SIVA SANKALPAMU-26

ఓం నమః శివాయ-26 **************** ప్రళయము చూస్తుంటావు-ప్రణవము చేస్తుంటావు అదృశ్యము చేస్తావు-పంచకృత్యమని అంటావు అల్లుడిని కానంటావు-ఇల్లరికము ఉంటావు సన్యాసిని అంటావు-సంసారిగ ఉంటావు దయనీయుడనంటావు-దహించివేస్తుంటావు ఎవ్వడు వాడంటావు-ఎదిరించలేడనంటావు ఎడమకాలితో తన్నుతావు-మడమతిప్పనంటావు ఎడమకాలు ఎవరిదంటే-తడబడుతుంటావు నీవు చేయని శిక్షణను-నీవే చేసానంటావు అమ్మ చేయుచున్న రక్షణను-అంతా దాచేస్తావు మక్కువ అంటూనే అమ్మను-నువ్వు తక్కువగా భావించే కక్కూర్తి వాడవటర నీవు ! ఓ తిక్కశంకరా. శివుడు జగములు జలమున మునిగిపోతుంటే చేతకానివాడై కళ్ళుమూసుకొని జపము చేసుకుంటాడు.దక్షుడికి నేను ఇప్పుడు అల్లుడిని కానని,నమస్కరించకుండా,ఎప్పుడు కైలాసములోనే ఇల్లరికము ఉంటాడు.దయార్ద్రహృదయుడనని అంటూనే దహించివేస్తుంటాడు. ఎడమకాలితో శత్రువులను తరిమికొడుతు,మడమతిప్పని ధైర్యము కలవాడనని అంటాడు.సర్వము సతి చేస్తుంటే,దానిని చెప్పకుండా అంతా తానేచేస్తున్నానని చెప్పుకుంటాడు.ఎడమకాలి ప్రసక్తి వస్తే తడబడుతుంటాదు-నింద. శివాయ నమః శివాయ-శివాని నమః శివాయ సన్నుతి నమః శివాయ-సద్గతి నమఃశివాయ నమః శివాయ నమ: శివాయ ఓం నమః శివాయ. "ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయై జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయైచ నమః శివాయ" అర్థనారీశ్వర స్తోత్రము. లలితనృత్యమును చేయు తల్లి పాదము-దుష్టతాడనము చేయు స్వామి తాండవ పాదము జగత్కళ్యాణకారకములైన సచ్చిదానంద స్వరూపమే.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI