Thursday, April 7, 2022

తెలుగుపదపరిమళ పునాదులు.

 


 తెలుగుపదపరిమళ పునాదులు

 **********************

  పరిమళపారిజాతాలు మన తెలుగుపదాలు.వాటికి పునాదులు పురస్కారాలు వాటిలోదాగిన అక్షరాలు.తెలుగులో వర్నమాలలో మనము రోజు పిల్లలకు చూపిస్తు చదివిస్తున్న అక్షరముల స్వరూప-స్వభావములగురించి ,సహాయ-సహకారముల గురించి తెలుసుకొనేదుంకు ప్రయత్నిద్దాము.


 అ-ఔ  16 గా నున్న (మొదటిభాగము) వాటిని అచ్చులు లేక స్వరములు అంటారు.ఇవి స్వతంత్రత గలిగినవి.ఏ ఇతెర సహాయము లేకుండా పదమునందు ప్రకాశించుచు పరిమళమునందించగలవి.సానుకూల స్వభావములవి కనుకనే హల్లులతో కలిసిమెలిసి సమర్థవంతమైన సాహిత్యమునకు సొబగులు దిద్దుచున్నవి.

   హల్లులు 36 .అచ్చులతో సంఖ్యావిషయములో పోల్చితే అధికముగా నున్నప్పటికిని పదమునందలి చివరి స్థానమున మాత్రమే స్వతంత్రముగా నుండగలవు.మిగిలిన స్థానమున నుండవలెనన్న అచ్చు సహాయములేకుండా సాధ్యము కాదు.

  ఈ సంపూర్ణత్వమును ఏర్పరుచుకొనుటకు హల్లు తన పూర్వరూపం నుండి కొంత భాగమును తొలగించుకొని,రూపము మార్చుకొని కొత్త పేరుతో వచ్చి తనను కలియనున్న అచ్చునకు అనువగు స్థానమును చూపించవలసి ఉంటుంది.అచ్చు-హల్లు పరస్పర సమన్వయముతో తమనుతాము మార్చుకొని సరికొత్తరూపముతో అక్షరములుగా మారుచు మనలను మురిపించుచున్నవి.

  మరికొన్ని విశేషములతో తదుపరి భాగము. ధన్యవాదములు.

 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...