Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-44

ఓం నమః శివాయ-44 ******************** నీకు మల్లే నీ నామమునకు నిలకడలేదు శివా పెదవులు తెరుచుకోగానే పదమని పరుగెడుతుంది శంభో అని పిలువగానే అంభోరుహము చేరుతుంది శివ శివ అని పిలువగానే శిఖరాగ్రము చేరుతుంది మహాదేవ యని పిలువగ తుహినముగా మారుతుంది నీలగ్రీవ అనగానే వినీలగగనము అవుతుంది విశ్వనాథ అని పిలువగ విశ్వమంత తిరుగుతుంది ఈశ్వరా అని పిలువగ ఈడ ఉండనంటుంది ఉమాపతి అని పిలువగ ఉరూరుచాటి వస్తుంది పశుపతి అని పిలువగానే వశమయ్యానంటుంది ఎవరేమని పిలిచినా ఎక్కడికి పోవద్దని,దానికి ముక్కుతాడు వేయరా ఓ తిక్క శంకరా. శివనామము శివుని ఖాతరుచెయ్యదు.దానికేమి శివుడంటే భయము లేదు,కనుకనే తన ఇష్టమొచ్చినచోటికి వెళ్ళిపోతుంది.మళ్ళీరావాలనిపిస్తే,అది వీలుచూసుకుని ఎప్పుడో కుదిరినప్పుడు మెల్లగ వస్తుంది.తనకు ఎన్నో పర్లున్నాయని మురిసిపోయే శివుడు,వాటిని నియంత్రించలేని అసమర్థుడు.-నింద. నామం నమః శివాయ-నామి నమః శివాయ సామి నమః శివాయ-సర్వం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శివశివశివ అనరాదా శివనామము చేదా-శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.త్యగరాజస్వామి మరెందరో శివునకు శివనామమునకు వ్యత్యాసములేదని వక్కాణించిరి.నిరాకార-నిర్గుణ-నిరంజనుని ఏ పేరుతో పిలువగలము? ఏమని వర్ణించగలం? అన్నినామములిందే ఆవహించెను అన్నట్లుగా అన్ని రూప-నామములు తానైనవాడు-మనలను తరియింపచేయువాడు ఒక్కడే. నమ సూద్యాయచ సరస్యాయచ్రుద్రనమకం. బురదకలప్రదేశము సూద్యము.అందున్నది కమలము.అందుండువాడు సూద్యుడు.సరస్సున నుండువాడు సరస్యుడు.బురదకల సంసారమునందుండినను దానిని నంటనీయక అంతర్యామియై యున్న శివునకు నమస్కారములు-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...