SIVA SANKALPAMU-27

ఓం నమః శివాయ-27 *********************** మన్మథబాణము అంటే మాయదారి భయము నీకు కోపము నటించి వానిని మాయము చేసేసావు. కోరికలతో కొలుచువారంటే కొండంత భయము నీకు చేరువుగా రాకుండా పారిపోతు ఉంటావు అహముతో కొలుచువారంటే అంతులేని భయము నీకు దారి ఏదిలేక వారికి దాసోహము అవుతావు సురలందరు కొలువగ కలవరమగు భయము నీకు అనివార్యము అనియేగ గరళకంఠుడిగా మారావు ధరించినవాటిని దాచలేని భయము నీకు జగములు గుర్తించకుండ లింగముగా మారావు " నమో హిరణ్యబాహవే-సేనాన్యే" అని విన్న,నా బిక్క మొగమును చూడరా ఓ తిక్కశంకరా. మన్మథబాణప్రభావమును ఎదిరించలేక పిరికితనముతో మన్మథుని కాల్చివేసాడు.వరములకొరకు తన దరి చేరు వాని నుండి తప్పించుకొనుటకై మద్యపానము చేస్తూ,మగువతో క్రీడిస్తున్నట్లు వారిని భ్రమింపచేసి ,వారిని దూరముగా పంపించివేస్తాడు.(బ్రహ్మను తదితరులను.తప్పనిసరి పరిస్థితులలో పిరికివాడైన శివుడు చప్పుడు చేయక కష్టమైనప్పటికిని వారు చెప్పినదే చేస్తాడు.అంతెందుకు తన దగ్గర నున్న గంగ-జాబిలి-శూలము-లేడి మొదలగు వాటిని ఎవరైన దొంగిలిస్తే,వారినెదిరించుట కష్టమని,ముందరే తాను లింగముగా మారి ఎవరికి ఏమీ కనిపించకుండా చేస్తున్నప్పటికిని,రుద్రము బంగారు చేతులు గల రుద్రా నీ సేనాధిపతివి అని కీర్తిస్తుంటే ,ఆనందంతో అంగీకరిస్తాడు-నింద. " బీరం నమః శివాయ-వీరం నమః శివాయ లింగం నమః శివాయ -లీల నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. " నమః శూరాయచ-అవభిందతేచ" రుద్రనమకము. సకలలోకములు సదాశివుని బాహువులను హిరణ్యబాహవే" అని ప్రత్యేకించి కీర్తిస్తున్నవి.అవి హితమును-రమ్యత్వమును అందించు బాహువులు. అట్టి హిరణ్య బాహువులు కలిగిన శివుడు జగద్రక్షణ అను యుధ్ధమునకు సేనాని అయినాడు.దుష్టశిక్షణ-శిష్ట రక్షణ అను దీక్షను స్వీకరించినాడు.తత్ఫలితముగా భక్తులయొక్క శత్రువులను అప్రయత్నముగా ఛేదించుచు -అవభిందుడిగా తన శూరత్వము చేత ధర్మమునకుగ్లాని కలిగించబోవు బాహ్యశత్రువులను-అంతః శత్రువులను అవలీలగ అంతమొందించుచు (త్రిపురాసుర సంహారము) ,లోకకళ్యాణమును గావించుచున్నాడు.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI