Friday, June 23, 2017

Eid-mubaarak.

ఈద్ ముబారక్
    *************

  మనసును "మక్కా" చేసిన మనిషి తెలుపు కృతజ్ఞత
  " ఈద్-ఉల్-ఫితర్" అను ఈద్ ముబారక్ కత.

  "నమాజ్-సలా-రోజ-జకాత్-హజ్" అను ఐదు
   పవిత్రతకు రూపాలు-పాటించవలసిన నియమాలు.

   తొమ్మిదవనెల "చంద్రరేఖ"  తోడై
   చేయిస్తుంది " రం జాన్ నెల ప్రారంభము"

   ఆకలి-దప్పులను అధిగమించుటయేగ  "రమదాన్"
   " అల్ల-హో-అక్బర్" అంటున్నది అమ్మీజాన్.

   ఆధ్యాత్మిక  శిక్షణ అలవరచుకొనుటయేగ "రం జాన్"
   అర్థము వివరిస్తున్నాడు అందరికి బాబా జాన్.

   చేతగాని వారికి చేయూతగ  సాయము చేయి
   "సహరీ" అందిస్తున్నాడు  సలీం అనే అబ్బాయి.

   కుతూహలము ఆగదుకదా "కుత్బా" సమయము కొరకు
   కూలంకషమైన పరమ పవిత్రము ప్రతిపలుకు.

   విశ్వసోదరత్వమునకు అవుతాము గిరఫ్తారు
   విశిష్టతను వివరించు విందుయేగ "ఇఫ్తారు".

   ఖర్జూరపు మిఠయిలు-కమ్మనైన హలీములు
   తియ్యనైన పాయసాలు-తీరైన సలాములు.

  " అల్ల(హ్) అచ్చా కరేగా"  అంటున్నది అమీనా
   "ఫిత్రా' నందుకున్న చేతులతో  దీవిస్తూ

  అచ్చా పేట్ భరేగా   అనుకున్నది  ఆలియా
  ధాన్యమును దానమిచ్చు పద్ధతిని పాటిస్తూ.

  అంతా మనుషులమేగా  ఆదుకోగ  హమేషా
  "జకాత్" ను అందిస్తున్నాడు జాలితో పాషా.

  ఇరవై ఒకటవరోజు నుండి "షవ్వాల్" మాసము వరకు
  "ఏతెకాఫ్"  చేస్తున్నారు ఎందరో మహనీయులు.

  "ఉమ్రాలు-తఖ్వాలు-తహజ్జుదులు-తరావీలు"
  ప్రవక్త సందేశాలను  పాటించుచు ప్రార్థనలు.

  "షబ్-ఎ-ఖదర్" ప్రీతితో అందించినది" ఖురాను"
   షడ్వర్గ నియంత్రణతో ప్రవర్తించాలని "ముసల్మాను"

  "రోజేదారులు ప్రవేశించ స్వాగతించె  "రయ్యాను"
   ఉమ్రాను హజ్జ్ గా పరిగణించె "సులేమాను"

  అత్తరు పరిమళాలు-కొత్త బట్టల కొనుగోళ్ళు
  సరదాలు-సందళ్ళు- సంబురాల ఆనవాళ్ళు.

  రానే వచ్చేసింది  షవ్వాల్ నెల మొదటిరోజు
  రాతిరి తెచ్చేసింది  "హిలాల్"ని నువు చూడు.

  "అలాయ్-బలాయ్" అంటూ ఈద్ త్యోహార్  ఆగయా
  ఆశీర్వదిస్తున్న అల్లహ్ కు బహూత్ బహూత్ షుక్రియా.

  (దోషములను సవరించి పునీతము చేసిన శ్రీ షేక్ అన్వర్ అహమ్మద్ గారికి సవినయ నమస్కారములు.నా అజాగ్రత్త వలన అక్షర దోషములు-అర్థ దోషములు దొర్లిన క్షంతవ్యురాలను.) నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...