Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-07

ఓం నమ: శివాయ-07 ****************** కృతయుగము వాడివి అనిచెప్పి కృతకృత్యులైన వారు కొందరు త్రేతాయుగము వాడివని తేల్చేసిన మరికొందరు ప్రాచీన గోచరుడివి అనిచెప్పే ఆచార్యులు కొందరు ద్వాపరము వాడివి అని చెప్పిన దార్శనికులు కొందరు శతాబ్దముల వాడివి అని చెప్పే లబ్ధ ప్రతిష్టులు మరి కొందరు తరతరాల పురాతనమే అన్న పండితులుకొందరు పరమ ముసలివాడివి అన్న ప్రళయ సాక్షులు కొందరు అబ్బో కాలాతీతుడు అని నీ తెలివిని పొగిడే కొందరు "నమ: శివాభ్యాం నవ యవ్వనాభ్యాం" అని అన్నారే అనుకో నవ్వుకుంటు విని దానిని నువ్వు చిందులేస్తుంటే పరుగులు తీసే వయసును నువు మరుగున దాచేస్తున్నావని ఒక్కటే గుసగుసలు ఓ తిక్క శంకరా. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఉమా మహేశ్వర స్తోత్రములో శివుని నవయవ్వనుడు అనగానే,తాను ఎప్పటినుండియో ఉన్నప్పటికి తన వయసును దాచేసి,సంతోషముతో శివుడు నాట్యము చేస్తున్నాడని నింద. "నమో పూర్వజాయచ-పరజాయచ" శివుని తాపై అభరణమైన చంద్రవంక,చేతిలోని పుర్రె శివుని కాలాతీత తత్త్వానికి సంకేతములుగా సంకీర్తించుచున్నవి. (ఏక బిల్వం శివార్పణం)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...