Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-49

ఓం నమః శివాయ-49 **************** రుద్రాక్షలు ఇష్టము-చిన్ముద్రలు ఇష్టము అభిషేకము ఇష్టము-అవశేషము ఇష్టము బిల్వములు ఇష్టము-బిలములు ఇష్టము తుమ్మిపూలు ఇష్టము-తుమ్మెదలు ఇష్టము తాండవము ఇష్టము-తాడనము ఇష్టము అష్టోత్తరము ఇష్టము-నిష్ఠూరము ఇష్టము చందనాలు ఇష్టము-వందనాలు ఇష్టము కాల్చుటయు ఇష్టము-కాచుటయు ఇష్టము లయగ ఆడుట ఇష్టము-లయముచేయుట ఇష్టము మహన్యాసము ఇష్టము-మహాశివరాత్రి ఇష్టము కష్టాలలోనున్న నాపై ఇష్టము చూపించకుండుట నీ టక్కరితనమేరా ఓ తిక్కశంకరా. శివుడు రుద్రాక్షలను-అభిషేకములను-తుమ్మిపూవులను,మారేడు దళములను-కొండగుహలను చందనములను ఇష్టమని ప్రకటించుకున్నాడు.ఇంతేనా ఇంకా ఏమైన వున్నాయా అని అడిగితే చిన్ముద్ర-అవశేషాలు-నాట్యములు-దండించుట-తుమ్మెదలు-నమస్కారములు కాల్చుట-కాచుట మహన్యాసములు ఇష్టమనినాడు.తనకు కావలిసిన సమాధానము రాలేదని ఇంకా ఏవైనా మరిచిపోయినావా శివా అని అడిగితే దరహాసం చేస్తాడు కాని తనపై దయ ఉందని మాత్రము అనడు-నింద. బిలము నమః శివాయ-బిల్వము నమః శివాయ కాల్చుట నమః శివాయ-కాచుట నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " గలంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దలంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయితాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ" శివచరిత్రమను నదినుండి ప్రవహించుచు,పాపమనే ధూళిని కడిగివేయుచు,సంసారములో పరిభ్రమించుటచే నాలో ఏర్పడు సంతాపమును ఉపశమింపచేయుచు,నా హృదయమనే సరస్సులో నిలిచే ఆనందప్రవాహము శుభములను చేకూర్చును గాక.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...