Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-08

ఓం నమ: శివాయ-08 కాదనలేవుగ పాముని,కాదనలేవుగ చీమని కాదనలేవుగ లేడిని,కాదనలేవుగ వేడిని కాదనలేవుగ దండని,కాదనలేవుగ కొండని కాదనలేవుగ తేటిని,కాదన లేవుగ నీటిని కాదన లేవుగ బూజుని,కాదనలేవుగ బూదిని కాదన లేవుగ మేథని,కాదన లేవుగ వ్యాధిని కాదనలేవుగ గౌరిని,కాదనలేవుగ శౌరిని కాదనలేవుగ సుతులని,కాదనలేవుగ నుతునులని కాదన లేవుగ విందుని,కాదనలేవుగ విందుని కాదనలేవుగ మునులని,కాదనలేవుగ జనులని ఒకే ఒక్కసారి నిన్ను ఒక్కడినే రమ్మంటే,ఈ తొక్కిసలాటేమిరా ఓ తిక్క శంకరా ............... శివా నువ్వెక్కిడికైనా వెళ్ళాళంటే నీతో పాటు పాముని,చీమని,అగ్గిని,లేడిని,పూలదండలుగ మారిన భక్తులని,మంచు కొండని,అమ్మవారి తుమ్మెదలవంటి జుట్టుని(అర్థనారీశ్వరము)నీ జడలలోనున్న గంగని,సాలె పురుగు నీకై నేసిన బూజుని,మన్మథుని శరీరము నుండి వచ్చిన బూడిదని,దక్షిణా మూర్తిగా మేధను,భక్తుల వ్యాధిని,కొడుకులను,పొగడ్తలనుమునులను,జనులను విందుకు పిలిచిన భక్తుని దగ్గరకు తీసుకెళ్తాడని నింద.వాటికి,శివునికి భేదములేదని స్తుతి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...