Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-10

ఓం నమః శివాయ -10 ****************** శివుని తల్లి బెజ్జమహాదేవి అంటున్నారు శిలాదుడు తండ్రియని నేను వింటున్నాను శివుని అక్క మగాదేవి గారాబము చేస్తుందట శివుని పత్ని పార్వతి పరిపాలించేస్తుందట గణపతి-గుహునితో పాటుగ నీకెందరో సుతులట శివుని సఖుడు హరి అట చెప్పుకుంటున్నారు శివభక్తిని పశు-పక్షులు చాటిచెప్పుతున్నాయి శివలీలలు యుగయుగము కనువిందు చేస్తున్నాయి భావనలో నిండినది బహుచక్కని కుటుంబము "బ్రహ్మజ్ఞానవళీయము" బహుచక్కగ చెబుతున్నది "అసంగోహం-అసంగోహం-అసంగోహం-పునః పునః" టక్కరి మాటలురా ! ఓ తిక్క శంకరా. శివునికి తల్లి-తండ్రి,భార్యా-బిడ్డలు,భక్తులు-స్నేహితులు ఉన్నప్పటికిని,నేను ఏ సంబంధము లేనివాడిని అని చెబుతుంటాడు--నింద. "ఘట కుడ్యాదికం సర్వం-మృత్తికా మాత్ర ఏవచ తత్వద్ బ్రహ్మ జగత్ సర్వం-ఇతి వేదాంత డిండిమః." కుండలు-పాత్రలు-గోడలు-ఇటుకలు మొదలగు వానిలోని మూలపదార్థము మట్టియే అయినప్పటికిని,మనకు వివిధ వస్తువులుగా కనిపిస్తాయి.అదే విధముగా మూల పదార్థమైన బ్రహ్మము శుధ్ధ చైతన్యము,శాశ్వతానంద రూపము మాయచే కప్పబడిన వారికి వేరు వేరు రూపములుగా గోచర్మవుతుందని వేదాంత డిండిమ అను మహాగ్రంథము వివరిస్తున్నది.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...