Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-51

ఓం నమః శివాయ-51 ******************** నగుమోముతో నగములు నిన్ను బంధువు అంటున్నవి సాలెపురుగు పాలె దోమ దయాసింధువు అంటున్నది తుమ్మెద అమ్మమ్మ నిన్ను కమ్మని చుట్టము అంది కరిరాజు పరివారము తమ సరివాడవు అంటున్నవి ఎద్దుతరపు పెద్ద నిన్ను పెద్దయ్య అంటాడట లేడి చేడియ నిన్ను తనవాడివి అంటున్నది వ్యాళపతి వాసుకి నిన్ను చుట్టమని చుట్టుకుంది తిన్నని కన్న అడవి కన్నతండృఇ అంటున్నది హరి సంగతి సరేసరి అసలుచుట్టమంటాడు ఇందరి చుట్టమైన నీవు నన్ను చుట్టుకోకుంటేను " నరత్వం-దేవత్వం-నగవన మృగత్వం" అన్న లహరి లెక్కలోకి రాదురా ఓ తిక్కశంకరా. శివునికి చుట్టములు కొండలు-కీటకములు-జంతువులుఅడవి మొదలైనవే కాని సరివారు ఎవరులేరు కనుక నేను స్తుతిచేస్తుంటే నన్ను కరుణించుట లేదు--నింద. శిల్పం నమః శివాయ-శిల్పి నమః శివాయ వేట నమః శివాయ-వేటు నమః శివాయ( దెబ్బ) నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం -శివానందలహరి. పరమేశా! మానవునిగానో-దేవునిగానో-కొండగానో-అడవిగానో-జంతువుగానో-దోమగానో -పశువుగానో-కీటకముగానో -పక్షిగానో పుట్టినా ఎల్లప్పుడు నీ పాదపద్మ స్మరణమనే ప్రవాహములో తేలియాడే సౌభాగ్యమును ప్రసాదింపుము సదాశివా.ఇక్కడ మనమొక్క విషయమును గుర్తుచేసుకుందాము.ఎన్ని వరములను అడిగితే అవి ధర్మబధ్ధములైతే ఇన్ని వరములా అని అనడు ఈశ్వరుడు.కనుకనే లహరి అల ఈ విధముగా నిరంతరము కడలిని వీడక కదులుతూనే ఉంటుందో అదేవిధముగాశివానుగ్రహమనే సముద్రము నిరంతరము వరములను అలలతో నిండి అనవరతము అనుగ్రహించుచుండును. .అందుకే శ్రీ శివానంద లహరి నామమును సార్ధకతను అందించుచున్నది.శివోహం-స్తుతి. శివుడు చేతనాచేతనములలో అంతర్లీనముగా ఉన్నాడు.కొండలలో వేదస్వరూపముగా,కీటకములలో సూక్షములో మోక్షమునకు బాటగా,పశువులలో పశుపతిగా,మనసనే దట్టమైన అడవిలో విషయవాసనలనే కౄరమృగముల నుండి రక్షించువాడిగా విలసిల్లుతున్నాడని స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...