Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-23

ఓం నమ: శివాయ-23 ******************* అరిషడ్వర్గాలను ఆహా నువ్వు బెదిరిస్తుంటే అహముతో అసురగణము నిన్ను బెదిరిస్తోందా బ్రహ్మ పుర్రె పట్టుకొని నువ్వు బిచ్చమెత్తుతుంటే బ్రహ్మర్షులు చిత్రముగా నిన్ను బిచ్చమడుగుతున్నారా పొంగుచున్న గంగను నువ్వు జటలలో బంధిస్తే పంచాక్షరి వింతగ నిన్ను పట్టి బంధిస్తోందా ఆ నందిని కైలాస కాపరిగ నువ్వు నియమిస్తే బాణుడు శోణపురి కాపరిగా నిన్నే నియమించాడా పరమ గురుడు శివుడు అని నేను స్తుతులు చేస్తుంటే అఖిలజగము పరిహసిస్తు విస్తుబోయి చూస్తుందా బందీలు ఎవరో తెలియని నా సందేహము తీర్చకుంటే నిక్కము అనుకుంటానురా ఓ తిక్క శంకరా. ,..శివుడు ఆరు శత్రువులను బెదిరిస్తున్నాను అని చెబుతూనే, తన ప్రాణము మీది మోహముతో రాక్షసులనుండి రక్షించుకోవటానికి పరుగులెత్తటమో,చెట్టు తొర్రలలో దాగుటయో చేస్తాడు తాను యాచకుడిగా ఉంటున్నా బ్రహ్మర్షులకు తాను దాతను అంటాడు."ఓం నమ: శివాయ" అను పంచాక్షరి మంత్రములో తాను బందీగా ఉంటూ,గంగను జటలలో బంధించిన వాడినని పొంగిపోతుంటాడు.తాను బాణాసురుని శోణపురమునకు కాపరిగా ఉంటూ,నందిని తన కైలాసానికి కాపరిగా నియమించానని,నందికి యజమానిని అని చెప్పుకుంటాడు.శివుడు తనుచేసే పనులను ఇతరుల చేత చేయిస్తున్నానని చెప్పుకుంటున్నాడు అని, నింద. కావలి నమః శివాయ-కాపాలి నమః శివాయ దైత్యం నమః శివాయ-దైవం నమః శివాయ నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ. " నమః అశుషేణాయచ-అశురథాయచ నమః శూరాయచ-అవబింధతేచ." రుద్రనమకము. భక్తరక్షణకై శీఘ్రముగా నడచునట్టి సేనలు,రథములు గల రుద్రా నమస్కారములు.భక్తులయొక్క శత్రువులను అప్రయత్నముగా ఛేదించు శూరా! నమస్కారములు. త్వమేవాహం -నేనే నువ్వు,నువ్వే నేను అన్న తత్త్వముతో అహము-ఇహము,దాత-అర్థి,బంధించిన వాడు-బంధితుడు,కాపరి-యజమాని,స్తుతి-నింద,కీర్తి-అపకీర్తి,భగవంతుడు-భక్తుడు అంతా శివుడేనని స్తుతి. ( ఏక బిల్వం శివార్పణం) .

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...