Thursday, April 7, 2022

"దేశభాషలందు తెలుగు లెస్స"

.

 "దేశభాషలందు తెలుగు లెస్స" అని కీర్తింపబడుచున్న తేనెలొలుకు తెలుగుభాష లిపి గురించి తెలుసుకునే ప్రయత్నమును చేస్తూ,  మందార మకరందమును గ్రోలే మధుపములుగా మన తెలుగుతల్లి పాదాలమీద వాలుదాము.

   అచ్చులు-అ-నుండి ఔ వరకు,హల్లులు క నుండి ఱ వరకు ఉభయాక్షములు మూడు ,
 సున్న,అరసున్న,విసర్గ అన్న పేర్లతో తెలుతల్లి కంఠహారముగా కన్నులపండుగ చేయుచున్నవి..
  కదంబముగా మారునపుడు అచ్చుల-హల్లుల ఐకమత్యమునుగురించి వానికి ఉభయాక్షరములతో ఉన్న సత్సంబంధముల గురించి అర్థముచేసుకునే ప్రయత్నమే ఈ తేనెపలుకులు.
 ఇప్పటి వరకు ఎందరో మహానుభావులు తమవంతు అర్చనగా ఎన్నో మహత్తర విషయములను అందించినారు.వారందరికి నా హృదయపూర్వక అభినందనలు.
 "అక్షరపదార్చనయే అక్షయ పదార్చనమనే ఆర్యోక్తిని "
గౌరవిస్తు నా వంతు ప్రయత్నమును మీ ముందుంచుతాను,పెద్దమనసుతో లోపములను సరిదిద్దుతు నన్ను ముందుకు నడిపిస్తారని 
 ఆశిస్తూ,నమస్కారములతో,మీ సోదరి.
  మరిన్ని విశేషములతో,తదుపరి భాగము. 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...