నాయనారు,
తిరువంబారులోని బ్రహ్మణ కుటుంబములో జన్మించెను.బ్రహ్మజ్ఞాని కనుక ప్రతిఒక్కరిలో బ్రహ్మమును దర్శించగలవాడు.
మారన్ అను నామాంతరమును కలిగిన నాయనారు సోమసి అను యజ్ఞ/అగ్నికార్యమును అనన్య భక్తితో నిత్యము సలుపుటచే సోమసి/మన తెలుగులో సోమయాజిగా ప్రసిధ్ధికెక్కెను.
సోమసి యజ్ఞ అనుగ్రహముగా పరిసరములు పరిశుభ్రమై,పర్యావరణము రోగనిరోధక శక్తితో
రాజిల్లుచుండును.
భూమాత అన్నముతో పాటు ఔషధములను కూడ అత్యంత అధికస్థాయిలో ఉత్పత్తి చేసే సామర్థ్యమును కలిగి ఉంటుంది.తత్ఫలితముగా అకలిదప్పులు అగుపడని ఆనందము అన్యాయమును-అపార్థములను దరికి రానీయదు.
సోముని శిరమున ధరించిన వాని కరుణ మన నాయనారుని సుందరారుతో జత చేసింది.జనులను చైతన్యవంతులను చేసింది.
సొమశిర నాయనారు కులవ్యవస్థను ధిక్కరించటం అప్పటి ఛాందసవాదులకు నచ్చలేదు.వారిని నమ్మించదలచాడు నాయనారు ద్వారా పరబ్రహ్మము.సుందరారు
అరోగ్యమును సహకరించనీయలేదు.
వారు నాయనారును పరీక్షించదలచి,యజ్ఞహవిస్సును పరమేశ్వరునికి నాయనారు తమ సోమసి ద్వారా అర్పించగలిగితే సర్వజనుల సమానత్వమును అంగీకరిస్తామన్నారు ,
కాదు కాదు అనిపించాడు అర్థనారీశ్వరుడు.
అత్యంత భక్తితో ఆదిదేవునికి హవిస్సును అర్పించాడు నాయనారు.అంబతో సహా ప్రత్యక్షమై అందరిని అనుగ్రహించారు ఆదిదంపతులు.
శివాజ్ఞ మేరకు శివచింతనతో నుండి అంత్యమున శివసాయుజ్యమును పొందిన మన నాయనారుని ఆశీర్వదించిన ఆదిదంప
తులు మనలనందరిని అనిశము రక్షించెదరు గాక.
అంబే శివే తిరువడిగలే శరణం
ఏక బిల్వం శివార్పణం
Monday, November 22, 2021
ERIPATTA NAYANAR
ఎరిపత్త నాయనార్
***************
ఎరిపత్త నాయనారు
***************
"నీరాట వనాటములకు
బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్".
గజేంద్రమోక్షము.
హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి?
మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి.
" నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవ నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః".
రుద్రా!
తే- నీయోక్క
మన్యవే-కోపమునకు
నంస్తే- నమస్కారము
రుద్రా నీ కోప ప్రకటనమునకు నమస్కారము.
ఉతో-మరియును
తే-నీయొక్క
బాహుభ్యాం-బాహువులు,
కోపమును సూచించు ఆయుధములను ధరించిన బాహువులకు నమస్కారము.
రుద్రమంత్రములను సనాతనులు ప్రత్యక్ష మంత్రములుగా భావించి,గౌరవిస్తారు.
నీ కోపము,దానిని సూచిస్తూ నీ బాహువులలో ఒదిగిన ఆయుధములు ధర్మసంరక్షనమునకు మాత్రమే ప్రయోగింపబడును గాక.
అంతే కాదు,
యా తే హేతిః మీడుష్తమ
య-ఏ-తే-నీ యొక్క ఖడ్గము/గొడ్డలి
మీడుష్టమ-
సజ్జనులను సంరక్షించుతకు సాధనమగుగాక.
భగవంతునికి-భక్తునికి భేదము లేదు అను సత్యమును చాటువాడు ఎరిపత్త నాయనారు.
ఎరిపత్త అన్న పదమునకు ఒక నియమము/తీర్పు/విధానము అను అర్థమును తమిళభాష ప్రకారము మన నాయనారు,
చేత ఒక గండ్రగొడ్డలిని పట్టుకుని,ఎక్కడైనా/ఎవరికైనా/ఎప్పుడైన /ఏదైనా శివపూజా నిర్వహణకు ఆటంకము కలిగించిన,తత్ క్షణమే తనదైన తీర్పుగా వారిని /శివాపరాధమును శిక్షించేవాడు.
ఋతువులతో పాటుగా ,శివుని అనుమతులను సైతము ప్రకటిస్తూ కాలము జరుగుచున్నది.మదమునకు ఉదాహరణముగా చెప్పబడు కరి అన్నిరూపములు తానైన వాని కనుసన్నలలో నడచుటకు సిధ్ధమైనది ఎంతో మోదముతో.
భక్తుని ఉధ్ధరించాలనే శివకామ మనోహరుని ఆనగా శివగామి ఆండార్ పూలునిండిన సజ్జతో నడుస్తున్నాడు ఆమోదముతో.
ఇద్దరు స్వామి లీలా ప్రదర్శనమునకు పాత్రధారులు.ఒకరికి అది పూజాసమయము.మరొకరికి అది చెలరేగుచున్న చెండాడు సమయము.పరస్పర విరోధ ప్రకటనప్రదర్శనమే అయినప్పటికిని అది పరమేశ్వర లీలా వినోదము.స్వామికార్య సేవా సౌభాగ్యము.సాక్షాత్తు నిర్ద్వంద్వుని ఆనగా జరుగుచున్న నిర్దాక్షిణ్యము.
ఒకవైపు శివగామి సత్వగుణ సంపన్నుడై స్వామిసేవకువెళుతున్నాడు.మరొక వైపు తమోరజో గుణములను తలనిండా నింపుకున్న మత్తగజము/దానిని నడుపుతున్న /నడుపలేని మావటివాడు.స్వామిభక్తిని తోసివేసి భక్తునిపైకి దూసుకుని పోతున్నది ఏనుగు.చూస్తున్నాడు మావటి కర్తవ్యహీనుడై.పూలసజ్జ ఎగిరిపడి పూలన్నీ చెల్లాచెదరైపోయినాయి.
అనుకోని సంఘటన అభిరామిఆండర్ ని నేలకొరిగేలా చేసింది.హాహారావములను ఎరిపత్త చెవులకు చేరవేశాడు చంద్రశేఖరుడు. కాబోవు
పనినికన్నులముందుంచాడు కాముని కాల్చినవాడు.క్రోధము తెప్పించాడు.నాయనారు చేతి గొడ్డలినెత్తించాడు.
" ఆట కదరా శివా-ఆట కద కేశవా
ఆట కద జననాలు-ఆట కద మరణాలు
ఆటలన్నీ నీకు అమ్మతోడు"
శ్రీ తనికెళ్ళ భరణి.
ఆట మొదలైనది.ఏనుగు తొండముపై,దానిని సరిగా నడుపలేని మావటి తలపై వేటు పడింది.పుగళై చోళరాజుగారికి ఈ విషయము తెలిసింది.వచ్చి చూశాడు .జరిగిన దానిని సమన్వయముతో పరిశీలించాడు.
మళ్లీ మొదలుపెట్టాడు సంఘర్షణను వారిద్దరి మధ్య వాదనగా శివుడు
రాజునినాయనారుని ధర్మానుసారులుగా,కర్మఫలానుసారులుగా.
భక్తి మర్మమును తెలియచేయుటకు
తప్పు తనరాజ్యములో జరిగినది కనుక దాని శిక్షను అనుభవించవలసినది తానని రాజు తన ఖడ్గమును నాయనారు చేతికిచ్చి ,తన తలను దునుమమన్నాడు.
ప్రభుహత్య మహాదోషము కనుక,రాజాజ్ఞను ధిక్కరించలేనివాడను కనుక ఆ ఖడ్గముతో తన తలను నరుకుకోబోయాడు నాయనారు.
ఇద్దరు ధర్మనిష్ఠాగరిష్ఠులే.స్వామి భక్తిపరులే.స్వార్థరహితులే.
సాంబశివుడు తక్క వారి సమస్యను పరిష్కరించగలవారెవరు?
సంతుష్టాంతరంగుడై సా సాక్షాత్కరించాడు.
ు.ఏనుగును మావటివానిని పునర్జీవితులను కావించాడు.
ఎరిపత్త నాయనారు తన ప్రమధునిగణునిగా ఆశీర్వదించాడు.
ఎరిపత్తను కరుణించిన పరమేశ్వరుడు మనలను ఎల్లవేళలా
రక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
VIRALMINDA NAYANAR
నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు
లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు."
చిదానందరూపా- విరాల్మిండ నాయనారు
**************************************
"బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా
నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి
నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేஉపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"
చిదానందరూపా-విరాల్మిండు నాయనారు
************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అతియారులు అతిశయ ఆరాధ్యులనుచు కొలుచును విరాల్మిండు
శివభక్తుల సేవయే శివార్చన అనుచు ఆనందించుచు నుండు
కూరిమి సేవింప శివుని తిరువారూరుకి తీర్థయాత్ర వెడలె
నేరుగ చను సుందరారు తీరుకు కోపించి పలికె
శివభక్తుల చేరనీక సుందరు చేసినది శివాపరాధమనె
దానిని మన్నించిన ఆ శివుడు కూడ దోషి అని నిందించె
తిరువూరారుకు రానని తీర్మానించుకొనియె,త్యాగరాజును తరుముచు
తిరిగి ప్రవేశించెనాయె, మహేశుని పొందుటకు మాట తప్పుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక .
నేను-నాది అను భావాలను అధిగమించిన (వాడు ) విరాల్ మిండ నాయనారు భగవంతుని సేవకన్న భక్తుల సేవకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడు.శివభక్తులకు గౌరవములేనిచోట క్షణకాలమైనను ఉండుటకు ఇష్టపడడు ఏ విధముగా శ్రీరామునికన్నా రామనామమహిమ గొప్పతనము శ్రీ రామాంజనేయ యుద్ధము ద్వారా ప్రకటింపబడినది కదా! ,విరాల్మిండ భక్తిలో సాత్వికతను దాచివేసి రౌద్రము తన ముద్రతో రుద్రుని మెప్పించింది.శివ భక్తులను సాక్షాత్ శివ స్వరూపముగా భావించి,వారిని గౌరవించుటలో చిన్న నిర్లక్ష్యమును కూడ సహించలేని విలక్షణుడు విరాల్మిండ నాయనారు.శివుని వ్యహారములు పాప పరిహారములో-పావన తారకములో తెలియాలంతే చర్మచక్షువులతో కథలుగా కాక,మనసులోతునుంచి వాని తత్త్వమును అర్థముచేసుకొనుటకు మనము ప్రయత్నించాలి కదా!సుందరారు తేవారములను సుమధురములుగా మనకు అందించాలనుకొన్నాడు ఆ సుందరేశ్వరుడు.నేరుగా అడిగేకన్నా,నేర్పుగా అందించాలని పరీక్షగా.. ఒకనాడు సుందరారు, శివభక్తులను నిర్లక్ష్యము చేసి( తిరివారూరులోని) సరాసరి శివ దర్శనమును చేసుకొనునట్లు చేసి,అదిచూసి ఇసుమంతయు తాళలేని విరాల్మిండ అతనిని దూషించి, శివ భక్తుల పట్ల చేసిన అపరాధము (వారిని గౌరవించక-ప్రథమ దర్శనము చేయనీయక,శంకరుని చదరంగపు [పావుయైన సుందరారు)భక్తునితోపాటు భగవంతుని కూడా వెలివేస్తున్నానన్నాడు. "ఆట కదరా శివా! ఆట కద నీకిది అమ్మ తోడు".పావులు కదిలాయి.పావన తేవారములు ప్రకటింపబడినాయి. తప్పు తెలిసికొనిన సుందరారు తాను శివభక్తుల సేవకుడనని "తేవారముల"తో కీర్తించి విరాల్ నాయనారును శాంతపరిచాడు.శివ సంకల్పముచే తన ప్రతినను మరచి,తప్పుచేసిన వారిని తరుముతు తిరిగి ప్రవేశించిన విరాల్మిండ నాయనారును రక్షించినట్లు ఆ పరమేశ్వరుడు మనలను రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
Sunday, November 21, 2021
MURUGA NAYANARU
మురుగ/మురుగర్ నాయనార్
*********
" యోపాం పుష్పం వేద -
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
చంద్రమాం వా అపాం పుష్పం-
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
య ఏవం వేద -
యోపాం ఆయతనం వేద-
ఆయతనవాం భవతి.
మంత్రపుష్పము.
పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నిండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే.
ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే,
" పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు.
సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన
పరమాత్మ మహాశక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సంహరణము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరావృతముచేయుచున్న అవ్యక్తమే పుష్పము.
మంత్రపుష్పములో మన మనసు చంద్రునితో పోల్చబడినది.దానికి కారణము చంద్రుని ఉన్న వృధ్ధి-క్షయములు మన మనసునను మనము కలిగియుండుట.సుఖ-దుఃఖములకు పొంగుతూ-విచారిస్తూ ఉంటాము.
అటువంటి మన మనము స్థితప్రజ్ఞత్వమును
పొందాలంటే జలము నుండి ప్రభవించిన పుష్పముగా మారాలి.అదియే హృత్పుండరీకము.
ఇక్కడ మన మనము బలమును పొందాలంతే దానికి ఆయతనము/ఆధారము కావాలి.ఆ ఆధారము సంసారమనే జలములో అనుభవములనే పాఠములు.వాటినుండి మనము నేర్చుకొనుచున్న విషయములే మంచివాసనలు.కనుక జలమనే సంసార అనుభవ సారమునుండి పుట్టిన సలక్షణ సంస్కారములే సద్గతికి సోపానములు.
పూజలు సేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను స్వామి
తీయరా తలుపులను
తొలగించరా తలపులను,
అంటూ ప్రతి నిత్యము పంచభూతములతో-తన పంచేంద్రియములను జతచేసి,పంచాక్షరిని జపించుచు,పాపయ్యశాస్త్రి గారు అన్నట్లు పుష్పములు నొచ్చుకోకుండా,దుర్వినియోగము కాకుండా,సున్నితముగా తెంపి,భక్తి భావన అను దారముతో హారముగా మలచి,తిరుపుగలూరులోని అగ్నీశునికి అర్పించి అమితానందమును పొందేవాడు మురుగ నాయనార్.సార్థక నామధేయుడు.
తమిళములో మురుగ శబ్దమునకు అళగు/అళ్ళత్తు అలఘు అను అర్థమును చెబుతారు.సుందరాతిసుందరము.
.
ఆ అళగుదనము సౌందర్యము ఎటువంటిదంటే,
ఇల్లామై-ఎప్పటికి జరా భయములేక,యవ్వనవంతమై,
దేనిలో యవ్వనవంతము అంటే,
కడవన్ తమ్మై-దైవభావనలో,
దైవభావనలో/చింతనలో ముసలితనమును తెలియక,ఎప్పటికిని యవ్వనముతో నుండి,
భక్తి సువాసనలను వ్యాపింపచేయునది.
కనకనే మన నాయనారును మురుగర్ నాయనారుగా /మురుగేశన్ గా కీర్తిస్తారు.
భక్తిని ఆభరణముగా,దీక్ష అను మురుగును/కంకణమును ధరించిన వానిగా కూడ భావించుకొనవచ్చును.
పై అంతస్థుకు చేర్చుటకు నిచ్చెన ఆధారమైనట్లు, మురుగను శివ సాయుజ్యమును చేర్చుటకు స్నేహ రూపమున జ్ఞాన సంబంధారు భక్తి తాడును పెనవేయుచున్నదు..భగవద్దర్శనముకై వేచియున్నారు ఇద్దరు.
స్నేహితుని కళ్యానమునకు హాజరు కావాలని పెరుమానం కు బయలుదేరాడు మురుగనాయనారు.తన జ్ఞమను కళ్యానప్రదమునకు జంగమదేవర కదుపుచున్న పావులకు అనుకూలముగా.
కన్నుల పండుగగాజరిగినది జ్ఞానసంధరు కళ్యానము.
వధూవరులతో పాటుగా మురుగనాయనారును కటాక్షించాలనుకొన్న నిటలాక్షుడు,
కైవల్య కాలముగా కనికరించి వధూవరులను,మురుగనాయనారును అగ్నిప్రవేశముచేయమని ఆదేశించినాడు.
జనన-మరణ
చక్రమనే మొసలినోటినుండి వారిని విడిపించటానికి.
జయ జయ శంకర అంటూ ప్రవేశించి,జ్యోతిస్వరూపులైనారు.
పెరుమానం లోని ప్రాణ స్నేహితుని పరిణయము పరమపద సోపానమై,పరమేశ్వరసన్నిధికి చేర్చినది.శాప విముక్తులైనారు ఆ శివభక్తులు
.శివోహం-శివోహం.,.వారికీర్తిని చిరస్థాయి చేసిన ఆ నర్తనప్రియుడు మనలనందరిని రక్షించును గాక.
కార్తిక సోమవారము కళ్యాణప్రదమగుగాక.
ఏక బిల్వం శివార్పణం.
KOTTALI NAYANAR
" అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః."
చిదానందరూపా-కోట్టలి నాయనారు
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి
గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి
నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల
తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల
శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను
వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను
తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ
భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ
చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు.
అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి యైన నాయనారు,ధాన్య నివేదనము-ధ్యాన నివేదనము అను రెండు పాదముల అడుగులతో శివుని చేరిన ధన్యాత్ముడు.
ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది అని తెలిసిన నాయనారుకోత్తిలి నాయనారు.తన శక్తి వంచన గాకుండా శివాలయములకు ధాన్యరాశులను పంపించుతు,స్వామి ప్రసాదమును సర్వజీవులు స్వీకరించుటలో శివుని దర్శించి,పులకరించేవాడు.వ్యాస మహర్షిని సైతము కుపితునిచేసిన అన్నలేమి కలుగకుండ చూడమని అన్న పూర్ణేశ్వరుని అర్థించేవాడు.
ఆదిదేవుడు ఆ నాయనారు భక్తి-ప్రపత్తులను లోకవిదితము చేయాలనుకున్నాడు.రాచ కార్యమును కల్పించి,రానున్న ఫలితములను దరహాసముతో చూస్తున్నాడు.స్వామి కార్యము స్వకార్యమునకన్న ఒక మెట్టెక్కినది.అజ్ఞాబద్ధుడైన నాయనారు అన్న ప్రసాదమునకై ధాన్యపురాశులను అయినవారనుకొనే తన బంధువులకిచ్చి,స్వామి దేవాలయములకు పంపించమని కోరి,ఊరు వెడలి వెళ్ళెను.కపర్దికి కావలిసినదదే కదా.క్షణాలలో కరువు కోరలు చాచి,బంధువులు మాట తప్పునట్లు చేసినది.స్వామికైంకర్యము స్వార్థ కైంకర్యమైనదని తెలుసు కొనిన నాయనారు తాళలేక,వారందరిని శివాపరాధమునకు,శిక్షగా తన కరవాలమునకు బలిచేసెను.
ప్రత్యక్షమై వారిని పునర్జీవితులను చేసి,నాయనారును కటాక్షించిన సదాశివుడు సర్వవేళల మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.) తక్కువ
SOMASIRA NAYANAR
" జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ |
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ"
చిదానందరూపా--సోమశిర నాయనారు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు
తిరువెంబూరులోని శివభక్తుడు సోమసి మార నాయనారు
పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు
పరహితమును కోరు అనిశమును పూజను మానడు
గురువని తలచెను సుందరారును,తిరువూరును చేరెను
భుజియింపగ యాగ హవిస్సును శివునే కోరెను
చండిక తోడుగ శివుడు చండాలుడిగ వచ్చెగా
సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక .
యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము.
ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడు. పంచమ దంపతుల ప్రత్యక్షముగ తామే సోమ శిర(శిరమందు చంద్రుని ధరించిన వాడు) నాయనారు దివ్య చరితము. మంచి-చెడులు ఎంచి చూడగ మనుజులందున రెండు కులములు ....మంచి నేనౌతా అన్నారు గురజాడ వారు.అదేవిధముగా చండాల రూపము-అచంచల కరుణాప్రవాహమైన స్వామి అనేక రూపములలో,అనేక విధములుగ ప్రకటింపబడుతు మనలను మూఢత్వమునుండి ముముక్షుత్వము వైపుకు మరలించుటకు బయలుదేరుచున్నాడు
తిరువాంబూరులోని సోమశిర నాయనారు ఉత్తమ సంస్కారుడు.పరమ శివభక్తుడు.త్రిగుణాతీతుడై,త్రినేత్రున్ పొందినవాడు. పరిసరములు,.బ్రాహ్మణులు అగ్రకులజులమను అపోహలో ప్రభావితముచేయుచున్న సమయమునందు, కుల వివక్షను మరచి సర్వజనులను సదాశివుడే అనుకొనుచు,శివభక్తులను త్రికరశుద్ధిగ కొలిచేవాడు.
2. యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము. ఎటువంటి ఫలితములను ఆశించక నిస్స్వార్థముగా చేయు యజ్ఞమును శివపూజగా భావించి,సంతృప్తితో నుండెడివాడు.
3.గురువుగారైన సుందరమూర్తి యందు అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులను కలిగియుండెడి వాడు.గురుసేవకై తిరువూరు చేరిన సోమశిర నాయనారును పరీక్షించాలనుకున్నాడు.యాగ హవిస్సును స్వీకరించమని ప్రార్థించు సోమశిర ను పరీక్షించుటకై పంచమ దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు.పరమానందముతో వారిని సేవించి,హవిస్సును సమర్పణము చేసి,పులకించాడు నాయనారు.సమయము ఆసన్నమైనపుడు సద్గతి కలుగుతుందని దీవించి,అదృశ్యమయ్యారు ఆదిదంపతులు.అతిపవిత్ర మనసుతో అనుగ్రహించిన ఆదిదేవుని నిర్హేతుక కృపా కటాక్షము మనలందరిని అనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణ)
ERIPATTA NAAYANAARU
ఎరిపత్త నాయనారు
***************
"నీరాట వనాటములకు
బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్".
గజేంద్రమోక్షము.
హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి?
మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి.
ఎరిపత్త అన్న పదమునకు ఒక నియమము/తీర్పు/విధానము అను అర్థమును తమిళభాష ప్రకారము మన నాయనారు,
చేత ఒక గండ్రగొడ్డలిని పట్టుకుని,ఎక్కడైనా/ఎవరికైనా/ఎప్పుడైన /ఏదైనా శివపూజా నిర్వహణకు ఆటంకము కలిగించిన,తత్ క్షణమే తనదైన తీర్పుగా వారిని /శివాపరాధమును శిక్షించేవాడు.
ఋతువులతో పాటుగా ,శివుని అనుమతులను సైతము ప్రకటిస్తూ కాలము జరుగుచున్నది.మదమునకు ఉదాహరణముగా చెప్పబడు కరి అన్నిరూపములు తానైన వాని కనుసన్నలలో నడచుటకు సిధ్ధమైనది ఎంతో మోదముతో.
భక్తుని ఉధ్ధరించాలనే శివకామ మనోహరుని ఆనగా శివగామి ఆండార్ పూలునిండిన సజ్జతో నడుస్తున్నాడు ఆమోదముతో.
ఇద్దరు స్వామి లీలా ప్రదర్శనమునకు పాత్రధారులు.ఒకరికి అది పూజాసమయము.మరొకరికి అది చెలరేగుచున్న చెండాడు సమయము.పరస్పర విరోధ ప్రకటనప్రదర్శనమే అయినప్పటికిని అది పరమేశ్వర లీలా వినోదము.స్వామికార్య సేవా సౌభాగ్యము.సాక్షాత్తు నిర్ద్వంద్వుని ఆనగా జరుగుచున్న నిర్దాక్షిణ్యము.
ఒకవైపు శివగామి సత్వగుణ సంపన్నుడై స్వామిసేవకువెళుతున్నాడు.మరొక వైపు తమోరజో గుణములను తలనిండా నింపుకున్న మత్తగజము/దానిని నడుపుతున్న /నడుపలేని మావటివాడు.స్వామిభక్తిని తోసివేసి భక్తునిపైకి దూసుకుని పోతున్నది ఏనుగు.చూస్తున్నాడు మావటి కర్తవ్యహీనుడై.పూలసజ్జ ఎగిరిపడి పూలన్నీ చెల్లాచెదరైపోయినాయి.
అనుకోని సంఘటన అభిరామిఆండర్ ని నేలకొరిగేలా చేసింది.హాహారావములను ఎరిపత్త చెవులకు చేరవేశాడు చంద్రశేఖరుడు. కానిపనినికన్నులముందుంచాడు కాముని కాల్చినవాడు.క్రోధము తెప్పించాడు.నాయనారు చేతి గొడ్డలినెత్తించాడు.
" ఆట కదరా శివా-ఆట కద కేశవా
ఆట కద జననాలు-ఆట కద మరణాలు
ఆటలన్నీ నీకు అమ్మతోడు"
శ్రీ తనికెళ్ళ భరణి.
ఆట మొదలైనది.ఏనుగు తొండముపై,దానిని సరిగా నడుపలేని మావటి తలపై వేటు పడింది.పుగళై చోళరాజుగారికి ఈ విషయము తెలిసింది.వచ్చి చూశాడు .జరిగిన దానిని సమన్వయముతో పరిశీలించాడు.
మళ్లీ మొదలుపెట్టాడు సంఘర్షణను రాజునినాయనారుని ధర్మానుసారులుగా,కర్మఫలానుసారులుగా.
తప్పు తనరాజ్యములో జరిగినది కనుక దాని శిక్షను అనుభవించవలసినది తానని రాజు తన ఖడ్గమును నాయనారు చేతికిచ్చి ,తన తలను దునుమమన్నాడు.
ప్రభుహత్య మహాదోషము కనుక,రాజాజ్ఞను ధిక్కరించలేనివాడను కనుక ఆ ఖడ్గముతో తన తలను నరుకుకోబోయాడు నాయనారు.
ఇద్దరు ధర్మనిష్ఠాగరిష్ఠులే.స్వామి భక్తిపరులే.స్వార్థరహితులే.
సాంబశివుడు తక్క వారి సమస్యను పరిష్కరించగలవారెవరు?
సంతుష్టాంతరంగుడై సా సాక్షాత్కరించాడు.
ు.ఏనుగును మావటివానిని పునర్జీవితులను కావించాడు.
ఎరిపత్త నాయనారు తన ప్రమధునిగణునిగా ఆశీర్వదించాడు.
ఎరిపత్తను కరుణించిన పరమేశ్వరుడు మనలను ఎల్లవేళలా
రక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Saturday, November 20, 2021
MURUGA NAYANAR
మురుగ/మురుగర్ నాయనార్
************************
" యోపాం పుష్పం వేద -
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
చంద్రమాం వా అపాం పుష్పం-
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
య ఏవం వేద -
యోపాం ఆయతనం వేద-
ఆయతనవాం భవతి.
మంత్రపుష్పము.
పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నుండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే.
ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే,
" పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు.
సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన
పరమాత్మ మహాసక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సమ్హరనము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరావృతముచేయుచున్న అవ్యక్తమే పుష్పము.
మంత్రపుష్పములో మన మనసు చంద్రునితో పోల్చబడినది.దానికి కారనము చంద్రుని ఉన్న వృధ్ధి-క్షయములు మన మనసునను మనము కలిగియుండుట.సుఖ-దుఃఖములకు పొంగుతూ-విచారిస్తూ ఉంటాము.
అటువంతి మన మనము స్థితప్రజ్ఞ్తవమును పొదాలంటే జలము నుండి ప్రభవించిన పుష్పముగా మారాలి.అదియే హృత్పుండరీకము.
ఇక్కడ మన మనము బలమును పొందాలంతే దానికి ఆయతనము.ఆధారము కావాలి.ఆ ఆధారము సంసారమనే జలములో అనుభవములనే పాఠములు.వాటినుండి మనము నేర్చుకొనుచున్న విషయములే మంచివాసనలు.కనుక జలమనే సంసార అనుభవ సారమునుండి పుట్టిన సలక్షణ సంస్కారములే సద్గతికి సోపానములు.
పూజలు సేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను స్వామి
తీయరా తలుపులను
తొలగించరా తలపులను,
అంటూ ప్రతి నిత్యము పంచభూతములతో-తన పంచేంద్రియములను జతచేసి,పంచాక్షరిని జపించుచు,పాపయ్యశాస్త్రి గారు అన్నట్లు పుష్పములు నొచ్చుకోకుండా,దుర్వినియోగము కాకుందా,సున్నితముగా తెంపి,భక్తి భావన అను దారముతో హారముగా మలచి,తిరుపుగలూరులోని అగ్నీశునికి అర్పించి అమితానందమును పొందేవాడు మురుగ నాయనార్.సార్థక నామధేయుడు.
తమిళములో మురుగ సబ్దమునకు అళగు/అళ్ళత్తు అలఘు అను అర్థమును హెబుతారు.
ఆ అలగుదనము సౌందర్యము ఎటూవంటిదంటే,
ఇల్లామై-ఎప్పతికి జరా భయములేక,యవ్వనవంతమై,
దేనిలో యవ్వనవంతము అంటే,
కడవన్ తమ్మై-దైవభావనలో,
దైవభావనలో/చింతనలో ముసలితనమును తెలియక,ఎప్పటికిని యవ్వనముతో నుండి,
భక్తి సువాసనలను వ్యాపింపచేయునది.
కనకనే మన నాయనారు మురుగర్ నాయనారుగా వానిని ప్రసాడించు శక్తిని మురుగన్/మురుగేశన్ గా కీర్తిస్తారు.
భక్తిని ఆభరణముగా,దీక్ష అను మురుగును/కంకణమును ధరించిన వానిగా కూడ భావించుకొనవచ్చును.
పై అంతస్థుకు చేర్చుటకు నిచ్చెన ఆధారమైనట్లు,శివ సాయుజ్యమును చేర్చుటకు స్నేహ రూపమున జ్ఞాన సంబంధారు భక్తి తాడును పెనవేయుచు భగవద్దర్శనముకై వేచియున్నారు ఇద్దరు.కాలగతిలో ఋతువులతో పాటు మానవదశలు-ఆశ్రమములు మారుట సహజమే కదా.
NESA NAYANAR
నేశ నాయనారు
****
హరియను రెండక్షరములు
హరియించును పాతకములు అంబుజనాభా
హరి నీ నీ నామ మహాత్మ్యము
హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
(నృసింహకవి)
పరమాత్మ యొక్క శబ్ద స్వరూపము నామము.
హనుమ రామనామ మహిమ స్వామినే ఎదిరించినది.నామికి-నామమునకు కల అభేదమును వివరించినది.పిబరే రామ రసం అంటూ ఎందరినో రామనామామృతమును గ్రోలుతూ,ధన్యులను చేసినది.శివ నామమునకు కూడా జపించిన వారిని అనుగ్రహించుటలో ఏమీ మినహాయింపు లేదు అని తెలియచేసే అనుగ్రహవీక్షణమే ,
నేశనాయనారు దివ్య చరితము.
" పంచాక్షరీ శివ వేదేన విభాతి నిత్యం
రుద్రస్తయా స్పురతి తేన చతుర్థ కాండః
కాండేన తేన యజురేవ విభాతి నిత్యం
ఋక్సామమధ్య మణినాచ విభాంతి వేదాః"
శివా నీనామమునకు స్థానమై ,రుద్రాధ్యాయముచే తైత్తరీయ సంహిత చతుర్థకాండము మహిమాన్వితముగా ప్రకాశించుచున్నది.
నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే,
శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తమిళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది.
మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి.
మనముపై పంచాక్షరి నామములను దారములను సర్దుతు భక్తియను వస్త్రములను నేయుట ప్రవృత్తి.
కామేశుని భక్తులకు పంచిపెట్టుటకై కౌపీనములను నేయుట ,
శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపముగా దర్శిస్తూ,వారికి పంచెలు-కౌపీనములను పంచుతూ,పరమ సంతోషపడు వాడు.
ఉచ్చారణమాత్రము చేతనే ముక్తిని ప్రసాదించు శబ్దరూపములేమంత్రములు.
యుగధర్మములననుసరించి అనుష్ఠాన విధానములలో మార్పులు వచ్చినప్పటికిని,అనుగ్రహవిషయములలో ఎటువంటి మార్పుయును లేదు.
నామమునకు-నామికిని అభేదమును గుర్తించిన ప్రతివారును నామ జపమునకు అర్హులే.
పంచాక్షరి అనుష్టానము సర్వశాస్త్ర సమానము కనుకనే,
"జిహ్వాగ్రే వర్తతే యత్ర సఫలం తస్య జీవనం" అన్నది ఆర్యోక్తి.
అక్షరము అను శబ్దమునకు వర్ణమునకు
భాషకు ఆయువుపట్టుగా కనుక అన్వయించుకుంటే అవి శివుని డమరుక ప్రసాదమే.
అక్షరము అనగా న- క్షరము.నశించనిది/శాశ్వతమైనది.
అదియే సత్యము-సుందరము.
సత్యము-శివము-సుందరమైన పరమాత్మ శక్తి ,జగన్నాటకమునకు,జనుల/జీవుల నివాసమునకు పంచభూతములను స్థూలముగాను సూక్ష్మముగాను కల్పించిస్తున్నది.స్థూలమును ప్రపంచముగాను-సూక్ష్మమును జీవుని ఉపాధిగాను పెద్దలు భావిస్తారు.ఈ పంచభూతముల జీవునిలోని పంచేంద్రియముల అమరికతో,వానిలోని హెచ్చు-తగ్గులతో సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను లీలగా/అవలీలగా చేస్తుంటుంది ఆ
అద్భుతశక్తి.
నమో నమః.
శివ పంచాక్షరిని మనము కనుక ఈ విధముగా అన్వయించుకోగలితే మన కనుల ముందర సచ్చిదానందమే సాక్షాత్కరిస్తుంది.మనచే సన్నుతింపబడుతుంది.మనకు సద్గతిని ప్రసాదిస్తుంది.
జీవులచే తల్లి-తండ్రి-భార్యాపిల్లలు అను బంధములతో నటనము చేయించు శక్తి,
"న" కారముగా,
జీవుని నటనమునకు కావలిసిన మాయ/మోహమనే తెరచే కప్పివేయు అదేశక్తి,
"మ" కారముగా,
ఏ మహాశక్తి మోహ వశుడై నటించు జీవునికి నిర్హేతుక కృపతో శుభములను/శివమును ప్రసాదించు,
"శి" కారముగా,
తాను ఉపాధియని,తనలో దాగి
వసతిని కల్పిస్తున్న శక్తిని,
"వ" కారముగా,
మార్కండేయుని యమపాశమ ునుండి విడిపించి ,రక్షించిన కరుణావృష్టిని,
నాలుగు అక్షరములను కలుపు "య" కారముగా కనుక గుర్తించి,
తన ఉపాధిలోనే కాక,సర్వత్ర వ్యాపించియున్న సాక్షిని ,
ఏ విధముగా నేశనాయనారు,పట్టులేని పోగులను తీసివేస్తూ,పటిమగల నూలుతో నేస్తూ,వస్త్రములను-కౌపీనములను శివభక్తులకు సవినయముగా సమర్పించి తన జన్మను చరితార్థము చేసుకొన్నాడో,
అదే విధముగా మన మనసనే మగ్గమును సవరించుకొని,అరిషడ్వర్గములను పట్టులేని దారములను తీసివేస్తూ,అనన్య భక్తి యను పటిమగల దారముతో ,పంచాక్షరిని జపిస్తూ,పరమేశుని /భక్తుల పాద సమర్పణము గావించుకొనగలిగినప్పుడు
అనిశము కరుణతో మనలను
రక్షించడా ఆ పార్వతీవల్లభుడు.
"ఆర్తా విషణ్ణాశిధిలాశ్చ భీతా
ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం
విముక్త దుఃఖా సుఖినో భవంతు."
ఏక బిల్వం శివార్పణం.
Friday, November 19, 2021
TIRU NAVUKKU ARASAR APPAAR NAAYANAAR
తిరునవుక్కు అరసర్ నాయనారు/అప్పార్ నాయనార్
****************************
"పరిత్రాణాయ సాధూనాం
వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయాం
సంభవామి యుగే యుగే"
వైదిక ధర్మమునకు గ్లాని సంభవించుచున్నవేళ దానిని పునరుధ్ధరించుట్కు పరమాత్మ ప్రత్యేక నామరూపములతో ప్రకటితమవుతాడు అని తెలియచేస్తునది శ్రీమద్భగవద్గీత.
నాయనారుకుగల మరో పేరు అప్పర్/తండ్రి.
జ్ఞానసరస్వతీదేవి నాయనారును కాళిదాసును శ్యామలాదేవి అనుగ్రహించినట్లు బీజాక్షరములతో అనుగ్రహించినది కనుక,
తిరు పవిత్రమైన
నవుక్కు-మాటలకు
అరసర్-అధిపతి.
నామములకు అధిపతి కనుక నవుక్కు అరసర్ అనియు,నామములు పవిత్రమైనవి కనుక తిరు నవుక్కు అరసర్ గా నాయనారు కీర్తింపబడుతున్నాడు.
కొన్నివర్గముల వారి అభిప్రాయము ప్రకారము రావణాసుర రుద్రవీణాగానమునకు సహాయము చేసిన వాగీశ్వర్ అను మునియే శాపవశమున నవుక్కు అరసర్ గా జన్మించాడని నమ్ముతారు.
అప్పర్ని-అతని అక్కయైన తిలకవతిని వేదాధ్యన సంపన్నులను చేశారు వారి తండ్రి అప్పటి మతవిద్వేషములు చేయుచున్న మారణకాండలను దృష్టిలో నుంచుకొని.వేదధ్యయనందు తన పిల్లలకు ఆసక్తిని కలిగించారు.ఆకర్షితులను చేసారు.కాని, ఒక మహాకవి నుడివినట్లు,
"కోరిక ఒకతి జనించు
తీరక దను దహించు
కోరనిదేదో వచ్చు
శాంతి సుఖాలను తెచ్చు
అని తెలియచేసేది జీవితము.
అప్పర్ అక్క తిలకవతికి సైన్యాధిపతితో వివాహమును నిశ్చయింపచేసాడు సేనాపతి తండ్రియైన సాంబశివుడు.
మానవుడు తానొకటి తలిస్తే దైవము మరొకటి నిశ్చయిస్తుంది అన్న మాటను నిజముచేస్తూ,ఆ సమయములో జరుగుచున్న యుధ్ధములో తిలకవతికి కాబోయే భర్త వీరస్వర్గమును పొందాడు.
సుగుణసంపన్నమైన తిలకవతి తనువుచాలించుట
కు నిర్ణయించుకొనినది.జరిగిన ఘోరమును తట్టులోకోలేని వారి తండ్రి చనిపోతూ,అప్పర్ బాగోగులను చూసుకొనే బాధ్యతను తిలకవతికి అప్పగించి కన్నుమూసాడు.కర్తవ్యమును కాదనలేని తిలకవతి సన్యాసినియై సదాశివుని పూజిస్తూ ,తమ్ముని మిక్కిలి అనురాగముతో చూసుకోసాగినది.
పరమేశుని ప్రణాళిక ప్రకారము అప్పర్ పరమత ప్రలోభములకు దాసుడై సనాతనమును నిందించటము ప్రారంభించాడు.అక్క చెప్పే సుద్దులను చెవికి చేరనీయకుండా చేస్తున్నాడు చంద్రశేఖరుడు.ఒక్కమాటైన చెవికెక్కటములేదు.
తాను నమ్మిన శివుడే తన తమ్ముని ధోరణిని మార్చగలవాడని నమ్మిన తిలకవతి తాను మాత్రము నిష్కళంక భక్తితో నీలకంఠుని సేవిస్తున్నది.
కాలముతో పాటుగా చెరొకపక్కన ధర్మము-అధర్మము సమాంతర ప్రయాణమును చేస్తున్నవి అడ్డనామాల వాని ఆనకై ఎదురుచూస్తూఆసక్తిగా.
శివ ప్రసక్తిలేకుండా తమ్ముడు అప్పర్-శివ ప్రశస్తి తక్క అన్యము లేకుండా అక్క తిలకవతి నిమగ్నులై ఉన్నారు..
కడుపునొప్పిని ఒడుపుగా వదిలాడు అప్పర్ మీదకు తప్పక తన మార్గమునకు తెప్పించుకోవాలని.శివుడు.
ఆహార సిధ్ధి-ఆసన సిధ్ధి
ఆసన సిధ్ధి-ఆరాధ్య సిధ్ధి
ఆరాధ్య సిధ్ధి-అనుగ్రహ సిధ్ధి కి
సోపానములు అంటారు.మన శరీరారోగ్యము మనకు సహకరిస్తేనే కాని ధ్యానము -ధన్యత సిధ్ధించదు
.
సన్నగిల్లుచున్న సనాతనమును పునరుధ్ధరించుటకు అన్నట్లు పుణ్యతిథులను జరుపుతున్నాడు దీక్షాస్వీకారమునకై దాక్షాయణిపతి.
తన తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో-ఎప్పుడు వస్తాడో తెలుసుకోలేని పరిస్థితి తిలకవతిది.తమ్ముడు సనాతన ధర్మమునకు వ్యతిరేకియై,అది ఆశపెడుతున్న పదవికి దాసుడై,దైన్యమునాశ్రయిస్తాడేమోనని దిగులుతో సదాశివుని తమ్ముని సంస్కరించమని వేడుకుంటుంన్నది.
.
సమయమునకై ఎదురుచూస్తున్న సదాశివుడు కడగండ్లను తొలగించుటకు అప్పర్కు కడుపునొప్పిని పంపించాడు.
పాషణ్డ మతస్థుల పాలనలో పదవిని పొందాలంటే అప్పర్ కడుపునొప్పిని తగ్గించుకోవాలి.కాని అది శరీరపు గడపదాటనంటూ,గడబిడ చేస్తున్నది.
తడబడక తనకు ఈయబడిన పనిని,అప్పర అక్క ఇంటి గడప తొక్కేవరకు పక్కకు తప్పుకోకుండా ఉంది.
అక్క తప్ప తనను చక్కదిద్దువారెవరు లేరనుకున్న అప్పర్ అక్క ఇంటిముందర నిస్సహాయముగా నిలబడినాడు.శివానుగ్రహమైన విభూతిని అప్పర్ శరీరమంతా పూసి పునీతుని చేసినది తిలకవతి.
స్వామియే కాదు స్వామి ధరించే విబూది సైతము మహిమాన్వితమై అప్పర్ను మార్చగలిగినది.
హర శంకర శివ శివ సంకర
శివ శివ సంకర జయ జయ శంకర.
మక్కువతో భక్తులను చక్కదిద్దు ముక్కంటి అక్కచే అప్పర్కు శివదీక్షను అనుగ్రహింపచేసాడు.అంతే ఐహికమును మరచి ఆరు సంవత్సరములు అం
తర్ముఖుడై బ్రహ్మజ్ఞానమును పొందాడు.
మన తెలుగు కవిత్రయము వలె తమిళములో
అప్పర్-తిరుజ్ఞాన సంబంధర్-సుందరర్ శివజ్ఞాన సంబంధ ప్రచారమును గ్రంధరూపమున నిక్షిప్త పరచి,చరితార్థులైనారు.
"తిరుమురై "గ్రంధములోని 7 ప్రకరణ
ములను అప్పర్ మనకు అందించినారు.అంతే కాదు అద్భుత తేవారములను ప్రసాదించినారు.
తేవ-ఆరం-అనగా శివునకు/పరమాత్మకు అర్పించు హారము అని ఒక అర్థమును తీసుకుంటే,
తే వరం భవంతుని యందు అనురాగము అని మరొక అర్థమును కూడా పెద్దలు స్వీకరిస్తారు.
భగవంతునికి భక్తితో సమర్పించే భావన తేవారము అని మనము అనుకోవచ్చును.
యక్షరాజ సేవకుని (కుబేరుని) దీవెన ఎన్నో మహిమలను ప్రక్షిప్తముచేయుటకు అప్పర్ లో యాత్రా కుతూహలమును కలిగించింది.శివనామ స్మరణముతో ఎన్నో స్థలములు పునీతములగుచున్నవి.ఎందరో భక్తులు శివుని మహిమలు శివభక్తుడైన అప్పరు (వాక్రూపములో) ద్వారా ప్రత్యక్షముగా దర్శించి,ధన్యులవుతున్నారు.చనిపోయినవారు పునర్జీవితులవుతున్నారు.మూగబోయిన వేదములు నాదమయములై మోదమందుచున్నవి.
క్రమక్రమముగా కానికాలము కరిగిపోతూ,సనాతనపు వేకువకు దారిని చూపిస్తున్నది.కాని సామాన్య జనములకు కావలిసినది నిదర్శనము.
ఓం నమః శివాయ-శంభో శంకర
అప్పర్ ద్వారా శివమహిమలు
అందరికి ఆ
నందమునిస్తుంటే,సనాతనధర్మమును వ్యతిరేకించు రాజును కలవరపరచినవి.
"దండనం దశగుణం భవేత్ "అనుకున్నాడేమో సనాతనధ్ర్మ విద్వేషి యైన రాజు
అప్పర్ ను అనేకానేక చిత్రహింసలకు గురిచేసాడు.
"సత్యమేవ జయతే "అను వాక్యమును నిజము చేస్తూ,అప్పర్ ను ఆ శిక్షలు ఏమీచేయలేక పోయినవి.
సాంబశివుడు రాజును అనుగ్రహించి సుందరమైన శుభకరమైన శివతత్త్వమును ప్రసాదించాడు.
అప్పర్
అదిదేవుని ఆనతి ప్రకారము అంత్యమున సోమస్కందమునకు వెళ్ళి శివైక్యమునందినాడు.
కొండంత దేవునికి కొండంత పత్రిపూజను చేయలేని నేను అప్పర్ అణువంత మాత్రమే స్మరియించగలిగాను..అనుగ్రహిస్తే మరింత వివరములతో మీ ముందుకు వచ్చే ప్రయత్నమును చేస్తాను.క్షంతవ్యురాలను.
అప్పర్ను అనుగ్రహించిన సదాశివుడు మనలనందరిని అనిశము రక్షించునుగాక.
ఏక బిల్వం శివార్పణం.
NESA NAYANAR
నేశ నాయనారు
***************
" శంభో మహాదేవ శంభో
శివ శంభో మహాదేవ శంభో
ఫాలావలనమ్రత్ కిరీటం
ఫాలనేత్రార్చిధా దగ్ధ పంచేషు కోటం
శూలాహలా రాతి కూటం
శుధ్ధమర్థేంద్రుచూదం
భజేమార్గ బంధుం
భజే మార్గబంధుం.(శ్రీ అప్పయ్య దీక్షితులు)
శిరస్సున
కిరీటమును ధరించినవాడు,మూడవనేత్రముతో మన్మథుని జయించినవాడు,త్రిశూలముతో శత్రువులను సంహరించినవాడు,శుభకరుడు,మాయాతీతుడు,సిగలో చంద్రకళను ధరించినవాడు,మార్గ బంధువు అగు శివునికినమస్కరించుచున్నాను.
***
హరియను రెండక్షరములు
హరియించును పాతకములు అంబుజనాభా
హరి నీ నీ నామ మహాత్మ్యము
హరిహరి పొగడంగ, వశమె హరి శ్రీకృష్ణా!
(నృసింహకవి)
నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే,
శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తముళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది.
మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి.
మనముపై పంచాక్షరి నామములను దారములను సర్దుతు భక్తియను వస్త్రములను నేయుట ప్రవృత్తి.
కామేశుని భక్తులకు పంచిపెట్టుటకై కౌపీనములను నేయుట ,
శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపముగా దర్శిస్తూ,వారికి పంచెలు-కౌపీనములను పంచుతూ,పరమ సంతోషపడు వాడు.
Wednesday, November 17, 2021
TIRUNEELA NAKKAR NAAYANAAR
తిరునీల నక్కర్ నాయనారు
********
" బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం."
సాక్షాత్తుగా బ్రహ్మయే దిగివచ్చి ఆరాధించిన శివుని ఆలయము ,
అయ-వంద-ఈశ్వర ఆలయము.అయవందీశ్వరుని అనుగ్రహపాత్రుడైన నాయనారు నక్కర్ నాయనారు.
చోళరాజ్యములో అనవరతము వేదము నినదించు "తిరుచత్తాత మంగై పురములో జన్మించిన మన నాయనారు అసలుపేరు మరుగునపడి,నక్కర్ వేదవిజ్ఞానమును అవగతము చేసుకొని ఆచరించువానిగా ,తిరునీలకంఠుని భక్తునిగా,
తిరునీల నక్కర్ నాయనారుగా కీర్తింపబడుచున్నాడు.
నిత్యము తన ధర్మపత్ని తో పాటుగా,నీలకంఠుని నిండార సేవిస్తూ,అన్యమెరుగక ధన్యతనొందుచుండెడివాడు.
ఉన్నచోట,ఉన్నతీరున,ఉండనీయడు కదా తన భక్తులను ఆ మూడుకన్నులవాడు..కరుణ చూపుతాను అంటూ,కఠిన పరీక్షలను పెట్టుతూ,వానిని దాటిస్తుంటాడు.కొంతసేపు కరుణను దాటవేస్తుంటాడు.
చిక్కులు కల్పిస్తూ,మక్కువతో తొలగిస్తూ వేడుకగ కొందరిని పాపులుగా/
పావులుగా మారుస్తూ,నిరపరాధులైనను నిందలకు గురిచేస్తూ,మోదమందుతుంటాడు ఆ నందివాహనుడు.
పాలించేవాడు సాలెపురుగును లాలించదలిచాడో/నాయనారు భార్యను పరిపాలించ దలిచాడో కాని ,
తనలింగము మీద పాకే సాకును కల్పించాడు సాలీడుకు.పాకుతు చీకాకు పెట్టడానికి సిధ్ధమయింది శ్రీ పురుగు ఆటకు తాను శ్రీకారము చుడుతూ.
ఈశ్వర పరీక్ష తమను సమీపించుటకు నిరీక్షిస్తున్నదన్న విషయమును తెలుసుకోలేని నాయనారు దంపతులు,విషము కంఠమున దాచిన వానిని సేవించుటకు సంసిధ్ధులైనారు.సకల ఉపచారములను చేస్తున్నారు.సేవా సౌభాగ్యముగా ప్రతి ఉపచారమును ప్రసన్న మనస్కులుగా చేస్తూ,ప్రత్యక్షముగా స్వామిని చూస్తూ ,పరవశిస్తూ,
అంతర్ముఖము-బహిర్ముఖములతో దోబూచులాడుకుంటున్నారు.
దేవాలయములో/తమ దేహములలో దాగిన వాడితో.
అదే సమయమనుకున్నదో ఏమో ఆ సాలీడు ఆదే పనిగా పాకుతూ,లింగమును తాకుతూ,లాలా జలముతో లాలిస్తూ,నోటి దారముతో పట్టుపుట్టములు కడుతూ తాను మురుస్తూ-తన స్వామి కార్యమును నెరవేరుస్తూ దూసుకుపోతున్నది.
నాయనారు భార్య మూసుకున్న కన్నులు చటుక్కున తెరుచుకున్నాయి .అనుంగు సుతుని కనులారా చూసుకోవాలనే ఆకాంక్ష అంతర్ముఖమును విడివడింది.
వాని లీలను అవలీలగా గ్రహించలేని అమ్మ మనసు లింగమునకు జరుగుచున్న అపచారమునకు విచారగ్రస్తమైనది.సదాచారము జరుగుచున్న అఘాయత్వమును చూస్తూ మిన్నకుఓడలేని,
ఆ సాధ్వి తన పక్కన అంతర్ముఖుడై యున్న నాయనారు వైపు చూసినది తక్షణ తన కర్తవ్యమునకై.
సలక్షణమైన సమాధిలో సన్నుతిస్తున్నాడు సాంబశివుని నాయనారు.
కదలడు-మెదలడు.కనులు విప్పడు.బదులు చెప్పడు.బాహ్యమును వదిలివేసిన నిశ్చలత్వముతో అత్మనివేదనమును చేస్తున్నాడు.
అటువైపు సాలెపురుగు చేయుచున్న అపచారము-ఇటువైపు సర్వేశునికి తనపతి చేస్తున్న ఉపచారము.
చేసేది లేక/చేయకుండా ఉండలేక తన నోటితొ ఊది,గాలిని పంపి బూదిపూతల వాని మీద పాకుతున్న సాలీడును జరిపివేసింది.
కథను మరింత ముందుకు జరుపుతున్నాడు కందర్పదర్పుడు. నాయనారు కనులను తెరిచి,జరిగిన అపచారమును గుర్తించేలా చేసాడు ఆ జగన్నర్తకుడు.
మాయామర్మములెరుగని మనసుతో మహేశుని లింగమును చూశాడు.నున్నతనము సన్నగిల్లి పొ
క్కులు మిక్కుటమైనవి.భార్య చేసిన అపచారమే భవుని లింగమునకు కష్టము తెచ్చినదని అనుకున్నాడు.గుడిలోని లింగము గుట్టుగా తనపని కానిస్తున్నది.
భార్యచేసిన పనికి ఆగ్రహించిన నాయనారు ఆమెను కోవెలలోనే ఉండి పశ్చాత్తాపముతో స్వామి పాదపద్మములను ఆశ్రయించమని ఇంటికి తానొక్కడే వచ్చాడు
స్వామికి తమవలన జరిగిన అపరాధమునకు నొచ్చుకుంటూ నిద్రకుపక్రమించాడు.
చూపునిచ్చినది దేవుడైన మరి అంధులనేల సృజించె అని అమాయకత్వము ప్రశ్నిస్తే,
అల్ప బుధ్ధితో దైవశక్తినే సలుపకు పరిహాసం-అని సమాధానమునిస్తుంది పరిణితిచెందిన ఆత్మతత్త్వము.
వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విచిత్రం అన్నట్తుగానే,
నాయనారుకు స్వప్నసాక్షాత్కరామునందించిన,
ఔషధీనాం పతి తన శరీరములోని ఓక భాగమును నున్నగా/మరొక భాగమును పొక్కినట్లుచూపుతూ,నా తల్లి( చేసిన ఉపచారమే)చల్లని స్పర్శయే నాకు చల్లని స్పర్శయే నా రుగ్మతను తగ్గించగలదంటూ,పొక్కులతో నిండిన మిగిలిన భాగమును చూపించి అదృశ్యమయాడు ఆదిదేవుడు.
కళ్ళుతెరిచిన నాయనారు ,
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకుందునా
సాలీడు పాకగ స్వామి శరీరము పొక్కిపోయె
గ్రహచారము చాలక ఎర్రగ కందిపోయె
పాయని భక్తి తానొక ఉపాయము సేసి వేగమే
జాలము చేయక ఉపచారము చేయుచు సాగిపోయె ఆ
నక్కనయనారుని ధర్మపత్ని,కోపించీ నాయనారు సామిని,
క్షమియించగ కోరగ,ఆమె వైద్యమే సరియనె సాంబుడు
గాఢత ఎంత ఉన్నదో కద ఆ మూఢపు భక్తిలో
నెమ్మదినీయగ స్వామికి తల్లి ఉమ్మియె కారణమాయె
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.
అనుచు కీర్తిస్తూ కోవెల దగ్గర తన రాకకై వేచియున్న సాధ్విని సహృదయతతో ఇంటికి తీసుకువచ్చెను.
తిరు చంపంధర్,తిరునల్లకండ్ల ఎల్పనార్ మొదలగు సాక్షాత్తు శివ స్వరూపములతో పాటుగా,శివుని-శివభక్తులను నవవిధభక్తితో నర్తిస్తూ,గానముచేస్తూ,మార్గములను పుష్పాలంకరముతో సురుచిర (దారులను-బాహ్యము-ఆరాధనలను భక్తి యను పుష్పాలంకృతముగా-భక్తులకు సకల సౌకర్యములను సమకూరుస్తూ,) అంత్యమున
శివైక్యమునొందిరి.
నాయనారు దంపతులను అనుగ్రహించిన భిషక్కు మనలను తన కృపాదృక్కులతో అనిశము రక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం
Tuesday, November 16, 2021
MANA KAMCHARA NAYANAR
మన కంచార నాయనారు
*******************
స్వార్థ సంహార సంకేతముగాగ గజచర్మము
శాశ్వతత్త్వ పునీతముగాగ గంగావతరణము
మనోవికార మర్దనము గద మన్మథ సంహరణము
మరువకే ఓ మనసా! శివ నామస్మరణము.
శ్రీ వేదసార శివస్తోత్రము.
కంచార-సఖుడు.
మన కంచార-మనసులో నిండిన సఖుడు.
పరమేశుని తన మనసులో నిండిన సఖునిగా భావించి పూజించుట వలన ఈ నాయనారు కంచార నాయనారు/మన కంచార నాయనారుగా ప్రసిధ్ధిపొందినాడు.(ఆంతరంగికము)
కాంచారూరు పట్టణములో భూస్వాముల కుటుంబమునందు జన్మించిన వాడగుటచే మన కాంచార నాయనారు అని కూడా భావిస్తారు.(బాహ్యము)
వంశానుగతముగా లభించిన/వారసత్వముగా లభించిన చోళ సేనా నాయకత్వమును వృత్తిగాను/
షడ్వర్గ సేనలను సమర్థవంతముగా శివభక్త పాదసేవార్పనమునకు పరమార్థవంతముగా పనిచేయించు ప్రవృత్తిగాను కాలమును సద్వినియోగము చేసుకునే వాడు.
మన నాయనారును శివానుగ్రహము గృహస్థాశ్రమములోనికి ప్రవేశింపచేసినది.
కాలముతో పాటుగా సాగుతున్న శివుని మాయాజాలము మనలను ఆశ-నిరాశలను ఊయలలో ఊగిస్తుంది కదా.
నాయనారు ఇంట ఊయలలో బిడ్డ ఊగే తరుణము కరుణను మరచినదా యన్నట్లుగా తాత్సారముచేస్తూ,శరణాగత రక్షకుని చరణసేవాసక్తతకు నాయనారును ఉపక్రమింపచేసినది.
అపుత్రస్య గతిః నాస్తి- అన్న ఆర్యోక్తి నాయనారుని అర్థిని చేసింది
.
పరమేశుని అనుగ్రహము పుణ్యవర్ధిని అను పుత్రిక పేర తరలివచ్చినది తల్లితండ్రుల కన్నులపండుగగా.అపురూప సౌందర్యరాశి.అతులిత సుగుణాల నిధి.పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా చిన్నతనమునుండియే శివభక్తి తత్పరతతో దినదినప్రవర్థమానమైనది.
పుణ్యవర్ధిని కపర్ది కరుణాలవాలమేమో తుమ్మెదరెక్కలవంటి నల్లని చిక్కని పొడవైన కేశపాశముతో
శుభలక్షణములతో నడయాడసాగెను.
కుమార్తెకు వివాహసమయమాసన్నమైనదని,తగిన శుభలక్షణుడైన,అయర్కోన్ కలికామ నాయనారు తో వివాహమును చేయ నాయనారు సంకల్పించెను.
మంగళతోరణములు,భూమియంత పీట-ఆకాశమంత పందిరి,అంగరంగ వైభవముల అలంకారములు,ఆనందముగా ఆడపెళ్ళివారు అన్ని పనులను జరుపుకుంటున్నారు.
అపరంజి పుణ్యవతిని పెళ్ళికూతురును చేయుటకు ముత్తైదువులు ఆయత్తమవుతున్నారు.
ముడికి అందని కేశములను చూసి మురిసిపోతున్నారు.నిడివితనమును చూపిస్తూ పొగుడుతున్నారు.కేశపాశము విరజిమ్ముతున్న సుగంధములకు తోడు
గా సుందరత్వమును అద్దుటకు తొందరపడుతున్నారు.మూడుపాయలుగా ముడులు లేకుండా విడదీసి జడను అల్లుతున్నారు.జడకుప్పెలను అలంకరించారు.ముత్యాల దండలను ముడిచారు నవరత్న హారములతో నగిషీలను అద్దారు.కన్నులు తిప్పుకోలేనంత కనికట్టు
నున్నది ఆమె వాలుజడ.ఇది బాహ్యము.
మూడు పాయలుగా విభజించుట అనగా దేవుడు జీవుడు ఆ రెండింటిని జతచేయు జగన్నాటక సూత్రధారుడు.జడ మూడుపాయలుగా విభజింపబడి యున్నప్పటికిని బాహ్య నేత్రములకు రెండుగా మాత్రమే కనిపించును.మూడవది ఉన్నప్పటికిని అది అవ్యక్తముగానే ఉంటుంది.
రాబోవు/జరుగబోవు సంఘటనకు దీనిని సూచనగా కనుక మనము అనుకుంటే ,
" నమో కపర్దినేచ-వ్యుప్తకేశాయచ"
నాయనారు మనసులో ఒకటే వెలితి.తన సఖుడు ఇంకా వధువును ఆశీర్వదించుటకు రాలేదు.వేయి కన్నులతో ఎదురుచూస్తున్నాడు ఏలినవాని రాకకై.
కదులుతున్నాడు కాముని కాల్చినవాడు.జటలను అందముగా ముడివేసుకున్నాడు.విభూతిని తీరుగా పూసుకున్నాడు.యజ్ఞోపవీతము సిధ్ధమైనది స్వామి ఆటకు పావుగా మారటానికి,కపాలమాలలు కదులుతున్నాయి కాగల లీలను చూడాలని.
రానే వచ్చాడు మహావ్రత శివయోగి
తేజో కిరణములను వికిరిస్తూ/వెదజల్లుతూ.
నాయనారు ఆనందమునకు అవధులు లేవు.సాదరముగా స్వాగతించాడు సఖుని.సమస్త ఉపచారములను సంతోషముగా/సంతృప్తిగా
చేశాడు.
.పుణ్యవతిని పాదనమస్కారమాచరించి,ఆశీర్వచనమును పొందుటకై పిలిచాడు.
పాములు మెడలో నున్నవాడు అదే అదననుకున్నాడు.కదిలి వచ్చింది పుణ్యవతి కళ్యాణమునకు పెళ్ళికూతురుగా ముస్తాబయి,కదులుతున్నది వయ్యారముగా వాలుజడ ఆటకు నాగినిలా.
పరమపూజ్య భావముతో పవిత్రపాదములకు వంగి నమస్కరించినది పుణ్యవతి.
వంగిన ఆమె వెనుకభాగమున సింగారముగా నున్న జడను మోహముతో చూస్తున్నాడు మోహినిని వెంబడించినవాడు.
ఎంతటి పరమాద్భుత దృశ్యము.కాముని చంపిన వాని మనసులో కోరిక వేడుక చేసుకుంటున్నది.నాయనారును వేడుకునేలా చేస్తున్నది.
స్వామి వధువును ఆశీర్వదించండి అన్నాడు నాయనారు.జడ చేస్తున్న చమత్కారమా లేక జటాధారి చేస్తున్న పరీక్షా రూపమా అన్నట్లుగా శివయోగి కదలక మెదలక ఉన్నాడు.
స్వామి నా ఆతిథ్యములోని లోపములను సవరించుకుంటాను.మీరు సంతుష్టాంతరంగులై మా సాలంకృత కన్యను ఆశీర్వదించండి శరణు శరణు అంటున్నాడు నాయనారు.
కరుణాంతరంగుడు తనకు కావలిసినది కోరుకొనుటకు ,నిశ్చయించుకొని,
మన కంచార,తో
నేను వ్రతదీక్షలో నున్నాను.ఆ దీక్షా సమయమున సుగంధ-సులక్షణ కేశ పాశముతో " పంచవటి" అను పవిత్ర యజ్ఞోపవీతమును నేను ధరించవలసి యున్నది.నీ కన్య పుణ్యవతి కేశపాశమును కనుక కత్తిరించి నాకు ఇచ్చివేస్తే నేను దాన్ని తీసుకుని,సంతోషముగా ఆశీర్వదించుతాను అన్నాడు అమాయకముగా.
మంగళకర సమయమున అమంగళము ప్రతిహతమగుగాక.
పుణ్యవతి జన్మసంస్కారమేమో,నాయనారు పుణ్యమేమో కాని ఏ మాత్రము సంశయించక తక్షణమే కేశములను కోసి వేసి ,అర్పించి,ఆశీర్వచనమును పొందినది..కేశపాశముతో పాటుగా అంతర్ధానమయ్యాడు క్లేశములను తొలగించువాడు.
పెళ్లి ఆగిపోయినది పేచీలతో.ధీటైన భక్తి ఆటను శుభప్రదము చేసినది.పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై పుణ్యవతికి సురుచిర సుగంధ కేశపాశమును ప్రసాదించి,పెండ్లి జరిపించి,నాయనారుకు ముక్తిని ప్రసాదించి,అనుగ్రహించినారు.
నమ్మిన నాయనారును అనుగ్రహించిన నాగరాజాభూషణుడు నగజను కూడి మనలనందరిని సంరక్షించును
గాక.
ఏక బిల్వం శివార్పణం.
Monday, November 15, 2021
RUDRA PASUPATI NAYANAR
ఉరుత్తిరు రుద్ర పశుపతి నాయనారు.
*****************************
" పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం
రుద్రస్తయా స్ఫురతి తేన చతుర్య్హ కాండః
కాందేన తేన యజురేవ విభాతి నిత్యం
ఋక్సామ మధ్య మణివాచ విభాంతి వేదా"
నమః శివాయ అను పంచాక్షరి మంత్రము "శివ" అను పదము చేత ప్రకాశించుచున్నది.
శివపంచాక్షరిని ప్రశంసించి నిర్దేశించుటచే రుద్రాద్యాయము ప్రశస్తమగుచున్నది.
రుద్రుడు తేజోరూపము.
రుద్రాధ్యాయము వైదికమగు స్తుతి.రుద్రాధ్యాయమనగా నమకము మరియు చమకము.నమః అను శబ్దము పలుమార్లు ఆవృత్తమగుటచే నమకము అనియును,చ-మే పలుసార్లు చెప్పబడుటచే చమకము అనియు సార్థకనామములను సంతరించుకున్నవి.
"తిరుతొండర్దొగై" సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు.
" నమః కాట్యాయచ-నీప్యాయచ
నమః సూద్యాయచ-సరస్యాయచా"
కొండమీది నుండి జారిపడే జలము నీప్యము.కొద్దిపాటి జలము కాటము.
" నమో నాద్యాయచ-వైశంతాయచ"
నదీ జలములములలో నుండువాడు నాద్యాయచ,
స్వల్పజలము కలది వేశంతము.అవి మన భాషలో చెప్పుకోవాలంటే, కోవెలలోని దైవ తర్పణము కొరకు ఏర్పరచిన దేవ ఖాతములు.పుష్కరిణులు.
ఆ పుష్కరిణి జలమును సాక్షాత్తు పరమేశుని ఆవాసముగా ఆరాధిస్తూ,
త్రికాలములందు -తిరుతలయూరు నందలి పార్వతీ శ్రీ బాలేశ్వర స్వామి పుష్కరిణీ తీర్థమునందు తలలోతు మునిగి,
బురదంటని పద్మమువలె ఊర్థ్వ ముకుళిత హస్తములతో,సూత సంహిత నుడివినట్లు,
'వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి యైయదా
శివే రుద్రే జపాత్ ప్రీతే ప్రీతా ఏ వాన్య దేవతాః"
రుద్రాధ్యాయము వేదములలో ఉత్తమము.హోమాది కర్మలలో ప్రధానము,అమృతప్రదము కనుక,
రుద్రపారాయణను చేసేవాడు
నాయనారు అచంచల భక్తికి నిదర్శనమా అన్నట్లుగా, --
బాహ్యము సైతము రుద్రాక్షమాలలతో తన భక్తిని ముద్రించుకునేది.తిరుపుండ్రములు నిరంతర విభూతిని/ఐశ్వర్యమును ప్రకటిస్తూ పరమేశ ప్రస్తుతిని చేస్తుండేవి.సత్వగుణ సంపన్నమైన నాయనారు ముఖము సాక్షాత్తు సదాశివ రూపముగా తేజరిల్లుతుండేది.నాభినుండి శోభాయమానముగా వెలువడుతున్న నమక-చమకములు నలుదిక్కులా నినదిస్తుండేవి.
నిద్రాహారములు దరిచేరుటకు ధైర్యము చేయలేకపోయేవి.అన్యమునకు స్థానము నాస్తి నాస్తి.
శ్వాస మాత్రమే రుద్రనాయనారు అనుష్టానమునకు ఆలంబనగా ఉండేది.
ఇక్కడ మనము కొంచము పరిశీలిస్తే అనేకానేక జన్మల చక్రములలో నిరంతరముగా తిరుగుచున్న జీవునికి దాని నుండి విముక్తి లభించాలంటే, దానికంటే బలమైన శక్తి అవసరము.ఆ శక్తి సత్యమైనది-శుభప్రదమైనది-శాశ్వతమైనది అయితేనే తాత్కాలితను తొలగించగల సామర్థ్యతను కలిగియుంటుంది.
మనకు పాశము-పశుపతి-పశువు అను మూటిని కనుక పరిగణిస్తే ,
పాశమును వేయగల/తీయగల సామర్థ్యము కలవాడు శాశ్వతుడు.పాశము శాశ్వతుని చేతిలో నున్నది కనుక అదియును శాశ్వతమే.కాకపోతే పశుపాశ బంధితుడు తన పూర్వజన్మల పుణ్య-పాప కర్మల అవశేషములను ముగించుకొనుటకై ,పునరపి జననం-పునరపి మరనం-పునరపి జనననీ కఠరే సయనం" అని శంకర భగవత్పాదులు సెలవిచ్చినట్లు ఉపాధి అను పాశముతో భగవతత్త్వమునకు-జీవనకృత్యమునకు ముడివేయబడి జన్మరాహిత్యమును పొందుటకు దయాంతరంగుడైన "పతి" చే మరొక్క అవకాశమును పొందుచున్నాడు.
జీవన పరమార్థమును ఆకళింపు చేసికొనిన నాయనారు నమక-చమక పారాయణమును సంసారపు సాగరమును దాటించు నావగా భావించిన వాడు.
ఆంతర్యమును అభివ్యక్తీకరించుటలో కూడా తన అనుష్టాన భంగిమను ఒక అద్భుత సందేశముగా చూపుతు మనలను అనుగ్రహిస్తున్నాడు పశుపతి రుద్రనాయనారు.
ప్రతిజీవి సంసారమనే ప్రవాహమును ఈదలేక తలమునకలవుతుంటాడు.ఆ సాగరము చిక్కటి బురదతో, పెక్కు మొసళ్ళతో
కాలు తీసి,పైకివేసి,కదిలి వద్దామన్న విడిచిపెట్టక మనలను ఒడిసి పట్టుకుని ఉంటుంది.
అటువంటి బురదతో నిండిన చెరువులో ఉన్నప్పటికిని పద్మము ఏ విధముగా దినపతి అయిన సూర్యకిరణముల సహాయముతో,తన పుట్టినిల్లైన బురదను ఏ మాత్రము అంటనీయక స్వచ్చముగా ఉంటుందో,సుగంధభరితమవుతుందో,అదే విధముగా తాను పుట్టిన /తనకు పుట్టినిల్లైన సంసార బంధములను పశుపతి కరుణ అనెడి కిరణముల ద్వార తన ఉపాధిని సంస్కార భరిత సుగంధ మయము చేసుకోవాలని తానొక నిదర్శనమై,నీలకంఠుని నిస్తుల కరుణను పొందిన నాయనారు ప్రాతస్మరణీయుడు
తామర తటాకములో తానొక తామరయై జలములో-జగములో జంగమదేవరను కాంచి-జపించి,పరమేశ్వర సాక్షాత్కారమును పొందుటయే కాక స్వామిచే ఉరు-తిరు-రుద్ర-పశుపతిగా అనుగ్రహింపబడినాడు.
భగవంతుడు-భక్తుడు అను ద్వంద్వము మమేకమై నాయనారు కీర్తిని లోకవిదితము చేసినది.
నాయనారును అనుగ్రహించిన నాదనాధుడు మనలనందరిని అనిశము సంరక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
.
.
KAMCHARA NAYANARU
" నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ."
చిదానందరూపా-కంచార నాయనారు
*****************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కంచార నాయనారు చోళదేశ సేనాపతి
శివతపోఫలితముగా కుమార్తె జన్మించింది
యుక్తవయసు రాగానే యోగ్యుని అల్లుడు అనుకొనె
దీవించగ ఏతెంచెను మహా వ్రతుడు "వధువును"
విధేయముగా వధువు వంగి పాద నమస్కారమును చేసె
విచిత్రముగా అతిథి వధువు కేశపాశమును కోరె
సందేహించక ఏమాత్రము కోసి ఇచ్చేసెనుగా
కైవల్యమును పొందగ కోసిన కేశపాశము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక
శివ భక్తులను కొలుచుట ఆదరించుట శివపూజగా భావించు కంచార నాయనారు చోళరాజ్య సేనా నాయకుడు.సదాశివుడు నాయనారు భక్తికి మెచ్చి సకల సద్గుణరాశియైన ఒక కుమార్తెను అనుగ్రహించాడు.యుక్త వయసువచ్చిన ఆమెకు శివ భక్తడైన ఇయర్కాన్ కాలికమార్నుని వరుడుగా నిర్ణయించాడు శివుడు.
" ఆట కదరా శివా ! ఆట కద కేశవ- ఆట కదరా నీకు అన్ని పనులు."
భక్తుని చరిత్ర అందముగా మరందముచిందాలని నిందను స్వీకరించుటకు ముందుకొచ్చాడు ఆ నందివాహనుడు. జడలు కట్టినకొప్పును అలంకరించుకొన్నాడు. ఓం కపర్దినేచ నమో నమ: అంతటితో ఆగక కొన్ని కేశములను యజ్ఞోపవీతమును చేసుకొని అలంకరించుకొన్నాడు,నమో వృక్షేభ్యో-హరికేశేభ్యో" అని సన్నుతులందువాడు.ఒక మహావ్రతుని రూపుదాల్చి నాయనారు ఇంటికి వేంచేశాడు.మహదానంద పడిన నాయనారు శివుని పూజించి,తనకుమార్తెను పిలిచి సాధువుకు నమస్కరించమని స్వామి దీవెనలు అందుకోబోతున్న తన బిడ్డను చూసి దొడ్డ సంబరమును పొందాడు." ఆనతి నీయరా శివా" అంటు మైమరచిపోయాడు.
కపర్డిగా వచ్చిన సాధువు ఆశీర్వచనమునకై వంగిన వధువు కబరీ బంధమును (కేశ సంపద-జడ) చూసి తనను తాను వ్యుప్త కేశుడిగా (కేశములు లేని వాడిగా) భావించుకొని,నాయనారుతో అమ్మాయి కేశ సంపదను తాను మోహించానని,దానితో పంచవటిని నిర్మించుకుంటానని,
కనుక తనకు ఇయ్యమని కోరాడు."శివ శివ! అమంగళము ప్రతిహతమగుగాక"!. ధూర్జటి చెప్పినట్లు అన్నీ తన దగ్గరనే ఉన్నను ఆత్మార్పణశక్తిని పరీక్షించుచు మైమరచిపోతుంటాడు ఆ జడల రామలింగేశ్వరుడు..ఏ మాత్రము ఆలోచించకుండా తక్షణమే కోసి, దానిని శివార్పణము చేస్తూ "జటాజూట ధారి-శివా చంద్రమౌళి,నిటాలాక్ష నీవే సదా మాకు రక్ష అని ప్రార్థించిన మన కంచార నాయనారు కుమార్తెను దీర్ఘ సుమంగళిగా దీవించిన ( ఆమె కేశపాశము తిరిగి వచ్చేసింది) జటలలో గంగమ్మను బంధించిన భోళా శంకరుడు మనలందరిని తన కరుణతో బంధించును గాక.
మాన కంచర నాయనారు సంతానమునకై నీలకంఠుని అకుంఠిత దీక్షతో తపమాచరించి,ఆశీర్వచనముగా లక్ష్మీస్వరూపమైన కుమార్తెను పొందెను.
పెళ్ళికూతురును మురితుచు ముస్తాబు చేస్తున్నది బాహ్యము.పరీక్షాసమయమాసన్నమయినదనుచు ప్రవేశించుచునది దైవము ఆంతర్యము.
ఘటనాఘటనా సమర్థుడు కళ్యానమందపమునందు సమీపించాడు .ఘటనాఘటనా సమర్థుడు క్
తుమ్మెదరెక్కలౌ పోళ్యానమందపమునందు సమీపించాడు .నల్లని తుమ్మెదరెక్కల వంటి వధువు కుంతలములను నవరత్న మణులతో జడగంటలతో సూర్య చంద్రులతో పాపిడి బిళ్లలతో అలంకరిస్తున్నారు.
( ఏక బిల్వం శివార్పణం.) .
.
Sunday, November 14, 2021
DANDI ADIGAL NAYANAR
దండి అడిగళ్ నాయనారు
*********************
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం.
ఏ సంకేత రూపముగా నున్న పరమాత్మ లింగమును బ్రహ్మ విష్ణువు మొగిలిన దేవతలు అర్చింతురో,నిర్మలమైన ఏ లింగము సకల చరాచర జన్మలకు ముడిపడియున్న కర్మపాశములను విడదీసి,దుఃఖములను నశింపచేయునో అట్టి సదాశివునికి నా నమస్కారములు.
********
చోళదేశములో తిరునావూరులోని పరమ శివభక్తుడు దండి అడిగళ్ నాయనారు.
అడిగల్ పాదపద్మములు-పరమేశ్వర పాదపద్మములను దండిగా అపరిమితముగా నమ్మిన వాడగుటచే దండి అడిగళ్
గా కీర్తింపబడుచున్నాడు.వారు సార్థకనామధేయులే సదాశివునికి ప్రియమైన వారే.
దండి అడిగల్ బాహ్యమునకు అంధుడు.అంతర్దర్శనశక్తిమంతుడు.
కన్ను తక్క నాలుగు ఇంద్రియములను స్వామిసేవకు మిక్కిలి ప్రేమతో సమర్పించే సమర్థుడు.
స్వామి లీలలు వినుచు
తన శ్రవణేంద్రియమునకు సౌఖ్యమును కలిగించేవాడు.
స్వామిని తాకుతు స్పర్శను
పరవశమొందించేవాడు.
సామి కరుణ యను సుగంధములను ఆఘ్రాణించుచు ఆనందపడేవాడు
.పరమేశుని గుడి చుట్టు ప్రదక్షిణములను లక్షణముగా చేస్తూ మురిసిపోయేవాడు.
నిర్మలమైన తన మనసులో నీలకంఠుని దర్శిస్తూ,స్మరిస్తూ,పూజిస్తూ,
నిశ్చితగానుండు సత్వగుణశోభితుడు.నాయనారు.
పొంచియున్న పరీక్షా సమయము మదాంధులతో వారు తలచుచున్న అంధునితో తలపడుటకు తరలివచ్చినది తన పని తాను చేసుకొనిపోవుటకు.
నందివాహనుని ఆనకు వినోదమునకు తాను సిధ్ధమైనది కటాక్షమునకు కారణముగా గుడి పడమట వైపునున్న తటాకము.
.
శివద్వేషులుగా బాహ్యమునకు శివకార్య నిర్వాహకులుగా ఆంతర్యమునకు సిధ్ధమైనారు జైనుల రూపములో నున్న రాజ సేవకులు.
ఇంకెందుకు ఆలస్యము అన్నట్లుగా శివుని కోవెలకు సంబంధించిన చెరువును పూడ్చుటకు కుప్పలుకుప్పలుగా మట్టిని పోసే పని ప్రారంభమయింది.శంభుని మాటను వింటూ.
అందరు చేసేదిలేక నిస్సహాయముగా చూస్తున్నారు.
గుసగుసలాడుకుంటున్నారు చూపులేనివాడని అజ్ఞానము భావించే.నాయనారు చెవివరకు చేరింది చెడువార్త.
అడ్డుకొనుటకు దొడ్డతనము ముందుకువచ్చింది.కపర్దికి కావలిసినది కూడా అదేకదా
.ఆటను ప్రారంభించాడు పోటీ రూపములో అజ్ఞానమునకు-జ్ఞానమునకు.
ఆడిస్తున్నాడు మూడుకన్నులవాడు.వేడుకుంటున్నాడు వేడుక తెలియనివాడు.
ఒక కర్రను. తాడును తీసుకుని చెరువు దగ్గరకు వచ్చాడు దండి అడిగల్. చెరువు మధ్యలో ఒక కర్రను పాతాడు.కాసేపు మనము దానిని ఇహము అనుకుందాము.భక్తి అనే తాడు ఒక కొసను దానికి గట్టిగా కట్టాడు.
.రెండవ కొసను కట్టుతకు పైపైకి ఆధ్యాత్మికము వైపుకి తడుముతకుంటూ,
తడుముకుంటూ రెండవ కొసను చేతిలో పట్టుకుని నడుస్తున్నాడు .
స్వామి కృప వానిని జరుపుతు-జరుపుతు గట్టుమీద ఉన్న రెండవ స్తంభము వైపునకు గుట్టుగా చేరుస్తున్నది.పట్టుకుని దానిని తన చేతిలో నున్న తాటి రెండవ కొసను గట్టిగా కట్టాడు నాయనారు.స్వామిని స్మరిస్తూ..స్మరిస్తూ..
శివ పాదము మీద నీ శిరమునుంచరాదా
భవసాగరమీద దుర్భర వేదన లేదా
శివ శివ శివ అనరాదా
శివ నామము చేదా?
ఎంతఓ ఎంతో ఎంతో రుచిరా అనుకుంటూ,
ఎంతటి పరమాద్భుతము.
గట్టు మీద నున్న స్తంభమునకు బిగించిన తాడు తాను పట్టును సడలించక తటాకములో పెట్టిన కర్రకు ఊతముగా మారినది.ఊదిపూతల వాని కనుసన్నలలో.
విరాజమానుడు బహువిధములుగా దాసోహమనుచు ఒక వైపు మదాంధులనుంచి మట్టిని తట్టలతో వేయిస్తూ పూడిపిస్తున్నాడు తటాకమును పగటిపూట..
మరొక వైపు నిశియు తానైన వాడు (నాయనారు)కసిగా తట్టల తట్టల మట్టిని గట్టుకు చేరుస్తూ పూడికను తీసివస్తున్నాడు తడబడక తడుముకుంటూ.
చీకటితో పాటుగా శివద్వేషమును కూకటివేళ్ళతో సహా తొలగించే ప్రయత్నములో రాటుతేలుతున్నది గుడ్డి భక్తి.
చెరువు పగలు తాను మట్టిలో మునుగుతూ రాత్రి నాయనారు సేవకు సాక్ష్యముగా మారినందుకు సంతోషపడుతు చిద్విలాసుని లీలకు ఆవాసమైనది.
ద్వంద్వ యుధ్ధమును నిర్ద్వంద్వముగా జరిపిస్తున్నాడు నీలకంఠుడు.
ఫలితమును చూపించవలసిన సమయమునకు సూచనగా పసన్నత తాను సిధ్ధమవుతూ,పరీక్షకు పరిహాసమును ముందు పంపినది.
అడిగళ్ ఆంతర్యమును తెల్లబరచుటకా యన్నట్లు తెల్లవారినది.
గమనించని నాయనారుని పనిలో నిమగ్నుని చేసినది.
కాదనగలవారెవరు కామేశుని ఆనను.
కదిలివచ్చినది అహంకారముతో కూడిన అజ్ఞానము శివద్వేష వేషముతో.
నాయనారుని సమీపించి నానా దుర్భాషలను పలికించింది.గుడ్డివాడా! ప్రాణాపాయకరమైన పనులను ఎందుకు చేస్తావు? కళ్ళుకనిపించవు కదా!
పోయి ఒక మూల కూర్చోక?అంటూ అవహేళనను చేయించింది.
ఘోరేభ్యః-అఘోరేభ్యో నమోనమః.
రౌద్రరూపములోనున్నవానికి-శాంతరూపములో నున్న వానికి నమస్కారములు.
కాముని వైరి, పంచేంద్రియములతో
ఇతరులను వంచించు వారికి మంచి సమాధానమీయదలిచాడేమో?
నాయనారు పొంచియున్న క్రోధము వాగ్రూపముగా ముంచెత్తుకొని వచ్చింది.
మునుపెన్నడు పరుషములు మాటాదని వానిని విపరీత పౌరుషమునకు దాసుని చేసి,
"నాదం తను మనిశం"
వానిచే,
నా స్వామి కరుణామయుడు అనుట కనుక నిజమే అయితే,
ఆశ్రిత రక్షకుడూ అని అనుకొనుట సత్యమే అయితే,
శివుని నమ్మిన వారు ఎన్నటికిని చెడిపోరు అన్న సూక్తి శాశ్వతమే అయితే,
మీరు భావిస్తున్న నా అంధత్వమును స్వామి తొలగించి,మిమ్ములను అంధులను చేయుగాక అని అనిపించినది.
భక్తుని మాట
ను నిలబెట్టే భారము భగవంతునిదే కదా.
కాదనలేడను నమ్మకమును కలిగించుటకు కదిలి వచ్చాడు అమ్మతో సహా నాయనారు నమ్మకమునకు చిరస్థానమును కలిగిస్తూ.చక్షువులతో పాటుగా మోక్షమును ప్రసాదించుటకు.
దూషించిననవారికి పోయినవి చర్మచక్షువులు.పశ్చాత్తాపముతో ప్రణమిల్లిన ఫలితముగా క్షిప్ర ప్రసాదుని కరుణచే లభించినవి చర్మ చక్షువులతో స్వామి మర్మమును తెలియచేయు జ్ఞాన చక్షువులు.సూరదాసును నందగోపాలునిగా తరింపచేసిన పరమాత్మ ,మన నాయనారుని నందివాహనునిగా సాక్షాత్కరించి మహదానంద భరితుని చేసాడు.రాజు అజ్ఞానమును స్వప్నదర్శనముతో తొలగించాడు.
ఆశ్రిత రక్షకా! అన్నీ నీవే-అంతానీవే అనుచు,
అందరి ప్రస్తుతులనందుకొను చున్న సదా శివుడు మనలనందరికి కంటికి రెప్పవలె కాపాడును గాక.
కార్తిక ఏకాడశి-సోమవారము కాలకంఠుని కరుణను వర్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం..
Saturday, November 13, 2021
MAIPORUL NAYANARU
మెయిపొరుల్ నాయనరు
****************
అంతా పరమాత్మ స్వరూపమే అని నమ్మేవాడు పొరుళ్ ఈ విశ్వము విశ్వశ్వరుని స్వరూపము అన్న సత్యమును నమ్మేవాడు కనుక మెయి పొరుళ్,మై పొరుల్ నాయనారుగా కీర్తించబడుతున్నాడు.తిరుక్కోయిలూరులో వీరత్తరేశ్వరుని కొలుచు పరమ శివ భక్తుడు.సేది దెశమును ఏలినవానిగా కొందరు సేది నాయనారు అని కూడా కీర్తిస్తారు
రాజుగా ఉత్తమ నాయకుడిగా ప్రజాపాలనను కొనసాగించినవాడు కనుక ఆ హోదాను గౌరవిస్తూ,
మిలాద్ ఉడయార్-మిలాద్ నాయకుడు అని కూడా సంబోధిస్తారు.
ఈ నాయనారు బద్దెన కవి సుమతీశతకములో చెప్పినట్లు,
'అపకారికి నుపకారము
నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ"
అన్న సుభాషితమునకు నిలువెత్తు నిదర్శనము.
తమ ఊరిలోని శివాలయములలోనే కాక రాజ్యములో పలుప్రాంతములలో పరమేశ్వారాధనమును కొనసాగించేవాడు.స్త్రీ-పురుషులు.పిన్నలు-పెద్దలు,ధనిక-పేద,మొదలగు బాహ్య వ్యత్యాసములను అధిగమించి ప్రతి ఒక్కరిలో పరమేశ్వరుని చూడగలిగి,భావించగలిగి,భాషించగలిగి,ఆరాధించగలిగిన ప్రావీణ్యమును పొందిన పుణ్యశాలి.
రాజ్యము-రాజు-ప్రజలు సుభిక్షముగా నున్న సమయమున ఆది భిక్షువు తన ఆతను ప్రారంభందలచాడు.ఆపగలవారెవరు?
పొరుగు రాజైన ముత్తునాథన్ మదిలో అసూయ అను విత్తును నాటాడు.నాయనారు రాజ్యమును ఆక్రమించాలనే ఆశను అధికము చేసాడు.అనవసర ప్రయాస అను ఆలోచనను అణిచివేశాడు.
అంతే హుటాహుటిగా మన్నన్ పై దండెత్తి వచ్చాడు ముత్తునాథ తన సత్తాను గమనించలేక.
గమనము గమ్యము తానైన వాని ఆటకు తానొక ఉపకరణమైనాడు.ఉపక్రమించాడు.
యుధ్ధములో ఒక పక్క అసూయ మరొక పక్క శివ విధేయ.
అరితో పోరును అరిషడ్వర్గము చేసి,చేసి, అలిసిపోయినది.సొలాసి వెనుదిరిగినది
రుద్రుని అండనున్న వాని భద్రతను అపహరించుట సాధ్యమా ఆ ముత్తునాథునకు.చిత్తు చిత్తుగా ఓడి,మడమను తిప్పినాడు.
మధురం శివనామం మదిలో మరువకె ఓ మనసా.
ఇహపర సాధనమే నాణ్యమైన పరీక్షకు నాణెము గిరగిర తిరుగుతు ధర్మాధర్మములను తిప్పుతూ,ముత్తునాథను మనసును చిత్తుచేస్తున్నది.
ధర్మము తాను కాసేపు శివాజ్ఞగా పక్కకు తప్పుకోవాలనుకున్నదేమో,అదేపనిగా అధర్మము ముత్తునాథన్ ఆశను తీర్చుకోమ్మని ఆకర్షిస్తున్నది.
అంతే అనుకున్నదే తడవుగా,
ఆహార్యము శివస్వరూపమైనది.రుద్రాక్షలను ధరించింది.విభూతి పుండ్రములను అలంకరించుకుంది.అంతా శివమే అంతు చిక్కిన తరువాత.అడుగులను అరి ఉన్న రాజ్యము వైపు కదుపుతున్నది.అన్నెము-పున్నెము ఎరుగని శివభక్తులు కదులుచున్న స్వరూపమునకు కైదండలు పెడుతున్నారు.కీర్తిస్తున్నారు.పరవశిస్తున్నారు.
ఆంతర్యములోని జీవుడు అరిమర్దనమునకు ఆలోచనలను చేస్తున్నాడు.అత్యంత వినయమును ప్రదర్శిస్తూ నాయనారు భవనము వైపునకు అడుగులను కదుపుతున్నాడు.
జీవిని అధర్మ ఆలోచనము.దేవునిది ,
అన్నమయ్య అన్నట్లుగా
ఇందులో హీనాధికములసలే లేవు.
అంతయును పరబ్రహ్మ స్వరూప స్వరూపమే.అవసరానుసారము పరమాత్మ వానిని విరుధ్ధములుగా ప్రకటిస్తూ భక్తిని -భక్తుని భాగ్యోపేతులను చేస్తాడు.
మందిరములోనికి ప్రవేశించాలంటే మాయమాటలు చెప్పవలసినదే ముత్తునాథుడు.తానొక మహా శివయోగినని,శివతత్త్వ మర్మమును నాయనారుకు ఉపదేశించుతకు సివాజ్ఞగా వచ్చానని కల్లబొల్లి కబురులు చెప్పాడు ద్వారము దగ్గరనున్న ధాతన్ అను అంగరక్షకునితో.
శివ స్వరూపమును సాదరముగా ఆహ్వానించాడు నాయనారు.సాదర మర్యాదలను నిర్వర్తించాడు.సేవా సౌభాగ్యమును ప్రసాదించమని వేడుకున్నాడు
అందులకు ఆ కపటయోగి తాను వేదవిద్యా రహస్యములను ఏకాంతములో బోధించుటకు వచ్చితినని,ఉన్నతాసనమున కూర్చుండి,సేవాసక్తతతో తన కిందకూర్చుని యున్న నాయనరును కత్తితో పొడిచెను.
ఎంతటి దారుణము.అడ్దగించుటకు రాబోతున్న ధాతన్ ను ఆపి ,పరమేశ్వర సంకల్పానుసారము జరుగుచున్న పని ఇది కనుక దీనిని అడ్దగించరాదు.
అనుచు ధాతన్ ను పిలిచి,ప్రజలు దుఃఖముతో వీరికి కానిపని తలపెట్టుతారేమో.కనుక నీవు వీరిని సురక్షిత ప్రదేశమునకు చేర్చి రమ్మని ఆనతిచ్చెను.
తన భార్యాపుత్రులను పిలిచి తన రాజ్యము శివమయమై శోభిల్లాలని,తాను శివనామస్మరణమును చేస్తూ,శివైక్యమునొందెను.
నాయనారును ఆశీర్వదించిన ఆదిదేవుడు మనలనందరిని అనిశము కాపాడును గాక.
ఏక బిల్వం శివార్పణం.
RUDRA PASUPATI NAYANARU
URUTTIRU PASUPATI NAYANAR
తిరుతొండర్దొగై సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు.త్రికాలములందు తలలోతు -తిరుతలయూరు నందలి పార్వతీ శ్రీ బాలేశ్వర స్వామి పుష్కరిణీ తీర్థమునందు తలలోతు మునిగి రుద్రపారాయణను అదే నమ్మినవాని అర్చనగా నమకచమక పారాయణమును చేసేవాడు.భవ పాశములను తొలగించే పతి ని కొలిచేవాడు శివుడుగా --
నిద్రాహారములు దరిచేరుటకు ధైర్యము చేయలేకపోయేవి.అన్యమునకు స్థానము నాస్తి నాస్తి.శ్వాస మాత్రమే రుద్రనాయనారు అనుష్టానమునకు ఆలంబనగా ఉండేది.
ఇక్కడ మనము కొంచము పరిశీలితే అనేకానేక జన్మల చక్రములలో నిరంతరముగా తిరుగుచున్న జీవునికి దాని నుండి విముక్తి లభిచాలంటే దానికంటే బలమైన శక్తి అవసరము.ఆ సక్తి సత్యమైనది-శుభప్రదమైనది-శాశ్వతమైనది అయితేనే తాత్కాలితను తొలగించగల సామర్థ్యతను కలిగియుంటుంది.
మనకు పాశము-పశుపతి-పశువు అను మూటిని కనుక పరిగణిస్తే ,
పాశమును వేయగల/తీయగల సామర్థ్యము కలవాడు శాశ్వతుడు.పాశము శాశ్వతుని చేతిలో నున్నది కనుక అదియును శాశ్వతమే.కాకపోతే పశుపాశ బంధితుడు తన పూర్వజన్మల పుణ్య-పాప కర్మల అవశేషములను ముగించుకొనుటకై ,పునరపి జననం-పునరపి మరనం-పునరపి జనననీ కఠరే సయనం" అని శంకర భగవత్పాదులు సెలవిచ్చినట్లు ఉపాధి అను పాశముతో భగవతత్త్వమునకు-జీవనకృత్యమునకు ముడివేయబడి జన్మరాహిత్యమును పొందుటకు దయాంతరంగుడైన "పతి" చే మరొక్క అవకాశమును పొందుచున్నాడు.
జీవన పరమార్థమును ఆకళింపు చేసికొనిన నాయనారు నమక-చమక పారాయనమును సంసారపు సాగరమును దాటించు నావగా భావించిన వాడు.
ఆంతర్యమును అభివ్యక్తీకరించుటలో కూడా తన అనుష్టాన భంగిమను ఒక అద్భుత సందేశముగా చూపుతు మనలను అనుగ్రహిస్తున్నాడు పశుపతి రుద్రనాయనారు.
ప్రతిజీవి సంసారమనే ప్రవాహమును ఈదలేక తలమునకలవుతుంటాడు.ఆ సాగరము చిక్కటి బురదతో పెక్కు మొసల్లతో కాలు తీసి,పైకివేసి,కదిలి వద్దామన్న విడిచిపెట్తక మనలను ఒడిసి పట్టుకుని ఉంటుంది.
అటువంటి బురదతో నిండిన చెరువులో ఉన్నప్పటికిని పద్మము ఏ విధముగా దినపతి అయిన సూర్యకిరణముల సహాయముతో,తన పుట్టినిల్లైన బురదను ఏ మాత్రము అంటనీయక స్వచ్చముగా ఉంటుందో,సుగంధభరితమవుతుందో,అదే విధముగా తాను పుట్టిన /తనకు పుట్టినిల్లైన సంసార బంధములను పశుపతి కరుణ అనెడి కిరనముల ద్వార తన ఉపాధిని సంస్కార భరిత సుగంధ మయము చేసుకోవాలని తానొక నిదర్శనమై,నీలకంఠుని నిస్తుల కరుణను పొందెను.
MURKHA NAYANAR
మూర్ఖ నాయనారు
*****************
ఈ నాయనారు అసలు పేరు మరుగున పడినప్పటికిని,జూద నిపుణుడు కనుక నర్సూదన్ నాయనారు అని అన్నదానమునకు సప్తవ్యసనములలో మొదటిదైన జూదమును ఆధారముగా చేసికొనిన వాడు కనుక మూర్ఖ నాయనారుగా ప్రసిధ్ధిపొందెను.
తొండైనాడు లోని తిరువెర్కుడం లో జన్మించిన నాయనారు,
" అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః"
అన్న సిధ్ధాంత ప్రకారము,
యజ్ఞము చేత వర్షము
వర్షము వలన అన్నము
అన్నము వలన సమస్త ప్రాణకోటి
ఏర్పడును.
అన్నం అంటె అన్నమయకోశ శరీరముగా మనము భావించుకోవాలి.
అంటే అణు-పరమాణు సముదాయమైన శరీరము.
నాయనారు తన చిన్నతనము నుండి శివభక్తులను శివస్వరూప భావంతో సేవిస్తూ,వారికి మధురపదార్థములను అన్నముతో పాటు వడ్డిస్తూ,వారు తృప్తిగా తినిన తరువాతనే తాను భుజించేవాడు.
అనవరతము ఆతంకములేకుండా దేనిని సాగనీయడు కదా ఆ సాంబశివుడు.
హరుని ఆన దాటనంటూ నాయనారు సంపదలను హరించివేయసాగినది కాలము.ఉన్న వస్తువులన్నీ అమ్ముడుపోయి కిమ్మనకున్నాయి.అయినా ఏమాత్రము బాధపడకుండా,
అన్నము పరబ్రహ్మ స్వరూపము.
అన్నిదానములలో అన్నదానము మిన్న అన్న
నమ్మకమును వీడక దానికి కావలిసిన సంపాదనకై ఉపాయమును ఆలోచించసాగినాడు నాయనారు.
తనకి తెలిసినది ఒక్కటే.అదే జూదము.అది సప్త వ్యసనములలో మొదటిది.
నాయనారు నల్ల సూదన్ గా గొప్ప జూదగాడుగా అప్పటికే పేరుపొందిఉన్నాడు.నల్ల సూదన్ కాలక్రమేణా నల్ సూదన్ గా/నర్ సూదన్ గా మార్పు చెందింది.
అన్న సంతర్పనకు అన్యాయ మార్గమును ఎంచుకోక తనకు ఈశ్వర ప్రసాదితమైన జూదముపైన మనసును కేంద్రీకరించి మరింత సిధ్ధహస్తుడైనాడు.
పందెము పై జూదము ఆడుట ప్రారంభించాడు.మొదటి ఆటను కావలియే ఓడి ప్రతిపక్షము వారికి మరింత ఆసక్తిని పెంపొందించేవాడు.వ్యామోహితులైన వారు పెద్ద పెద్ద మొత్తములను పందెముగా ఒడ్డి ,నాయనారుతో గెలువలేక సమర్పించి వెళ్లేవారు.
అన్నదానము కోటి గోదానముల కన్న మిన్న యనుచు దారిని పోయే వారిని నయానో/భయానో ఒప్పించి జూదమాడుటకు కూర్చుండపెట్తేవాడు.వారిని చిత్తు చిత్తుగా ఓడించి వారిదగ్గర నున్న పైకమును మొత్తము లాగివేసుకొని ఆ ధనము మొత్తము శివభక్తుల అన్న సంతర్పణలకే వినియోగించేవాడు.
తన స్వార్థమునకు అసలు ఉపయోగించేవాడు కాదు.
కామేశుని పరీక్ష మరి కొంత పదునెక్కి గ్రామములో ఎవ్వరును జూదమాడుటకు (నాయనారుతో) రాకుండాచేసినది.
ధర్మము తప్పని నాయనారు అన్నసంతర్పణమును అంతరాయమును కలిగించుటకు ఇష్టపడక తన మకామును కుంభకోణమునకు మార్చాడు.ఆ ఊరి ప్రజలను సైతము జూదములో గెలిచి అన్న సంతర్పనమును నిరాటంకముగా సాగించాడు.
చేసేది ఈశ్వరారాధనా.ఈశ్వరభక్తులను ఈశ్వరులుగా భావిస్తూ పరమానందముతో,పరమ భక్తితో చేయు
అన్న సంతర్పణము. కాని,అన్న సంతర్పనమునలు ఆధారమైనది అభ్యంతరకరమైన జూద సంపాదన.
ఇది పాపమా/పుణ్యమా అను ధర్మ సంకటము.
సమాధానము తోచని సందేహము.
నిష్కల్మష భక్తి నిధనపతిని మెప్పించినది.నిర్వాణమును ఇప్పించినది.
జూదగాడిని మెచ్చిన వేదపురీశ్వరుడు నాయనారును కటాక్షించి,శిలారూపములో తన దగ్గర నిలుపుకున్నాడు.
Friday, November 12, 2021
SAKTI NAYARAR
శక్తి నాయనారు
*************
కృపాకటాక్ష అక్షర స్వరూపునకు దండాలు శివా
ప్రకటిత ప్రకాశ యజ్ఞదీక్షితునకు దండాలు శివా
నందివాహనుడు చిదానందమునకు దండాలు శివా
సద్గతి ప్రసాదక భక్త మందారకునకు దండాలు శివా
*****
శక్తి నాయనారు పరింజియార్ గ్రామమునకు సంబంధించిన భూస్వామి.పరమ శివభక్తుడు.శివడమరుక అనుగ్రమైన అక్షరములను సలక్షణముగా గౌరవించే వాడు.నిక్షేపములైన
అక్షరములను ఆక్షేపిస్తూ ,దుర్భాషలాడిన వారిని శిక్షించక వదిలేవాడు కాడు.
అసలే వ్యవసాయ పాండిత్యమున్నవాడేమో,లక్షణ అక్షర సేద్యమునకు కంకణ
బధ్ధుడైనాడు.
దానికి కారణము నాయనారుకు శబ్ద ప్రాశస్త్యము పై గల అవగాహనయే.సాక్షాత్ తాను నమ్మిన శివుని శబ్ద స్వరూపమే వాక్కుగా భావించేవాడు.దాని ప్రయాణమును
ను ప్రమాణముగా స్వీకరించేవాడు.
సకల చరాచర జగత్తులో వాక్కు సలక్షణముగా నున్నప్పటికిని ,సమస్తమునందు సంపూర్ణముగా నుండదను విజ్ఞుల అభిప్రాయా నుసారము ,
రాళ్ల యందు వాక్కు పరా రూపంలో ఉంటుంది, వృక్షాదులయందు పశ్యంతీ రూపంలో, పశువులయందు మాధ్యమా రూపంలో, మానవుని యందు వైఖరీ రూపంలో వ్యక్తమౌతోంది అని విశదీకరించబడింది.
అయితే,
కేవలము మానవుడి యందే ఈ నాలుగు దశలు కనిపిస్తాయి. సృష్టి లోని మిగతా వాటి వద్ద ఒక్కొక్క దశ మాత్రమే కనిపిస్తుంది. అందుకే 'చత్వారి వాక్పరిమితా' అన్నారు. ఎవరు జ్ఞానులో వాళ్ళు ఈ వాక్ తత్త్వాన్ని తెలిసికోగలరు. నాలుగవదశ ను దాటి వచ్చిన వాక్కును మానవులే పలకగలరు. ఆ విధంగా పూర్ణత్వం మానవ శరీరంలో ఉంటుంది కనుక పురుషుడు / పూర్ణుడు అన్నారు మానవుణ్ణి.
అట్టి ఉదాత్త వాగ్వైభవమును ఈశ్వరుని అనుగ్రహముగా పొందిన మానవుడు ఇంద్రియములచే ఆకర్షింపబడి,అధీనుడై,దుర్వినియోగపరుస్తుంటే సహించలేని నాయనారు ,వారి నాలుకను కత్తిరించివేసే దీక్షను చేపట్టాడు.
భాషణమునకు సహాయపడే ముఖ్య ఇంద్రియము నాలుక.అదియును ఒక్కొక్కసారి యుక్తాయుక్త విచక్షణను మరచి,విజృంభిస్తుంటుంది.కనుక నిందిస్తున్నావారికి సహకరించే జిహ్వను కత్తిరించుటకు కారణము,దానిని అంతకు ముందు ఎన్నోసార్లు
హెచ్చరించినప్పటికిని తన పధ్ధతిని మార్చుకోక రెచ్చిపోవటమే.
సామ-దాన-భేద ఉపాయములను ధిక్కరించి,దండనను ఆహ్వానించుటయే.
కనుక దుర్భాషలాడుటకు సహకరించిన నాలుకను కత్తిరించుట,కలుపుమొక్కను సమూలముగా పీకివేసి,సస్య కేదారములను సంపన్నముచేయుట అని తలచేవాడు నాయనారు.
ఎవరైనను రుద్రాక్షలు ,విభూతి పుండ్రములు ధరించకున్నప్పటికిని,
సదాచార సంపన్నులు కాకపోయినప్పటికిని,,రుద్రాభిషేకములు చేయకపోయినప్పటికిని వారిని విమర్శించకుండ ఉండగలుగు సంస్కారము కలిగిన వాడు,నాయనారు
శ్రవణేంద్రియము మాత్రము శంభుదూషణుని క్షమించలేని కఠినత్వము కలది.భావములను భాషగా మార్చుటలో సహకరించుచున్న నాలుకను కత్తిరించివేయకుండా ఉండలేనిది.
"శివనాథు వర్ణించు జిహ్వజిహ్వ"-దాని నియమము.అన్యము అనర్థదాయకమనుచు ,దానిని తీసివేసే
మోటుదనములో దీటులేనిది.
ఇది బాహ్యమునకు మనకు కనిపించుచున్న దృశ్యము.
కాని నిశితముగా పరిశీలిస్తే పరమపూజ్యుడైన నాయనారు,అన్నమయ్య కీర్తించినట్లు,
భావములోన-బాహ్యము నందున గోవింద-గోవింద అనికొలువవే ఓ మనసా అనుటకు నిలువెత్తు నిదర్శనము.
అత్తినాయనారు-సత్తి నాయనారు-శక్తి నాయనారు అని సన్నుతించుటలోని ఆంతర్యమును కొంచము పరిశీలిద్దాము.
అత్తి అనగా వటవృక్షము-ఆళ్వారుళచే అత్తి వరదరాజ స్వామిగా కీర్తింపబడు వటపత్రసాయికి ఆసనమైనది.అంటే శాశ్వతమైనది.మన నాయనారు సైతము అత్తి వృక్షమువలె అతిపవిత్ర శాశ్వతత్త్వముతో అలరారువారు.
-ప్రళయానంతరము జగన్నాధుని సేవించినది.
"సత్తము" అను తమిళ పదము శబ్దము అను అర్థమును తెలియచేస్తుంది.తీయ సత్తము అను పదమును దుర్భాషగా కనుక అన్వయించుకుంటే,
దుర్భాష వెలువడుటకు సహాయపడిన నాలుకను అనగా మూలదోషమును నిర్మూలించు స్వభావము కలవాడు సత్తి నాయనారు .
మూడవ నామము శక్తి నాయనారు.
శక్తి అను పదమును ఆయుథము అను అర్థములో కనుక అన్వయించుకుంటే,భక్తి అనే కత్తితో(శక్తితో) భవబంధములను తుంచివేయువాడు అని అనుకోవచ్చును.బాహ్యమునకు హింసాప్రవృత్తిగా అనిపించినప్పటికిని,మాటలలోని దోషములను మొగ్గలోనే తుంచివేయుటలో మొగ్గుచూపునది.
పరమేశ్వరుని సన్నిధిచేరుటకు తన కఠినత్వము ద్వారా,
.
వాచాలత్వమునకు వీడ్కోలు ఇస్తూ,
" కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం '
అన్న సత్యమును జగద్విఖ్యాతము చేసిన శక్తి నాయనారును అనుగ్రహించిన సదాశివుడు మనలను సర్వవేళల సంరక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Thursday, November 11, 2021
AMARANEETI NAYANARU
అమరనీతి నాయనారు
*****************
[03:20, 11/11/2021] విమల: ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ
దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ
సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమః శివాయ
అష్టమూర్తయే వృషేంద్ర కేతవే నమః శివాయ
ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా
ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా
దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా
ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా.
అశాశ్వత ఉపాధిని నడిపించుచున్న శాశ్వత /అమర శక్తివి నీవే అని పరమాత్మ తత్త్వమును తెలిసిన సార్థక నామధేయుడు అమరనీతి నాయనారు.
వృత్తి-ప్రవృత్తులు విరుధ్ధములైనప్పటికిని ,వాటిని తన సంస్కారముతో సమర్థవంతములుగా మలచుకొనిన వాడు.పళైయర్ లో వైశ్యకులములో జన్మించిన అమరనీతి ఇహమునకు సంబంధించిన భోగలాలసను పెంపొందించు పట్టు వస్త్రములను.సువర్ణ-నవరత్నములను కులవృత్తిగా విక్రయించుచున్నప్పటికిని,బురద తాకని తామరవలె,వైరాగ్య సంపన్నుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో నటరాజ భక్తులైన శివయోగులకు ,వైరాగ్య సంకేతమైన కౌపీనములను దానము చేయు దీక్షాపరుడిగా శివార్చనలను చేయుచుండెడి వాడు.
తన సంపాదనతో శివభక్తుల వసతికై ఎన్నో మఠములను కట్టించాడు.పరవశిస్తూ శివభక్తుల పాదములను (పాద్యముతో) పరమేశులే అంటూ కడిగే వాడు.కాశీ విశ్వేశ్వరులంటూ కౌపీనములను భక్తితో సమర్పించేవాడు.
కళ్యాణ సుందరేశుని కనులారా దర్శించుకుంటు,మనసారా స్మరించుకుంటూ మైమరచి పోతుండేవాడు.
గోచీ సమర్పణ వ్రతుని పేచీతో అనుగ్రహించాలనుకున్నాడు ఆ మూడుకన్నులవాడు వేడుకగా.
అంతే.
దాక్షిణ్యమూర్తి కౌపీనమును ధరించి,తన దండమునకు రెండు కౌపీనములను కట్టి ,సమీపించాడు అమరనీతి నాయనారును.వచ్చినది తనను పరీక్షించుటకని తెలియని భక్తి, భక్తుని చేత సంభ్రమాచర్యములతో పరుగులు తీయించినది.పాదసేవనము చేసినది.పరిపరి విధముల ప్రార్థనలను చేయించినది.
.ప్రణామములిడినది.పరవశిస్తున్నది.అయినా ఏదో వెలితి.
అదను కోసము చూస్తున్నాడు మదనుని కాల్చినవాడు.వానితో తందానా అంటూ మోదముతో నున్నది కథను నడిపించే కౌపీనము.
స్వామి మిమ్ములను సేవించుకొను అవకాశమునిమ్మని అమాయకముగా వేడుకుంటున్నాడు మాయావిని మైమరచి అమరనీతి.
మరీ ఇంత మొహమాటపెడితే కాదనగలనా.కానీయి నీ ఇష్టమే అంటూ , తన దండమునకున్న ఒక పొడి కౌపీనము నిచ్చి
,
,
నేను నదీస్నానము చేసివచ్చేవరకు దీనిని నీ దగ్గర భద్రపరచు.వచ్చి తీసుకుంటాను అన్నాడు మహదేవుడు. .మహాభాగ్యమంటు మురిసిపోయాడు నాయనారు.
అంతలో ... అనుకోకుండా,
కురుస్తున్నది కరుణామృత వర్షమందునా/ కఠిన పరీక్షకు నాంది అనుకోనా /కైవల్య కటాక్షమునకు శిక్షణ యా అది?
ఆదిదేవుడు ఆటను ప్రారంభించాడు.తన శరీరము మీది కౌపీనమును/దండమునకు కట్టిన దానిని తడిసి ముద్దయేటట్లు చేసాడు.మంచుకొండ నివాసమైన వాడిని నేనేమనగలను?
చలికి గడగడ వణుకుతు వచ్చి అమరనీతిముందు నిలబడి, అమరనీతి నా పొడి కౌపీనమును ఇస్తే కట్టుకుంటున్నాను
అన్నాడు అగ్గి కన్నువాడు అమాయకముగా.
తక్షణమే దాచిన కౌపీనమును తిరిగి ఇచ్చివేయుటకు లోనికి వెళ్ళాడు అమరనీతి.
.
దాచిన చోట కౌపీనములేదు.తొందర పెడుతున్నాడు బయటనున్న అతిథి కౌపీనమునకై.
క్షమాపణ నడిగి తన దగ్గరనున్న కౌపీనమును స్వీకరించమన్నాడు భక్తుడు.తానిచ్చిన కౌపీనమే కావాలన్నాడు భగవంతుడు."లాలోచిపడిన కౌపీనము తనపని తాను చేసుకుపోతున్నది భక్తునికి అందకుండా.భగవదాజ్ఞను పాటిస్తూ."
భంగపాటును భరిస్తూనే భక్తి బ్రతిమలాడ సాగినది మరొక్క అవకాశమునకై.కౌపీనమునకు బదులుగా మరేదైనా స్వీకరించుటకై.శివపాదమును విడువకున్నది.
కనికరించాడు కదిలివచ్చినవాడు.భక్తులకు స్తుతుల నందించ దలచి కౌపీనముతో తులాభారమునకు అంగీకరించాడు అష్టమూర్తి.త్రాసులో కౌపీనమునుంచారు ఒకవైపు.
అష్టసిధ్ధులు ఒకవైపు -అష్టైశ్వర్యములు మరొకవైపు ఆడుకుంటున్నాయి.సరితూగుట సాధ్యము కానిది కదా.
మాట తప్పని అమరనీతి తన కుటుంబముతో సహా తక్కెడలో కూర్చున్నాడు తూగుటకు.
జగమంత కుటుంబమైన జంగమ దేవర కనికరించాడు.నిజ దర్శనమునందించాడు.
విషయభోగములను విష సర్పముల బారిన పడకుండా ,విశేష ఫలమును అందించుటకు,కౌపీనమును కారణము
ు చేసిన శరణాగత రక్షకుడు మనలను అనిశమురక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం
.
Wednesday, November 10, 2021
murty nayanar
మూర్తి నాయనారు
************
శిశుశశిరేఖా ప్రకాశములవానికి దండాలు శివా
సుందరంబగు దరహాసంబులవానికి దండాలు శివా
వెండికొండ చరియలందుండు వానికి దండాలు శివా
మెండుగ కరుణించు పశుపతినాధునకు దండాలు శివా
********
[08:46, 10/11/2021] విమల: మూర్తి నాయనారు.
*******
నిరాకార భగవత్స్వరూపముగా తాను సాకారముగా ప్రకటింపబడుటయే మూర్తిమంతము.ప్రకటింపబడిన స్వరూపముయే మూర్తి.
మనము ఈ రోజు సాకారరూపియైన భగవంతుని మూర్తినాయనరుగా కీర్తించుకుందాము.
" గంధము పూయరుగా-కస్తూరి గంధము పూయర్య్గా" అని యదునందనుని గంధపుసేవు గానముతో చేస్తూ పరవశిస్తూ ధన్యుడైనాడు త్యాగరాజస్వామి.
అదే విధముగా షోడశోపచారములలో ఒకటైన గంధపుసేవా ప్రాశస్త్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు మన మూర్తి నాయనారు.
మంగళకరమైన మధుర పట్టనమున వ్యాపారకుటుంబములో జన్మించిన మూర్తి నయనరు గంధపుచెక్కల వ్యాపారమును చేసేవాడట.
మధురలోని చొక్కనాథస్వామికి చందనసేవార్చనాసక్తుడు.
ప్రతి ఉదయము స్వామికి తానే స్వయముగా చందనమును అరగదీసి స్వామికి అలంకరించి ఆనందించేవాడు.ఇది బాహ్యార్థము.
కాసేపు మనము రాయిని పాంచభౌతిక ప్రపంచమనుకుందాము.దానికి మంచి-చెడులతో సంబంధము లేదు.వేటిపైనను పక్షపాతమును లేదు.ఏ విధముగా నేల-నింగి-నీరు-నిప్పు-గాలి అన్నింటిని/అందరిని సమముగా భావిస్తాయో సాన/రాయి కూడా అంతే.దానిపైన అరగదీయుటకు ఉంచిన చెక్క మన ఉపాధి.మన్సుతో కూడిన శరీరము.అది అరగటము కాలము అనగా మన జీవన పరిమానము తరుగుచున్నదని చెప్పుటకు గుర్తు.ఉపాధిని సద్వినియోగ పరచుకుంటే అది గంధపుచెక్క అనుకోవచ్చును.లేకపోతే నిరుపయోగ చెక్కగా భావించవచ్చును.
సాన మీద గంధపుచెక్కను ఉంచినంత మాత్రమున పరిమళము వచ్చి,దిగంతములు వ్యాపించదు.ఎందుకంటే గంధపుచెక్కకు తాను పరిమళభరితమని తెలియదు.నిరంతరము సానపై అరుగుట వలన తెలుసుకోగలుగుతుంది.
మన ఉపాధికి కూడ తన పరమార్థము తెలియదు.అది ప్రపంచము మనకందించుచున్న పంచభూతముల సహకారముతో నిరంతరము వానిని ప్రసాదించిన వాని ప్రార్థనము అను పనిలో మునిగితే కాని మన జన్మను సార్థకము చేసుకుని తరించలేము.
రాయి మీద గంధపుచెక్క ఉన్నంత మాత్రమున అది మృదుత్వముతో కూడిన పరిమళములను అందించలేదు.అరగదీయుట తెలిసిన వాడే అదృష్టవంతుడు.మన జీవితములో తారసపడు అనేకానేక సంఘటలపై దృష్టిని సారించక సద్గుణములతో కూడిన మన ఉపాధిని,సాధన అదియును నిరంతర సాధన యను పనిలో నిమగ్మమైనప్పుడే సత్కృప అను పరిమళ చందనము మనకు లభిస్తుంది.
గంధార్చనతో నాయనారును బంధవిముక్తుని చేయాలనుకున్నాడేమో ఆ సుగంధపుష్టికర్త ,రాజకీయమును రాజీపడకుండాచేసి,మధురనగరములోనికి గంధపుచెక్కల రాకను తప్పించాడు.
క్రమక్రమముగా మూర్తినయనరు దగ్గర ఉన్న గంధపుచెక్కలు నిండుకున్నవి.కొత్తవి దొరికే అవకాశము లేదు.
ఆట ఆడిస్తున్నాడు మూడుకన్నులవాడు.లోటు చేయనంటున్నాడు వానిని నమ్ముకున్న వాడు.
ఇది కాదనలేని సోదాహరణము.
కపర్ది కరుణ కఠిన రూపముగా కనపడినను కషటములను కడతీర్చి,కైవల్యమును ప్రసాదించినదనుట శిలా శాసనము.
అయిపోయినవి నాయనారు దగ్గర నున్న గంధపుచెక్కలు.సేవా బంధమునకు పరీక్ష పెడుతూ.
సుగంధ పుష్టికర్తకు చూడముచ్చటైన వినోదము.
సుగంధ సేవాసక్తునకు గంధపుచెక్కకానరాని,దొరుకు ప్రదేశము
తెలిసికొనలేని విచారము.
కారుణ్యము తాను వస్తూ తనకంటె ముందరగా తమాషా చూపిద్దామని కాఠిన్యమును పంపించిందేమో.
సర్వస్యశరణాగతి సానుకూలమైనదా అన్నట్లుగా నాయనారు మనసులోనికి ప్రవేశించినది పరీక్షగా/శివుని రక్షగా ఒక అద్భుత ఆలోచన.
చందనము ఒక చెట్టు కట్టే.తన శరీరము ఒక కట్టెనే.నిర్మల-నిశ్చల-భక్తితో నిండిన ఈ కట్టె సైతము అరిగించినచో పరిమళ గంధమును ప్రసాదించగలదు అను తలంపు,తహ తహలాడు మనసును అర్చనకు ఉపక్రమింపచేసినది.
తన్మయత్వముతో తన చేతిని రాతిమీద అరగదీస్తున్నాడు మూర్తినాయనారు.
బాహ్యము భయపడుతూ పారిపోయినా ,భక్తి భావనలో ఊహాతీత సేవ జరుగుతున్నది.
చర్మము చిట్లి పోతున్నది.రక్తము కారిపోతున్నది.మాంసము అరిగిపోతున్నది.ఎముకలు విరిగిపోతున్నాయి.సప్తధాతువులు తమ పట్టును సడలించుకుని విడిపోతున్నాయి.
సరగున వచ్చి అక్కున చేర్చుకున్నారు పార్వతీపరమేశ్వరులు.
మెచ్చిన కరుణతో
మధుర రాజ్యము మైమరచిపోయినది.ఒక్కరోజులో రాజ్యమును అంతా శివమయము చేసాడు,దానికి రాజుని చేసాడు మూర్తి నాయనారునమ్మిన నందివాహనుడు.
స్థిత ప్రజ్ఞుడైన మూర్తినాయనారు శివానుగ్రహముతో రుద్రాక్ష కిరీటమును ధరించి,శివదండమును పట్టుకుని,మూడు పూవులు -ఆరుకాయలుగా రాజ్య పరిపాలనను శివాజ్ఞచే కొనసాగించి,అంత్యమున శివస్వరూపమైనాడు.
మూర్తి నాయనారును అనుగ్రహించిన సదా శివుడు సర్వవేళల కంటికి రెప్పవలె మనలను కాపాడును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Tuesday, November 9, 2021
SAKKIYA NAYANAR
సక్కియ నాయనారు
******************
[05:42, 09/11/2021] విమల: ఆపదద్రి భేద టంక హస్తతే నమః శివాయ
పాపహారి దివ్య సింధు మస్తతే నమః శివాయ
పాపధారిణే లసన్నమస్తతే నమః శివాయ
శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ
ఆపదలు నశింపచేయు ఆయుధునకు దండాలు శివా
పాపములు నశింపచేయు గంగాధరునకు దండాలు శివా
శాపములు తొలగచేయు భక్తవశంకరునకు దండాలు శివా
దండాలు స్వీకరించు దయాసింధువునకు దండాలు శివా.(చంద్రుని శాపమును/పాపమును నశింపచేసిన శివా)
చిదానందరూపా-సక్కియ నాయనారు
************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివపూజకు అనుమతిలేని పాలనలో
ఏమి తక్కువచేసెను స్వామి లాలనలో
కనపడులింగము పూర్వము తానును రాయియే కదా
ఆ రాయికి రాతిపూజ అపూర్వపు సేవయే కదా
దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ చాలు చాలు
భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు
అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు
సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబ నా చింతలు తీర్చు గాక.
సత్యాన్వేషణ సాధనముగా ఏ మతమైనను వారికి ఆమోద యోగ్యమే.సర్వమత సత్కారము-స్వీయ మత స్వీకారము వారి అభిమతము.అన్యమతముల వారిని నొప్పించకుండా బాహ్యమున నడుచుకుంటూ,ఆంతర్యమును ఆరాధనతో సుసంపన్నము చేసుకొనే చాకచక్య భక్తులులలో సక్కియ ఒక్కరు.
అన్నమాచార్యులు కీర్తించినట్లు,
" అన్ని దైవములిందే ఆవహించెను" అనుకొనుచు,అర్చన చేయగల,అదియును పూజాద్రవ్యము యొక్క బాహ్య రూపమును గమనించగలిగినప్పటికి,ఆంతరంగిక శుధ్ధితో వాటిని అతిపవిత్ర పూజాద్రవ్యములుగా భావించుకొనగలిగిన అత్యున్నత సంస్కారులు.
నాలుగు విషయముల సమాహారమే ప్రపంచము అని నమ్మువాడు సక్కియ నాయనారు.అవి,
1.భక్తి
2.భక్తుడు
3.ఫలితము
4.ఫలితమునందించు పరమాత్మ
సత్యము-శివము-సుందరము తానైన పరమాత్మను ఏ రూపములో ఆరాధించినను,ఏ సంప్రదాయమును పాటించినను కావలిసినది సర్వస్య శరణాగతి మాత్రమే అని నమ్ముతూ,బాహ్యమునకు బౌధ్ధ భిక్షువు ఆహార్యముతో,అంతరంగమున సదాశివుని ఆరాధనతో నుండేవాడు.
స్వామిని సమీపించగనే సక్కియ మనసు సెగ తగిలిన వెన్నవలె కరిగిపోతుండేది.హృత్పుండరీకము స్వామి ఆసనముగా మారి వికసనము చెందేది.కన్నులు అనిర్వచనీయానందముతో హర్ష వర్షములయేవి.
" పవి పుష్పంబగు-అగ్ని మంచగు"
అని శ్రీకాళహస్తీశ్వర శతకములో ధూర్జటి మహాకవి సెలవిచ్చినట్లు ,
నిధనపతిని(పాపములను నిధనము చేసి రక్షించు స్వామిని)
ప్రసన్నము చేసుకొనుటకుు కావలిసినది భక్తితత్పరతయే కాని బాహ్యపూజలు కావని చాటిన సక్కియ నాయనారుగా కీర్తింపబడు "సాక్కయ నాయనారు" తిరుశంగమలై లోని వ్యవసాయ కుటుంబములో జన్మించాడు.బౌధ్ధమత అవగాహనకై కాంచీపురములో విద్యాభ్యాసమును చేసెను.సమయస్పూర్తి కల సక్కియ నాయనారు సత్య-శివ-సుందరుని భక్తుడైనప్పటికిని(ఆంతర్యములో) బాహ్యమునకు మాత్రము బౌధ్ధ భిక్షకుని వలె కనిపిస్తూ,క్రమము తప్పక రూపి/అరూపిగా,ద్వంద్వముగా/ద్వంద్వాతీతునిగా నున్న శివలింగముపై రాళ్ళు తిడుతూ విసిరికాని భోజనమును చేయని నియమము కలవాడు.
.
స్వామిపై రాళ్ళు విసురుట అపచారము కాదా అన్న సందేహము మనలో చోటు చేసుకొనవచ్చును.ఆంతర్యము అపరాధమును సవరించుచున్నట్లున్నది.పరవశముతో నాయనారు అర్చనను స్వీకరిస్తున్నాడు పరమేశ్వరుడు.
ఏలేవాడు ఎందుకో సక్కియ మనసున ఏమరపాటును కలిగించాడు.వడివడిగా నడుస్తూ,ఇంటికి వెళ్ళి భోజనము చేయుటకు సిధ్ధమయ్యాడు.
భజన మానిన వానిని భుజింపచేయనిస్తాడా ఆ భుజంగభూషణుడు.
తప్పిదమును గ్రహించిన నాయనారు,చప్పున రాయిని చేత తీసుకుని పెద్దరాయి మీద విసరడానికి వచ్చాడు.బాహ్యము.
ముసిరిన చీకట్లను స్వామిచే తొలగింప చేయుటకు విసిరిన రాయి వికసిత కుసుమముగా పరివర్తనమును చెందింది.పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు.
సాక్షాత్కరించిన సామికి సాష్టాంగ దండప్రణామాలు సక్కియతో పాటు మనవి కూడా సమర్పిద్దాముు.సక్కియను తన దాసునిగా స్వీకరించిన దయాంతరంగుడు మనలను అనిశము రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
Sunday, November 7, 2021
TIRU MOOLAR NAAYANAAR
తిరుమూలర్ నాయనారు
*******************
మూలర్ అను సత్తనూరు గ్రామవాసియైన విగతజీవుడైన పశువుల కాపరిశరీరములోనికి ప్రవేశించిన వాడు కనుక ,నాయనారు అసలుపరు మరుగున పడి,తిరుమూలర్ నాయనారుగా ప్రసిధ్ధి చెందినాడు.
తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెళ్ళుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమంద విచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషయమును తెలిసిన ,.నాయనారు ఆవులను దుఖః విముక్తులను చేయ దలిచాడు. ఆది శంకరుల వారిని స్మరించి,నిష్కాముడై తన శరీరమును చెట్టు తొర్రలో పెట్టి మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేశాడు. కాపరిని చూసి గోవులు సంతసించాయి.
అంటే అంతకు ముందు గోవులు విచారముతో నున్నాయా? ఎందుకున్నాయి? వాటి దగ్గరకు నయనరు వెల్లవలసి వచ్చిన పరిస్థితి ఏమిటి? పరకాయ ప్రవేశమే మూలార్ గా ప్రకటింపబడుటకు సరియైన పరిష్కారమా? అని మన మనసు మనలను పరిపరి విధముల ప్రశ్నింప వచ్చును.
అసలు ఇదంతా ఆదిదేవుడు ఆడిన నాటకమని నమ్ముతున్నప్పటికిని,వమ్ముకానీయని వాని కరుణ చేసిన కనికట్టును తెలిసికొనే ప్రయత్నమును చేద్దాము.
తిరునంది యోగి శిష్యునిగా ప్రశస్థిని పొందిన నాయనారు పరమేశుని సంకల్పముతో పరకాయ ప్రవేశమును చేసినాడనుటలో సందేహము లేదు.
ఎవరి తలపున దాగి,దానిని వారిజీవితములో సరికొత్త మలుపుగా మలుస్తాడో చెప్పనలవికాదు.
నడక-నడిచేది-నడిపించేది అన్నీ తానేయైన నటరాజు నాయనారు మనసులో,పోతికొండల యందున్న అగస్త్యముని సందర్షనాభిలాషకు బీజం నాటాడు.అనుకున్నదే తడవుగా అమలుచేయుటకు అనుజ్ఞ నిచ్చాడు.
అమితానందముతో అడుగులను కదుపుతున్నాడు నాయనారు.కదిపిస్తున్నాడు నగజాపతి.
దారిలో కావేరి నదిలో స్నానమాచరించి,కామేశునికి ప్రదక్షిణమాచరించి,కదులుతున్న సమయములో,కాగల కార్యమునకు కావలిసిన దృశ్యమును నాయనారు కన్నులముందుంచాడు ఆ మూడుకన్నులవాడు.
మునిదర్శన కాంక్ష మౌనముగా తరలిపోయినది.విచారముతో కన్నీరు-మున్నీరుగా రోదిస్తున్నాయి గోమాతలు.కారనము-నివారనము నాయనారు మనసు ఆవరణమున ప్రవేశించి,ఆలోచింపచేసినవి.అంబాపతి పతి అంబా ధ్వనులు ఆవులమందలో ప్రతిధ్వనించుచు నాయనారును చుట్టుపక్కల పరికింపచేసినవి.స్వామిని నాయనారు భక్తిని పరీక్షింపచేసినవి.
విధిలీలా విలాసముగా విగతజీవుడై అక్కడ పడియున్నాడు గోసంసరక్షకుడు భూసంరక్షకుని ఆటలో.
తక్షణ కర్తవ్యముగా తన సరీరమును అక్కడ నున్న ఒక చెట్టు తొర్రలో భద్రపరచి,తాను మూలార్ తనువులోనికి ప్రవేశించాడు.కాపరిని చూసిన ఆవులు ఆనందముతో సమీపించాయి.
ఏ వేళ ఏమి జరుగుతుందో ఆ ఎరుకుల వానికే ఎరుక.
ఇంటికి చేరిన వానిని ఎనలేని ప్రేమతో సమీపించింది మూలార్ భార్య.
తల్లిగా గౌరవించు సంస్కారము తప్పుచేయనీయక సత్యమును చెప్పించి,ఆమెకు సత్యమార్గమును చూపించాలనుకున్నది.
మంచిరసపట్తులో నున్న కథ ఆమెతో తగవులాడించింది.మూలార్ను కర్తవ్య విముఖిగా ఆరోపించుచు,గ్రామపెద్ద న్యాయ నిర్ణయము వైపు మరలించినది .
నందివాహనుని పందెమునకు పదునుపెట్టుతూ ముందరకు పోతున్నది.
అన్మతించారు గ్రామ పెద్దలు మూలార్ సన్యాస స్వీకరనకు-వాని భార్య సన్మార్గ సాధనకు.
తరలి వచ్చాడు మూలార్ గోవులతో పాటుగా తన కాయమును దాచిన చెట్టు వద్దకు.గోసమ్రక్షణా సేవను చేస్తూనే పరమేశుని ప్రసన్నుని చేసుకునే ప్రయత్నమునకై.
తలపుకు జన్మను ఇచ్చినవాడు తనువును మాయము చేసేసాడు.దృశ్యమును చూపిస్తూనే నాయనారు శరీరమును అదృశ్యము చేసేసాడు.
ఘటనాఘటనా సమర్థుడు ఆనతీయగా ,
సమాధి స్థితిలో మూడువేల సంవత్సరాలుండి,సంవత్సరమునకొకసారి బహిర్ముఖుడై ఒక పద్యమును చెప్పుచు,మూడువేల పద్యముల "తిరు మందిరము"ను అందించిన అదృష్టవంతుడు తిరుమూలర్ నాయనారు ఆ చంద్ర తారాక్షము ఆరాధ్యనీయుడు.
నాయనారును అనుగ్రహించిన ఆదిదేవుడు మనలనందరిని సంరక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...