Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-02

ఓం నమ: శివాయ-02 ధర్మాధర్మములా సకలదేవతలారా! ఇవి నిర్మితము శివునిచే నిమిత్తమాత్రము నేను మదముతోటి మాటలని నన్ను మన్మథునిగ చూస్తాడో వదరుబోతు పదములు అని ఆదరమే చూపుతాడో పుట్టుట-గిట్టుట నడుమ శివుని తిట్టుట అనుకుంటాడో కట్టుబాటు నేర్పించగ మెట్టుదిగి వస్తాడో ప్రమథ గణములకు నన్ను పరిచయమే చేస్తాడో ప్రమదములో ముంచుతాడో-ప్రమాదమే అంటాడో కాలకూట విషముకన్న కఠినము తానంటాడో కన్నతండ్రిని అని క్షమించి వదిలేస్తాడో మితిమీరిన ప్రేమతో తిక్క శంకరుడని అన్నానంటూ నా పక్కనే ఉంటాడో ఆ తిక్క శంకరుడు. ద్వంద్వ భావములు నాలో చేరి,నేనే వ్రాసాను అని కాసేభ్రమపడుతు,మరి కాసేపు శివుడే వ్రాసాడు అనికనిపెడుతు,కాసేపు స్తుతియిస్తు, మరికాసేపు నిందిస్తు మాయామోహితుడనైన నన్ను క్షమించి రక్షించుతాడో-కోపించి శిక్షించుతాడో-అంతా ఈశ్వరేచ్చ. ( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...