Friday, June 23, 2017

శారద కలికితురాయి

శారద కలికితురాయి
***********************
అయ్యా తమరు,

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనిన ఆదికవి వాల్మీకియా,
ఈ దుర్యోధన.దుశ్శాసన దుర్వినీత సంఘ ద్రష్టలైన కృష్ణద్వైపాయనులా,

శంకరా నాదశరీరా అని కీర్తించిన శివకవులా,
తెలుగుతనానికి జన్మదినమందించిన నందకమా

,
పిల్లనగ్రోవికి నిలువల్ల గాయాలు,అల్లన మోవికి తాకితే గేయాలు అంటూ కష్టాల వెనుకే సుఖాలు దాగి ఉన్నాయన్న ఆశావాదులా,


రాలిపోయే పూవా నీకు రాగాలెందుకు,
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకు అన్న నిరాశావాదులా,


తెల్లావు కడుపులో నల్లవు పుట్టదా
కర్రావు కడుపులో ఎర్రావు వుండదా
ఎందువలన అంటే దైవఘటన అని


ఓం ఫట్ అంటూ సంధ్యావందనము చేసుకునే సంప్రదాయవాదివా,
ఏ కులము నీదంతే గోకులము నవ్వింది అన్న కులవ్యవస్థను నిలదీసిన
  గుఱం  జాషువా,వా,

చిలక కొట్టుడు కొడితే చిన్నదానా అని పులకరింప చేసిన బహిర్ముఖుడివా,
ఓ నమ: హృదయ జతులకు అని స్తుతించిన అంతర్ముఖుడివా,


యమహాపురిని,ఆహాపురమును సృష్టించిన విశ్వకర్మవా,

సిరిమల్లెలతో,పెరటి చెట్టు జాంపండుతో కన్నెమనసును చిత్రించిన రవివర్మ వా,


ఏ శకుని ఆడని జూదానికి చితిలోనే సీమంతం చేయించిన చాణుక్యుడివా,

ఏ కవి వ్రాయని (నంది కొండ}పదాలను విశ్వవిఖ్యాతము చేయించిన మరకత మాణిక్యము


భరనభ భరవ,మసజస తతగ గణముల అసలు సొగసు చూపిన అప్పకవివా,లేక
కొమ్మ కొమ్మకో సన్నాయిని మోగించిన "గొప్ప కవి"" నిన్నేమని 
వర్ణించగలను ఓ

"పాటకే గీటురాయి" శ్రీ వేటూరి.సంస్మరిస్తూ,,నమస్కారములతో..

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...