Saturday, September 12, 2020

siva sankalpamu-01

ప్రియ శివస్వరూపులారా! నమస్కారములు. శివుని కరుణ అర్థముకానిది.కాని శివుని కరుణ అద్భుతమైనది.సత్య-శివం-సుందరము గా కీర్తింపబడుచున్న పరమాత్మస్వరూపము-స్వభావము ఆనందదాయకములు.అభీష్టఫలప్రదములు.ఆధ్యాత్మికసోపానములు. పాలు-మీగడ,పెరుగు-వెన్న-నెయ్యి ఇలా రూపాంతరములను చెందుతుంది చిలికినప్పుడు.విచిత్రము నెయ్యి పరుకొని ఉన్నా-కరిగించినా నెయ్యిగానే తన రూపములో-స్వభావముతో ఉంటుంది.అదేవిధముగా సుందర సత్యమైన శివతత్త్వమునకు ఆకర్షింపబడినవారు దానినుండి వెనుతిరగలేరు.అది మనలను మహేశ్వరునితో మమేకము చేస్తుంది.దాసుని తప్పులు దండముతో సరి అంటు మనచే ఆడిస్తుంది-పాడిస్తుంది.మనసును జోకొట్టి-బుధ్ధిని నిద్దురపుచ్చి శువుని నిందించేలా చేస్తుంది.తిరిగి మేల్కొలిపి స్తుతించేలా చేస్తుంది.మనసుతో దాగుడుమూతలు ఆడుకుంటు,బుధ్ధిని అందులో భాగస్వామిని చేస్తూ" శివ సంకల్పము" అను "నిందాస్తుతులను" అందచేస్తుంది.సర్వమును తానే అయిన సదాశివుడు తన డమరుకము నుండి లక్షణ అక్షరధారలను కురిపించదలిచాడు.అక్షయ ముక్తిఫలములను పంచుతు మనలను మురిపించనున్నాడు.కాని మధ్యలో నా అహము దూరి అడ్డుపడుతోంది.కనుక దోసిలొగ్గి ఫలములను స్వీకరించి తరించుదాము.నా దోసములను సవరించుదాము. ఓం నమః శివాయ-01 ********************** ఓం నమ: శివాయ-01 అర్హత ఉందో-లేదో అసలేనేనెరుగను అర్చన అవునో-కాదో అదికూడా నేనెరుగను నమక-చమక అంతర్గత గమకము నేనెరుగను కోట్ల అపచారములో షోడశోపచారములో అహంకార గద్యమో అపురూప నైవేద్యమో అశక్తతా కళంకమో భక్తి నిష్కళంకమో దు:ఖ నివృత్తియో ఇదిసత్కృతియో నేనెరుగను దుష్ట పరిహారమో ఇది ఇష్ట పరిచారమో కుప్పల తప్పులు చేస్తూ నే ఒప్పులుగా భావిస్తే గొప్పదైన మనసుతో నా తప్పిదములు క్షమియిస్తూ సకల దేవతలతో పాటు సముచితాసనుడివై సన్నిహితుడుగ మారరా లోక సన్నుత ఓ శంకరా. భగవత్ స్వరూపులారా! నన్ను పరికరముగ మలచి ఆ సదాశివుడు తనకు తాను వ్రాసుకొనిన "శివ సంకల్పము" అను 108 నిందా స్తుతులతో కూడిన స్వేచ్చా స్తుతుల సంకలనములో అహము చొరబడి నేను చేసిన తప్పులను సహృదయతతో సవరిస్తారని ఆశిస్తూ,నమస్కారములు. ( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...