బతుకమ్మ-ఉయ్యాలో-2

తుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో
బతుకమ్మ బతుకమ్మ
బంగారుబతుకమ్మ 
జలములోన కలిసె
జలజముగా పూసె
జనము పూజలందె
దప్పిక తీర్చేను
గొప్పనైన తల్లి
చేనులోన జారె
జొన్నపైరుగా మారె
యెన్నరాని ప్రేమ
ఆకలిని తీర్చే
కలికి చిలుకల కొలికి
పిల్లగాలిని చేరె
పిల్లాపాపనుగావ
పిల్లనగ్రోవై తాను
ఉల్లము ఉప్పొంగ
చల్లనైన తల్లి
బతుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో
నిండుజాబిలి చేరె
పండువెన్నెలగాను
పిండారబోసింది
సత్తుపిండి దొరికె
సత్తువ గౌరమ్మ
చెట్టులోన చేరె
చుట్టమౌతానంది
తెల్పింది ప్రేమను
శిల్పక్క పండుగా
కల్పవల్లి తల్లి
బతుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో
వలయాకారంలోన
మమకారం దాగుంది
ముత్తెపు బతుకుల్లో
పొత్తు తెలుపుతుంది
సత్తెపు బతుకమ్మ
గునుకుపూలల్లోన
గుమ్మాడిపూలల్లో
తంగేడుపూలల్లో
చామంతిపూలల్లో
పూబంతి బతుకమ్మ
పూలు పేర్చేమమ్మ
బతుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో
తాపాలు తీర్చేవమ్మ
ఆడిపాడేమమ్మ
సద్దులాడంగాను ముద్దులాడేతల్లి
మనీదా విందులు మనసైన చిందులు
బొడ్డెమ్మ అందాలు బొడ్డెమ్మ చందాలు
దొడ్డదైన తల్లీ
తలపైన మోసేము తలవంపు తేమమ్మ
తలచినంతలోన తల్లడిల్లనీవు
తల్లీ బతుకమ్మ నీవు సేదతీర
నిమజ్జనాలమ్మ మళ్ళీ మమ్మేలంగ
నీళ్ళవాయనాలు వేనోళ్ళపొగిడేము
బతుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI