Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-46

ఓం నమః శివాయ-46 ******************** మౌనము మాటాడునట మాయేదో చేసావులే మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే మూగయు మాటాడునట మాయేదో చేసావులే మూక పంచశతిగా కీర్తించేది మాయేలే కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే పూవులే పళ్లట మాయేదో చేసావులే పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే బోడిగుండు శివుడట మాయేదో చేసావులే శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా. శివుడు మౌనముగానే జ్ఞానమందించే అతీతశక్తులు కలవాడనని చెప్పుకుంటాడు.మూగవానిని మాట్లాడించగలను అని కూడ అంటాడు.అంతే కాదు గంధర్వుని శాప పరిహారమునకై వాని దంతములను సుగంధభరితములు చేసానని చెబుతాడు,పెద్దప్రవాహములో తనను నమ్మి నడుచు భక్తుని పాదముల క్రింద పద్మములను సృష్టించానని తనకు శ్రీ శంకర భవత్పాదులకు భేదములేదని,ఎలా ఎన్నో-ఎన్నెన్నో మాయమాటలు చెప్పే మొసగాడు.కనుకనే దక్షయజ్ఞకుండమునుండు ప్రభవించిన మాయాసతికి-మాత సతికి తేడాను గుర్తించలేక మాయా మోహితుడై భుజము మీదికెక్కించుకొని మోయుచున్న మోసగాడు.-నింద. మౌనం నమః శివాయ- ధ్యానం నమః శివాయ మోహం నమ:శివాయ-మోక్షం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే. అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా. ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే. హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా. వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ, అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్. సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ హరం దివ్యం రోగ సర్వ సంపత్కరం శుభం. శివుని మౌన వ్యాఖ్య,మూక పంచశతి,పద్మపాదుడైన సునందుని స్తుతి పుస్పదంతుని భక్తి,సాక్షాత్ శివ స్వరూపమైన ఆది శంకరుని స్తోత్రములు శివుని పూజనీయుడిని చేస్తున్నాయని స్తుతి శివుడు మాయామోహ పూరితుడై దక్షయజ్ఞ కుండమునుండి తిరిగి వచ్చిన మాయా సతిని ,తన భార్య అనుకుని మోసుకెళ్లాడని నింద. అలా శివుడు మాయ నటించినది అష్టాదశపీఠ ఆవిర్భావమునకు అని స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...