మకర సంక్రమణము-2

సంక్రాంతి శుభాకాంక్షలు
పల్లెతల్లి నేర్పిన పాఠాలే గద ఇవి
ప్రగతి సాధించామంటు పొందుతున్న ఈవి
సంక్రాంతిని తలచుకో,భ్రాంతిని తొలగించుకో
.................................
నాగేటిదెబ్బ తాను తింటూ సాగేటి ఆ సాగు
కన్నతల్లి కరుణ జారి పొంగేటి ఆ వాగు
కష్టమొక్కటే తెలిసిన ఆ రైతన్న రెక్క లాగు (నెప్పి)
ఆకలి తీరుస్తూ ధన్యమైన ఆ ధాన్యాల పోగు
కోరుకునేది ఒక్కటే మన అందరి బాగు.
..........................................................................
సద్దిమూట తినిపిస్తూ సుద్దులాడు పెద్ద గురువు
పెద్ద చదువులన్నీ గమ్మత్తుగ నేర్పిస్తుంది
శ్రద్ధగ గమనించుకో,ఒద్దికగ తెలుసుకో
.....................
అసహనమును దహిస్తోంది భోగిమంట నెపముతో
ఆయువు పెంచేస్తున్నది ఆయుర్వేద భోగిపళ్ళతో
వస్తు వ్యాపారమునునేర్పింది ధాన్యపు పంపిణీలతో
ఆధ్యాత్మికతను అందిస్తున్నది హరినామ సంకీర్తనతో
పోటీ తత్వమును (మంచి) చాటుతోంది కోడి పందాలతో
గ్రహ మార్పులను తెలుపుతోంది అందమైన ముగ్గులతో
దాతృత్వమును చాటుతోంది గుమ్మడి దానాలతో
కళాకారులను అందిస్తున్నది బొమ్మల కొలువుతో
పశువులు ఈశుడంటున్నది బసవన్న పూజలతో
కలివిడిని చాటుతోంది సందె గొబ్బెమ్మలతో
మురిపాలు పొంగించుకోమంటున్నది చక్కెర పొంగలితో
లోక కళ్యాణమును కోరుతోంది గోదా కళ్యాణముతో
తలెత్తుకు జీవించమంటున్నది తరగని బంధాలనే గాలిపటముతో.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI