Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-35

ఓం నమ: శివాయ-35 *************** కొండమీద నీవున్నావని కొలువగ నేవస్తే బండరాయి కూడ నిన్ను తనతో పోల్చుకుంది బావిలోన నీవున్నావని భక్తుడిగా నేవస్తే బావిలోని కప్ప నిన్ను తనతో పోల్చుకుంది బీడునేల నీవున్నావని తోడు కొరకు నేవస్తే జోడువీడు అంటు బీడు తనతో పోల్చుకుంది అటవిలోన ఉన్నావని అటుగా నేవస్తే జటలు చూడు అంటు అడవి తనతో పోల్చుకుంది చెట్టులోన ఉన్నావని పట్టుకొనగ నేవస్తే పట్టులేక ఉన్నావని చెట్టు తనతో పోల్చుకుంది సఖుడివి నీవై సకలము పాలిస్తుంటే ఒక్కరైన పొగడరరేర ఓ తిక్క శంకరా. భావము శివుడు కప్ప వలె బావిలో,బండరాయిలా కొండ మీద, బీడు నేలలా పొలములో,జటలతో ఊడలమర్రిలా ,,అడవిలొ పటుత్వము లేని మద్ది చెట్టులా ఉన్నాడని నింద బీడు నమః శివాయ-తోడు నమః శివాయ బండ నమః శివాయ-అండ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. " నమః కూప్యాయచావట్యాయచ" రుద్రనమకం. బావులలోని జలములయందున్నవానికి,పల్లము స్థలముయందున్న వానికి నమస్కారములు. బావి లోని నీరు నిర్మలముగా ఉంటుంది.పల్లపు నీరు మలినముగా ఉంటుండి.రుద్రుడు నిఎర్మలమైన నీటిలోను-మలినమైన నీటిలోని సర్వసమానత్వమును పాటిస్తు ఉంటాడు.అదే విధముగా సజ్జనులను మందభాగ్యులను కనికరిస్తుంటాడు. "అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే" రుద్ర చమకము. పరమేశ్వరా సర్వము నీవై శోభించుచున్నవాడ! నాకు నా ప్రయత్నమును సమర్థవంతము చేసికొనుటకు నాకు రాళ్ళు-మట్టి-పర్వతములు-చెట్లు మొదలగు బానిని అనుగ్రహింపుము అని సాధకుడు రుద్రుని అర్థించుచున్నాడు. " గుహాయాం గేహేవా బహిరపి వనే వాద్రి శిఖరే జలేనా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ వదే స్థితం చేద్యోగోసౌ స చ పరమ యోగీచ స చ సుఖీ." శివానందలహరి. . చిత్తునందు చిత్తము నిలుపని వాడు గుహలలో-అడవిలో-పర్వతశిఖరములలో-నీటిలో-అగ్నిలో-ఎక్కడెక్కడో నిన్ను వెతుకుచున్న ఏమిలాభము? ఎవడి మనస్సు నీ పాదపద్మములయందు స్థిరముగా నుండునో అతడే సుఖప్రద గొప్పయోగి.-స్తుతి. తనలో దాగిన కప్పకు ఆహారమును,ఉనికినిచ్చు బావి వలె,వజ్ర సంకల్పమైన రాయివలె,ఏ ఆకర్షణకు లోనుకాని నిశ్చలత్వము వలె,బీడుగా పైకి కనపడుచున్నను ఆర్ద్రతతో కడుపునింపు పంటచేను వలె,తన పిల్లలు అందుకొనుటకు కరుణ పాశమను తాటిని వేలాడదీయు జడల వృక్షము వలె,తీగెలకు ఆలంబనమైన మద్ది వృక్షము వలె శివుడు ప్రకాశించుచున్నాడు.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం. .

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...