Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-43

ఓం నమః శివాయ-43 ******************* దారుణ మారణ కాండను కారుణ్యము అంటావు పొట్ట చీల్చి గజాసురుని మట్టి కరిపించావు చుట్టుకుంది అతని తల నీ సుతు శరీరమునే కన్ను తెరిచి మన్మథుని కన్ను మూయించావు కన్నుల పండుగ ఐనది నీ కళ్యాణముతో బాణమేసి వరాహము ప్రాణమే తీసావు పాశుపతము చేరినది అర్జునునికి ఆశీర్వచనమై హరిని అస్త్రముగా వాడి త్రిపుర సమ్హారము చేసావు విరచితమైనది వీరముగా హరి మహిమ ఎటు చూసిన పాతకమే నీ గతముగా మారితే నీకు "మహాదేవం,మహాత్మానాం,మహా పాతక నాశనం" అని స్తుతులా అంటే చక్క బరచుట అంటావురా ఓ తిక్క శంకరా. భావము శివుని గతము అంతా పాపమయము-నింద.చెడును దునిమాడాననుకొని తానే నష్ట పోతూ ఉంటాడు.పొట్ట చీల్చి గజాసురుని చంపాననుకుంటే ఆ ఏనుగుతల తనకొడుకుని చుట్టుకొంది.మన్మథుణ్ణి జయించాననుకుంటే,ఆ బాణమునకు లొంగి పార్వతీపతిగా మారాడు.పందిని గెలిచాననుకుంటే,పాశుపతమును పోగొట్టుకున్నాడు.త్రిపురాసురులను జయించాననుకుంటే,ఆ ఘనత అస్త్రముగా మారిన హరికి దక్కింది.ఇలా ప్రతిసారి శివుడు తాను గెలిచాననుకుంటూ,ఓడిపోతూ ఉంటాడు-నింద. బాణము నమః శివాయ-ప్రాణము నమః శివాయ గతము నమః శివాయ-పాతకము నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ "నమో మృగయభ్యశ్శ్వనిభ్యశ్చవో నమః" రుద్రనమకం. వేటాడు వారికొరకు వారిరూపమున నున్న రుద్రునకు నమస్కారములు.మృగములను చంపుటకు వానిని సమీపించు రుద్రుడా కొంచము ఆగు స్వామి.నాదొక విన్నపము. " స్వామిన్నాది కిరాత మామక మనః కాంతార సీమంతరే వర్తంతే బహుశో మృగా" శివానంలహరి. ఓ ఆదికిరాతకుడా! నీవు అటు-ఇటు పోకుము. నా మనసనే మహారణ్య ప్రాంతములో మాత్సర్యము-మోహము మొదలగు మదించిన మృగములు విచ్చలవిడిగ సంచరించుచున్నవి.మృగయాసక్తుడవైన ఓ శివా! వేట అనే నీకు ఆనందకరమైన వినోదముతో వాటిని చంపి,నన్ను ఉధ్ధరింపుము.--స్తుతి. ( ఏక బిల్వం శివార్పణం)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...